తెలంగాణ భవిష్యత్తు నిర్మాణంలో మీ వంతు పాత్ర పోషించండి!
ప్రజా సేవే లక్ష్యంగా, సమాజ మార్పే ధ్యేయంగా జనసేనతో కలిసి ముందుకు సాగండి. మీ సామర్థ్యానికి తగిన బాధ్యతల్లో సేవలందించేందుకు ఇప్పుడే నమోదు చేసుకోండి.
https://t.co/2EW7BPNudm
సామాన్యుడి గొంతుకగా... ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా...
నేటి నుండి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో "జనవాణి" ప్రారంభం.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు, వినతులను నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావడానికి జనవాణి వేదికగా నిలవనుంది.
సమయం: ప్రతిరోజు ఉ-10:30 గం.ల నుండి సా-5:00 గం.ల వరకు
స్థలం: 8-1-246/2, మల్కం చెరువు సమీపంలో, మణికొండ, హైదరాబాద్.
#JanaVaaniJanaSenaBharosa #JanaSenaTelangana
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి గారి సమక్షంలో, డాక్టర్ గడల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కొత్తగూడెంకు చెందిన పుదారి శ్యామ్ కుమార్, అల్లూరి నాగరాజు గార్లు జనసేన పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. అనంతరం రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ విస్తరణ, సంస్థాగత నిర్మాణం మరియు ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి నాయకులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మిరియాల రామకృష్ణ, బండి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
#JanaSenaTelangana
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనా స్థలిని సందర్శించిన అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు మీడియాతో మాట్లాడారు.
•విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం. క్షతగాత్రులకు రూ. 10 లక్షల పరిహారం, చికిత్సకి అయ్యే ఖర్చు మొత్తం ఆర్.ఐ.ఎన్.ఎల్. భరిస్తుంది. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం.
•పదవీ విరమణ ప్రయోజనాల కింద రెగ్యులర్ ఉద్యోగులకు రూ. 1.72 కోట్లు. కాంట్రాక్టు ఉద్యోగులకు రూ. 45.75 లక్షల అందుతాయి.
•స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల మాదిరి మృతుల పిల్లల చదువులు కొనసాగించేందుకు సహకారం.
•స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై విచారణకు బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి త్రీ మ్యాన్ కమిటీ ఏర్పాటు. విచారణ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహకారం అందిస్తాం.
•స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలు, యాజమాన్య లోపాలు, సాంకే తికపరమైన ఇబ్బందులు తెలుసుకునేందుకు త్వరలో కార్మిక సంఘాలతో సమావేశం.
•విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకూడదన్నదే కూటమి ప్రభుత్వ ఆకాంక్ష అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు.
A new chapter begins today.
I have joined the Jana Sena Party in the presence of Sri Pawan Kalyan Garu. My commitment remains unchanged—to serve people with sincerity, integrity, and dedication.
I seek your blessings and continued support in this journey.
#JanaSena#Telangana
'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం'
కార్యక్రమం ఏర్పాట్లు జనసేన పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ @itsRamTalluri గారితో కలిసి పరిశీలించండం జరిగింది.
#JanaSenaTelangana
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
సకల జనుల సంకల్పం... అమరుల త్యాగాల రూపం... మన తెలంగాణ
"నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం ,స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు పుష్కరం క్రితం ఈ రోజు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలంగా నిలిచిన చారిత్రాత్మక ఘట్టం.
తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు మరియు అమర వీరులకు నా వినమ్ర నివాళులు.
తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. ఇక్కడి గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంది, నేలలో అమరుల రక్తం ఉంది.సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుంచి, కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాల వరకు, ఈ భూమి స్వాభిమానానికి, న్యాయం కోసం చేసే పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు, సాహిత్య సంపదతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణాది ఒక విశిష్టమైన స్థానం.
తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల పట్ల నాకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆవేదన, బాధ్యతాభావం ఉన్నాయి. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల పరిస్థితి, గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లోని సవాళ్లు ఇవన్నీ రాజకీయ అంశాలకంటే ముందుగా మానవీయ అంశాలుగా నేను భావించాను. ప్రజల కష్టాలు ఏ ప్రాంతానివైనా, అవి మన అందరి బాధ్యత అనే నమ్మకం నాది.
ఈ రోజు తెలంగాణ దేశంలో ఐటీ, ఔషధ పరిశ్రమలు, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్ వ్యవస్థ, విద్యా రంగాల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకుంటోంది. అయితే అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆ అభివృద్ధి సంపూర్ణమవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, చిన్న రైతులు కూడా సమాన అవకాశాలతో ముందుకు సాగే తెలంగాణ నిర్మాణమే మనందరి లక్ష్యంగా ఉండాలి.
తెలంగాణ అంటే అపారమైన ఆత్మీయత, అపూర్వమైన సంస్కృతి, అద్భుతమైన మానవ సంబంధాల సమాహారం.తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుంది..
12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించాలని, ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని, యువతకు విస్తృత అవకాశాలు లభించాలని, రైతు సంక్షేమం బలోపేతం కావాలని, మహిళలు మరింత సాధికారత పొందాలని, సామాజిక న్యాయం మరియు సమగ్రాభివృద్ధితో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
జై తెలంగాణ! జై హింద్!
#TelanganaFormationDay
రాష్ట్రంలో కాంగ్రెస్ మొదలుకుని ఎన్నో రాజకీయ పార్టీలు రేపు సభలు నిర్వహించుకుంటారు, వారందరికీ లేని అడ్డంకులు జనసేన పార్టీకి సృష్టించడం శోచనీయం.
తెలంగాణ ఆట, పాట, సంస్కృతిని అభిమానించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ పోరాట స్పూర్తి తనకు ప్రజా సమస్యలపై పోరాటం చెయ్యడానికి ప్రేరణ అని ఆయనే స్వయంగా చెప్పారు.
తనని ఆదరించిన తెలంగాణ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ విస్తరణకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభదినంగా భావించి తలపెట్టిన సభ "తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ." ఇలాంటి సభకి అనుమతి నిరాకరించడం విచారకరం.
#JanaSenaTelangana #TelanganaFormationDay
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జూన్ 2న హైదరాబాద్ వేదికగా...
'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం'
#JanaSenaTelangana
ఈ రోజు కళ్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే…
30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది - “ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి “
ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో
టైమ్ తీసుకుని వచ్చి, నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని, క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులందరినీ ఆనందపరిచినందుకు Thank You☺️
Love you Kalyan ❤️❤️❤️
#Mega158 #ChiruBobby2 begins ✨
@dirbobby #VenkatKNarayana
@KvnProductions