ముగిసిన (341వ రోజు) వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.
వైఎస్ జగన్ చరిత్రాత్మక ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ముగిసింది. ప్రజాసంకల్పయాత్రలో నేడు వైఎస్ జగన్ 9.1 కిలోమీటర్లు నడిచారు. వైఎస్ జగన్ మొత్తం 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
భయపడే ప్రసక్తే లేదు.. నాకున్నది ఒక్కటే కసి.. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి.. కుటుంబాల్లో ఆప్యాయతలు పెంచాలన్నదే నా కసి.. అని ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభ సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు మాట ఇచ్చారు.
ప్రజా సంకల్ప యాత్ర ముగిశాక కూడా వైఎస్ జగన్ ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. 151 శాసనసభ, 22 లోక్‌సభా స్థానాల్లో విజయం సాధించి మే 30వ తేదీన సీఎం పీఠాన్ని అధిష్టించారు. పాదయాత్ర స్ఫూర్తితో 17 నెలలుగా కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పాలనను అందిస్తున్నారు.
2019 జనవరి 9వ తేదీన ఇచ్ఛాపురంలో ముగిసిన పాదయాత్రలో తొలి నుంచీ జనంతో మమేకం అవుతూ.. తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుదలతో తన రాజకీయ ప్రస్థానాన్ని చేరుకున్నారు.
వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి ఆయన ఆశీర్వాద బలంతో 2017 నవంబర్ 6వ తేదీన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పానికి శ్రీకారం చుట్టారు.
దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనంగా, చరిత్రాత్మకంగా నిలిచి పోయిన ప్రజా సంకల్ప పాదయాత్రను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయింది.
వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు
ఏపీ చరిత్రను మలుపు తిప్పిన మరపు రాని యాత్ర.
14 నెలల పాటు ప్రజలతో మమేకం.
జనం కష్టనష్టాలు చూసి.. విని నేనున్నానంటూ భరోసా.
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా మేనిఫెస్టో.
ఇలాంటి నేతే కావాలంటూ పట్టం కట్టిన జనం.
#3YearsOfYSJaganPadayatra
ఆంధ్ర రాష్ట్రంలో ఓ చారిత్రక ఘట్టానికి తెరలేపిన ప్రజాసంకల్పయాత్ర.. అసలు సిసలు ప్రజానేత వైఎస్ జగన్ మనో సంకల్పానికి ప్రతీక. ఒక్క అడుగుతో మొదలై కొట్లాది మంది ధైర్యం వెంటరాగా.. సాగిన ప్రజా నాయకుడి నడక పూర్తయి నేటికి ఏడాది.
ప్రజాసంకల్పయాత్ర పూర్తయి నేటికి ఏడాది.
341 రోజుల పాటు 3,648 కిలోమీటర్లు సాగిన యాత్ర.
జగన్ పాదయాత్రకు అడుగడుగునా ప్రజల నీరాజనాలు.
పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్న సీఎం జగన్
సంక్షేమ పథకాల్లో మరో మేలిమి రత్నం..అమ్మ ఒడికి నేడు శ్రీకారం.
ప్రతీ సంక్షేమంలోనూ పాదయాత్ర ముద్రలే
రైతన్నకు జరగకూడని నష్టం ఏమైనా జరిగితే.. వైఎస్సార్ బీమా కింద రూ. 5 లక్షలు వెంటనే ఆ కుటుంబానికి ఇస్తాం. ఆ నష్టపరిహారం పూర్తిగా ఆడపడుచులకు ఇచ్చే సొత్తుగా చూసే విధంగా అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాం. దాంతో అప్పుల వాళ్ళు లాక్కొనే అవకాశం ఉండదు - వైఎస్ జగన్
ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులు నష్టపోకుండా.. రూ.4 వేల కోట్లు(రూ.2వేల కోట్లు రాష్ట్రం, రూ.2 వేల కోట్లు కేంద్రం ఇస్తుంది) ప్రకృతి వైపరీత్యాల ఫండ్ పెడతాం. కొబ్బెరి చెట్లుకు పరిహారం రూ.3 వేలు ఇస్తాం. జీడి చెట్లకు ఇప్పుడు ఇస్తున్న రూ.30 వేలును రూ.50 వేలుకు పెంచుతాం - జగన్
మే నెలలోనే రైతన్నకు పెట్టుబడి కోసం ఏడాదికి రూ. 12,500 ఇస్తాం. రైతులందరికీ బోర్లు ఉచితంగా వేయిస్తాం. పంట ఇన్సూరెన్స్‌ల కోసం రైతులు ఇక ఆలోచించనక్కర్లేదు. అధికారంలోకి రాగానే ఇన్సూరెన్స్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది - వైఎస్ జగన్
రైతులకు పెట్టుబడులు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటాం. పగటి పూటే 9 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇస్తాం. ప్రతి రైతు ఆదాయం పెంచడం కోసం.. బ్యాంకు రుణాలపై వడ్డీ లేకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం - ఇచ్ఛాపురం బహిరంగ సభలో వైఎస్ జగన్
ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు పాలించాలనేది నాకున్న సంకల్పం. నా పాలన చూసి.. నాన్న ఫోటోతోపాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలన్నది నా ఆశ - వైఎస్ జగన్
#YSJaganHistoricPadayatra#VijayaSankalpam
ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది. మనం యుద్దం చేసేది నారాసురుడి ఒక్కడితోనే కాదు ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేయాలి. జిత్తులు మారిన చంద్రబాబు అనేక పొత్తులు పెట్టుకుంటాడు. ప్రజల దీవెనలతో చంద్రబాబు మోసాలను, అన్యాయాలను జయిస్తా - వైఎస్ జగన్
#YSJaganHistoricPadayatra#VijayaSankalpam