ఎన్నికల కోడ్ కారణంగా ‘జనవాణి’ తాత్కాలికంగా నిలిపివేత
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మంగళగి��ిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిర్వహించే ‘జనవాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపి వేయడమైనది. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం జనవాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. కార్యక్రమాన్ని ఎప్పుడు పునఃప్రారంభిచబోయేది ముందుగా తెలియజేస్తాము.
#janavaani
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో వీర మహిళా నాయకురాలు శ్రీమతి నిహారిక నాయుడు ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో బతుకమ్మ ఆట పాటలతో తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పిన వీర మహిళ రాష్ట్ర నాయకురాలు కావ్య, రత్న పిల్ల, పద్మజ, వెంకటలక్ష్మి, అరుణకుమారి, శాంతి, శ్రావణి, కీర్తి, స్వాతి రెడ్డి, రజిని, మాధవి, భవ్య, లక్ష్మీ, రాణి, డాక్టర్ పద్మజ దేవి, రాజ్య లక్ష్మీ, శాంతి, అరుణ కుమారి, లావణ్య, అనసూయ, శ్రీదేవి.
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు మచ్చా సుధాకర్, శ్రీధర్ శర్మ, ప్రజిత్ గౌడ్, మీసాల శ్రీనివాస్, మేడ రామకృష్ణ, నరేష్ రెడ్���ి, పృథ్వీ, సుదర్శన్ రెడ్డి, ఎస్.సందీప్, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.
#Bathukamma #JanaSenaTelangana #JSPForTelangana
జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్ధుల తుది జాబితా
మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయనున్న అభ్యర్ధుల తుది జాబితాకు పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆ���ోదం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
1. తుని: శ్రీమతి సరకణం శ్రీలత
2. ముమ్మిడివరం : శ్రీమతి గుబ్బల రత్న భవాని
#VoteForGlass
#APLocalBodyElections
ఎల్నినో రాబోతుందని ఏప్రిల్లోనే IMD హెచ్చరించింది. అంటే ఖరీఫ్ మొదలవడానికి రెండు నెలల ముందే వర్షాలు తగ్గుతాయని ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఉంది.
మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది?
జూన్ పోయి, జూలై సగం ముగిసేదాకా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది. తీరా జూలై 30న చిన్నారెడ్డి కమిటీ ₹802.92 కోట్లతో ఎమర్జెన్సీ ప్లాన్ అమలు చేయాలని సీఎం గారి చేతికి రిపోర్టు ఇచ్చింది.
ఆ రిపోర్ట్ ఇచ్చి రెండున్నర నెలలు దాటింది. అందులో డ్రిప్ ఇరిగేషన్కు కేటాయించమన్న ₹402 కోట్లు ఎక్కడ? ప్రత్యామ్నాయ విత్తనాల కోసం చెప్పిన ₹330 కోట్లు ఎక్కడ? ఒక్కపైసా అయినా రిలీజ్ చేశారా? ఏ ఒక్క రైతుకైనా ఆ సాయం అందిందా?
ప��్క రాష్ట్రాలు వర్షాభావం మొదలైన వెంటనే కరువు ప్రాంత��లను నోటిఫై చేసి, బ్యాంక్ రుణాల రీషెడ్యూలింగ్కు ఆదేశాలిచ్చాయి. ఇన్పుట్ సబ్సిడీలను ఖరారు చేశాయి.
కానీ తెలంగాణలో కనీసం కరువు సర్వే లేదు, మండలాల గుర్తింపు లేదు, పైసా నష్టపరిహారం లేదు. తీరా ఇప్పుడు యాసంగి మొదలయ్యేసరికి-"వరి వేయకండి, పంట త్యాగం చేయండి" అని మంత్రులు మైకుల ముందుకొచ్చి ఉపన్యాసాలు దంచుతున్నారు.
ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరూ ఆపలేకపోవచ్చు. కానీ హెచ్చరికలు వచ్చినా జూలై ద���కా నిద్రపోవడం, సొంత కమిటీ ₹803 కోట్లు అడిగినా పైసా విదల్చకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ అసమర్థతే.
వరి వేయొద్దు అని రైతులకు హుకుం జారీ చేసే ముందు-చిన్నారెడ్డి కమిటీ సిఫార్సు చేసిన ₹802.92 కోట్లలో ఎంత ఖర్చు పెట్టారో లెక్కలతో సహా సమాధానం చెప్పండి!
@revanth_anumula @TummalaOfficial @DirectorAgriTS
#CongressFailedTelangana
జనసేన పార్టీ మున్సిపల�� అభ్యర్ధుల మలి జాబితా
తొలి దశ మున్సిపల్ కార్పోరేషన్లు, మున్పిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయనున్న అభ్యర్ధుల మలి జాబితాకు పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆమోదం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
1.దర్శి : శ్రీ దారం సుబ్బారావు
2.పుట్టపర్తి : శ్రీ మేకల ఈశ్వర్
3.పాలకొండ : శ్రీమతి పల్లా విజయనిర్మల
4.మడకశిర : శ్రీ ఎస్. శ్రీనివాసరావు
మార్పు :
1.పెడన : శ్రీమతి బళ్లా జ్ఞానలింగ జ్యోతి
2.పిఠాపురం : శ్రీ దానం లాజర్ బాబు
#VoteForGlass
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో వీర మహిళా నాయకురాలు శ్రీమతి నిహారిక నాయుడు ఆధ్వర్యంల�� శనివారం జరిగిన బతుకమ్మ సంబురాల్లో బతుకమ్మ ఆట పాటలతో తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పిన వీర మహిళ రాష్ట్ర నాయకురాలు కావ్య, రత్న పిల్ల, పద్మజ, వెంకటలక్ష్మి, అరుణకుమారి, శాంతి, శ్రావణి, కీర్తి, స్వాతి రెడ్డి, రజిని, మాధవి, భవ్య, లక్ష్మీ, రాణి, డాక్టర్ పద్మజ దేవి, రాజ్య లక్ష్మీ, శాంతి, అరుణ కుమారి, లావణ్య, అనసూయ, శ్రీదేవి.
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఖమ్మం, నల్గొ���డ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు మచ్చా సుధాకర్, శ్రీధర్ శర్మ, ప్రజిత్ గౌడ్, మీసాల శ్రీనివాస్, మేడ రామకృష్ణ, నరేష్ రెడ్డి, పృథ్వీ, సుదర్శన్ రెడ్డి, ఎస్.సందీప్, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.
#Bathukamma #JanaSenaTelangana #JSPForTelangana
ప్రజలను భయపెట్టి వైసీపీ ఏం సాధిస్తుంది?
పులివెందులలో వైసీపీ ప్రేరేపిత హింసను ప్రతి ఒక్కరూ ఖండించాలి
తెనాలిలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖామాత్యులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ @mnadendla గారు
‘పులివెందులలో ఈ రోజు జరిగిన సంఘటన ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. సమాజంలో అల్లర్లు, అలజడులు సృష్టించి ప్రజల్ని భయాందోళనలకు గురి చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని మూర్ఖంగా వైసీపీ ఆలోచిస్తుంది’ అని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖామాత్యులు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో ప్రజలను భయపెట్టినట్లుగా.. ఇప్పుడు కూడా అదే ���ంథాను కొనసాగిస్తుందని చెప్పారు. తెనాలిలో శనివారం సాయంత్రం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ.. "రాష్ట్రంలో పూర్తి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించి ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో పాల్గొనేలా అవకాశం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఆకాంక���షిస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగినట్లుగా ఏకగ్రీవాల కోసం అరాచకాలు సృష్టించిన విధంగా కాకుండా ��న్నికల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇందుకు విరుద్ధంగా వైసీపీ మాత్రం రాష్ట్రంలో అలజడులు, అశాంతి సృష్టించి ప్రజలను భయపెట్టాలని భావిస్తోంది. గత ప్రభుత్వంలో కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వకుండా వైసీపీ చేసిన పిచ్చి ఆలోచనలతో ప్రజలంతా ఎంత ఇబ్బందిపడ్డారో రాష్ట్రమంతా చూసింది. ఇప్పుడు కూడా అదే పంథాలో వైసీపీ ఉండడం దురదృష్టకరం. పులివెందులలో శనివారం వైసీపీ ప్రేరేపిత హింసాత్మక సంఘటనలు అత్యంత దురదృష్టకరం. దీనిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి" అన్నారు.
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో శనివారం బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి.
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు హాజరయ్యారు.
రాష్ట్ర నాయకులు మచ్చా సుధాకర్, శ్రీధర్ శర్మ, ప్రజిత్ గౌడ్, మీసాల శ్రీనివాస్, మేడ రామకృష్ణ, నరేష్ రెడ్డి, పృథ్వీ, సుదర్శన్ రెడ్డి, ఎస్.సందీప్, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.
వీర మహిళ రాష్ట్ర నాయకురాలు కావ్య, నిహారిక, రత్న పిల్ల, పద్మజ, వెంకటలక్ష్మి, అరుణకుమారి, శాంతి, శ్రావణి, కీర్తి, స్వాతి రెడ్డి, రజిని, మాధవి, భవ్య, లక్ష్మీ, రాణి, డాక్టర్ పద్మజ దేవి, రాజ్య లక్ష్మీ, శాంతి, అరుణ కుమారి, లావణ్య, అనసూయ, శ్రీదేవి పాల్గొని బతుకమ్మ ఆట పాటలతో తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పారు.
-జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం, తెలంగాణ.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ @PawanKalyan గారితో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ @DrMohanYadav51 గారు భేటీ
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇంద్రకీలాద్రిపై జరు��ుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతోపాటు విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన ఆయన శనివారం మధ్యాహ్నం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రివర్యుల వారి క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీ మోహన్ యాదవ్ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య అభివృద్ధి సంబంధితమైన పలు కీలక అంశాలపై చర్చించారు.
ప్రధానంగా నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) పరిధి���ో పులుల సంరక్షణ చర్యలను మరింత బలోపేతం చేసే అంశాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అలాగే, జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో గౌర్ (అడవి దున్నలు) పునఃప్రవేశానికి సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. త్వరలో మధ్యప్రదేశ్లో పర్యటిస్తానని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.
* ఉప్ప��డ పట్టు శాలువా, కొండపల్లి కళాకృతి బహూకరణ
మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారిని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ పట్టు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీరామ పట్టాభిషేకం కొండపల్లి కళాకృతిని, శ్రీకాళహస్తి పెన్ కలంకారీ కళాకారులు రూపొందించిన శ్రీ దుర్గాదేవి చిత్రపటాన్ని, అరకు కాఫీని బహూకరించారు.
శ్రీ మోహన్ యాదవ్ గారు శ్రీ ఓంకారేశ్వర స్వామి ప్రతిమను, జ్యోతిర్లింగ క్షేత్రం నుంచి తీసుకువచ్చిన ప్రసాదాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు.
జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధాన కారణాలు ఇక్కడి యువత చేసిన ప్రాణత్యాగాలు, వారి అలుపెరగని పోరాటాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడుస్తున్నప్పటికీ, నేటికీ ప్రజల ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేరలేదని, యువత ఆశయాలు సహా ఇంకా అనేక కోరికలు నెరవేరాల్సి ఉందని తెలిపారు.
#MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
స్థానిక ఎన్నికల్లో సామరస్య వాతావరణం చెడగొట్టాలని వైసీపీ కుట్ర
* రాయలసీమ బడుగులకు అధికారం రావడం వైసీపీకి ఇష్టం లేదు
* స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కావాలన��� అరాచకం సృష్టిస్తోంది
* వైసీపీ నాయకులు పిల్ల చేష్టలు మానుకోవాలి
* వైసీపీ ఎంపీ ఎన్నికల నియమావళి కాలరాశారు
* వైసీపీ ఇకనైనా హింస ప్రవృత్తిని వదులుకుంటే మంచిది
* అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలి
* జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్, ఉపాధ్యక్షులు శ్రీ బి. మహేందర్ రెడ్డి, చేనేత వికాస విభాగం చైర్మన్ శ్రీ చిల్��పల్లి శ్రీనివాసరావు
‘వైసీపీకి ప్రజలు గత ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పిన వారి పద్ధతి మారలేదు. 2021 లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకం చేసినట్లుగానే ఇప్పుడు కూడా చేస్తామంటే కుదరదు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ ఒక్కరిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టబోదు’ అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ హెచ్చరించారు. వైసీపీ నాయకులు చేస్తున్న పిల్ల చేష్టలు, కుర్ర చేష్టలు, కుంక చేష్టలు ఇక మీదట ఆపకపోతే తీవ���ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ నామినేషన్ల ప్రక్రియలో వైసీపీ చేస్తున్న అరాచకాలపై శనివారం సాయంత్రం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యక్షులు శ్రీ బి. మహేందర్ రెడ్డి, చేనేత వికాస విభాగం చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ శివశంకర్ గారు మాట్లాడుతూ “ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎంపీ కనీస ఎన్నికల నిబంధనలు పాటించకుండా, రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా ప్రవర్తించడం అత్యంత హేయం. ఎన్నికల నామినేషన్ వేయడానికి నిబంధనలకు విరుద్ధంగా 100 మందితో నామినేషన్ వేసే కేంద్రంలోకి ప్రవేశించాలి అనుకోవడం దారుణం. ఎంపీకి కనీసం నిబంధనలు తెలియవా? కావాలని అలా చేశారా..? అనేది సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో సామరస్య, స్వేచ్ఛయుత వాతావరణాన్ని చెడగొట్టడానికి వై��ీపీ నాయకులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.
*రాయలసీమ బడుగులకు అధికారం దక్కడం వైసీపీకి ఇష్టం లేదా?*
వైసీపీ నాయకులు రాయలసీమను ప్రతిసారి వెనక్కు నెట్టివేయాలని చూస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో అధికారం అంటే బడుగులకు, అణగారిన వర్గాలకు లభించే అధికారంగా భావించాలి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో కిందిస్థాయి వర్గాలకు స్థానిక సంస్థల్లో రాజ్యాంగబద్దంగా దక్కే అధికారాన్ని వైసీపీ వారికీ అందకుండా దూరం చేయాలనీ చూస్తోంది. బడుగులకు అణగారిన వర్గాలకు అధికారం ఇవ్వడం వైసీపీకి ఇష్టం లేదు. ఈ కారణంగానే రాయలసీమలో అరాచకం సృష్టిస్తూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో రాయలసీమ తాగునీటి సమస్య తీరుతుంది. ఉపాధి లభిస్తోంది. ఈ సమయంలో వైసీపీక��� డిపాజిట్లు రావు అని తెలిసే ఇలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తుంది. బయట ప్రాంతాల నుంచి రౌడీలను తీసుకువచ్చి తమలోని హింసా ప్రవృత్తిని వైసీపీ బయటపెడుతోంది. వైసీపీ భయపెట్టినంత మాత్రాన ప్రజలు వారి నిర్ణయాన్ని మార్చుకోరు. దానిని వైసీపీ గుర్తించాలి. అధికార యంత్రాంగం కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించి వారి అధికారాన్ని వినియోగించి ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చొరవ తీసుకోవాలి. చి��రిగా ప్రజలు గెలవాలి ప్రజాస్వామ్యం నిలవాలి." అన్నారు.
ఖబర్దార్... వైసీపీ రౌడీ మూకలు : శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన పార్టీ చేనేత వికాస విభాగం చైర్మన్
జనసేన పార్టీ చేనేత వికాస విభాగం చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ "ప్రజల్లో గందరగోళం సృష్టించేలా వైసీపీ మూకలు వికృత చేష్టలు చేస్తున్నాయి. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే వైసీపీ మూకలను ప్రజలే తరిమికొడతారు.. ఖబడ్దార్. రాష్ట్రంలోకి బయటి నుంచి రౌడీ మూకలను తీసుకొచ్చి విధ్వంసం చేయాలని వైసీపీ ప్రయత్నం చేస్తుంది. దీనిని అధికార యంత్రాంగం తగిన విధంగా అడ్డుకోవాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా అవసరం. అభివృద్ధి అంటే గిట్టని వైసీపీ దాన్ని చెడగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల్లో చైతన్యం వచ్చింది. వైసీపీ చేస్తున్న చర్యలు అన్ని ప్రజలు గమనిస్తున్నారు. వైసీపీకి వారే తగిన బుద్ధి చెబుతారు" అన్నారు.
పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి చూసి వైసిపికి కంటగింపు : శ్రీ బి మహేందర్ రెడ్డి, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు*
జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బి. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ " రాష్ట్ర ఉప ము��్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్ర పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి వైసిపికి కంటగింపుగా మారింది. ఈ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా రావని తెలిసే వైసిపి నాయకులు అరాచకానికి తెగబడుతున్నారు.
జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణలో జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతూ, ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల ��్రీనివాసరావు గారిని గెలిపించాలని పిలుపునిచ్చారు.
ప్రచార రథంలో ఏర్పాటు చేసిన ‘పట్టభద్రుల కుర్చీ’లో కూర్చుని తమ సమస్యలను పంచుకోవాలని, జనసేన అభ్యర్థిని గెలిపించి తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
#MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా
మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయనున్న అభ్యర్ధుల తొలి జాబితాకు పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆమోదం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
కార్పొరేషన్లు
1.ఏలూరు: శ్రీ రెడ్డి అప్పలనాయుడు
2.విజయవాడ: శ్రీ వంగవీటి రాధాకృష్ణ
మున్సిపాలిటీలు
1. అమలాపురం: శ్రీ నల్లా శ్రీధర్
2. చిలకలూరిపేట: శ్రీమతి తోట రాజరాజేశ్వరి
3. గొల్లప్రోలు: శ్రీ కడారి తమ్మయ్య నాయుడు
4. నరసాపురం: శ్రీమతి కొత్తపల��లి శైలజ
5.నిడదవోలు: శ్రీమతి కల్లం జ్యోతి
6.పెడన: శ్రీమతి మట్టా శివపావని
7.పిఠాపురం: డాక్టర్ బీరా విజయ్ శేఖర్
8.పుత్తూరు: శ్రీ డి. ఏలుమలై
9.సాలూరు: శ్రీమతి గొర్లె విజయకుమారి
10.సామర్లకోట: శ్రీ పిట్టా జానకి రామారావు
11.తెనాలి: శ్రీ తోటకూర వెంకట రమణారావు
12.తిరువూరు: శ్రీమతి పి. మాధవి
అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకమే వైసిపి ఇప్పుడు మళ్లీ చేస్తోంది
- మళ్ళీ ఫ్యాక్షన్ రెచ్చగొట్టడానికి చూస్తున్నట్లు అర్థమవుతుంది
- ఓటమి ముందే పసిగట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే కుట్రకు పాల్పడుతోంది
- రాజమండ్రిలో మీడియాలో సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ @kanduladurgesh
పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ రాజమండ్రి ప్రెస్మీట్ నిర్వహించారు. ముఖ్యాంశాలు
* స్థానిక ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు పు���గనూరు, రాయచోటి, ధర్మవరం, తిరుపతి వేదికగా మరోసారి అరాచకాల��� సృష్టించారు.
* రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు.
* ఎన్నికల నియమావళిని ఏమాత్రం పాటించకుండా, 100 మీటర్ల అవతలే వాహనాలు నిలిపివేయాలని నిబంధనలు చెబుతున్న ఎంపీ పట్టించుకోలేదు. సుమారు 100 మందితో నామినేషన్ కు రావడం సరైన చర్య కాదు.
* అడ్డుకున్న వాళ్లని వాహనాలతో తొక్కించి ముందుకు వెళ్లిన వైసీపీ నాయకుల దాష్టికం దారుణం. రాయలసీమను రణరంగ�� చేయడానికి, వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి మళ్ళీ ఫ్యాక్షన్ రెచ్చగొట్టడానికి చూస్తున్నట్లు అర్థమవుతుంది.
* అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకమే వైసిపి ఇప్పుడు మళ్లీ చేస్తోంది. ఓటమి ముందే పసిగట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఎన్నికలను నిలిపివేయాలనే కుట్ర వైసిపి చేస్తోంది.
* స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు మొదటి రోజే కావాలని వైసిపి ఓ కుట్ర ప్రకారం అరాచకం సృష్టించింది.
* ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఎంపీని పదవికి అనర్హుడిని చేయాలి. ఓట్లు ఎన్నికల సంఘం ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొని ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
* ఒక ఎంపీ ఏకంగా కత్తులు కటార్లు పట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం సాధారణ విషయం కాదు. దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.
* ఎన్నికల్లో గెలవలేం అని తెలిసే వైసిపి ఈ ఘర్షణలకు తెర తీసింది. ��ిరిగి బుకాయిస్తూ తన తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తోంది.
* బయట ప్రాంతాల నుంచి మనుషుల్ని తీసుకువచ్చి ప్రశాంతంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న రాయలసీమను కావాలని రక్తసిక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా వైసీపీ ఆడుతున్న గేమ్. ఇలాంటి ఆటలు ఆడితే ప్రజలు తగిన విధంగా వైసీపీకి బుద్ధి చెబుతారు.