ఆదిలాబాద్ ఘటన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న పరిస్థితిపై సమాచారం సేకరిస్తే అత్యంత భయంకరమైన చేదు వాస్తవాలు బయటపడ్డాయి. 2020-21 లో 6 వేలు, 2022-23 లో 4,933, 2024-25 లో 3,853 మంది పసిపిల్లలు చనిపోయారు. చేతగాని ముఖ్యమంత్రి వైద్య రంగాన్ని విస్మరించి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు
నేనొక తల్లిని, ఆడబిడ్డను. ప్రైవేట్ స్కూల్ ఫీజులు కట్టలేని పేద పిల్లల చదువు బాధ్యత నాది. నన్ను అధికారంలోకి తీసుకురండి, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ పిల్లలను చదివిస్తా. ప్రతి ఊర్లో బడి, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా విద్యా విధానంలో మార్పు తెస్తాం.
- తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు.
#Panchajanyam #TRSsabha
We do not choose where we are born, but we do choose what we fight for.
I hereby pledge my life to every community that has been left in shambles, neglected for decades, and systematically underrepresented in our political institutions. We will not stop until complete social justice is delivered to all! ✊
#TRS4SocialJustice
آج کا یہ جلسہ کوئی عام جلسہ نہیں ہے، یہ جلسہ ہماری زندگیوں میں تبدیلی لانے ولا جلسہ ہے۔
اگر کسی قوم کو آگے بڑھنا ہے تو اسے تین چیزوں کی سب سے زیادہ ضرورت ہوتی ہے۔
پہلی چیز تعلیم۔دوسری چیز فینانشیل ایمپاورمنٹ اور تیسری چیز پولیٹیکل ایمپاورمنٹ۔ تعلیم ہوگی تو شعور آئے گا۔فینانشیل ایمپاورمنٹ ہوگی تو خودداری آئے گی اور سیاسی نمائندگی ہوگی تو انصاف ملے گا۔
میری دلی خواہش ہے کہ مسلم خواتین کی آواز ایوانوں میں گونجے اور وہ قانون ساز بنیں۔
#TRS4SocialJustice
బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం ఆగస్టు 6న భారీ బహిరంగ సభ
జయశంకర్ సార్ జన్మదినం సందర్భంగా బీసీ రిజర్వేషన్ల సాధనకు సంకల్పం తీసుకుందాం
- తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు
🔹బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఆగస్టు 6న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమవారం బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ ఆఫీస్ లో నిర్వహించిన పార్టీ బీసీ నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సంకల్పం తీసుకుంటామని తెలిపారు. ‘‘సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ’’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. బీసీలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల వారిని ఒక్కతాటిపైకి తీసువచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామన్నారు. ముందు భౌగోళిక తెలంగాణ సాధించుకుందాం.. ఆ తర్వాత సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం పాటు పడుదామన్న ప్రొఫెసర్ జయశంకర్ గారి సూచనల మేరకు తాము 50 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పాటు పడుతున్నామని తెలిపారు. జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్ రెండేళ్లుగా ప్రజాక్షేత్రంలో పని చేస్తున్నాయని గుర్తు చేశారు.
🔹ఆగస్టు 6న హైదరాబాద్ వేదికగా మనం నిర్వహించే బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన సభ దేశ గతినే మార్చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమిళనాడులోని స్కూళ్లలో ఎన్జీఆర్ ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని తెలిపారు. అదే విధంగా దేశవ్యాప్తంగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం చేసే ఉద్యమాలకు హైదరాబాద్ సభ దిక్సూచీగా నిలుస్తుందన్నారు. ఆగస్టు 6 జయశంకర్ సార్ జయంతిని టీఆర్ఎస్ పార్టీ సామాజిక న్యాయ తెలంగాణ దినోత్సవంగా నిర్వహిస్తుందని తెలిపారు. తాము చేసిన ఉద్యమాలకు తలొగ్గే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా రెండు వేర్వేరు బిల్లులు అసెంబ్లీ, కౌన్సిల్ లో పాస్ చేసి కేంద్రానికి పంపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లులకు ఆమోదం తెలిపేలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస ప్రయత్నాలు కూడా చేయడం లేదన్నారు. ‘‘మనమెంతో మనకంత’’ అనే నినాదం సాకారం కావాలంటే అన్ని వర్గాలను కలుపుకొని 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఐక్య ఉద్యమాలు చేద్దామని పిలుపునిచ్చారు.
రైతు డిస్కామ్ ద్వారా రైతులకు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే తెలంగాణ జాగృతి తరఫున కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈఆర్సీ రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అనుమతి ఇవ్వాలి — కల్వకుంట్ల కవిత గారు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు.
Under the guise of a 'reform,' the Union Government is wiping out small and medium-scale solar players. A sudden mandate requires domestic battery manufacturing, a capability only Adani and Ambani currently have. Giving just five days to adapt isn't a policy; it's enforcing a monopoly. We demand an immediate retraction of the order.
నల్లమల పులి బిడ్డను అని చెప్పుకునే ముఖ్యమంత్రి రెండున్నరేళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టిని ఎత్తిపోయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న జల ద్రోహానికి వచ్చే ఎన్నికల్లో పాలమూరు ప్రజలు కాంగ్రెస్ పార్టీని కిలో మీటర్ లోతున బొందపెట్టడం ఖాయం.
ప్రపంచ శ్రామికుల విజయానికి ప్రతీక మేడే.
తమ స్వేదంతో ప్రపంచ ప్రగతికి బలమైన పునాదులు వేసే కార్మిక, కర్షక లోకానికి ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.🙏
#MayDay
Telangana Rakshana Sena (TRS), it is!
We will relentlessly work to serve and protect the people of Telangana, as we have done in the last two decades as Telangana Jagruthi.
We received a letter of approval from the Election Commission in person. I would like to thank the Election Commission and commit to abide by the rules and regulations.
In January 2026, following standard EC protocol, we submitted five name choices, and the Election Commission has officially granted our third choice.
The only one with the acronym TRS.
Destiny, it seems, has a sense of irony !!
*తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)* కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియ చేయడానికి సంతోషిస్తున్నాము
రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం నేను చేసిన కృషిని కొనసాగిస్తూ, ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకితభావంతో పని చేస్తానని తెలియజేస్తున్నాను.
జనవరి 2026 లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నాం. అందులో మూడవ ప్రాధాన్యత గా మేము ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించడం కేవలం యాదృచ్ఛికం.
TRS నాకు రాసిపెట్టి ఉందేమో!!
@TRSpartyHQ
#TelanganaRakshanaSena #TRS
ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో సమాన హక్కుల సాధన కోసం, ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చడానికి, మహిళలు, బీసీలు మరియు సమాజంలోని అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం, సర్వోదయ తెలంగాణ లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఒక రాజకీయ శక్తి ఆవిర్భావానికి కేవలం 24 గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
జై తెలంగాణ.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు మీడియాతో మాట్లాడుతూ...
ఇది ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్
🔹ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పుమోపారు.
🔹బీసీలు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, వికలాంగులు అందరినీ మోసం చేశారు.
🔹బడ్జెట్ లో తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించారు
🔹మోడీ బడే భాయ్ అని ఢిల్లీకి పోయి వంద రూపాయలు కూడా తేలేదు.
🔹కాంగ్రెస్ నాయకులు ఒకరిని మించి ఒకరు ఫేక్ తున్నారు అందుకే ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వం.
🔹రాహుల్ గాంధీ మా హైదరాబాదీ సలీం ఫేక్ లాంటి వ్యక్తి.. సలీం ఫేక్ తన ఫేక్ తో కనీసం ప్రజలను నవ్విస్తాడు.. రాహుల్ మా ప్రజలను ఏడిపిస్తున్నడు
🔹అందుకే ఇక నుంచి రాహుల్ గాంధీకి "రాహుల్ ఫేక్" అని నామకరణం చేస్తున్నాం
🔹🔹కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీసీలు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, వికలాంగులు, మైనార్టీల ఇలా అన్ని వర్గాలకు బడ్జెట్ లో అన్యాయం చేశారని అన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. రైతుభరోసా, చేయూత పింఛన్లు సహా చాలా రంగాలకు గతేడాది కేటాయించిన నిధులనే అక్షరం మార్చకుండా అలాగే కొత్త బడ్జెట్ లోనూ పెట్టారని తెలిపారు. ఈ ప్రభుత్వానికి కనీస విజన్ కూడా లేదని అందుకే ఇది రివిజన్ బడ్జెట్ అంటున్నామని మండిపడ్డారు. ఏటా బీసీలకు రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామంటూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఫేకారని.. కానీ బడ్జెట్ లో మాత్రం 4 శాతం నిధులే కేటాయించి బీసీలను మోసం చేశారన్నారు. రాష్ట్ర జనాభాలో 56 శాతం మంది ఉన్న బీసీలకు 4 శాతం నిధులు ఇవ్వడం ఏమిటని నిలదీశారు.
🔹లక్షల కోట్లు అప్పులు తెస్తున్న రేవంత్ సర్కార్ ఆ డబ్బులను ఏం చేస్తుందని ప్రశ్నించారు. దాదాపు 8 లక్షల 64 వేల కోట్లు అప్పు చేసి ప్రతి ఒక్కరి తలపై రూ. 2 లక్షల 16 వేల భారం మోపారన్నారు. ఒక్కో కుటుంబంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.9 లక్షల అప్పుల భారం మోపిందన్నారు. లక్షల కోట్ల అప్పులు తెచ్చినా ప్రజలకు మాత్రం పైసా మేలు జరగలేదన్నారు. మోడీ తన బడే భాయ్ అంటూ ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా ఎందుకు తేలేదో చెప్పాలని నిలదీశారు. ప్రజలకు మేలు చేయటం చేతకాని కాంగ్రెస్ నాయకులు ఒకరిని మించి ఒకరు ఫేక్ తున్నారని మండిపడ్డారు. అందుకే ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వమని కవిత విమర్శించారు.
రాహుల్ ఫేక్
🔹ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి పెద్ద ఎత్తున హామీలిచ్చిన రాహుల్ గాంధీపై కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఫేకే అన్నారు. హైదరాబాద్ లో సలీం ఫేక్ అనే నటుడి మాదిరిగానే రాహుల్ గాంధీ కూడా ఫేక్ మాటలు చెబుతుంటాడని విమర్శించారు. అందుకే ఇక నుంచి రాహుల్ గాంధీకి రాహుల్ ఫేక్ గా నామకరణం చేస్తున్నామన్నారు. సలీం ఫేక్ తన మాటలతో నవ్విస్తే...రాహుల్ గాంధీ మాత్రం తెలంగాణ ప్రజలను ఏడిపిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు ఎప్పుడు వచ్చిన సరే ఆయన ఇచ్చిన హామీలపై నిలదీస్తామన్నారు.
నిరుద్యోగంలో రైజింగ్
🔹బడ్జెట్ లో తెలంగాణ ఉద్యమకారులను ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. మహిళలకు రూ.2,500 ఇస్తామన్న స్కీం ఈసారి కూడా పత్తా లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గతేడాదితో పోల్చితే రూ.7 వేల కోట్లు కోత పెట్టారని అన్నారు. సింగరేణి, ట్రాన్స్, జెన్ కో లకు ఇవ్వాల్సిన 1.50 లక్షల కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కొత్త ఉద్యోగాల నియామకాలకు ఎలాంటి కేటాయింపులు లేవని, ఉద్యోగులు, పెన్షనర్లకు బడ్జెట్ లో ఎలాంటి కొత్త కేటాయింపులు లేవన్నారు. కమీషన్లు వచ్చే యంగ్ ఇండియా స్కూళ్లకు మాత్రం రూ.5 వేల కోట్లు కేటాయించారని కానీ టీచర్ల రిక్రూట్ మెంట్ లేకుండా స్కూల్స్ నిర్మించి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. వరల్డ్ బ్యాంక్ ను మన భూములు ధారాదత్తం చేసే మూసీ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారని అన్నారు. 3.24 లక్షల కోట్ల బడ్జెట్ లో క్యాపిటల్ ఎక్స్ పెండీచర్ కేవలం రూ.50 వేల కోట్లలోపేనని ఇలాగైనా సంపద సృష్టి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రెవెన్యూ సర్ ప్లస్, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లలో అంచనాలను పెంచి ప్రజలను మోసం చేశారని కవిత అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం అన్నింటికి మించిన ఫేక్ అన్నారు.
🔹తెలంగాణ రైజింగ్ అంటూ ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారని కానీ నిరుద్యోగంలో మనం రైజింగ్ అవుతున్నామని కవిత చెప్పారు. స్టేట్ ఆఫ్ వర్కింగ్ అనే సర్వే సంస్థ చేసిన సర్వేలో తెలంగాణలో పెద్ద ఎత్తున నిరుద్యోగం ఉందని తేలిందని చెప్పారు. మహిళల విషయంలో 50 శాతం నిరుద్యోగిత రేటు ఉండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఇక ఆహారం కల్తీ విషయంలోనూ ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. స్త్రీ నిధి విభాగంలో 14 ఏళ్లుగా ఓ దయ్యం ఉందన కవిత అన్నారు. జి. విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి గత బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలను మేనేజ్ చేసి ఇప్పటికీ ఉద్యోగంలో కొనసాగుతున్నారన్నారు. అతను చేసే అక్రమాలపై విచారణ కమిషన్ వేసినప్పటికీ ఇప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. వెంటనే మంత్రి సీతక్క ఎంక్వైరీ చేయించి విద్యాసాగర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.
🔹యంగ్ స్కిల్స్ యూనివర్సిటీ గురించి బడ్జెట్ లో గొప్పలకు పోయారని.. ఆ సంస్థ వెబ్ సైట్ లో 64 వేల మంది ఎన్ రోల్ చేసుకున్నట్టుగా ఫేక్ ప్రచారం చేసుకుంటున్నారని.. వాస్తవానికి స్కిల్ యూనివర్సిటీలో ఎన్ రోల్ చేసుకున్నది 960 మంది మాత్రమేనని అన్నారు. వెంటనే యూనివర్సిటీ వెబ్ సైట్ లోని తప్పుడు సమాచారాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపైనా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. కేవలం 13 వేల ఉద్యోగాలు భర్తీ చేసి 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. తాము ప్రజా బడ్జెట్ లో లేవనెత్తిన కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు ఈ బడ్జెట్ లో ప్రతిఫలివంచలేదన్నారు. మైనార్టీలు, దివ్యాంగుల సంక్షేమానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవన్నారు. బడ్జెట్ లో కేటాయింపులు చేయకున్నా, రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో అవకాశం దక్కని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వచ్చని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్ పై గంపెడాశలతో బాసర ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థిని అర్ధాంతరంగా ఈ లోకాన్ని వీడి పోవడం అత్యంత దురదృష్టకరం
బాసర ట్రిపుల్ ఐటీ లో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తేజస్విని అనారోగ్యం పాలైనా సరైన చికిత్స అందించకపోవడంతోనే కన్నుమూసింది
తేజస్విని ఈనెల 13న అనారోగ్యం పాలైన వెంటనే మెరుగైన చికిత్స కోసం తరలించి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవి
తేజస్విని మరణంతో బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ఎంతటి అద్వాన వైద్య సదుపాయాలు ఉన్నాయో స్పష్టం అవుతున్నది
తేజస్విని మృతికి వైస్ చాన్స్ లర్ నిర్లక్ష్యమే కారణం అన్న విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి.. వీసీపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
తేజస్విని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందజేయాలి.. మరో విద్యార్థి అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోకుండా రక్షించేందుకు వెంటనే క్యాంపస్ లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు అత్యాధునిక మెడికల్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయాలి