ఉన్నత చదువులు చదువుతున్న 8,09,039 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.583 కోట్లను నేడు మన ప్రభుత్వంలో జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా వారి తల్లుల ఖాతాల్లో రీయింబర్స్ చేశాం. అలాగే దాదాపు 2 లక్షల మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి విడతగా చెల్లించాల్సిన నగదును కూడా ఇప్పటికే వారి తల్లుల ఖాతాల్లో జమచేశాం. ఇప్పటివరకూ జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 27.61 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఫీజు కింద రూ.11,900 కోట్లను అందజేశామని చెప్పేందుకు గర్వపడుతున్నాను.
రైతన్నలకు జగనన్న భరోసా
అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నకు అండగా నిలబడి
భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్.
#jaganannemaabhavishyathu#raithubharosa
కంకిపాడు మండలం, మద్దూరు గ్రామ సచివాలయ పరిధిలో "గడప గడపకు మన ప్రభుత్వం" రెండవ రోజు.. ఇప్పటికే 98% హామీలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం మన YSR కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రజలకు తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉంది.
#GadapaGadapakuManaPrabhuthvam#kankipadu
మన పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం, మద్దూరు గ్రామ సచివాలయం నందు మొదటి రోజు "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమం ప్రజల ఆత్మీయ స్వాగతంతో ప్రారంభమైంది. ప్రభుత్వం చేపట్టిన విధానాల పట్ల వారి మద్దతు, ప్రజలే ముందుండి కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది.
అకాల వర్షంతో నష్టపోయిన రైతన్నను ఆదుకునేందుకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు డబ్బులు ఐదురోజుల్లోనే జమచేసి రైతు కంట కన్నీరు తుడిచిన మన జగనన్న ప్రభుత్వం..
#ysrcongressparty#cmjagan#AndhraPradesh
కంకిపాడు మండలం వేల్పూరు గ్రామ సచివాలయ పరిధిలో "గడప గడపకు మన ప్రభుత్వం"లో పేద, మధ్యతరగతి కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా మన YSR కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు తెలియజేశాము. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రజా క్షేత్రంలోనే తిప్పికొడుతున్నాం.
#ysrcp#penamaluru
జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఉయ్యురులో ఏర్పాటు చేయడానికి నాడు ఎంతగానో కృషి చేసిన ప్రజా నాయకుడు కొలుసు పార్థసారధి గారిని ఉయ్యురు బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఉయ్యురు సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన సారధి గారికి కృతజ్ఞతలు తెలియజేసారు.
#Vuyyuru#YSRCP#Penamaluru
గోశాల గ్రామానికి చెందిన పోలవరపు రవి గారి తండ్రి పోలవరపు రామదాసు గారు నిన్న రాత్రి స్వర్గస్తులయ్యారు. నేడు అయన పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించాము, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పాము.
పెనమలూరు ఐపిసి చర్చి వారి ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరుగుతున్న క్రైస్తవ ఆశీర్వాద పండుగలు చివరి రోజు బుధవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నాము.ఈ సందర్బంగా పెనమలూరు మండలం పాస్టర్స్ ఫెలోషిప్ వారి ఆత్మీయ సత్కారం ఎంతో సంతోషాన్ని కలిగించింది
ఇది జగనన్న మార్క్ పాలన!
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల అర్హతే ప్రామాణికం. దాని ఆధారంగానే సంక్షేమ పథకాలు.
కులాలు, మతాలు, పార్టీలు, రాజకీయాలు చూడకుండా నేరుగా పేదలకే లబ్ధి.
దళారులన్నదే లేకుండా పాలనతో సత్తా చూపుతోన్న ప్రభుత్వం మనది.
#YSRCP
ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా నియోజకవర్గంలోని పసుపు, వరి, మొక్కజొన్న, జొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతులతో నేరుగా మాట్లాడేందుకు అధికారులతో కలిసి నియోజకవర్గంలోని కంకిపాడు, పెనమలూరు మండలాల్లో పర్యటించాము, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నాను.
#ysrcp
మన నియోజకవర్గంలోని ఉయ్యురుకు చెందిన బాక్సింగ్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో అత్యధిక ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించిన సందర్బంగా.. సొంత ఖర్చుతో వారికి బాక్సింగ్ కిట్లను అందించాము, క్రీడల్లో యువతను ప్రోత్సహించేందుకు నా వంతు సహాయసహకారాలు తప్పక అందిస్తాను.
#penamaluru
నేడు మన పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం, వేల్పూరు గ్రామ సచివాలయ పరిధిలో "గడప గడపకు మన ప్రభుత్వం"లో భాగంగా.. ప్రతి గడపకు వెళ్లి మన ప్రభుత్వం అందించిన పథకాలను తెలియజేశాం. గ్రామ సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తూ.. ప్రజా మద్దతుతో దిగ్విజయంగా ముందుకు సాగుతున్నాం.
#yscrp
భారత జాతీయోద్యమ పితామహుడు, గోప్ప ఆర్థికవేత్త, సామాజిక సేవకుడు శ్రీ గోపాల కృష్ణ గోఖలే గారి జయంతి సందర్బంగా.. దేశానికి వారు చేసిన ఎనలేని సేవలను స్మరించుకుందాం.
#GopalKrishnaGokhale
మన కంకిపాడు - 2 సెగ్మెంట్ MPTC మరియు కంకిపాడు Mandal wise MPP శ్రీ దూళిపాళ్ళ కిషోర్ గారికి ఇటీవల కాలు ప్రాక్చర్ కావడంతో నేడు వారిని పరామర్శించి, ఆరోగ్య విషయాలు తెలుసుకున్నాము.
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో విప్లవ జ్యోతిని రగిలించిన మన్యం వీరుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.
#AlluriSitaramaRaju