రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేసి సమగ్ర ఓటర్ల జాబితా రూపొందేలా కృషి చేయాలని సూచించాను.
#specialintensiverevision
రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యూనిట్ ఇన్చార్జీలు, క్లస్టర్ ఇన్చార్జీలు, మండల, పట్టణ పార్టీ కన్వీనర్లతో సమావేశమై ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ–2026 కార్యక్రమంపై చర్చించాను.
ఈ నెల 15 నుంచి జూలై 14 వరకు జరిగే సవరణ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఓటరు పేరు
జాబితాలో ఉండేలా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలి. 18 సంవత్సరాలు నిండిన వారి పేర్లు నమోదు చేయడంతో పాటు, అనర్హులైన వారి వివరాలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించాను.రాయదుర్గం పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచడం, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ ద్వారా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ లక్ష్యం.
ఆనంద్, తేజల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ఈ కష్టాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లి గ్రామానికి చెందిన తండ్రి–కొడుకులు ఆనంద్, తేజలు బోరుబావి మరమ్మత్తు పనులు నిర్వహిస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిని సందర్శించి మృతదేహాలకు నివాళులర్పించాను.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశాను. ఈ విషాద ఘటనతో కుటుంబానికి తీరని లోటు ఏర్పడింది. మృతుల కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తాను.
పోటీల్లో పాల్గొన్న అన్ని జట్ల క్రీడాకారులకు అభినందనలు. విజేతలకు శుభాకాంక్షలు, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.
#ntrtrophy#KCL-3
ఎన్టీఆర్ ట్రోఫీ KCL-3 ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా కల్యం - సోమాలపురం జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత క్రికెట్ పోటీలను ఆసక్తిగా వీక్షించాను. క్రీడాస్ఫూర్తితో అద్భుత ప్రదర్శన కనబరిచి విజేతగా నిలిచిన సోమాలపురం జట్టుకు ఎన్టీఆర్ కప్‌తో పాటు రూ.20,000 నగదు బహుమతి,
రన్నరప్‌గా నిలిచిన కల్యం జట్టుకు రూ.10,000 నగదు బహుమతి అందజేయడం ఆనందంగా ఉంది.
గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహిస్తూ యువతలో ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయి.
ఈ సందర్భంగా చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, పరిశుభ్రమైన పరిసరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాం. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత. భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి.
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాయదుర్గంలో అవగాహన సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మున్సిపల్ కార్యాలయం నుండి డ్రైవర్స్ కాలనీ వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రజలు, పార్టీ నాయకులు, విద్యార్థులు, యువత పాల్గొని పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతు తెలిపారు.
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
అలాగే పట్టణాభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
రాయదుర్గం పట్టణ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.2.50 కోట్ల నిధులను మంజూరు చేయడం ఆనందంగా ఉంది. గత రెండేళ్లలో వివిధ పథకాల కింద ఇప్పటికే సుమారు రూ.10 కోట్ల నిధులు మంజూరుకాగా, తాజా నిధులతో కలిపి మొత్తం రూ.13 కోట్లకు పైగా అభివృద్ధి నిధులు రాయదుర్గానికి అందాయి.
ఈ నిధులను పట్టణంలోని రోడ్లు, మురికి కాలువలు, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులకు వినియోగించనున్నాం. రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ రాయదుర్గం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ నిధులు కేటాయిస్తున్న
రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.రెవెన్యూ సంబంధిత సమస్యలు లేని గ్రామంగా ఉడేగోళంను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాను.అధికారులుస్వయంగా గ్రామాలకు వచ్చి సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాలు చూపిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. గ్రామస్థాయిలోనే ప్రజల సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం “ప్రజా ఫిర్యాదుల దినోత్సవం” కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా రాయదుర్గం రూరల్ మండలం 74 ఉడేగోళం గ్రామంలో నిర్వహించిన
సమీక్షించి నాలుగు వారాల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రతి అర్జీకి కాలపరిమితి నిర్ణయించి పరిష్కారం చూపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంకా రెండు వారాల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.