నిజాయితీనే ఆయుధంగా, నిరాడంబరతనే ఆభరణంగా మలచుకుని, నమ్మిన సిద్ధాంతాల కోసం ఆజన్మం పోరాడిన మహనీయుడు ‘ఆంధ్రకేసరి’ శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తెలుగువారి ఆత్మగౌరవానికి, అసమాన ధైర్యసాహసాలకు ఆయన నిలువెత్తు ప్రతిరూపం. ప్రతి నిర్ణయంలోనూ ప్రజా శ్రేయస్సునే పరమావధిగా భావించి, దేశం కోసం, ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన త్యాగాలను, అచంచల పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను.
ఎన్టీఆర్ జిల్లా రైతులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో భవానిపురం బాలభాస్కర్ నగర్లో నూతన భూసార పరీక్షా కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు రూ.1 కోటి వ్యయంతో 4,000 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ కేంద్రం ద్వారా మట్టి శాస్త్రీయ పరీక్షలు, పంటలకు అవసరమైన పోషకాలు, ఎరువుల వినియోగంపై ఖచ్చితమైన సూచనలు ఇవ్వడం వంటి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక సాంకేతికత ద్వారా, రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తూ అధిక దిగుబడులు సాధించేలా NDA కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు' ఎంపికైన మన తెలుగు ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా చనుముల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ కౌలూరి రాజేష్ గారికి ప్రత్యేక అభినందనలు. కృత్రిమ మేధ వంటి ఆధునిక సాంకేతికతను బోధనలో వినియోగిస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధనా సామగ్రిని అందించి, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న ఆయన కృషి ప్రశంసనీయం.
ఈరోజు చిట్టినగర్‌లోని శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఆలయ నిబంధనలు, సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఆలయ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని నూతన పాలకమండలి సభ్యులను కోరాను. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే మనందరి ప్రధాన ధ్యేయంగా ఉండాలని తెలియజేశాను. నగరాల కులస్తుల సంక్షేమానికి, పశ్చిమ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నా వంతు కృషి ఎల్లప్పుడూ కొనసాగుతుంది.
శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశాను.
ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు మరియు కూటమి నేతలు సాదరంగా స్వాగతం పలికి అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై నిరంతరం ఉండాలని భగవంతుడిని ప్రార్థించాను.
One thing I loved about #InMobiEncore26: abstract ideas from auction theory aren't abstract anymore when you're applying them billions of times. The math becomes infrastructure.
The fastest way to understand what industry needs is to let students work on the problems industry is actually facing. Experience can teach a lot. So can getting your hands dirty. #InMobiEncore26
The AI era will belong to builders who experiment relentlessly. Not every idea will work, but every experiment can reveal what becomes possible next. #InMobiEncore26
దైవిక శోభకు నిలయమైన శ్రావణ మాసం అంటేనే భక్తి, మంగళత్వం, ఆధ్యాత్మికతకు ప్రతీక. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే పవిత్ర శుక్రవారం నాడు శ్రీ వరలక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా సకల శుభాలు, సౌభాగ్యాలు సిద్ధిస్తాయని మన విశ్వాసం. ఈ పవిత్రమైన రోజున శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తున్న మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆ జగన్మాత లక్ష్మీదేవి కటాక్షంతో ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సమృద్ధిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం సమగ్ర అభివృద్ధికి NDA కూటమి ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో భాగంగా నేడు కీలక మైలురాయిని చేరుకున్నాం. దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, కొండ దిగువన ఉన్న కనకదుర్గనగర్‌లో రూ. 52.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 'శ్రీకనకదుర్గ అన్నప్రసాద సదనం' మరియు 'శ్రీదుర్గాభవాని మహాప్రసాదం' భవనాలు నేడు ప్రారంభోత్సవం జరుపుకోనున్నాయి. రాబోయే దసరా, భవానీ దీక్షల వేడుకలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, దర్శనానంతరం సులభంగా అన్నప్రసాదం, మహాప్రసాదాలు స్వీకరించేలా ఈ భవనాల నిర్మాణం జరిగింది.
AI-first thinking means asking a different question: if we were designing this entire industry from scratch today, what would we build? Not where do we insert AI into the old system. #InMobiEncore26@InMobi
Ee range lo audience connect avuthundani chusthe chaala satisfying ga undi 😍
@RaviTeja_offl anna comeback ki #Irumudi perfect start ichinattundi 🔥
Inka long run undali ❤
విశాఖలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో ఉపాధ్యాయురాలి దెబ్బలకు ఆరేళ్ల చిన్నారి ప్రణయ్ తేజ్ ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్రంగా కలచివేసింది. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. చిన్నారి ప్రణయ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఈ ఘటనకు కారణమైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడం ఏమాత్రం సహించరానిది. పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు మరింత బాధ్యతాయుతంగా, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలి.
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి సమర్థ నాయకత్వంలో, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు 'బ్లూ ఎకానమీ' సరికొత్త దిక్సూచిగా మారుతోంది. FY26 లో రికార్డు స్థాయిలో రూ.73,890 కోట్ల సీఫుడ్ ఎగుమతులు నమోదు కావడం, చేపల ఉత్పత్తి 198 లక్షల టన్నులకు చేరడం మరియు రూ.5.8 లక్షల కోట్ల విలువైన సాగరమాల ప్రాజెక్టులు వేగవంతం కావడం మన సముద్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధికి నిదర్శనం. మత్స్య రంగానికి 2026-27 బడ్జెట్లో రూ.2,761.8 కోట్లు కేటాయించి, 2030 నాటికి $100 బిలియన్ల 'బ్లూ ఎకానమీ' లక్ష్యంతో 'వికసిత భారత్' వైపు దేశాన్ని నడిపిస్తున్నారు మన గౌరవ ప్రధానమంత్రి గారు.
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో.. దేశంలో రైలు, రహదారి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో దాదాపు రూ.13,041 కోట్ల విలువైన భారీ రోడ్డు, రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం హర్షణీయం.
ఈ నిర్ణయంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూడూరు - గుమ్మిడిపూండి మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం లభించడం విశేషం. ఆంధ్రప్రదేశ్ - తమిళనాడుల మధ్య మరింత పారిశ్రామిక సహకారానికి, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ సమగ్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడుతుంది.
జాతీయ ప్రతిష్టాత్మక 'అర్జున అవార్డు' కు ఎంపికైన మన తెలుగు క్రీడాకారులు పుల్లెల గాయత్రి గోపీచంద్ (బ్యాడ్మింటన్), ధనుష్ శ్రీకాంత్ (పారా షూటింగ్) లకు నా హృదయపూర్వక అభినందనలు. కఠోర శ్రమ, క్రమశిక్షణతో అంతర్జాతీయ వేదికలపై మాతృభూమి కీర్తిపతాకాన్ని ఎగురవేసి ఈ అత్యున్నత క్రీడా పురస్కారానికి ఎంపికవ్వడం ప్రతి తెలుగువారికీ ఎంతో గర్వకారణం. భవిష్యత్తులో వారు మరెన్నో విజయాలు సాధించి, దేశ యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తూ, ఇంకెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
గత 12 సంవత్సరాలుగా.. కేంద్రంలో గౌరవనీయులైన శ్రీ @narendramodi గారు దేశ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి బలమైన అండగా నిలుస్తున్నారు. సంక్షేమంతో పాటు మౌలిక వసతులు, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రగతికి బలమైన భాగస్వామిగా నిలుస్తోంది.
బిజెపిని ఆంధ్రప్రదేశ్‌లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా, పార్టీ సంస్థాగత విస్తరణ, కార్యకర్తల బలోపేతం, ప్రజలతో మరింత మమేకం తదితర అంశాలపై దిశానిర్దేశం చేసేందుకు విశాఖ విచ్చేస్తున్న జాతీయ అధ్యక్షులు శ్రీ @NitinNabin గారికి సాదర స్వాగతం. #APWelcomesNitinNabinJi
ఈరోజు నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ప్రారంభం కావడం అనేది ఉత్తరాంధ్ర ప్రగతి పటంలో ఒక చారిత్రాత్మక సువర్ణాధ్యాయం. గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి 'వికసిత్ భారత్ - 2047' లక్ష్యానికి అనుగుణంగా, అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలు మరియు సాంకేతికతతో నిర్మితమైన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మన రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను ప్రపంచ వేదికపై సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది.