అదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరం.
ఈ దుర్ఘటనలో ఇంకా 23 మంది పసిపిల్లలు గాయపడిన నేపథ్యంలో వెంటనే మెరుగైన చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడాలి.
కాంగ్రెస్ సర్కారు ఘోర వైఫల్యం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగి, అభంశుభం తెలియని పిల్లలు అన్యాయంగా బలైపోయారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ప్రభుత్వ వైద్య రంగాన్ని పూర్తిగా విధ్వంసం చేసిన సీఎం రేవంత్ రెడ్డే ఈ సంఘటనకు పూర్తి బాధ్యత వహించాలి.
రిమ్స్ ఆసుపత్రిలో నెలకొన్న దుస్థితులపై అనేకసార్లు BRS జిల్లా నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించినా మొద్దునిద్ర పోయిన రేవంత్ సర్కారులో కనీస చలనం కనిపించలేదు.
అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన పిల్లల వార్డులో ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా లోపించడం, కనీస నిర్వహణ లేకపోవడం వల్లే ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ రిమ్స్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పిల్లల వార్డులు, ఐసీయూలను నిపుణులతో తనిఖీ చేయించి ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.
రేవంత్ సర్కారు చేతకానితనం వల్ల తమ పసిపిల్లలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని BRS పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
🎂💐 నా సోదరి హేమకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు! ❤️
నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. 🌸🙏
హ్యాపీ బర్త్డే హేమ! 🎉🎂❤️
Took the blessings of Lord Ganesha organized by Secunderabad MLA and former Deputy Speaker Sri Padma Rao Goud Garu at Takara Basti. 🙏🐘
May Lord Ganesha bless everyone with peace, prosperity, and happiness. 🙏
🙏 ఇంటి గణపయ్యకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి,
బొజ్జ గణపయ్యను వేడుకొని, మా కుటుంబంతో పాటు అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని ప్రార్థించడం జరిగింది. 🙏🌺
విఘ్నాలు తొలగించి, అందరి జీవితాల్లో విజయాలు నింపాలని గణనాథుడిని వేడుకున్నాను. 🕉️🐘
🙏 గణపతి బప్పా మోరియా!
ఈ రోజు సీతాఫల్మండి క్యాంప్ కార్యాలయంలో 42 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.18 లక్షల విలువైన CMRF చెక్కులను సికింద్రాబాద్ ఎమ్మెల్యే శ్రీ తిగుళ్ల పద్మారావు గౌడ్ గారితో కలిసి, నా తోటి మాజీ కార్పొరేటర్లు మరియు పార్టీ సహచరులతో కలిసి అందజేయడం జరిగింది.
జై తెలంగాణ! జై BRS!
Today, along with GHMC DE Smt. Nagamani Garu and party cadre, distributed eco-friendly clay Ganesh idols to the local residents of Boudhanagar GHMC Ward.The initiative was aimed at encouraging the use of eco-friendly idols and promoting a greener and pollution-free environment.
ఈ రోజు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు శ్రీ కేసీఆర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారాసిగూడ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది
బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు, సికింద్రాబాద్ శాసనసభ్యులు శ్రీ తిగుళ్ల పద్మారావు గారి ఆదేశాల మేరకు ఈ రోజు మెట్టుగూడ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి నా తోటి మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ గారు మరియు పార్టీ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.
ఈ రోజు అసెంబ్లీ బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, సీతాఫల్మండి చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది.
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు హేమ గారు, సునీత గారితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ సమర భేరి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జీహెచ్ఎంసీ ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేయడం జరిగింది.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూనే ఉంటుంది.
#BRS#Warasiguda#PrajaVani#SamaraBheri#6Guarantees
బీఆర్ఎస్ పార్టీ సమర భేరి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వారాసిగూడ చౌరస్తా నుండి నిర్వహించిన ఆటో ర్యాలీలో నా తోటి మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ గారితో కలిసి నిర్వహించడం జరిగింది.
#BRS#SamaraBheri#AutoRally#AutoWorkers#Warasiguda
ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల విఫల పాలనకు నిరసనగా, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గారితో కలిసి మాజీ కార్పొరేటర్లు కంది శైలజ, డాక్టర్ సామల హేమ, ప్రసన్న, సునీత, సరస్వతి గార్లు లాలాపేటలోని సంఘీ కళాశాల విద్యార్థులతో కలిసి నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడం జరిగింది.
ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల విఫల పాలనకు నిరసనగా, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గారి ఆధ్వర్యంలో అడ్డగుట్టలో నిర్వహించిన వంట వార్పు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
Today participated in rally against Congress party failure along with Secunderabad MLA Shri Padmarao Garu , fellow Ex corporators and cadre from warasiguda chowrasta to seethaphalmandi.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సీతాఫల్మండి లో ఎమ్మెల్యే పద్మారావు గారి సమావేశం లో పాల్గొనడం జరిగింది.వెయ్యి రోజుల విఫల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పై నిరసన కార్యక్రమాలు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టటం జరుగుతుంది.
ఈరోజు సనత్నగర్ TIMS వద్ద బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి శ్రీ హరీశ్ రావు గారు ఇచ్చిన పిలుపులో భాగంగా మేము ఇంటి నుంచి బయటకు వస్తుండగా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నాం—రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకుని ప్రజలకు మేలు చేసే పనులు చేయండి.