దేశ స్వాతంత్య్రం కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన విప్లవ యోధుడు, ప్రజలను చైతన్యపరిచిన స్ఫూర్తిప్రదాత భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.
తరతరాలుగా భూములను సాగు చేసుకుంటున్నా హక్కుపత్రాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.
భూ రికార్డుల్లో తప్పులకు తావులేకుండా అర్హులైన ప్రతి రైతుకూ పూర్తి భూ హక్కుల భరోసా కల్పిస్తున్నాము.
ఒక రోజు ఆలస్యమైనా వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అసలైన భూ యజమానులకు రాజముద్రతో పాస్‌పుస్తకాలు ఇస్తున్నాము.
2019–24 మధ్య కుంటుపడిన అభివృద్ధిని పునరుద్ధరిస్తూ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నాము.
ప్రజలు నన్ను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి పనులను పూర్తి చేస్తాము.
గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా మా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఈరోజు టెక్కలి మండలంలోని అయోధ్యపురం గ్రామ పంచాయతీలో విస్తృతంగా పర్యటించి, స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది.
ఈ పర్యటనలో భాగంగా రూ.1.70 కోట్ల అంచనా వ్యయంతో జాతీయ రహదారి–16 నుంచి సుఖదేవిపేట వరకు నూతన తారు రహదారి నిర్మాణానికి, అలాగే రూ.50 లక్షల అంచనా వ్యయంతో జాతీయ రహదారి–16 నుంచి అయోధ్యపురం మీదుగా సుఖదేవిపేట రహదారి నుండి కంట్రగడ వరకు బీటీ రోడ్డు పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. వీటితో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారం చూపేందుకు రూ.624 కోట్లతో హిరమండలం రిజర్వాయర్ ఆధారిత సమగ్ర తాగునీటి పథకాన్ని మంజూరు చేశాం. ఈ పథకం ద్వారా టెక్కలి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని త్వరలోనే అందిస్తాం.
రైతన్నల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయాన్ని పండుగలా మార్చడమే మా లక్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగానే కాలువలు, గెడ్డల్లో పూడికతీత పనులను వేగవంతం చేయడంతో పాటు, రైతులకు అధికారిక రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తున్నాం.
ఒకవైపు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తూనే, మరోవైపు పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, 3 లక్షల ఇళ్ల నిర్మాణం వంటి పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. ప్రజా సంక్షేమమే పరమావధిగా మా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
నన్ను అందరూ 'ఆంధ్రప్రదేశ్ డోలో 650 (Dolo 650)' అని పిలుస్తారు. ఒక పారిశ్రామికవేత్తకు ఏదైనా సమస్య ఎదురైతే.. మళ్లీ ఆ సమస్య వేరెవ్వరికీ రాకుండా పరిష్కరిస్తాం. నా దృష్టిలో వేగం అంటే కేవలం నిర్ణయాలు వేగంగా తీసుకోవడమే కాదు, మొత్తం వ్యవస్థను మార్చడం.
#ChooseSpeedChooseAP
#JobCreatorInChiefLokesh
#InvestInAP
#NaraLokesh
పదిహేనేళ్ల ఎదురుచూపులు ఫలించాయి. ఒక్క ఇంటి పట్టాతో మా జీవితాలు మారిపోయాయి. ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే. దేశంలో ఏ నాయకుడూ చేయలేనిది సీఎం చంద్రబాబు గారు చేసి చూపించారు. మహిళలకు పెద్దన్న మా చంద్రన్న.
#PedalakuPattabhishekam#MeeilluMeeHakku#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
టెక్కలి మండలం కొల్లివలస గ్రామానికి చెందిన గణియా శ్రీనివాసరావు గారి నివాసంలో నిర్వహించిన పసిపాప ఊయల, నామకరణ మహోత్సవానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించడమైనది, ఈ సందర్భంగా పసిపాప ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఆ కుటుంబ సభ్యులకు, బంధువులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను.
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి మా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలియజేస్తున్నాను.
యాభై ఏళ్లుగా తరతరాలుగా భూములను సాగు చేసుకుంటున్నా సరైన హక్కుపత్రాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతు సోదరులకు శాశ్వత పరిష్కారం చూపడమే మన కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని నా క్యాంప్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజాదర్బార్‌లో నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు, వినతులను స్వయంగా స్వీకరించి పరిశీలించాను. ప్రజల ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పింఛన్లు, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ సహా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాను. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించాను. మన ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తూ, గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో, సమష్టి కృషితో పనిచేసి రాబోయే స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని పిలుపునిచ్చాను.
10 ఏళ్ల క్రితం ఉన్న @naralokesh బాబు వేరు, ఇప్పటి లోకేష్ బాబు వేరు. స్టాన్ఫోర్డ్ లో చదువుకొని, @ncbn గారి దగ్గర పరిపాలనలో శిక్షణ పొంది దేశంలోనే అగ్రగామి నాయకుడిగా ఎదిగారు. ప్రధాని @narendramodi గారి ప్రశంసలు అందుకుంటూ తండ్రికి తగ్గ తనయుడిగా పాలన సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఊహించని రీతిలో భారీగా పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.
కనీసం 10వ తరగతి లేదా ఇంటర్ విద్యార్హత సర్టిఫికెట్లు కూడా చూపించలేని వారు, విద్యాధికుడైన లోకేష్ బాబుతో తమను తాము పోల్చుకోవడం హాస్యాస్పదం. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం, ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాలపై మా ఎన్డీఏ ప్రభుత్వం 'సిట్' వేసి విచారణ జరుపుతుంటే, ఈ అక్రమాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతో ప్రజల దృష్టి మళ్లించడానికి డిఎస్సీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి... నేటి యువత అమాయకులు కారు, మీ డైవర్షన్ రాజకీయాలను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
గత ప్రభుత్వ హయాంలో గొడ్డలిపార్టీ అధ్యక్షుడు @ysjagan పబ్లిక్ సర్వీస్ కమిషన్ పవిత్రతను దారుణంగా దెబ్బతీస్తూ గ్రూప్-1 ఉద్యోగాలను అమ్ముకోవడం శోచనీయం. ప్రొఫెసర్లతో కాకుండా కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లతో రహస్యంగా 'హైలాండ్'లో పేపర్లు దిద్దించి తమవారికి ఉద్యోగాలు కట్టబెట్టడం నిరుద్యోగ యువతను తీవ్రంగా వంచించడమే. కష్టపడి చదువుకున్న యువత న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించడంతో, కోర్టు ఆదేశించిన 'సిట్' విచారణలో ఈ కుంభకోణం బండారమంతా పూసగుచ్చినట్లు బయటపడింది. ఇప్పుడు అసలు దొంగ దొరికిపోవడంతో ఏం చేయాలో తోచక, ఈ తీవ్ర నేరాన్ని డైవర్ట్ చేసేందుకు @YSRCParty కొత్త నాటకాలకు తెరలేపుతుంది.
టెక్కలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతు ఏ స్థాయిలో ఉందో సీతాపురం, తిర్లంగి పంచాయతీల పరిధిలోని దాదాపు 500 కుటుంబాలు వైకాపాను వీడి టీడీపీలో చేరడమే ప్రత్యక్ష నిదర్శనం. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించాం. వీర రామకృష్ణాపురం సహా తిర్లంగి పరిధిలోని పలు గ్రామాల నుంచి ప్రజలు, కార్యకర్తలు ఇంత పెద్దఎత్తున పార్టీలో చేరడం టెక్కలి అభివృద్ధికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న నాయకులు ప్రాంతీయ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించడమే ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతను శిరసావహిస్తూ టెక్కలి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం.
గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, గృహ నిర్మాణం, పింఛన్ల పంపిణీతో పాటు రైతులు, మహిళలు, పేదల సంక్షేమానికి ప్రతి పథకాన్ని అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ పారదర్శకంగా అందిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా, గతంలో ఓట్లు వేయని గ్రామాలను కూడా సమంగా చూస్తూ అభివృద్ధి ఫలాలను అందిస్తున్నాం. ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తా. అభివృద్ధి, సంక్షేమం ద్వారాలే ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపడమే మన ప్రభుత్వ ధ్యేయం.
గతంలో ఉన్న హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి నేటి టెక్కలి వరకు గత 44 ఏళ్లుగా మా కింజరాపు కుటుంబం ప్రజల సేవకే అంకితమైంది. దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు గారు వేసిన బాటలోనే నేను కూడా నిరంతరం నియోజకవర్గ పురోగతికి శ్రమిస్తున్నాను. ఇటీవలే సీతాపురం, వెంకటాపురం గ్రామాల్లో పర్యటించి ప్రత్యక్షంగా మౌలిక వసతుల పనులను పరిశీలించాను. సీతాపురం, తిర్లంగి పరిధిలోని అన్ని గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో పాటు మరిన్ని వసతులు కల్పిస్తాం.
ఈ చేరికల కార్యక్రమంలో భాగస్వాములైన AMC ఛైర్మన్ బగాది శేషగిరిరావు గారికి, టీడీపీలో చేరిన బెండి శ్రీనివాసరావు, బెండి అప్పలసూర్యనారాయణ, టి. జగ్గారావు, బెండి కామరాజు, సోమేశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.
@JaiTDP@ncbn@naralokesh
3,600 కోట్ల లిక్కర్ దోపిడీకి అసలు సూత్రధారి జగనే! నీ నీతి ముసుగు తొలిగింది!
మద్యపాన నిషేధం అని ఓట్లు అడిగి, ఐదేళ్లలో ₹3,600 కోట్ల లిక్కర్ దందా నడిపింది నువ్వు కాదా @ysjagan ? ఆధారాలతో దర్యాప్తు సంస్థలు ముందరబెడితే, సమాధానం చెప్పలేక రాజకీయ విమర్శల వెనుక దాక్కుంటావా?
ప్రజాధనాన్ని మేసి, నాసిరకం బ్రాండ్లతో పేదల ప్రాణాలు తీసిన నీ పాపం పండింది! ప్రతీ పైసా లెక్క తేలుతోంది.. దొంగ దొరికిపోయాక నాటకాలు చెల్లవు!
జగన్ మోహన్ రెడ్డి.. కబడ్దార్! రాజకీయ కంటితుడుపు మాటలు కాదు, ఆధారాలకు వాస్తవాలతో సమాధానం చెప్పు.. పద్ధతి మార్చుకోకపోతే తోక కట్ చేసి చట్టం ముందు నిలబెట్టడం ఖాయం!
అరాచక శక్తులకు హెచ్చరిక.. జగన్ ముసుగు తొలగించి లోపలేస్తాం!
ఒక దోపిడీదారుడు, క్రిమినల్ పార్టీ ముసుగులో విద్వేషాలు రెచ్చగొడుతూ.. @YSRCParty గూండాలతో ఉపాధ్యాయులపై దాడి చేయించడం సభ్య సమాజం తలదించుకునే దారుణం.
మాది ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం. తప్పులను ప్రశ్నిస్తే పాజిటివ్‌గా తీసుకుంటాం గానీ, దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకోం.
@ysjagan .. ఇకపై నీ ఆటలు సాగవు.. కబడ్దార్! పద్ధతి మార్చుకోకపోతే తోక కట్ చేసి లోపలేస్తాం!
ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియపై ఏమైనా అభ్యంతరాలుంటే సరైన సమయంలో చట్టపరంగా ప్రశ్నించాలి గానీ... కష్టపడి DSC సాధించి విధుల్లో చేరిన తర్వాత యువత జీవితాలతో రాజకీయాలు చేయడం ఏంటి?
ఉద్యోగాలు సాధించిన యువతను అనవసర వివాదాల్లోకి లాగుతున్న గొడ్డలపార్టీ అధ్యక్షుడు @ysjagan & కో ఆ యువత భవిష్యత్తుకు ఏం సమాధానం చెప్తారు?
మా DSC నియామకాలపై విషం చిమ్మే ముందు... మీ ఐదేళ్ల తుగ్లక్ పాలనలోని వైఫల్యాల రికార్డును ప్రజల ముందు పెట్టండి!
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి మా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలియజేస్తున్నాను. కోటబొమ్మాళి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం కుమారుడు పంచాయతీ పరిధిలోని చౌదరి కొత్తూరు గ్రామానికి చెందిన 17 నిరుపేద కుటుంబాలకు నా చేతుల మీదుగా ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయడం జరిగింది.
పేదల సంక్షేమమే మా కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. గతంలో సొంత ఇల్లు, ఇంటి స్థలం లేక ఇబ్బందులు ఎదుర్కొన్న నిరుపేద కుటుంబాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ఈ కార్యక్రమం చేపట్టాం. పేద కుటుంబాలకు ఇంటి స్థలం ఇవ్వడం అంటే కేవలం భూమి కేటాయించడం మాత్రమే కాదు, వారి జీవితానికి భరోసానివ్వడం మరియు వారి పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించడమని నేను బలంగా నమ్ముతున్నాను.
మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గ్రామీణ ప్రాంతాల్లో పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణం, పెన్షన్లు, రేషన్, విద్య, వైద్యం తదితర రంగాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. అర్హత ఉన్న ఏ ఒక్క పేదవాడూ నష్టపోకుండా పథకాలు అందించాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తమ సొంతింటి కల నెరవేరేందుకు మార్గం సుగమం అయినందుకు చౌదరి కొత్తూరు గ్రామానికి చెందిన లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేయడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.