రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క @seethakkaMLA గారి జన్మదినం సందర్భంగా
ములుగు జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు గారు , ఎస్ పి సుధీర్ రామ్‌నాథ్ కేకన్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేలు అందించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి, డి.ఎస్.పి రవీందర్, సిఐ లు తదితరులు. పాల్గొన్నారు.
#BirthdayWishes #WishingYouSuccess #Mulugu #Leadership #PublicService #InspiringLeader #VisionaryLeader #DedicatedLeader #GoodHealthAndHappiness #ServiceToPeople #Telangana #TelanganaGovernment
#TelanganaLeadership #TelanganaDevelopment
#PeopleFirst #ServingTheNation @TelanganaCMO
Scan to Pay, NOT to Receive!
If anyone asks you to scan a QR code to receive money, it's a scam.
Report cyber fraud: 1930 | https://t.co/xg5CDNcpu1
#CyberSafety#OnlineFraud#CyberCrime
Telugu podcast with Vamshi kurapati.
in 5 days @1 million people viewed it.
Scientific investigation stories, citizen centric initiatives for good governance, UPSC mentorship, Awareness on scientific temper, communalism, extremism, insurgency , community policing activities etc. discussed in lenth. Your comments welcome.
@sunita_krishnan@TelanganaCOPs@hydcitypolice@MalkajgiriCop@cyberabadpolice@SCSC_Cyberabad
#podcast #telugu #policing #Telangana #Manipur #Andhrapradesh
@vamshikurapatik
https://t.co/P5hmErRFl1
మహబూబ్‌నగర్‌లోని బోయపల్లి అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా, IAS గారు సందర్శించి, శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రీ-లిటరసీ, ప్రీ-న్యూమరసీ, FLN కార్యక్రమాలను పరిశీలించారు. చిన్నారుల అభ్యాస నైపుణ్యాల మెరుగుదలకు పూర్తి సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. @TelanganaCMO@TelanganaCS@IPRTelangana
విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం అవసరం
–వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపిఎస్.
పోలీసులు తమ విధుల్లో అత్యుత్తమంగా రాణించాలంటే వృత్తి నైపుణ్యం సొంతం చేసుకోవడం ఎంతో కీలకమని వరంగల్ పోలీస్ కమిషనర్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మూడు రోజుల పాటు జరిగే భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను మంగళవారం పోలీస్ కమిషనర్ మామూనూర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ప్రారంభించారు.
భద్రాద్రి జోనల్ పరిధిలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్, ఖమ్మం పోలీస్ కమీషనరేట్, మహబూబాబాద్ మరియు భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది డ్యూటీ మీట్ లో భాగంగా కంప్యూటర్ పరిజ్ఞానం, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్ లిఫ్టింగ్, ప్యాకింగ్, హ్యాండ్లింగ్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్, ఫోటోగ్రఫీ & వీడియో గ్రఫీ వంటి విభాగాల్లో సిబ్బంది తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు.
ప్రతి విభాగంలో ప్రతిభ కనబర్చిన వారిని, త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ కోసం ఎంపిక చేయడం జరుగుతుంది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ డ్యూటీ మీట్లు అధికారులకు తమ నైపుణ్యాలను మెరుగుపర్చే అవకాశం కల్పిస్తాయి. నేరాలను త్వరితగతిన ఛేదించేందుకు, సాక్ష్యాలను శాస్త్రీయంగా విశ్లేషించేందుకు, ప్రజలకు న్యాయం అందించేందుకు ఈ వృత్తి శిక్షణ ఎంతో అవసరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, అదనపు డీసీపీ లు బాలస్వామి, శ్రీనివాస్ తో పాటు జోనల్‌కు చెందిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs
మృతి చెందిన హోంగార్డ్ బాలకృష్ణ కుటుంబానికి జిల్లా పోలీస్ శాఖ అండగా నిలిచింది. హోంగార్డులు స్వచ్ఛందంగా సేకరించిన రూ.50,000 ఆర్థిక సహాయాన్ని ఎస్పీ డాక్టర్ వినీత్ IPS చేతుల మీదుగా మృతుడి భార్యకు అందజేశారు. కష్టసమయంలో సహచర కుటుంబానికి అండగా నిలవడం పోలీస్ శాఖ సేవాభావానికి నిదర్శనం.
తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేసి అధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, భూ భారతి, సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించడం జరిగింది.
కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది.
చట్టపరమైన గుర్తింపు కోసం టీజీ మీసేవలో బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి! ఈరోజే https://t.co/Pv9BXjfKNw వెబ్సైట్లో లేదా మీ సమీప మీసేవ కేంద్రంలో అప్లై చేసుకోండి! 📜🏛️
#MeeSeva#BirthCertificate#GovernmentofTelangana
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో పోలీస్ టెక్నాలజీకి AI తో మెరుగులు.. డీజీపీ శ్రీ సివి ఆనంద్ క్షేత్రస్థాయి పర్యటనలతో పోలీసుల్లో సరికొత్త ఉత్సాహం. యూనిట్ అధికారులకు సరైన దిశానిర్దేశం.
Sri Sunpreet Singh, IPS has assumed charge as the Joint Commissioner of Police, Traffic, Cyberabad Commissionerate.
On assuming charge, Sri Sunpreet Singh, IPS reported to the Commissioner of Police, Cyberabad, Dr. M. Ramesh, IPS.
DCP Traffic-II, Smt. Seshadrini, IPS; DCP Traffic Sri Ravi Kumar; Addl. DCP Traffic-I, Sri Hanmanth Rao; and the Traffic Inspectors of the Cyberabad Commissionerate has paid a courtesy call to Sri Sunpreet Singh IPS, Jt CP Traffic, Cyberabad.
శ్రీ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ గారు సైబరాబాద్ కమిషనరేట్, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) గా బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆయన కమీషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్, డా. ఎం. రమేష్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
తదనంతరం, డీసీపీ ట్రాఫిక్-II శ్రీమతి శేషాద్రిని, ఐపీఎస్ గారు ,డీసీపీ ట్రాఫిక్ శ్రీ రవి కుమార్ గారు అదనపు డీసీపీ ట్రాఫిక్-I శ్రీ హనుమంతరావు గారు, అలాగే సైబరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగానికి చెందిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) శ్రీ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
మణుగూరులో నూతన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ గారు
డీజీపీ సి.వి. ఆనంద్ గారు మణుగూరులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ గారు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ అంకిత్ IAS, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రోహిత్ రాజు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ IAS పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ మానిటరింగ్ సెల్‌ను ప్రారంభించారు.
డీజీపీ సి.వి. ఆనంద్ గారు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ సహకారంతో నిర్మించిన ఈ పోలీస్ స్టేషన్ ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, ఆధునిక పోలీసు సేవలు అందుతాయని తెలిపారు. సీసీటీవీ నిఘా, సైబర్ నేరాల నియంత్రణ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై EAGLE వ్యవస్థ ద్వారా కఠిన చర్యలు కొనసాగుతున్నాయని, డ్రగ్ మాఫియాపై తీవ్రవాదుల తరహాలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు సత్వర, పారదర్శక పోలీసు సేవలందించడంలో జిల్లా యంత్రాంగం పోలీసు శాఖతో సమన్వయంగా పనిచేస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక సదుపాయాలతో కూడిన ఈ నూతన పోలీస్ స్టేషన్ ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించడంలో కీలకంగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సింగరేణి సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@jupallyk_rao@UttamINC@INC_Ponguleti@OffDSB@DamodarCilarapu@KomatireddyKVR@Ponnam_INC@Tummala_INC@VivekVenkatswam@TummalaOfficial@seethakkaMLA@meeseethakka@iamkondasurekha@minister_adluri@SrihariVakiti@TelanganaCS@IPRTelangana
#AnkithIAS #CVAnand #Manuguru #TelanganaPolice #LawAndOrder #PublicSafety #BhadradriKothagudem #Telangana
Siddipet CP Rashmi Perumal, IPS conducted a field inspection at Victory Chowrasta and Old Bus Stand areas. Spotting road safety hazards and instructing officials for swift, strict action to ensure citizens have a safer commute.
Let's build safer roads together! #ArriveAlive