2275 transactions in a single day and counting on #Dharani! 8500 transactions in just 7 days; ₹18 Cr revenue realised. Secure & seamless registration and instant mutation. Avg. transaction time of 15 mins. Massive response to @TelanganaCMO pioneering reform!
ప్రస్తుతం తెలంగాణకు ఇస్తున్న 5,500 రెమిడెసివిర్ల ఇంజక్షన్ల సంఖ్యను, సో��వారం నుంచి 10,500 కి పెంచుతున్నట్టుగా, ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండు చేస్తున్న నేపథ్యంల�� అదనంగా 200 టన్నుల ఆక్సిజన్ ను సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు.
వ్యాక్సిన్లను కూడా పెద్దమొత్తంలో తెలంగాణకు సరఫరా చేయాలని సీఎం కోరిన నేపథ్యంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సెకండ్ డోస్ కు ప్రాధాన్యతనివ్వాల్సిందిగా కేంద్రమంత్రిని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ డోస్ కే ప్రాధాన్యతనిస్తున్నదని సీఎం స్పష్టం చేశారు.
కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, వ్యాక్సిన్ ల సరఫరాను పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఇవా��� కేంద్ర రైల్వేశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు ఫోన్ చేసి చెప్పారు.