@pulsenewsbreak ఎక్కడో చదివాను, పుల్లారెడ్డి గారు స్వీట్ స్టాల్ పెట్టిన కొత్త లో (ఫేమస్ కాని టైమ్ లో) తను తయారు చేయించిన మంచి క్వాలిటీ స్వీట్లు తను ఎక్కడకు వెళితే అక్కడ స్వీట్లు ఉచితంగా తినమని పంచి పెట్టేవారట. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. అప్పుడు అంత నిబద్ధతగా ఉండేవారు వ్యాపారం చేసేవారు.
— సర్వాంగ సుందరంగా సున్నం చెరువు
— అందంగా ఆంజనేయ స్వామి మందిరం
— హైడ్రాతో కలసి నడచిన టెంపుల్ కమిటీ
— పర్యావరణ హితంగా పరిసరాలను తీర్చిదిద్దిన హైడ్రా
✳️ ఒక వైపు బోరబండ బస్తీ.. మరో వైపు ఐటీ కారిడార్ ఇలా మాధాపూర్ గుట్టల బేగంపేటలో మురికి కూపంగా ఉన్న సున్నం చెరువును సర్వాంగ సుందరగా హైడ్రా తీర్చిదిద్దుతోంది. ఆక్రమణలతో కుంచించుకుపోయి మురుగు నీటి కుంటలా మారిన సున్నం చెరువుకు పూర్వ వైభవం తెచ్చేందుకు హైడ్రా పెద్ద కసరత్తే చేస్తోంది. 14.20 ఎకరాలకు కుంచించుకుపోతే.. ఆక్రమణలను తొలగించి 30.5 ఎకరాలుగా హైడ్రా విస్తరించింది. ఎక్కడా నిర్మాణ నివాసాలను తొలగించలేదు. ఇక్కడి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీటిలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే పాదరసం, సీసం, ఆర్సెనిక్, ఫ్లోరైడ్, పురుగుమందల వంటి విషపూరిత పదార్థాలు ఉన్నట్టు పీసీబీ నివేదిక కూడా ఇచ్చింది. తాత్కాలిక షెడ్డులు వేసి మురుగు నీటి దందాకు హైడ్రా చెక్ పెట్టింది. 3 మీటర్ల మేర పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి మురుగు వాసన లేకుండా హైడ్రా చేసింది. అక్కడ దుర్గంధభరిత వాతావరణం తొలగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చెరువు ప్రారంభానికి ముందే వేలాది మంది ఉదయం, సాయంత్రం చెరువు చుట్టూ నిర్మించిన బండ్ మీద వాకింగ్ చేస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో చెరువు అభివృద్ధి పనలు పూర్తవ్వనున్నాయి. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌రెడ్డి గారి చేతుల మీదుగా చెరువు ప్రారంభోత్సవానికి సిద్ధమౌతోంది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో గుడిసెలు వేసుకుని ఇబ్బందికరమైన వాతావరణంలో నివాసం ఉన్నవారికి ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా డబుల్ బెడ్ రూం ఇళ్లను అందజేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
— సర్వాంగ సుందరంగా ఆంజనేయ గుడి..
✳️ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో చుట్టూ చెత్త, చెదారం.. దుర్గంధ భరిత వాతావరణంలో ఉన్న అంజనేయ గుడిని కూడా హైడ్రా అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సంబంధించి ఆలయ కమిటీ ప్రతినిధులతో పలుమార్లు హైడ్రా సమావేశమైంది. వారు సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని గొపురాన్ని నిర్మిస్తోంది. ఆలయానికి వెళ్లే దారితో పాటు.. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి పాత్ వే కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆలయానికి వచ్చిన వారు కూర్చునేందుకు పాలరాతి గజబోను కూడా నిర్మిస్తోంది. గుడికి ముందు వాటర్ ఫౌంటైన్లో ఆంజనేయుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ పనులు త్వరలోనే పూర్తి చేసి గుడికి మంచి రూపాన్నిస్తోంది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న అభివృద్ధిని ఆలయ కమిటీ ప్రతినిధులు స్వాగతిస్తున్నారు. అక్కడ కొంతమంది గుడిని అడ్డంపెట్టుకుని అభివృద్ధిని అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఆలయాన్ని హైడ్రా తొలగిస్తున్నదనే తప్పుడు ప్రచారాన్ని చేస్తూ లేనిపోని గందరగోళానికి సిద్ధమౌతున్నారు. దీంతో ఆలయ కమిటీ ప్రతినిధులు అప్రమత్తమయ్యారు.
— చెరువు చుట్టూ ఆకర్షణలు..
✳️ సున్నం చెరువుచుట్టూ విశాలమైన బండ్‌పై పాత్వే సిద్ధమైంది. ఎక్కడికక్కడ కూర్చునేందుకు రాతి కుర్చీలను, సేద దీరేందుకు గజబోలను అందుబాటులోకి హైడ్రా తీసుకు వస్తోంది. పిల్లల ప్లే ఏరియాలు, పచ్చిక బైళ్లు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తోంది. చెరువుచుట్టూ ఔషధ, సుగంధ మొక్కలు, నీడనిచ్చే చెట్లను నాటి పచ్చదనాన్ని పెంచుతోంది. 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువ ఉండేలా పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటోంది. బతుకమ్మలు ఆడేందుకు బేబీ పాండ్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నది. చెరువులో బోటింగ్ చేసే విధంగా పర్యాటక ఏర్పాట్లు అందుబాటులోకి రానున్నాయి. చెరువు గట్టు చుట్టూ సోలార్ లైట్లు ఏర్పాటు చేయడమే కాకుండా.. పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. చెరువుకు ఆనుకుని ఉన్న సహజసిద్ధమైన కొండను కూడా హైడ్రా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది.
#HYDRAA #Lakes #SaveLakes #SunnamCheruvu
@TV9Telugu మామూలు గా మందు తాగితే అంత విపరీతం గా ప్రవర్తించరు , కానీ ఈ గంజాయి తీసుకుంటే రాక్షసులు గా మారిపోతున్నారు. ఈ ప్రాణం కూడా గంజాయి ఖాతా లోదే అన్న మాట. గంజాయి ద్వారా డబ్బు సంపాదించే వారికి, గంజాయి ను అడ్డుకోలేని వారికి ఈ ప్రాణం కూడా అంకితం.
@RTVnewsnetwork కల్తి నెయ్యి సప్లై, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కుళ్ళిన మాంసం తో బిర్యానీలు చేసే కొన్ని హోటల్స్, అధిక కార్బైడ్ తో పండించి అమ్మే పండ్లు, అధిక ఇండ్ల రేట్లు, అద్దె రేట్లు, విపరీతమైన ట్రాఫిక్, ఈ దోమల గుంపు అన్ని రంగాల్లో హైద్రాబాద్ మొదటి స్థానంలో ఉండాలి కదా 😜😜
@TeluguScribe ప్రతీ Inter, degree Colleges లో civic sence మీద, traffic మీద ప్రతీ year లో సంబంధిత శాఖలలో ఒకరు యూనిఫాం లో వెళ్ళి తప్పనిసరిగా ఒకటి లేదా రెండు 1hr క్లాసెస్ తీసుకోవాలి.
@pulsenewsbreak ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అతి చవకగా ప్రభుత్వం దగ్గర భూమి పొంది, అప్పుడే డిగ్రీ పొందిన వారిని తీసుకుని వయసు లో ఉన్న గుర్రాల ను వాడుకున్నట్లు రాత్రి పగలు తేడా లేకుండా వాడుకుని కొంచెం సీనియర్ అయి జీతం ఎక్కువ అవుతున్న టైమ్ లో ఏదో ఒక పొగ పెట్టి నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారు.