ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు.
తెరపై అనేక పాత్రలను సజీవంగా ఆవిష్కరించిన మహానటుడిగా…
ప్రజాజీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా… అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులు.
ఇటీవల ఎన్టీఆర్ జాతీయ పురస్కారం నాకు లభించడం కూడా ఎంతో ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను. అది ఆయనపై నాకు ఉన్న గౌరవానికి మరింత విలువైన గుర్తింపుగా నిలిచిపోతుంది.
ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ…
మనిషి దేవుడిగా మారడం అంటే ఏంటో తన జీవితంతో ప్రపంచానికి చూపించిన నటవిఖ్యాత, నటసార్వభౌమ, నందమూరి తారక రామారావు గారు.
తెరపై శ్రీరాముడిగా కనిపిస్తే ప్రజలు చేతులు జోడించారు…
శ్రీకృష్ణుడిగా పలికితే భక్తితో పరవశించారు…
నాయకుడిగా ముందుకు నడిస్తే తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా నిలిచారు.
ఆయన ఒక వ్యక్తి కాదు… ఒక శకం.
తెలుగు గర్వానికి ప్రతీక… ప్రజల విశ్వాసానికి ప్రతిబింబం… కోట్ల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహాశిఖరం.
నటన, నాయకత్వం, క్రమశిక్షణ, ప్రజలపై ప్రేమ… ఏ రంగాన్ని తాకినా తనదైన ముద్ర వేసిన అసామాన్య వ్యక్తిత్వం ఆయనది.
24 క్రాఫ్ట్స్‌లో ఆయన చేయనిది లేదనిపించే మహోన్నత ప్రస్థానం.
నటుడిగా అలరించారు… నాయకుడిగా నడిపించారు… మహానాయకుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం, ఆయన సాన్నిధ్యాన్ని దగ్గరగా అనుభవించడం నా జీవితంలో ఎన్నటికీ మరువలేని గౌరవం.
ఆయనలో చేయలేని పాత్ర లేదు… చేరలేని శిఖరం లేదు అనిపించేది.
#NTR గారి జయంతి సందర్భంగా నిర్వహించిన విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో భావోద్వేగాన్నిచ్చింది.
తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా వెలిగే మహానుభావుడికి ఇలాంటి ఘన నివాళులు అర్పించడం నిజంగా గర్వకారణం.
ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన @revanth_anumula గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
తెలుగు ఉన్నంత వరకు ఎన్టీఆర్ గారు చిరంజీవిగానే ఉంటారు…
తెలుగు జాతి ఆత్మగౌరవం నిలిచినంత వరకు ఆయన మహోన్నత కీర్తి యుగయుగాల పాటు వెలుగుతూనే ఉంటుంది.
ఆ మహానుభావునికి శతకోటి వందనాలు 🙏🏻
Many happy returns of the day Bava @tarak9999 ! May you have abundant prosperity, peace & love .
This time it ain’t tiger
It’s DRAGON 🐉
Roaring fire every shot 🔥
Dragon Glimpse : Telugu360
NTR Neel Dragon Glimpse is 100X better than expected 🙏🔥🔥
The Scale is Massive than all previous Neel‘s massive films
And .. NTR is Oh MY GOD ! Crazy look !! Peaks !! The dialogues are 🔥🔥
And the villains ... Its an Army
Overall, what a birthday gift this turned out to be for @tarak9999 and his fans 🔥
Tollywood and Pan India will be blown away with the grandeur of Dragon
Mark this.