#Ramayana continues its SENSATIONAL RAMPAGE at the worldwide box office, with early estimates suggesting a massive ₹120 crore gross today!
The film’s estimated 7 days worldwide gross now stands at a staggering ₹950 crore.
ABSOLUTELY UNPRECEDENTED! 💥💥💥
పవన్ కల్యాణ్ కుటుంబంపై అసభ్యకర పోస్టులు - భారీగా పోలీస్ కేసులు
ఆంధ్రప్రదేశ్ ఉ��� ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన, కించపరిచే పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు చట్టపరమైన కొరడా ఝుళిపించారు. ఆయన కుటుంబ వ్యవహారాలపై హద్దులు దాటి దూషణలకు దిగడంతో పాటు తీవ్ర అభ్యంతరకర రీతిలో ట్రోలింగ్‌కు పాల్పడిన విపక్ష పార్టీ సానుభూతిపరులకు చెందిన ఏకంగా 44 సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో అధికారికంగా కేసులు నమోదు చేశారు. ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ వ్యవహారంలో పోలీసులు కేవలం కేసులు నమోదు చేయడంతోనే సరిపెట్టకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ఎక్స్ కార్పొరేషన్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర అంతర్జాతీయ సంస్థల లీగల్ అండ్ సేఫ్టీ విభాగాలకు పోలీసులు అధికారిక నోటీసులు జారీ చేశారు. వివాదాస్పద పోస్టులు, వీడియోలకు సంబంధించిన లింకులను పొందుపరుస్తూ.. ఈ నోటీసు అందిన 36 గంటల్లోగా ఆయా అకౌంట్లు, అభ్యంతరకర యూఆర్ఎల్లను తక్షణమే తొలగించాలని, డిసేబుల్ చేయాలని చట్టబద్ధమైన ఆదే��ాలు ఇచ్చారు.
To all Cults , Manam avamana padalsina Pani Ledhu ikkada pk ni Troll Chese valla Hero lu Okkadu Kuda Perfect ga ledu andharki edhoka Macha undhi..tweets BM cheskondi Time ochinappudu Tagalapettedham 👍
#Pawankalyan