స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి కృషితోనే కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు ముందడుగు.
ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులకు 1లక్ష ఎకరాలకు సాగు నీరు అందించి నియోజకవర్గ పంట భూములను సస్యశామలంగా చూడాలనే సంకల్పంతో కృషి చేస్తున్న MLA మదన్ మోహన్ గారు.
ఎల్లారెడ్డి ప్రజలు & రైతులు తమ కృతజ్ఞతగా సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, & MLA మదన్ మోహన్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.
రైతుల ప్రయోజనాలను గుర్తించి కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజల నుంచి ప్రేమ, గౌరవం, ఆశీర్వాదాలు వెల్లువెత్తుతున్నాయి.
✨ప్రజల కలలను నిజం చేస్తున్న ప్రజా ప్రభుత్వం!
ఇందిరమ్మ ఇల్లు అందించి మా కుటుంబ సొంతింటి ఆశయాన్ని నెరవేర్చిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు:
ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి మండల బీజేపీ పార్టీ మండల కార్యదర్శి నరేష్, అలాగే ఎల్లారెడ్డి టౌన్ బీజేపీ కార్యదర్శి శంకర్ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో తుక్కోజీవాడిలో రూ.10 లక్షల SHG భవనానికి శంకుస్థాపన:
సదాశివనగర్ మండలం తుక్కోజీవాడి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా స్వయం సహాయక సంఘం (SHG) భవనానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.
ప్రజా అభివృద్ధికి మరో అడుగు – రూ.40 లక్షల పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు సదాశివనగర్ మండలం మార్కల్ గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సంఘ భవనానికి భూమిపూజ నిర్వహించారు.
అనంతరం గ్రామంలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మహిళల సాధికారతకు అవసరమైన వసతుల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, మహిళా నాయకులు, అధికారులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా సదాశివనగర్ మండలంలోని లక్ష్మి నాయక్ తండా లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు ఘనంగా ప్రారంభించారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ గ్రామాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.
నూతన గ్రామపంచాయతీ భవనం ద్వారా గ్రామ ప్రజలకు పరిపాలనా సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గ్రామాభివృద్ధి పనుల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలులో ఈ భవనం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మి నాయక్ తండాలో వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎమ్మెల్యే గారు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ప్రత్యేక చొరవతో రూ.23 లక్షలతో లింగంపల్లి చెరువు పునరుద్ధరణ పనులకు శ్రీకారం:
సదాశివనగర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో రూ.23 లక్షల వ్యయంతో చేపట్టనున్న కొత్త చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు రైతులకు సాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం మొక్కను నాటి, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సందేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండలం, చిట్యాల గ్రామ ప్రజలు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం కల ఎట్టకేలకు సాకారమైంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు రూ.2.11 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
గత సంవత్సరం 02-05-2025 న ఈ ఉపకేంద్రానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు శంకుస్థాపన చేయగా, అధికారులతో సమన్వయం చేస్తూ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు. ఏడాది వ్యవధిలోనే ప్రాజెక్టును పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో చిట్యాల ప్రజల్లో ఆయనపై మరింత విశ్వాసం పెరిగింది.
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, "మాటిచ్చాడంటే నిలబెట్టుకుంటాడు" అనే నమ్మకానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మరోసారి నిదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించి గ్రామ అభివృద్ధికి కొత్త దిశను చూపారని కొనియాడారు.
ఈ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం అందుబాటులోకి రావడంతో చిట్యాల, సంతాయిపేట్ ,సోమారం మరియు అన్నారం తండా గ్రామాలకు దీర్ఘకాలంగా ఉన్న లో వోల్టేజ్ విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. దీంతో వ్యవసాయానికి, గృహ వినియోగానికి, చిన్న వ్యాపారాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందే అవకాశం ఏర్పడింది.
ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి కృషికి ఈ విద్యుత్ ఉపకేంద్రం మరో మైలురాయిగా నిలిచింది.
తాడ్వాయిలో కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్.
పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపు.
నూతన కమిటీల సభ్యులకు నియామక పత్రాల అందజేత.
తాడ్వాయి టౌన్‌లోని మా గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే **మదన్ మోహన్** పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కమిటీల సభ్యులను అభినందించి, వారికి నియామక పత్రాలను అందజేశారు. పార్టీ అభివృద్ధిలో నూతన కమిటీల పాత్ర కీలకమని పేర్కొంటూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే ప్రతి పౌరుడు తన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేలా చైతన్యం తీసుకురావాలని కోరారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరితో SIR దరఖాస్తు పత్రాలు నింపించి సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (BLO) అందేలా సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ స్థాయి నాయకులు, నూతన కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నందివాడ పెద్ద చెరువు పునరుద్ధరణకు శంకుస్థాపన
రూ.35 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే మదన్ మోహన్
తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో రూ.35 లక్షల వ్యయంతో చేపట్టనున్న పెద్ద చెరువు పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. చెరువుల పునరుద్ధరణ ద్వారా సాగునీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు భూగర్భ జలాలు మెరుగుపడి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో రూ.35 లక్షల వ్యయంతో చేపట్టనున్న పెద్ద చెరువు పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. చెరువుల పునరుద్ధరణ ద్వారా సాగునీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు భూగర్భ జలాలు మెరుగుపడి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ గూటికి చిట్యాల సర్పంచ్ రంజిత్ రెడ్డి.
తాడ్వాయి మండలం చిట్యాల గ్రామ సర్పంచ్ రంజిత్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండలం ఉపాల్వాయి గ్రామ సర్పంచ్ శివాని రాజేందర్ ఈరోజు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే గారు వారికీ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నాయకత్వంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండగా, ఉపాల్వాయి గ్రామం కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు.
గ్రామంలో సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, గృహ జ్యోతి పథకం వంటి అనేక ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందాయని తెలిపారు. గ్రామ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే సంకల్పంతో తాము సమిష్టిగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెల్లడించారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై లింగంపేట్ మండలం పర్మల్ల గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిలో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికిన ప్రముఖ నాయకులు:
పర్మల్ల గ్రామ ఉపసర్పంచ్ కోడబోయిన శ్రీను
మాజీ మండల అధ్యక్షులు చంద్రబాబు
సొసైటీ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి
మాజీ ఉపసర్పంచ్ కోడబోయిన శ్రీనివాస్
మాజీ బీఆర్ఎస్ అధ్యక్షులు గంట బాబు
వీరితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు మరియు కార్యకర్తలు:
బద్ద రాజులు, ఇర్ల సాయిబాబు, కాశ ప్రశాంత్, ఇర్ల గోపాల్,
రాజారెడ్డి,డీలర్ రాజు,చాకలి రవి,ఇర్ల సాయిలు,లేగ్గెల, సాయిలు,పల్లె శేఖర్,రావుల శ్రీను,మంద రమేష్,
గంట ఇస్తారీ,సాంబని గోపాల్,గంట శ్రీను, పద్మారావు
బెస్త భాగయ్య,ఇర్ల పరమేశ్,జగతి రవి,బెస్త నర్సింలు,మంద ప్రవీణ్, బద్ద కిష్టయ్య,ఇర్ల మోహన్,మన్నె రాము, గంప రవి
పోచాగౌడ్. తదితర గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి సహకారంతో రూ.20 లక్షలతో నందివాడ చెరువు అభివృద్ధి పనులు పూర్తి:
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ప్రత్యేక చొరవతో తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టిన చెరువు అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తయ్యాయి.
గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నందివాడ చెరువు కట్ట తీవ్రంగా దెబ్బతిని, ఎప్పుడైనా తెగిపోయే ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామ ప్రజలు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారిని కలిసి చెరువును అభివృద్ధి చేసి కట్టను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామస్తుల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు రూ.20 లక్షల నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు.
ఈ పనుల్లో భాగంగా చెరువు కట్టకు పటిష్టమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు, పెరిగిన పిచ్చి మొక్కలను పూర్తిగా తొలగించి దీంతో వర్షాకాలంలో చెరువు మరింత సురక్షితంగా ఉండటమే కాకుండా, రైతులకు సాగునీటి వినియోగం కూడా సులభతరం కానుంది.
చిరకాలంగా ఎదురుచూస్తున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో నందివాడ గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ విజ్ఞప్తిని వెంటనే గుర్తించి చెరువు అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
SIR విజయమే లక్ష్యం.. ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు:
ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే ధ్యేయం.. ఇంటింటికీ చేరి అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే పిలుపు
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ఈరోజు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంతో పాటు, SIR ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని కోరారు.
ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని పేర్కొన్న ఎమ్మెల్యే గారు, ఒక్క అర్హుడైనా ఓటరు జాబితా నుంచి మిగిలిపోకుండా పార్టీ శ్రేణులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. అవసరమైన చోట ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ SIR ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో SIR కార్యక్రమాన్ని పారదర్శకంగా, వేగవంతంగా అమలు చేయడం, ఓటరు నమోదు ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, పార్టీ శ్రేణులు మరియు అధికారుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలపై ఎమ్మెల్యే గారు సమగ్రంగా సమీక్షించి కీలక సూచనలు చేశారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి జోరు..!
గాంధారి మండలంలో రూ.1.10 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్.
🔆రూ.1 కోటి వ్యయంతో పొతంగల్ ఖుర్ద్, నేరల్ తండా, పిస్కుల్ గుట్ట, చద్మల్, వండ్రికల్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన 5 గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ఘనంగా ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు ఈ భవనాలు ఎంతో ఉపయోగపడనున్నాయి.
🔆అదేవిధంగా, రూ.10 లక్షల వ్యయంతో తిమ్మాపూర్ గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గారు భూమి పూజ నిర్వహించారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
గాంధారిలో నూతన మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ , డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్
📍గాంధారి మండల కేంద్రం | జూన్ 29
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయడం లక్ష్యంగా ఎమ్మెల్యే మదన్మోహన్ గారు మరియు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్ గారు** గాంధారి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు.
రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మదన్మోహన్ గారు, డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే *మదన్మోహన్ గారుమాట్లాడుతూ, ప్రజల విశ్వాసమే కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద బలమని, ప్రజల సంక్షేమం మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండే సేవా వేదికగా ఈ నూతన కార్యాలయం నిలవాలని ఆకాంక్షించారు.
డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్ గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని, ఈ కార్యాలయం కార్యకర్తలకు మార్గదర్శక కేంద్రంగా, ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్ గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్ మరియు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
👉రూ.20 కోట్లతో దేమే కలాన్ నందు PWD రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన.
👉 మూడు మండలాల ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం *దేమే కలాన్ గ్రామంలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రెండు వరసల(టూవే) పీడబ్ల్యూడీ రహదారి నిర్మాణ పనులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు ఘన స్వాగతం పలికారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో దేమే గ్రామం ఆనందోత్సాహాలతో నిండిపోయింది. గ్రామ ప్రజలు తమ చిరకాల కోరిక నెరవేరిందంటూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత *తాడ్వాయి, సదాశివనగర్, గాంధారి మండలాల వేలాది మంది ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుండగా, దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రయాణ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించనుంది.* మూడు మండలాలను అనుసంధానించే ఈ ద్విమార్గ రహదారి ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారనుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎల్లారెడ్డి నియోజకవర్గంలో, ముఖ్యంగా తాడ్వాయి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు.
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొంటూ...
🔶* ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం,
🔶* తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం,
🔶* నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం,
🔶* కొత్త రేషన్ కార్డుల మంజూరు,
🔶* ప్రజలకు నాణ్యమైన *సన్న బియ్యం* పంపిణీ,
🔶* *ఇందిరమ్మ ఇళ్ల పథకం* ద్వారా వేలాది నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడం,
వంటి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయని తెలిపారు. ఇప్పటికే అనేక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తై, గృహప్రవేశాలు కూడా జరుగుతుండడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు.
దేమే గ్రామంలో కూడా తన ప్రత్యేక చొరవతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, గ్రామ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేర్చుతున్నామని మదన్ మోహన్ తెలిపారు. ప్రజల విశ్వాసమే తనకు బలమని, అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
"ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి... ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకోవాలి... అదే మా ప్రభుత్వ లక్ష్యం" అని ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దేమే గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
రైతులకు గుడ్ న్యూస్: ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి కృషితో 40 ఏళ్లుగా రైతులను వేధిస్తున్న సమస్యకు రూ.2.08 కోట్లతో ఎండ్ కార్డ్..!
ఎన్నో సంవత్సరాల తర్వాత రైతుల బాధలు అర్థం చేసుకుని, రైతు సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే నాయకుడు మాకు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి రూపంలో దొరికారు: రైతులు హర్షం వ్యక్తం.
వేలాది మంది రైతులకు శాశ్వత ఉపశమనం కలిగించేల ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి కృషి.
నాగిరెడ్డిపేట మండల రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సమస్యకు చివరకు పరిష్కారం దొరకనుంది. మంజీరా నది పరివాహక ప్రాంత రైతులను గత 40 సంవత్సరాలుగా వేధిస్తున్న ముంపు సమస్యకు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నిరంతర కృషితో ఎండ్ కార్డ్ పడింది. ప్రభుత్వం రూ.2.08 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి.
ప్రతి సంవత్సరం మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహించే సమయంలో నాగిరెడ్డిపేట మండలంలోని గోల్లింగాల్, వాడి, చినూర్, నాగిరెడ్డిపేట, లింగంపల్లి, వెంకంపల్లి, తాండూర్, మాటూర్, మసానిపల్లి, ఆత్మకూర్ తదితర గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదిలో మట్టిదిబ్బలు, తుమ్మచెట్లు, ముళ్లపొదలు పెరగడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి వేల ఎకరాల పంట భూములు ముంపునకు గురవుతూ రైతులకు భారీ నష్టాలు కలుగుతున్నాయి.
ఈ సమస్య పరిష్కారం కోసం రైతులు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు.కానీ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, గత ప్రజాప్రతినిధుల అలసత్వం, చేతగానితనం కారణంగా ఈ సమస్య ఎప్పటికప్పుడు పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఒక దశలో రైతులు ఈ సమస్యకు పరిష్కారం దొరకదనే నిరాశకు కూడా గురయ్యారు.
అయితే చివరి ఆశగా నాగిరెడ్డిపేట మండల రైతులు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారిని కలిసి తమ గోడును వినిపించారు. రైతుల కష్టాలను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి సమస్య తీవ్రతను వివరించారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నిరంతర ప్రభుత్వం పై ఒత్తిడి, ప్రత్యేక చొరవ ఫలితంగా ప్రభుత్వం రూ.2.08 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో మంజీరా నదిలో పేరుకుపోయిన పూడిక, మట్టిదిబ్బలు, తుమ్మచెట్లు, ముళ్లపొదలను తొలగించి నీటి ప్రవాహాన్ని సక్రమంగా జరిగేలా చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఈ పనులు పూర్తయితే వర్షాకాలంలో నది ఉద్ధృతంగా ప్రవహించినప్పటికీ పంట భూములు ముంపునకు గురయ్యే పరిస్థితి గణనీయంగా తగ్గిపోతుంది. వేలాది మంది రైతులకు శాశ్వత ఉపశమనం లభించడంతో పాటు వ్యవసాయానికి భద్రత కలగనుంది.
పనులు ప్రారంభం కావడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కష్టాలను తన కష్టాలుగా భావించి పరిష్కారం కోసం పోరాడిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారే తమకు నిజమైన అండగా నిలిచారని రైతులు పేర్కొంటున్నారు.
"ఎన్నో సంవత్సరాల తర్వాత రైతుల బాధలు అర్థం చేసుకుని, రైతు సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే నాయకుడు మాకు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి రూపంలో దొరికారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతాంగ అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ గారిపై మాకు పూర్తి నమ్మకం ఉంది" అని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో మల్తుమేధ గ్రామంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
నాగిరెడ్డిపేట మండలంలోని మల్తుమేధ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గ్రామ అభివృద్ధే తమ చేరికకు ప్రధాన కారణమని వారు తెలిపారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నాయకత్వంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండగా, మల్తుమేధ గ్రామం కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు.
గ్రామంలో సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, గృహ జ్యోతి పథకం వంటి అనేక ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందాయని తెలిపారు. గ్రామ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే సంకల్పంతో తాము సమిష్టిగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ, *"నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడా ఆగదు. ప్రతి గ్రామానికి అభివృద్ధి, ప్రతి ఇంటికి సంక్షేమం అందించడమే నా లక్ష్యం. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తాం"* అని తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్తుమేధ గ్రామ పాలకవర్గ సభ్యులు:
🔹 తలారి శోభ – 1వ వార్డు సభ్యురాలు
🔹 బైండ్ల శ్రీనివాస్ – 2వ వార్డు సభ్యుడు
🔹 కుడికాల రాజు – 4వ వార్డు సభ్యుడు
🔹 జోగు లక్ష్మి – 6వ వార్డు సభ్యురాలు
🔹 పుప్పాల శివరాములు – 7వ వార్డు సభ్యుడు
🔹 బోయిని పవిత్ర – 8వ వార్డు సభ్యురాలు
🔹 చి. సిద్ధిరాములు – 9వ వార్డు సభ్యుడు
గ్రామ అభివృద్ధే లక్ష్యంగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణకు ఈ చేరికలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.