మీరు ఒక సాధారణ సినీ ప్రేక్షకుడైతే, ఈ పుస్తకం మీ సినిమా చూసే కోణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఒక వర్ధమాన రచయిత అయితే, ఇదొక గైడ్‌గా పనికొస్తుంది. ఇది చదివాక మీరు సుకుమార్ సినిమాలను చూస్తే, మీకు కథలకంటే ముందు ఆ కథను నడిపిస్తున్న ఒక అదృశ్యమైన మేధస్సు కనిపిస్తుంది. Order now.
ఈ మధ్య యంగ్ జనరేషన్ రచయితలు చాలామంది నవలలతో అరంగేట్రం చేస్తున్నారు. చాలా వరకు బాగుంటున్నాయి కూడా. కాకపోతే కొన్నింటిలో "నవల"కి సరిపడేంత సరుకు లేకపోవడం, జీవితానుభవం కొరవడటం, రచనానుభవం సరిపోకపోవడం వల్ల బానే ఉంది నుంచి "మంచి నవల" స్థాయికి చేరి చేరకుండా ఆగిపోతున్నాయని నా పరిశీలన. పది నవలలు చదివితే ఒకటో రెండో "మంచి నవలలు" తగులుతున్నాయి. అలాంటి ఒక నవల - "ప్రేమలేదని ప్రేమించరాదని." నేహా చౌదరి రచయిత. అందుకు కారణాలలో మొదటిది - నేను చెప్పిన జెన్‌జీ రచయితలు రాసే చాలావరకు నవలల్లో కనపడని "structure" ఈ పుస్తకంలో ఉండటం. ఇది నాకు ఆశ్చర్యాన్ని, ఆననందాన్ని కలిగించింది. పకడ్బందీగా ఎప్పుడు ఏం జరగాలో రాసుకుని, ఎక్కడ ఎలాంటి మలుపు రావాలో నిర్ణయించుకుని, సరిగ్గా గీసుకున్న బరిలోనే కథని నడిపించినట్లు అనిపించింది. అందువల్లేమో కథ రేసీగా, ఎక్కడా కిందకి జారకుండా మొదట్నించి చివరివరకు నేరుగా, విడిచిపెట్టిన బాణంలా వెళ్లింది. అందువల్ల చదవటానికి (బహుశా సినిమాగా తీయటానికి కూడా) చాలా బాగుంది. ఈ నవల్లో కనిపించిన రెండో మంచి లక్షణం - characterization. ప్రధానపాత్ర అపర్ణ అనే అమ్మాయి. ఆ అమ్మాయిన ప్రేమించిన అనిరుధ్ అనే అబ్బాయి. వీళ్లిద్దరి పాత్రలు ఎంత బలంగా (ముఖ్యంగా స్పష్టంగా, నమ్మబుల్‌గా), consistentగా ఉన్నాయంటే, వీళ్లిద్దరూ మనకి బాగా తెలిసిన స్నేహితులే అనిపిస్తుంది. అందువల్ల వీళ్లిద్దరూ కలిస్తే బాగుండు అనుకునేలా కథ నడిపించడం సులువైంది. ఈ అబ్బాయిని అమ్మాయిని దగ్గరకి తీసుకొచ్చే సన్నివేశాలన్నీ, రకరకాల ప్రేమ కథల గుఛ్ఛం కావటంతో చదవటం ఇంకా బాగుంది. ప్రేమ నిర్వచనం వెతికే ట్రాక్ అదనం. అదీ కథలో కలిసే ఉండటం కూడా బాగుంది. కొన్ని contrived సన్నివేశాలు, చివర్లో కథ ముగించేసే హడావిడి వల్ల తీసుకున్న convieniences మినహాయిస్తే చాలా మంచి పుస్తకం. I recommend this book. -- a review by @SatyaAripirala
You can order your copy from https://t.co/OfqoyqfJhM
The hardest thing in life is not winning. It's waiting.
మనం సక్సెస్ గురించి చాలా మాట్లాడతాం.
కానీ వెయిటింగ్ గురించి ఎవరూ మాట్లాడరు.
ఎందుకంటే వెయిటింగ్ లో ఏమీ జరగదని మనం అనుకుంటాం.
కానీ నిజానికి...
మనిషి ఎక్కువగా మారేది actionలో కాదు.
రెండు సంఘటనల మధ్య ఉండే ఆ సైలెన్స్ లో.
అక్కడే patience పుడుతుంది.
అక్కడే hope పరీక్షించబడుతుంది.
అక్కడే మనం ఎవరో నెమ్మదిగా బయటపడుతుంది.
బహుశా అందుకే Odyssey ఇప్పటికీ relevant.
వేల సంవత్సరాల క్రితం హోమర్ రాసిన ఈ మహాకావ్యాన్ని వెంకట్ శిద్దారెడ్డి తెలుగులో పునఃకథనం చేసినప్పుడు నాకు మరింత ఆసక్తి పెరిగింది. అప్పుడెప్పుడో కొంత కొంతగా తెలుసుకున్న గ్రీకు mythology. Trojan war, ఒడిస్సీ ఇలాంటివి. తను చేసిన retelling చదవటం మొదలుపెట్టినప్పుడు. ఒడిస్సియస్ తో పాటు ఆలోకంలో నేను ఉన్నాను అన్న సంగతి తెలిసింది. అంత చక్కటి సులభమైన వాక్యం. అంత సరళంగా చదివించింది.
ఒడిస్సియస్ ఇంటికి చేరుకోవడానికి పదేళ్లు పట్టింది. కానీ నిజానికి అతను వెతికింది Ithaca కాదు. తనలో ఇంకా మిగిలి ఉన్న మనిషిని. మనం fast-forward generationలో ఉన్నాం.
2x speedలో videos చూస్తాం. Same-day deliveryకి అలవాటు పడ్డాం.
Whatsapp లో Typing... అని రెండు seconds కనిపించినా అసహనం వస్తుంది.
కానీ life మాత్రం ఇప్పటికీ bufferingలోనే నడుస్తుంది.
బహుశా అందుకే ఒడిస్సీ timeless.
"He who has a why to live can bear almost any how." - Friedrich Nietzsche
ఒడిస్సియస్ దగ్గర అదే why ఉంది.
అందుకే ప్రతి storm ఒక chapter అయింది.
ప్రతి failure ఒక detour అయింది.
ప్రతి delay ఒక teacher అయింది.
ఈ పుస్తకం చదివాక నాకు అనిపించిన
గెలవడం ఒకరోజు జరగొచ్చు.
కానీ వేచి ఉండడం...
అది ప్రతిరోజూ చేయాల్సిన పని.
మనం అందరం ఏదో ఒక Ithaca కోసం పరుగెడుతున్నాం.
Career.
Love.
Money.
Recognition.
కానీ destination గురించి అంతగా ఆలోచిస్తూ...
journey మనల్ని ఎలా rewrite చేస్తుందో మర్చిపోతున్నాం.
వెంకట్ శిద్దారెడ్డి ఈ పునఃకథనంలో చేసిన మంచి పని ఇదే.
తను Homerని translate చేయలేదు.
వేల సంవత్సరాల దూరాన్ని తగ్గించాడు.
అందుకే ఇది mythologyలా అనిపించదు.
ఇది మన WhatsApp last seenల మధ్య జరిగే loneliness.
మన unanswered emails.
మన delayed dreams.
అన్నీ కలిపితే...
అదే Odyssey.
ఈ పుస్తకం నాకు ఒక answer ఇవ్వలేదు.
ఒక better question ఇచ్చింది.
"నువ్వు నిజంగా గమ్యం కోసం పరుగెడుతున్నావా? లేక waitingని తప్పించుకోవడానికి పరుగెడుతున్నావా?"
ఎందుకంటే...
కొన్ని journeys మనల్ని destination దగ్గరకు తీసుకెళ్లవు.
మనల్ని మన దగ్గరకు తీసుకొస్తాయి.
- @MahyPallav
నేనెంతగానో అభిమానించే రచయిత మహి అన్న 'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' నవల చదివి ఈ రివ్యూ రాసి పంపాడు.
మహి అన్న కథల్ని ఎంతో ఇష్టంగా చదువుకునే నేను, ఈ రివ్యూని ఇంకెంత ఇష్టంగా చదువుకొని ఉంటానో ఊహించండి.
Thank you, @MahyPallav anna. నీకు నా ప్రేమ. 💙
***
మిలీనియల్ కుర్రాడి existential journey
మల్లి తెలుసు.
మల్లి కథలు తెలుసు.
మల్లి మనిషిగా తెలుసు.
ఇప్పుడు ఈ నవలగా కూడా తెలిసాడు.
ఇది ప్రేమకథ కాదు. బ్రేకప్ కథ కూడా కాదు. అసలు ఇది కథ అనే గీతలో ఇమిడిపోదు. ఒక అతను, ఒక ఆమె మధ్య మిగిలిపోయిన జ్ఞాపకాల శకలాలు.
అమరికలేని సంభాషణలు. అర్థం కోసం వెతికినా దొరకని కొన్ని క్షణాలు. ఎండాకాలపు మధ్యాహ్నం ఉక్కపోతలా మనసును నొక్కే నిశ్శబ్దం. సాయంత్రపు గాలిలా కాసేపు తాకి మళ్లీ దూరమయ్యే ఆప్యాయత.
గాయం మానిపోయిందని అనుకున్న చోట మళ్లీ మెల్లగా ఒత్తుకుంటే కలిగే అనుభూతి ఉంటుంది. దాన్ని బాధ అనలేం. సుఖం అనలేం. కానీ మరచిపోలేం. ఈ నవల నాకు అదే ఫీలింగ్ ఇచ్చింది.
ఇది కేవలం ఒక ప్రేమకథ కాదు. ఒక మిలీనియల్ యువకుడు తన ఉనికిని, తన ప్రేమను, తన ఒంటరితనాన్ని, చివరికి తననే వెతుక్కుంటూ వెళ్లిన existential journey.
ఈ నవల చదువుతున్నంతసేపూ కాము గుర్తొచ్చాడు.
"In the depth of winter, I finally learned that within me there lay an invincible summer." బయట ప్రపంచం ఎంత అర్థరహితంగా కనిపించినా, మనిషి తనలోని వెలుగును వెతుక్కోవాల్సిందే. కామూ చెప్పిన ఈ మాటలు నవల చదువుతున్నతసేపు తలుచుకుంటూనే ఉన్నాను.
మల్లి రైటింగ్ స్టైల్ చాలా placid. ఎక్కడా తొందరపడడు. ఎక్కడా పాఠకుడిని భావోద్వేగాలతో బలవంతం చేయడు. నెమ్మదిగా మనల్ని తన ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. అదే ఈ నవలకు అసలు రీడింగ్ ఎక్స్‌పీరియెన్స్.
ఈ నవల చదివాక ఒక నిశ్శబ్దం మిగులుతుంది. అది ఎలాంటి నిశ్శబ్దం అంటే. సైరాట్ అనే మరాఠీ సినిమా క్లైమాక్స్... దర్శకుడు ఆ సీన్ మొత్తని మ్యూట్ లో షూట్ చేసాడు. ఆ నిశ్శబ్దం కనిపించే విజువల్ కన్నా డిస్టర్బింగ్ గా ఉంటుంది. సరిగ్గా ఈ నవల చదవడం ముగిశాక... అలాంటి ఫీలింగ్.
చివరికి ఒకటే అనిపించింది. జీవితం నిజంగానే absurd కావచ్చు. ప్రేమకు సమాధానాలు ఉండకపోవచ్చు. కొన్ని బంధాలు ముగిసిపోవు... అవి కేవలం జ్ఞాపకాల రూపంలో జీవిస్తూనే ఉంటాయి.
ఈ నవలకు ఇప్పటికే ఎంతోమంది పాఠకులు ఉన్నారు. నేను మాత్రం కొంచెం ఆలస్యంగా చదివాను. కానీ కొన్ని పుస్తకాలు ఎప్పుడు చదివినా సరైన సమయానికే మన చేతికి వస్తాయి. ఒక ఎండాకాలపు మధ్యాహ్నం అలాంటి పుస్తకం.
పుస్తకం కావాలనుకునే వారికి అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్‌లోనూ, అలాగే ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంది.
- మహి బెజవాడ
నోలన్ కొత్త సినిమా 'ఒడిస్సీ' చూసే ముందు, హోమర్ రాసిన ఒడిస్సీ చదవడం మంచిది. ఒడిస్సీ అనేది చాలా పెద్ద కథ. అందులో ఎన్నో సాహసాలు, ఉపకథలు, లోతైన విషయాలు ఉంటాయి. కానీ, సినిమాలో అంత పెద్ద కథను కొన్ని గంటల్లోకి కుదించి తీయాల్సి వస్తుంది. ఈ క్రమంలో సినిమాలో కొన్ని సన్నివేశాలు లేదా వివరాలు చూపించే అవకాశం ఉండకపోవచ్చు.
అందుకే ముందుగా మీరు పుస్తకం చదివితే, మీకు పూర్తి కథ స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత సినిమా చూస్తున్నప్పుడు, మిస్సయిన వివరాలతో సంబంధం లేకుండా, అంత పెద్ద కథను నోలన్ తనదైన శైలిలో కుదించి తెరపై ఎలా అద్భుతంగా చూపించాడో మీరు మరింత చక్కగా అర్థం చేసుకోగలరు.
ఒడిస్సీ తెలుగు పునఃకథనం ఈ మధ్యనే విడుదలైంది.
హోమర్ రాసిన మహాకావ్యం ఒడిస్సీకి ఇది మన తెలుగు రూపం. అసలు కథ, పాత్రలు అవే అయినా, ఆ సముద్రపు హోరు మనకు వినిపించేలా, ఆ వేదన మన గుండెకు తగిలేలా ఈ కథను రాశాను. ఒడిస్సీ చదువుతూ నేను పొందిన అనుభూతిని మీతో పంచుకోవాలనే ఈ ప్రయత్నం. ఇది కేవలం ఒక అనువాదం కాదు, మనందరి అన్వేషణ. ఒడిస్సీ మనకు చెప్పేది ఒక్కటే! మనిషి ఎంత దూరం వెళ్లినా, ఎన్ని సముద్రాలు దాటినా, అతని లోపల ఎప్పుడూ ఒక ఇల్లు మిగిలే ఉంటుంది. ఆ ఇంటికే అతని ప్రయాణం. ఆ ప్రయాణమే అతని జీవితం!
https://t.co/Z3i708oEv5
ఒడిస్సీ మనకు చెప్పేది ఒక్కటే! మనిషి ఎంత దూరం వెళ్లినా, ఎన్ని సముద్రాలు దాటినా, అతని లోపల ఎప్పుడూ ఒక ఇల్లు మిగిలే ఉంటుంది. ఆ ఇంటికే అతని ప్రయాణం. ఆ ప్రయాణమే అతని జీవితం.
హోమర్ ఒడిస్సీని అందరికీ అర్థమయ్యే సులభమైన భాషలో - త్వరలో మీ అందరి ముందుకు.
భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య ఉన్న తేడాలను, ఎదురవుతున్న సవాళ్లను ఎంతో స్పష్టంగా వివరించిన చాలా ముఖ్యమైన పుస్తకం ఆర్.ఎస్. నీలకంఠన్ రాసిన సౌత్ వర్సెస్ నార్త్ (South vs North - India's Great Divide).
జనాభా నియంత్రణ, చదువు, వైద్యం వంటి రంగాలలో ఎంతో ప్రగతి సాధించిన దక్షిణ భారతదేశం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాజకీయంగా, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటోందో ఈ పుస్తకం ఎన్నో నిజాలతో మనకు చూపిస్తుంది. దేశ భవిష్యత్తును ఆలోచింపజేసే ఇంతటి ప్రాధాన్యత కలిగిన పుస్తకాన్ని, అక్కరాజు భట్టిప్రోలు గారి చక్కని తెలుగు అనువాదంలో @AnvikshikiPub ద్వారా అందిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన ఈ మంచి పుస్తకం ఇంకో రెండు వారాల్లో మీ ముందుకు వస్తోంది.
ఈ పుస్తకప్రచురణకు అనుమతిచ్చిన @juggernautbooks వారికి మా ధన్యవాదాలు.
వారి నటనతో అందంతో తెలుగువారి
అందరి గుండెలో చిరకాల స్థానాన్ని సంపాదించుకున్న ఆనాటి అందాల తారలు సహజనటి జయసుధ గారు అందాల నటి జయప్రద గారి చేతిలో అందరి అమ్మమ్మల కథ “నీ రుణం తీరేది ఎట్ల?”
@vrsiddareddy@AnvikshikiPub#neerunamteeredietla
Amazon book link https://t.co/eNthFKA4QG
Thank you @VishweshwarBhat garu for translating Brahmanandam garu's autobiography into Kannada. నేను మీ బ్రహ్మానందం ఇప్పటికీ ఆరు భాషల్లోకి అనువాదం అయింది. త్వరలో మరాఠీ, ఉర్దూ భాషల్లో కూడా అనువాదం అవుతుంది.
మీరింకా నేను మీ బ్రహ్మానందం పుస్తకం చదవకుంటే https://t.co/W5UjbIPya8 ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.
@AnvikshikiPub మొదలుపెట్టడంలో పెద్ద ఆలోచన లేదు. పెద్ద పెద్ద ఆశయాలు లేవు. నేను రాసిన రెండు పుస్తకాలు ప్రచురించే సంస్థలేకపోవడం నుంచి పుట్టిన ఒక చిన్న ఆలోచన. నా పుస్తకాలను మంచి క్వాలిటీతో ప్రచురించాలనే సెల్ఫిష్ ఆలోచనే అయినా, నా పుస్తకాలతో పాటు మాకు నచ్చిన కొంతమంది రచయితల పుస్తకాలను అందంగా ప్రచురించడమే కాకుండా, మరింతమంది ఎక్కువ పాఠకులకు చేరువ చేయాలనే చిన్న ఆలోచనతో మొదలైంది ఆన్వీక్షికి. ఈ ఆలోచన కార్యరూపం దాల్చడంలో మాకు ఎంతోమంది సహకారం లభించింది. కాలక్రమంలో మేము రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ప్రచురణ సంస్థంగా ఎదుగుతామని ఎప్పుడూ అనుకోలేదు. పదో పాతికో పుస్తకాలు మాత్రమే ప్రచురించి చూద్దామనుకుని ఇప్పుడు 250 పుస్తకాలదాకా ప్రచురించాం. ఈ ఏడేళ్లలో ఎంతోమంది రచయితలు, పాఠకులు, అభిమానులు, స్నేహితులు మా ప్రయత్నాన్ని ప్రోత్సాహిస్తూ వచ్చారు. వాళ్లందరి ఆదరాభిమానాలు, సహాయ సహకారాల వల్లనే మేము ఇక్కడి వరకూ రాగలిగాం. ఆన్వీక్షికి ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆన్వీక్షికి ప్రచురించిన అన్ని పుస్తకాలు మీరు ఈ లింక్ ద్వారా పొందవచ్చు.
https://t.co/W5UjbIQ5ZG
రచ్చ రవి నటుడిగా మనందరికీ తెలుసు. కొన్ని నెలల క్రితం ఒక పుస్తకం గురించి మాట్లాడాలని వచ్చినప్పుడు, రవి రాసింది చదివి ఆశ్చర్యపోయాను.
ఒకటి, ఇలాంటి పుస్తకం నేను ఇంతవరకు చదవలేదు. జన్మనిచ్చిన తల్లి తండ్రుల గురించి చాలామంది రాసిన పుస్తకాలు ఉండొచ్చు. కానీ అమ్మమ్మ గురించి నేను ఇంతవరకు ఎప్పుడూ ఒక పూర్తి పుస్తకమైతే చదవలేదు. ఈ పుస్తకం చదువుతుంటే తెలియకుండా నా బాల్యంలోకి వెళ్ళిపోయాను.
మన చిన్నతనంలో చాలామందికి సెలవుల్లో అమ్మమ్మ ఇంట్లోనే గడపడం సాధారణం. కానీ ఎందుకో పెద్దయ్యాక చిన్నగా అమ్మమ్మ వాళ్ళింటికి దూరమవుతాం మనం.
రవి ఆ జ్ఞాపకాలను పదిలపరచడమే కాకుండా, ఆ అనుభవాలు తన జీవితాన్ని ఎలా మలిచాయో చెప్పుకుంటూ తన అమ్మమ్మను మనందరి మనసుల్లో ఒక జ్ఞాపకంగా పర్మనెంట్ గా ముద్రించేశాడు.
ఆన్విక్షికి ద్వారా వందమంది దాకా కొత్త రచయితలను తెలుగు సాహిత్య లోకానికి పరిచయం చేసాం. ఇప్పుడు రచ్చ రవి కూడా మా సంస్థ ద్వారా రచయితగా పరిచయం కావడం ఆనందంగా ఉంది.
వచ్చే ఆదివారం, మే 10 మదర్స్ డే సందర్భంగా ఈ పుస్తకం అందరికి అందుబాటులోకి రానుంది.
కంగ్రాట్స్ @racharavi
తరతరాలుగా గుర్తుండిపోయే సినిమా జెర్సీ. అటువంటి సినిమా స్క్రీన్ ప్లే ని ఆన్వీక్షికి ద్వారా ప్రచురించడం చాలా సంతోషంగా ఉంది.
జెర్సీ సినిమా ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జెర్సీ స్క్రీన్ ప్లే ఆర్డర్ చేసుకోండి. జెర్సీ సినిమాని ఒక మరిచిపోలేని జ్ఞాపకంగా పదిలపరుచుకోండి.
తరతరాలుగా గుర్తుండిపోయే సినిమా జెర్సీ. అటువంటి సినిమా స్క్రీన్ ప్లే ని @AnvikshikiPub ప్రచురించడం చాలా సంతోషంగా ఉంది.
జెర్సీ సినిమా ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జెర్సీ స్క్రీన్ ప్లే ఆర్డర్ చేసుకోండి. జెర్సీ సినిమాని ఒక మరిచిపోలేని జ్ఞాపకంగా పదిలపరుచుకోండి.
https://t.co/8cBP8RjUE6
తెలుగు సాహిత్యం గురిం చి ఇతర భాషలవాళ్లకి చాలా వరకూ తెలియదు. ఎందుకో తెలియదు కానీ తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అనువాదం కావడం చాలా తక్కువ. అనువాదకుల కొరత ఇందుకు ముఖ్య కారణం. నా కథలు ఇంగ్లీష్ లోకి అనువాదం చెయ్యమని చాలామంది నన్ను అడిగారు. ఒకటో రెండో కథలు అనువాదం అయ్యాయి కూడా. కానీ ఆ అనువాదాలు కూడా మన రాష్ట్రాన్ని దాటి వెళ్లలేకపోయాయి. ఈ మధ్యనే నా జీవిత భాగస్వామి రంజని నా కథలు ఇంగ్లీష్ లోకి అనువాదం చేయాలనుకుంటున్నానని చెప్పింది. మొదటి ప్రయత్నంగా నేను రాసిన "కస్తూరి నీడలు/షాడోస్ ఆఫ్ ది ఫర్గాటెన్" కథను ఇంగ్లీషులోకి అనువాదం చేసింది. ఇప్పుడు ఆ కథ "The Bombay Literary Magazine" లో ప్రచురణకు ఎంపికయింది. ఒక తెలుగు కథ ఇటువంటి ప్రతిష్టాత్మకమైన మ్యాగజైన్లో పబ్లిష్ కావడం, అది కూడా నా కథ కావడంతో పాటు, దీన్ని అనువాదించింది రంజని కావడం నాకు మూడు రెట్లు సంతోషంగా ఉంది.
ఈ కథ ఈ క్రింది లింక్ ద్వారా చదవండి. మీ స్పందన తెలపండి.
https://t.co/xCOXfm4tfr
It’s been 7 years since we dreamt that the Jersey screenplay should be printed and brought to our Telugu readers. We believe determination towards a wish takes time and this is that time.
Now our wish is in your hands.
Thank you This work will reach our entire Telugu fraternity.
2019, ఏప్రిల్.
జెర్సీ విడుదలైన కొన్ని రోజులకు గౌతం గారిని మధుర శ్రీధర్ గారి ఆఫీస్ లో కలిశాం. అప్పటికింకా @AnvikshikiPub మొదలుకూడా పెట్టలేదు. కానీ అప్పుడే అనుకున్నాం జెర్సీ స్క్రీన్ ప్లే పుస్తకంగా తేవాలని. ఏడేళ్లు పట్టింది అది జరగడానికి.
I think good things take time.
ఫైనల్ గా ఈ రోజు గౌతమ్ గారికి జెర్సీ స్క్రీన్ ప్లే పుస్తకం అందచేశాం.
మన ఆలోచన మంచిదైతే టైం పట్టినా జరగాల్సిన పని తప్పక జరుగుతుంది అనేదానికి ఇదొక చిన్న ఉదాహరణ.
Thank you @gowtam19 for giving us this opportunity.
#Jersey screenplay is now an Amazon No.1 Bestseller.
Order your copy now.
https://t.co/8cBP8RjUE6
Amazon #1 Bestseller.
జెర్సీ స్క్రీన్ ప్లే బుక్ గా తీద్దామని సినిమా విడుదలైనప్పటినుంచి ప్రయత్నిస్తున్నాను. ఏవేవో కారణాల వల్ల ఇప్పటికి కుదిరింది.
సినిమాకి పని చేసిన వాళ్లు చెప్పిన ప్రకారం, ఈ స్క్రీన్ ప్లే చాలా డీటెయిల్డ్ గా రాసుకుని, అదే స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేశారు అని విన్నాను.
తెలుగులో అంత పక్కాగా రాసుకుని. రాసిందే తీసిన సినిమాలు చాలా తక్కువ. అందుకే ఈ స్క్రీన్ ప్లే పుస్తకంగా తీసుకొస్తే రాబోయే తరాలకు ఎంతో ఉపయోగం అని నమ్మాము.
మా నమ్మకానికి తగ్గట్టుగానే వారమ రోజుల్లో పుస్తకాన్ని అమెజాన్ నెంబర్ వన్ బెస్ట్ సెల్లర్ చేసినందుకు అందరికి ధన్యవాదాలు.
జెర్సీ స్క్రీన్ ప్లే బుక్ ఆర్డర్ చేయడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
https://t.co/8cBP8RjUE6