కేసీఆర్ నగర్ ఫేస్-2లో వరుస గొడవలు, దాడులపై స్థానికుల ఆందోళన. 93వ బ్లాక్ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. బాధితులకు న్యాయం చేసి, కార్యకర్తలకు రక్షణ కల్పించాలని మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి కోరారు. చర్యలు తీసుకోకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.
@BRSHarish
బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు నివాసానికి చేరుకున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్
హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు గారి సంవత్సరీక కార్యక్రమంలో పాల్గొని, చిత్రపటానికి నివాళులర్పించిన కేసీఆర్
కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేటలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన ‘ట్రక్ పార్క్’ భూములను ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి ఆ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, ట్రక్ డ్రైవర్లు, కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై స్థానికులు హరీశ్ రావు గారి ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేయగా.. ట్రక్ పార్క్ భూముల వేలాన్ని కచ్చితంగా అడ్డుకుంటామని, స్థానిక ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీశ్ రావు గారు భరోసా ఇచ్చారు. అనంతరం అక్కడ నిర్వహించిన ధర్నాలో పాల్గొని మీడియాతో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు @mkrkkpmla గారు, @kp_vivekanand గారు, ఎమ్మెల్సీలు @RajuShambipur గారు, @naveenktrs గారు, సీపీఐ, సీపీఎం నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కబ్జా చేసిన భూమిని పరిశీలించి, బాధితుడిని కలిసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లాలో 25 సంవత్సరాల క్రితం మహ్మద్ అజ్మత్ పాషా కొనుగోలు చేసిన సర్వే నంబర్ 277లోని ఐదున్నర ఎకరాల భూమిలో భూకబ్జా చేసిన బల్మూరి వెంకట్
తన పొలం పక్కనే బల్మూరి వెంకట్ 10 ఎకరాల పొలంలో ప్లాటింగ్ డెవలప్మెంట్ చేస్తున్నాడని, దాని దారి కోసం తన భూమిని కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, పోలీసులు కూడా అతనికి మద్దతుగా ఉన్నారని మెతుకు ఆనంద్ వద్ద ఆవేదన వ్యక్తం చేసిన అజ్మత్ పాషా
బల్మూరి వెంకట్ సీఎం రేవంత్ రెడ్డి అండదండలతో అజ్మత్ పాషా లాంటి వారి భూములను కబ్జా చేసి వేధిస్తున్నాడు
అజ్మత్ పాషా కొడుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్రదాడి నుండి 24 మందిని కాపాడి ఆ దేశంలో ఎంతో గౌరవం సంపాదించాడు
అతనికి అక్కడి ప్రభుత్వం పౌరసత్వాన్ని అందించి ఎంతో గొప్పగా గౌరవించారు
కానీ మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారిని గుర్తించకపోగా వారి తండ్రి వద్ద ఉన్న భూమిని లాక్కున్నారు
బల్మూరి వెంకట్ కోర్టులో ఆర్డర్ సైతం లెక్కచేయకుండా దౌర్జన్యం చేస్తున్నాడు
పోలీసులు కబ్జాకు గురైన భూమిని అజ్మత్ పాషాకు ఇప్పించి, బల్మూరి వెంకట్ నుండి రక్షణ కల్పించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
కరువు తెచ్చిన కాంగ్రెస్ సర్కార్‌కు
కౌంట్‌డౌన్ మొదలైంది!
నేడే నిర్మల్‌లో రైతు గర్జన సభ 🔥
కాంగ్రెస్ మోసాలు, రైతులు ఎదుర్కొంటున్న ఎరువులు, విత్తనాల కొరత, సాగునీటి ఇబ్బందులు, విద్యుత్ సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥
⏰ సాయంత్రం 4 గంటలకు
📍 ఎన్టీఆర్ స్టేడియం, నిర్మల్
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి రిజిస్టర్లో సంతకాలు పెట్టి డ్యూటీలో లేని డాక్టర్లు
318 మంది డాక్టర్లు ఉన్న చోట 301 మందే ఇన్-పేషెంట్లా? మధ్యాహ్నం 2:30 గంటలకే ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, మెడిసిన్, రేడియాలజీ, కంటి విభాగాల్లో ఒక్క డాక్టరూ లేకపోవడం గమనార్హం.
@BRSHarish
Self-enumeration will be conducted from January 10 to 24, followed by house-to-house population data collection from January 25 to February 28. The Revision Round will take place from March 1 to 5. #public#TelanganaNews#patancheru#brs
తెలంగాణలో జనగణన -2027 నిర్వహణకు తేదీలు ఖరారు
జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఇంటింటి జనాభా లెక్కల సేకరణ
జనవరి 10 నుంచి 24వ తేదీ వరకు స్వీయ జనగణనకు అవకాశం కల్పించిన ప్రభుత్వం
మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు రివిజనల్ రౌండ్
2027 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటలు ప్రామాణిక తేదీగా నిర్ణయించి జీవో ఎంఎస్ నెం.155 జారీ
కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వగా దానికి అనుగుణంగా జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
బ్రేకింగ్ న్యూస్
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యను విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన మహిళా కమిషన్
అల్డాస్ జానయ్య లైంగికంగా వేధించాడని మహిళా ప్రొఫెసర్ చేసిన ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ స్టేట్ ఉమెన్ కమిషన్