పాతపట్నం మండలం బగదల గ్రామంలో ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు నిర్వహించిన శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ప్రార్థించాను. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, భక్తి భావాలను పెంపొందిస్తాయని పేర్కొన్నాను.
అనంతరం ఆలయ అభివృద్ధి మరియు భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ₹25,000 విరాళాన్ని అందజేయడం జరిగింది. గ్రామ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, వాటి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చాను. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
#MamidiGovindaRao
#AbhayaAnjaneyaSwamy
#TempleInauguration
#SpiritualService
#Pathapatnam
ప్రతి ఒక్క సక్సెస్ వెనుక ఒక స్టోరీ ఉంటుంది. మా అత్తగారు క్యాన్సర్ బారిన పడి, ఆవిడ పడిన బాధలు కళ్ళారా చూసాం. మా అత్తగారి పేరు శాశ్వతం కావాలనే సంకల్పంతో, ఆమె పేరుతో నాడు ఎన్టీఆర్ గారు పేదల కోసం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మించారు. క్యాన్సర్ ఆసుపత్రికి మొదటి మ్యానేజింగ్ ట్రస్టీగా కోడెల శివ ప్రసాద్ గారు, అన్ని బాధ్యతలు తీసుకుని నడిపించారు. అందరి సహకారంతో బసవతారకం ఆస్పత్రి 25 ఏళ్లలో ఎంతోమంది క్యాన్సర్ బాధితులకు అండగా నిలబడింది.
#25yrsOfBasavatarakamHospital
#ChandrababuNaidu
కేంద్రం ఇచ్చే ప్రతి పాలసీని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంది పుచ్చుకుంటుంది.
అమరావతి అనేది భారత దేశపు ఫ్యూచర్ సిటీ. ప్రతి భారతీయుడు గొప్పగా చెప్పుకునేలా, ఇక్కడ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా రెడీ అవుతుంది.
#RepublicSummit2026#NaraLokesh#AndhraPradesh
రూ.3500 కోట్ల ఏపీ మద్యం స్కామ్ లో జగన్ సన్నిహితులంతా అరెస్టై జైలుకు క్యూ కడుతున్నారు. అయినా జగన్ ఒక్క మాట కూడా మాట్లాడడు. జగన్ తెలియకుండా, అతని ప్రమేయం లేకుండా, అతని చుట్టూ ఉండే వాళ్ళు ఇన్ని వేల కోట్ల స్కామ్ చేయగలరా? ప్రజలు అడుగుతున్నారు జవాబు చెప్పు జగన్!
#EDArrestsJaganAide
#LiquorScamByJagan
#ScamsterJagan
#YCPScams
#PsychoFekuJagan
#AndhraPradesh
పాతపట్నం మండలం చాకిపల్లి గ్రామంలో నిర్వహించిన పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా అనిపించింది. ఈ సందర్భంగా శ్రీ శెవ్వాన మురళీధరరావు గారు – శ్రీమతి ఇంద్రలక్ష్మి గారి దంపతుల కుమార్తె చిరంజీవి సాయి గౌతమి మరియు శ్రీ నవీన్ కుమార్ గారి వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించాను. వారి దాంపత్య జీవితం ఆనందమయం, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించాను.
అనంతరం అదే గ్రామానికి చెందిన శ్రీ మారెడ్ల నాగభూషణరావు గారు – శ్రీమతి రజని గారి దంపతుల కుమార్తె భార్గవి లోకిత రజస్వల మహోత్సవంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించాను. ఆమె విద్య, విజ్ఞానం, మంచి సంస్కారాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నాను. కుటుంబ సభ్యుల ఆనందంలో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంటూ, ఈ రెండు కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థించాను. ఈ కార్యక్రమాల్లో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
#MamidiGovindaRao
#Pathapatnam
#WeddingCelebration
#RajswalaMahotsavam
#ChakipalliVillage
పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన “యోగాంద్ర” కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమతుల్యతను నెలకొల్పే భారతీయ ప్రాచీన జీవన విధానమని పేర్కొన్నాను. నేటి వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి యోగా అత్యంత ప్రభావవంతమైన సాధనమని వివరించాను.
యోగాభ్యాసం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత మరియు సానుకూల దృక్పథం పెంపొందుతాయని, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించాను. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించేందుకు “యోగాంద్ర” వంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయించాలని పిలుపునిచ్చాను.
#MamidiGovindaRao
#YogAndhra
#InternationalYogaDay
#HealthyAndhra
#Pathapatnam
ఇది గతంలో లాగా ఉత్తుత్తి బటన్ కాదు, విడుదల చేసిన కొద్ది సేపటికే 99.08% రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి.
అన్నదాతలకు అండగా నిలిచేలా పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రైతుల ఖాతాలకు నిధులు వేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.3,125 కోట్ల రూపాయల నిధులు ఇచ్చాం. రాష్ట్రంలో ప్రతి రైతు ఖాతాలోనూ తొలి విడతగా రూ.7 వేల రూపాయలను పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ కింద జమ చేశాం.
#AnnadathaSukhibhava
#అన్నదాతసుఖీభవ
#PMKisan
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని మండల వ్యవసాయ అధికారి కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన 2026-27 తొలి విడత అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పల్నాడు జిల్లా లింగంగుంట్ల గ్రామం నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయాన్ని జమ చేసిన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించాము. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నాను.
పాతపట్నం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 37,124 మంది రైతుల ఖాతాల్లో రూ.24.66 కోట్లు జమ కావడం ఆనందదాయకమని తెలియజేశాను. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి, నేరుగా ఆర్థిక భరోసా కల్పించడంలో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రైతు సంక్షేమం కోసం పనిచేస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నాయని, రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని మరింత అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చాను. అనంతరం పథకం లబ్ధికి సంబంధించిన చెక్కులను రైతులకు అందజేయడం జరిగింది.
#MamidiGovindaRao
#AnnadataSukhibhava
#PMKisan
#FarmersWelfare
#Pathapatnam
పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం బలద గ్రామ రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు చిరుధాన్యాల విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పంటలని, ప్రజల్లో వాటి వినియోగంపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాను. వాతావరణ మార్పులను తట్టుకుని తక్కువ నీటితో అధిక దిగుబడిని ఇచ్చే పంటలలో చిరుధాన్యాలు ప్రముఖ స్థానంలో ఉన్నాయని వివరించాను.
రైతులు సంప్రదాయ పంటలతో పాటు చిరుధాన్యాల సాగుపై కూడా దృష్టి సారిస్తే అదనపు ఆదాయం పొందడంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడగలరని సూచించాను. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆధునిక వ్యవసాయ విధానాలు మరియు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తూ రైతుల ఆదాయం పెంపునకు కృషి చేస్తోందని తెలియజేశాను. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
#MamidiGovindaRao
#MilletsMission
#FarmersWelfare
#AgricultureDevelopment
#Pathapatnam
కొత్తూరు మండలం బలద గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్పర్సన్ అండ్ ఎండీ శ్రీమతి నారా భువనేశ్వరమ్మ గారి జన్మదిన వేడుకలను కార్యకర్తలు, నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము. అనంతరం జేమ్స్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పాన్ని అభినందించాను.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీమతి నారా భువనేశ్వరమ్మ గారు విద్య, వైద్యం, మహిళా సాధికారత మరియు సామాజిక సేవా రంగాల్లో చేస్తున్న సేవలు ఎంతో ఆదర్శప్రాయమని పేర్కొన్నాను. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా పేదలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందిస్తూ, మహిళలు మరియు అనాథ పిల్లలకు అండగా నిలుస్తున్న ఆమె సేవా దృక్పథం ప్రశంసనీయమని కొనియాడాను. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, జేమ్స్ ఆసుపత్రి వైద్య బృందం మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
#MamidiGovindaRao
#NaraBhuvaneswari
#FreeMedicalCamp
#NTRTrust
#Pathapatnam
కొత్తూరు మండలం బలద గ్రామపంచాయతీలో నిర్వహించిన “స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో పాల్గొని అవగాహన ర్యాలీలో భాగమయ్యాను. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నాను. పరిశుభ్రమైన వాతావరణంతోనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉద్యమంలా విజయవంతం చేయాలని పిలుపునిచ్చాను. అనంతరం అంగన్వాడీ కేంద్ర భవన ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరాను.
తదుపరి స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి వంటగది, మౌలిక సదుపాయాలు మరియు చిన్నారులకు అందిస్తున్న భోజనాల నాణ్యతను పరిశీలించాను. చిన్నారులతో ఆత్మీయంగా మమేకమై వారికి స్వయంగా భోజనం వడ్డించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించాను. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
#MamidiGovindaRao
#SwarnaAndhra
#SwachhAndhra
#CleanAndGreen
#Pathapatnam
పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై సుమారు 600 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం ఎంతో ఆనందంగా ఉంది. సోభ గ్రామపంచాయతీ పరిధిలోని 14 హామ్లెట్ గ్రామాల నుంచి సుమారు 500 కుటుంబాలు, రౌతులక్ష్మీపురం గ్రామపంచాయతీ పరిధిలోని మామిడిపల్లి గ్రామం నుంచి 40 కుటుంబాలు, పెద్దసున్నాపురం గ్రామపంచాయతీ పరిధిలోని పలు గ్రామాల నుంచి 60 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా నూతన సభ్యులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించాను.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు, పాతపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి తమను ఆకర్షించిందని పార్టీలో చేరిన నాయకులు తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం, గుర్తింపు ఉంటుందని హామీ ఇస్తూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చాను. ఒకే రోజు భారీ సంఖ్యలో కుటుంబాలు పార్టీలో చేరడం ప్రజల విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది.
#MamidiGovindaRao
#TDP
#PartyJoining
#Pathapatnam
#TeamTDP
పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన “ప్రజా దర్బార్” కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా వినతులు, సమస్యలు స్వీకరించడం జరిగింది. రెవెన్యూ, రహదారులు, విద్యుత్, తాగునీరు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇల్లు స్థలాలు, గృహ నిర్మాణాలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల సంక్షేమానికి సంబంధించిన మొత్తం 29 వినతి పత్రాలు స్వీకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యతగా భావిస్తున్నాను.
ప్రతి వినతిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించాను. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ప్రతి అర్జీపై స్పష్టమైన చర్యలు తీసుకుని, 15 రోజుల్లోపు పరిష్కార వివరాలను ప్రజలకు తెలియజేయాలని సూచించాను. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని, ప్రజా సంక్షేమమే నా ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశాను.
#MamidiGovindaRao
#PrajaDarbar
#PeopleFirst
#PublicService
#Pathapatnam
పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్యాడర్ మీటింగ్లో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యాను. ఈ సందర్భంగా పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలమని పేర్కొన్నాను. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజలకు తెలియజేయడంతో పాటు, పార్టీ సిద్ధాంతాలు మరియు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించాను.
ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తూ గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చాను. కార్యకర్తల అంకితభావం, కృషి వల్లనే పార్టీకి విజయాలు సాధ్యమవుతాయని, నాయకత్వంపై విశ్వాసంతో సమిష్టిగా ముందుకు సాగితే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించగలమని పేర్కొన్నాను. “ప్రజల మద్దతే పార్టీకి ప్రాణం… కార్యకర్తలే ఆ బలానికి ఆధారం” అని స్పష్టం చేస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశాను. ఈ సమావేశంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#MamidiGovindaRao
#TDPCadre
#PartyStrength
#Pathapatnam
#TeamTDP
ధర లేక నష్టపోతున్న తోతాపురి మామిడి రైతులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో ఈ ఏడాది కూడా కిలోకు రూ.4 చొప్పున ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు గారు నిర్ణయించారు. అలాగే వర్జీనియా పొగాకు కిలో రూ.200కు తగ్గకుండా కొనాలని ఆదేశించారు. ఇకపోతే తయారీదారులతో మాట్లాడి రొయ్యల మేతపై కిలోకు రూ.4 తగ్గించిన విషయం తెలిసిందే.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ గ్రౌండ్లో నిర్వహించిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు శ్రీ @RamMNK గారు, సహచర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చాయని పేర్కొన్నాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు మరియు సామాజికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని వివరించాను.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన కొనసాగుతోందని, అభివృద్ధి – సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలియజేశాను. పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రహదారులు, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్య రంగాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని వివరించాను. రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం మరింత వేగంగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశాను.
#MamidiGovindaRao #NDAGovernment #VijayotsavaSabha #Srikakulam #Pathapatnam
పాతపట్నం నియోజకవర్గం ఎల్.ఎన్.పేట మండలం కోవిలాం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ముగడ భద్రయ్య గారు అనారోగ్యానికి గురై శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెబుతూ, త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించాను.
పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా అంకితభావంతో సేవలందిస్తున్న భద్రయ్య గారు త్వరితగతిన కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించాను. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలియజేశాను. నాయకులు, కార్యకర్తల సంక్షేమం పట్ల ఎల్లప్పుడూ అండగా నిలవడం నా బాధ్యతగా భావిస్తున్నాను.
#MamidiGovindaRao
#MugadaBhadrayya
#GetWellSoon
#TDPFamily
#Pathapatnam