అన్నారం సుందిళ్ల బ్యారేజీలలో నీళ్లు నింపిన భద్రాచలానికి ఎలాంటి ప్రమాదం లేదు
గోదావరి 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకుంది, లక్ష క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకోలేదా?
అన్నారం బ్యారేజీ కనిష్ఠ డ్రా-డౌన్ స్థాయి 116.500 మీటర్లు (5.1 TMC)
సుందిళ్ల బ్యారేజీని +126.500 మీటర్లు (3.78 TMC) MDDL స్థాయిల వద్ద నీటిని నిల్వ చేసి రోజుకు రెండు టీఎంసీలు తరలించవచ్చు.
ఆ దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించాలి కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి.
@KTRBRS@BRSHarish@sravandasoju@UttamINC
హరీష్ రావు గారు సవాల్ విసిరి 24 గంటలు దాటిపోయింది,
అయినా ఒక్క కాంగ్రెస్ మంత్రి కూడా సవాల్‌ను స్వీకరించలేకపోయారు.
కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉంటే, గోదావరి జలాలను ఒడిసిపట్టి ఆ నీళ్లను రైతులకు ఇవ్వాలి.
ఉద్దేశపూర్వకంగానే గోదావరి జలాలను రైతులకు ఇవ్వడం లేదు.
- మాజీ కార్పొరేషన్ చైర్మన్ @DrErrolla
నా లాగా దేశ భద్రత కోసం ఎదురొడ్డి పోరాడిన పోలీసు అధికారుల బాధను అర్థం చేసుకున్న గౌరవ తెలంగాణ హైకోర్టు కు హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏼🙏🏼
నా లాగా కోర్టును ఆశ్రయించలేక లోలోపల కృంగిపోతున్న పోలీసులు ఎందరో…!
విధి నిర్వహణలో అత్యున్నత సాహసాలు ప్రదర్శించిన అధికారులకు రక్షణ కవచం అన్నది ఒక హోదానో లేదా ఆభరణమో కాదు, కారాదు. రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా మాకు కల్పించిన ప్రాథమిక హక్కు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు తమ భుజాలపై వేసుకోవలసిన బాధ్యత.
వాన జోరుగా కురుస్తున్నప్పుడు గొడుగు కావాలనిపిస్తుంది. వాన వెలిసి ఎండ వచ్చిన వెంటనే అదే గొడుగు భారంగా అనిపిస్తుంది. ఇప్పుడు సీయం రేవంత్ గారికి, డీజీపీ గారికి మేము ఎండలో గొడుగు లాగా కనిపిస్తున్నాం! కేవలం నా మీద అక్కసుతో వందల మంది పోలీసు అధికారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశారు.
మీరు మీ హంగులు, ఆర్భాటాలు, మహాసభలు,మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు కల్పిస్తున్న అధికారిక రక్షణకు అయ్యే ఖర్చుల ముందు మా భద్రత ఖర్చు ఏ పాటిది కాంగ్రెస్ నాయకులారా? మీకొక న్యాయం, పోలీసులకు మరొక న్యాయమా?
గండిపేట గ్రేహౌండ్స్ భూములను కబ్జా చేసినంత ఈజీ కాదు కీకారణ్యంలో కోంబింగ్ సీయం గారు.
ఆ రోజుల్లో ఇంటి నుండి బయటికెళ్తే మళ్లీ క్షేమంగా ఎప్పుడు తిరిగొస్తామో తెలియని పరిస్థితి. ఎండాకాలంలో దట్టమైన అడవుల్లో నీళ్లు దొరక్క మూత్రం తాగిన రోజులున్నవి. బలిమెలలో 40 మంది కమాండోలు చనిపోయిన రోజున వారి కుటుంబాలను ఓదార్చడానికి ముఖ్యమంత్రులు రాలేక మమ్మల్ని పంపించారు! ఈ పరిస్థితులు మీ కర్థం కావు. మీ చుట్టూ ఉన్న అధికారులు కొందరు వాళ్ల స్వార్థం కోసం మీకసలు విషయం చెప్పరు. మీరేం వినాలనుకుంటే వాళ్లు అదే చెబుతారు.
మీ లాంటి రాజకీయ నాయకుల రక్షణ కోసం, ప్రభుత్వ ఆస్తులు కాపాడటం కోసం భార్య పిల్లల్ని వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనిచేశాం.
మొదటి 15 సంవత్సరాల్లో ఏ నాడు కుటుంబాలతో సినిమాలకు కానీ, షాపింగుకు కానీ, పిక్నిక్ లకు కానీ, చివరికి అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను పరామర్శించడానికి కూడా ఊర్లకు వెళ్లలేదు. రాష్ట్రంలో శాంతి కోసం, మారణహోమం ఆగాలి అనే లక్ష్యంతో చచ్చిపోతాం అని తెలిసినా సాయుధులైన నక్సలైట్లతో చర్చలు జరపడానికి దండకారణ్యంలో రాత్రింబవళ్లు తిరిగాం.
ఈ విధంగా డ్యూటీ చేయడం వల్ల మాకు ఒక పైసా జీతం పెరగలేదు, ఒక గజం భూమి కూడా ఎవరూ ఇవ్వలేదు.
ఈ రోజు మీ ఆదేశాల మేరకు మీ తరపు న్యాయవాదులు మా అభ్యర్థనకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో వాదిస్తున్న తీరు చూస్తుంటే మీకు మా పట్ల ఎంత పగ, వివక్ష, ద్వేషం, చులకనభావం ఉందో సులభంగానే అర్థమవుతోంది!!!
మాకు ఎలాంటి ముప్పు వాటిల్లినా ముమ్మాటికీ బాధ్యత వహించాల్సింది తెలంగాణ సీయం రేవంత్ రెడ్డి-డీజీపీలే.
మీ లాంటి సంకుచిత మనస్తత్వం ఉన్నవారు ముఖ్యమంత్రులవడం ఈ రాష్ట్రం దురదృష్టం. ఈ విషయం ముప్పై సంవత్సరాల ముందే తెలిసుంటే ఐపీయస్ లో చేరే వాన్ని కాదేమో!
సీరియస్లీ!
జైహింద్ 🇮🇳🫡
కన్నెపల్లి వద్ద గోదావరి నదిలో ప్రవాహం ఉదృతంగా ఉంది..
ఇప్పుడు మోటార్లు ఆన్ చేస్తే రోజులు 3 టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది.
అయినా వర్షాలు పడటం లేదు, నీరు ఎలా ఎత్తాలని
సిగ్గులేకుండా నిన్న పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి నీకు రాజకీయాలు ముఖ్యమా?
రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish🔥
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న భూ భారతి పోర్టల్‌లో 22 వేల భూ బదలాయింపులు జరిగాయి.
అంటే 22 వేల మంది ప్రజలకు చెందిన భూములు హక్కుదారుల ప్రమేయం లేకుండా, వాళ్లకు తెలియకుండా వేరే వాళ్లకు బదలాయించారు.
రెవెన్యూ శాఖ చట్టాలను ఉల్లంఘించి, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు జరిపి,
ఈ భూములకు చెందిన వారికి సంబంధం లేకుండా తమకు ఇష్టమైన వారి పేర్ల మీదకు బదలాయించారు.
రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజల హక్కులను కాలరాస్తున్నారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల మాన ప్రాణాలకు ఎలాగూ రక్షణ లేదు..
ఇప్పుడు భూములకు కూడా రక్షణ లేని పరిస్థితి వచ్చింది.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
రెండు చేపల కథ చదవండి.
నేను అవినీతికి వ్యతిరేకం.
చట్టం అందరినీ సమానంగా చూడాలని కోరతాను(Disclaimer)
అయితే..
చిన్న చేపల కొక న్యాయం-తిమింగలాలకు మరో న్యాయం ఉండకూడదు,
సీయం రేవంత్ గారు.
బంజారలకు-మాల మాదిగల కు ఒక న్యాయం, భీమ్ రెడ్డికి మరో న్యాయం ఎట్లా ఉంటది???
యధావిధిగా ఈ రోజు తెలంగాణ లో మరో అవినీతి చేప ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) వలలో పడిందని ప్రెస్ నోట్ ఇచ్చారు. కంగ్రాట్స్ ఆఫీసర్స్. 💐💐💐
ఈ చేప పేరు కొర్ర దిలీప్ నాయక్,చేర్యాల తహసీల్దార్. ఈయన ఎస్టీ లంబాడి(బంజారా) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పాపం ఇతని బీపీ నార్మల్ 120/80 ఉన్నందు వల్లనేమో మీరు, గౌరవ కోర్టు ఇతన్ని చంచల్ గూడ జైలుకు పంపించి ఉంటారు. బహుశా ఎస్టీ(ST) ఎమ్మెల్యేలు అందరూ గాఢ నిద్రలో ఉండి, సీయం గారి దగ్గరికి పోయే సాహసం చేసి ఉొండరు..
గత రెండు నెలల క్రితం ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి చెందిన విద్యుత్తు శాఖ ఇంజనీరు ఇరుగు అంబేద్కర్ ను సీయం రేవంత్ అల్లుడి క్రషర్ కు వట్టినాగుల పల్లిలో కరెంటు అక్రమ పర్మిషన్ అడుగుతే ఇవ్వనందు వల్ల ₹ 200 కోట్ల ఆస్తులున్నయని బదునాం చేసి, ఏసీబీ దాడులు జరిపి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు పెట్టి 38 రోజులు జైలులో ఉంచారు.
ఇప్పుడు ఆ లెక్కలన్నీ తప్పని తలపట్టుకుని ఏం చేయాలో పాలుపోక కూర్చున్నారు మీ అధికారులు!! పాపం ఈయన గురించి ఏ ఎస్సీ ఎమ్మెల్యే-మంత్రి కూడా సీయం దగ్గరికి పోయి గొంతెత్తి నిలదీయలేదు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కూడా అంబేద్కర్ కు జరిగిన అన్యాయం మీద సీయం తో మాట్లాడలేదు, ఎందుకో మరి?? మదిర ప్రజలారా ఇతన్ని ఈ సారి మన గూడేలకు వచ్చినపుడు గళ్ళ పట్టి గట్టిగా నిలదీయండి.
కాళేశ్వరం సీఈ హరిరాం(ST), ఆర్టీవో కిషన్ నాయక్ (ST) , సబావత్ రాంచందర్(ST) (పశు సంవర్ధక శాఖ డైరెక్టర్-ఈయన దగ్గర కనీసం ఒక రూపాయి కూడా దొరక లేదు- రెండున్నర సంవత్సరాలుగా పోస్టింగ్ లేక రోడ్ల మీద ఉన్నాడు) కనకయ్య సీఐ (SC) , సుచరిత (SC)తహసీల్దార్, నరహరి (BC) ఇలా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అధికారులు వందలాది మందిని అవినీతి అధికారులని ముద్ర వేసి తెలివిగా అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7 మరియు 13 లను పెట్టి కనీసం 60 రోజులు చంచల్ గూడ జైలులో బంధించారు. డీఎస్పీ భీంరెడ్డి లాగా వీళ్లకూ షుగర్ బీపీలు ఉన్నాయి. వీళ్లకు లేనిదల్లా కులం, గాఢ నిద్రలో ఉండి, చేతకాని ఎస్సీ మంత్రులు ఎమ్మెల్యేల అండ.
డా. రాంచందర్ నాయక్ (ST-కొడంగల్ వాసి) మరియు పోలీసు అధికారులు ఏసీపీ ఉమామహేశ్వరరావులు ఏ పాపం చేశారో ఎవరికీ తెలియదు. సీయం చెప్పగానే వాళ్లను జైల్లో 60 రోజులు బందీగా ఉంచారు. వాళ్ల వద్ద ఏం దొరకలేదు. కొడంగల్ రాజా వారికి కోపం వచ్చింది. అంతే!
అక్రమ కేసులో జైలు నుండి గుండె రోగం తో అనారోగ్యంతో బయటికి వచ్చిన భుజంగ రావు, అదనపు ఎస్పీని మళ్లీ అక్రమ ఆస్తుల కేసు పెట్టి జైలుకు పంపించారు రేవంత్ రెడ్డి గారు.
కాళేశ్వరం సీఈ మురళీధర్ ENC (70 సం ల వయసు) 60 రోజులు అక్రమ ఆస్తుల కేసులో జైలులో ఉంచారు. వీళ్లందరికీ 35(3) BNSS కింద నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది, కానీ రేవంత్ రెడ్డి వద్దన్నడని ఇవ్వలేదు ఏసీబీ అధికారులు.
మరి దాదాపుగా ₹300 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నాయని మీ ఆదేశాల మేరకే పనిచేసే ఏసీబీ అధికారులే అన్ని ప్రాంతాల్లో దాడులు చేసి మీడియాకు రిలీజ్ చేసి, డీఎస్పీ ‘సంకిరెడ్జి భీంరెడ్డి’గారిని చక్కగా స్టేషన్ బెయిల్ ఇచ్చి మరీ ఇంటికి సాగనంపారు రేవంత్ గారు!!!
పాపం డీయస్పీ భీం రెడ్డి గారి బీపీ 170/120 ఉంది కావున ఇప్పుడు మళ్లీ ఆయన్ను జైలుకు పంపమని నేను అడగడం లేదు…
కానీ…
డీఎస్పీ భీంరెడ్డి గారిపై చూపిన ప్రేమ జాలి కనికరం మిగతా మా బహుజన బిడ్డ లైన వారిపై చూపలేదు కావున, మా బిడ్డ లను కూడా వెంటనే జైలు నుండి విడుదల చేయండి. వారికి మళ్లీ పోస్టింగులు ఇవ్వండి. వారు తప్పు చేసినట్లుగా కోర్టు లో మీరు నిరూపించ గలిగితే వాళ్లకు శిక్ష ఎలాగూ పడుతుంది.
చివరిగా…
దమ్ముంటే తిమింగలాలనే మింగే తెలంగాణ వీర తిమింగలాలు - రేవంత్-పొంగులేటిల ₹1000000000000
లక్ష కోట్ల చీకటి సామ్రాజ్యాన్ని బహిర్గతం చేయండి.
సొర చేపలు, చిన్న చేపలు అన్నీ వెంటనే సర్దుకుంటాయ్. మసకబారిన మీ అనిశా (ACB) ప్రతిష్ట మళ్లీ తిరిగి వస్తుంది.
జై భీం..జై తెలంగాణ… జై భారత్
***అన్నీ సర్దుకున్నాక, ఐదు రోజుల తర్వాత, డీఎస్పీ భీం రెడ్డిని అరెస్టు చేసినట్లు వార్తలొస్తున్నాయి.
ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని కులం పలుకుబడి, బలవంతుల పైరవీల ఆధారంగా కాకుండా, నిజమైన అవినీతి పరులనే కూలంకషంగా పరిశోధించిన తరవాత నే కేసులు పెట్టి జైలుకు పంపండి.
Call ACB at 9440446106, 040-23251555 if you come across corruption by any public servant. CM and his ministers are also public servants.
Jai Hind.
@revanth_anumula@TelanganaACB@Telangana@BRSparty@KTRBRS@BRSHarish
రేవంత్.. నీకు చేతకాక పోతే
కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ గారికి అప్పజెప్పు..
మొత్తం తెలంగాణ నిండా నీళ్లు పారించి చూపెట్టే బాధ్యత మాది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
#KaleshwaramProject
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో..
చిల్లర మాటలు తప్ప ఒక్క నిర్మాణాత్మకమైన కార్యక్రమం చేపట్టలేదు.
నాడు కేసీఆర్ గారి సారథ్యంలో దేశానికే ఆదర్శంగా ప్రగతి పథాన నడిచిన తెలంగాణను,
ఈ కాంగ్రెస్ దద్దమ్మలు పాలన చేతగాక ఆగమాగం చేశారు
#CongressFailedTelangana
అప్పుల మీద భట్టి విక్రమార్క ఒకమాట, రేవంత్ రెడ్డి ఇంకోమాట మాట్లాడుతున్నారు.
నిన్న భట్టి విక్రమార్క అబద్ధాలు, అర్ధసత్యాలు చెప్పి మసిపూసి మారేడు కాయ చేసి, రూ.1,77,000 కోట్ల అప్పు చేశామని అంటడు.
అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి రూ.3,47,294 కోట్లు అన్నడు.
ఎవరి మాట నిజం?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
బ్రోకర్లను పెట్టి లంచాలు ఇచ్చి, కమీషన్లు ఇచ్చి బయటకు కనపడకుండా దానికి బాండ్స్ అని అందమైన ముసుగు వేసి అప్పులు తెస్తున్న కాంగ్రెస్ సర్కార్!
రూ. 30,000 కోట్ల అప్పు కోసం బ్రోకర్‌కు రూ. 510 కోట్ల లంచం ఇచ్చారు.
లంచం ఇచ్చి అప్పులు తెస్తున్నారా అని అసెంబ్లీలో అడిగితే..
రూ.169 కోట్లు లంచం ఇచ్చి, రూ.10 వేల కోట్లు తెచ్చామని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే సమాధానం ఇచ్చింది.
ఇప్పుడు తెచ్చిన రూ. 30 వేల కోట్లు చాలక, మరొక రూ.70 వేల కోట్లు తెస్తారట,
అంటే మొత్తం ఒక రూ.1,710 కోట్ల లంచం ఇవ్వాలి?
లంచాలు ఇచ్చి అప్పులు తీసుకురావడం చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఈ ప్రభుత్వానికి అసలు సిగ్గుందా?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు ఉన్నది భట్టి విక్రమార్క తీరు..
సింగరేణిలో కుంభకోణం జరిగిందని మూడు నెలల కింద బయటపెడితే ఇప్పుడు వచ్చి విజిలెన్స్ ఎంక్వైరీ అంటూ సోది ఉపన్యాసం ఇస్తున్నాడు భట్టి విక్రమార్క
జూపల్లి కృష్ణారావును మంత్రి పదవి పోతది అనగానే సవాళ్లు విసురుతున్నడు
కోమటిరెడ్డిని తొలగించి తమ్ముడికి మంత్రి పదవి ఇస్తారని అనగానే మీటింగ్ లు పెట్టి విమర్శలు చేస్తున్నడు
భూ భారతి అప్లికేషన్ల అప్రూవల్ వెనుక రేవంత్ రెడ్డి, కుటుంబ సభ్యుల పాత్ర ఉంది అనే అనుమానం కలుగుతోంది.
- మాజీ ఎమ్మెల్యే @DrGadariBRS🔥
మంత్రులు ఎల్ నినో పై దృష్టి పెట్టకుండా
సవాళ్లు విసురుతూ డ్రామాలు ఆడుతున్నరు.
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజి వద్ద ఈ రోజు ఉదయం 15 వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి. కాగజ్ నగర్ దగ్గర 45 వేల క్యూసెక్కుల నీరు గోదావరి లో ప్రవహిస్తోంది.. అంటే రేపటికి 4 టీఎంసీ ల నీళ్లు లక్ష్మి బ్యారేజి వద్దకు చేరుతాయి.
మేడి గడ్డ పిల్లర్లు రిపేర్ చేయమంటే చేయక మొద్దు నిద్ర పోతున్నది రేవంత్ సర్కార్..
నీళ్లన్నీ కిందకు వృధాగా వెళ్తున్నాయి.
మేడిగడ్డ దగ్గర మోటార్లు ఆన్ చేసి ఉంటే ఎల్ ఎం డి సగం నిండేది..
ప్రభుత్వం నిర్లక్ష్యం ఇట్లనే ఉంటే వచ్చే వేసవి కాలం లో స్నానానికి నీళ్లు కూడా ఉండవు.
- మాజీ ఎంపీ @vinodboianpalli
భూ భారతిలో దొంగలు పడ్డారని ఒక ప్రముఖ పత్రిక ప్రచురించింది!
మరి ఆ దొంగలు ఎవరు?
ప్రభుత్వమా? వెనుక ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కుట్రదారులా?
రైతు వేలిముద్ర లేకుండా భూమి పట్టాలో మార్పులు చేయకుండా ఉండేలా కేసీఆర్ పటిష్టంగా ధరణిని రూపొందించాడు..
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక భూ భారతి తెచ్చి అనేక అక్రమాలకు పాల్పడుతున్నరు ఈ కాంగ్రెస్ దొంగలు.
ముఖ్యమంత్రి అయినంక కూడా రియల్ ఎస్టేట్ దందానే చేస్తున్నడు రేవంత్ రెడ్డి.
4,000 దరఖాస్తులు ఎలాంటి వేలిముద్ర లేకుండా అప్రూవ్ అయ్యాయి.
సిద్దిపేట జిల్లాలో 80 దరఖాస్తులు, రంగారెడ్డి జిల్లాలో నాలా కన్వర్షన్లు, 100 ఎకరాల నిషేధిత జాబితాలో ఉన్న భూములు కూడా దరఖాస్తు లేకుండా నిషేధిత జాబితా నుండి తీసేసారు.
- మాజీ ఎమ్మెల్యే @DrGadariBRS
అప్పుల మీద చర్చ అని నిన్న పారిపోయిండు మంత్రి జూపల్లి
నేను తెలంగాణ భవన్ కు వచ్చి ఉంటే రాకుండా ముఖం చాటేసిండు.
తెలంగాణ భవన్‌కు రమ్మంటే రాలేదు..
గన్‌పార్క్‌కు వస్తానని చెప్పి పోలీసులతో అరెస్ట్ చేయించిండు..
పోలీస్ స్టేషన్‌కు రమ్మంటే ముఖం చాటేసిండు.
పూటకో సవాల్... రోజుకో అడ్రస్!
ఇప్పుడు లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1.77 లక్షల కోట్లు అంటూ సిగ్గులేకుండా అబద్ధాలు చెప్తున్నడు.
మార్చి 18న అసెంబ్లీలో రూ.3.47 లక్షల కోట్లు అప్పు చేసాం అని రేవంత్ రెడ్డి చెప్పిండు.
నెలకో లెక్కా? మనిషికో లెక్కా?
ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish🔥
సింగిల్ విండో కరప్షన్ కోసమే
రాత్రికి రాత్రే జీవో నెం. 17 తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్!
ఒక్కటే సారి వందల కోట్ల కమీషన్ కోసం..
10 వేల మంది దళిత, బహుజన చిన్న కాంట్రాక్టర్ల పొట్ట కొట్టిండు రేవంత్ రెడ్డి.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero🔥
రేవంత్ రెడ్డి.. నువ్వు మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టినా.. నా భద్రత తగ్గించినా..
నీ చిల్లర రాజకీయాలకు భయపడేది లేదు.
బీఆర్ఎస్.. ఇది పోరాటాల పార్టీ
మేము తప్పకుండా తెలంగాణ ప్రజల గొంతుకగానే ఉంటాం!
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero🔥
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు గట్టిగా ప్రశ్నిస్తున్నారని ఆయన భార్య లక్ష్మీభాయి గారిని బదిలీ చేసిన కాంగ్రెస్ సర్కార్!
ఇంత చిల్లర రాజకీయమా రేవంత్?
శ్రీధర్ బాబు గారి సతీమణి మా ప్రభుత్వంలో పనిచేశారు... మేము ఆయన సతీమణిని ఇలాగే ఇబ్బంది పెట్టామా?
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి భద్రతను తగ్గించారు.
రిటైర్ అయ్యే ఏడాది ముందు నిబంధనలకు విరుద్ధంగా ఆయన భార్యను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేశారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish🔥
బీఆర్ఎస్ నాయకులతో బహిరంగ చర్చకు కూడా రాలేని కాంగ్రెస్ పిరికిపందలు, చేతకాని దద్దమ్మలు..
చర్చలకు సిద్దమని సవాళ్లు ఎందుకు వేయాలి?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
చేతగానోళ్లు ఎందుకు మాట్లాడాలి?
అసలు జూపల్లి కృష్ణారావును అడిగింది ఎవరు?
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తే..
సందట్లో సడేమియాలా "నేను వస్తా" అంటూ మధ్యలో దూరింది నువ్వే..
చర్చకు రాకుండా పారిపోయి గన్ పార్క్ కి వెళ్తివి..
పోనీ మేము అక్కడికి వద్దామంటే పోలీసులతో అరెస్ట్ చేయిస్తివి!
ఇదేనా మీ దమ్ము?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥