ఎస్ఎంఏ వ్యాధితో బాధపుడుతున్న చిన్నారులు.. చికిత్సకు రూ.32 కోట్ల ఖర్చు
దాతల కోసం ఎదురు చూస్తున్న చిట్టితల్లులు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీకి చెందిన దేవిని కృష్ణవేణి, కల్యాణ్ దాస్ దంపతులకు ఇద్దరు పిల్లలు, కుమార్తె సహస్ర (1) కు, కుమారుడు మహా వీర్ (4)కు వెన్నెముక కండరాల క్షీణత (స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ-ఎస్ఎంఏ) వ్యాధి సోకింది
అయితే చిన్నారుల చికిత్సకు రూ.32 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో తెలియని దీన స్థితిలో మునిగిపోయిన తల్లిదండ్రులు
ఈ వ్యాధి వెన్నుపూసలోని కండరాల బలహీనత, క్షీణతకు దారి తీస్తుంది. దీని ప్రభా���ంతో ఎక్కు వసేపు నిలుచోలేరు.. నడవలేరు. దీని నివారణకు ఒక్కొక్కరికి రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ చేయాలని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తల్లితండ్రులకు
పిల్లల తండ్రి కల్యాణ్ దాస్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో కంప��యూటర్ ఆపరేటరుగా పనిచేస్తుండగా.. నర్సింగ్ పూర్తిచేసిన కృష్ణవేణి బెల్లంపల్లిలోనే ఉంటూ పిల్లల సంరక్షణను చూసుకుంటున్నారు
కళ్యాణ్ దాసుకు ప్రతి నెల రూ.11 వేల వేతనం వస్తోందని, పిల్లల మందులకు రూ.10 లక్షల వరకు అప్పులు చేశామని.. పిల్లలు ప్రస్తుత పరిస్థితుల్లో ఉండాలన్నా ఒక్కొక్కరికి రూ.6.50 లక్షల విలువైన సిరప్ చొప్పున ఇద్దరికి రూ.13 లక్షల విలువైన సిరప్లు వాడాలని సూచించిన వైద్యులు
ఎస్ఎంఏ ను��చి శాశ్వతంగా విముక్తి కల్పించడానికి అవసరమయ్యే ఇంజక్షన్ల కోసం దాత లెవరైనా ముందుకు వచ్చి.. తమ పిల్లలను కాపాడాలని కృష్ణవేణి, కల్యాణ్ దాస్ వేడుకుంటున్నారు
సాయం చేయాలనుకునే దాతలు తల్లి కృష్ణవేణి ఫోన్ నంబర్ 8897494155 ద్వారా సంప్రదించవచ్చు