ఐస్ క్రీమ్
నువ్వు భోజనం చేశాక, ఒక రెండు కప్పుల ఐస్‌క్రీం తింటావు. ఇప్పుడు ఆ ఐస్ క్రీమ్ మన ఒంటికి ఇప్పటికే శక్తి చాలా ఉంది కాబట్టి, అది ఒంట్లో ఎక్కడో దాక్కుంటుంది. ఎక్కడంటే పిరుదుల్లో, నడుము చుట్టూ, తొడల్లో, చేతి దండల్లో ఎక్కడో ఒకదగ్గర కొవ్వులా దాక్కుంటుంది.
కడుపులో అండాశయాలు (ఓవరీస్) ఈస్ట్రోజన్ ని తయారు చేస్తాయి. ఈ ఈస్ట్రోజన్ తన పని తాను చేశాక లివర్ దాన్ని ముక్కలు చేసి నీట్లో కలిపేసి మూత్రంలోనించి బయటకు పంపిస్తుంది. కానీ పైన దాక్కున్న ఐస్ క్రీం మాత్రం ఈ ఈస్ట్రోజన్ని పట్టి దాచుకుంటుంది. బయటకు పోనీయదు. అలా తయారయిన ఈస్ట్రోజన్ ఒంట్లో ఉండిపోతుంది.
ఈస్ట్రోజన్ గర్భాశయం ( యుటరస్) రొమ్ము (బ్రెస్ట్) లో కణజాలాన్ని (టిష్యూ) వృద్ది చెందించటం చేస్తుంది సాధారణంగా. అందువలన రొమ్ము పెరగటం, అలాగే నెలసరికి ముందు గర్భాశయ లోపలి గోడ పెరగడం జరుగుతుంది. నెలసరి వచ్చేటపుడు పెరిగినది ఊడి బయటకు వచ్చేస్తుంది.
కానీ ఇలా ఎక్కువైన ఈస్ట్రోజన్ ఇక నిరంతరం రొమ్ము, గర్భాశయం మీద దాడి చేస్తూనే ఉంటుంది. దీనివలన కణజాలం మాటిమాటికీ విభజనకి గురయ్యి ఎక్కడో ఒకదగ్గర గాడి తప్పుతుంది. ఆ గాడి తప్పిన కణజాలాన్ని ఎక్కువసార్లు ఇమ్యూన్ వ్యవస్థ పసిగట్టి నాశనం చేస్తుంది. కానీ కొన్నిసార్లు దాన్నుంచి కూడా తప్పించుకుంటుంది ఆ కణజాలం. అదే పెరిగి పెద్దదై క్యాన్సర్ అవుతుంది.
ఇప్పుడు భారతీయ మహిళల్లో రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్లు పెరగటానికి ముఖ్య కారణం ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం, సరిపడా వ్యాయామం చెయ్యకపోవడం అలాగే మానసిక ఒత్తిడి.
జాగ్రత్తగా తినండి, రనౌట్ కాకండి.
అనగనగా ఒక వ్యక్తి ఉంటాడు. వాడు నీతో ఒక విధంగా ప్రవర్తించినదానిబట్టి వాడు ఇది అనుకుంటావు, కానీ వాడి లోపలి ఆంతర్యం ఎంతో నీకు తెలీదు కాబట్టి వాడు నీకు పూర్తిగా తెలీనట్టే లెక్క.
ఇక వాడి లోపల వాడు ఏమనుకుంటున్నాడో వాడికి తెలుసు కాబట్టి వాడికి వాడేంటో తెలుసు అనుకున్నా పొరపాటే, ఎందుకంటే వాడి గురించి తెలీనివి వాడి లోపల ఇంకొన్ని ఉంటాయి. అవి అసలు అలాంటివి ఉన్నాయని కూడా వాడికి తెలీదు. అలాగే వాడు ఒక విధంగా మీతో ప్రవర్తిస్తున్నాడు అన్నది కూడా వాడు గమనించడు. దానివలన వాడి గురించి వాడికి కూడా పూర్తిగా తెలీదు.
కాబట్టి ఒకడి గురించి వాడికి గానీ, ఎదుటివాళ్ళకి గానీ పూర్తిగా తెలీదు. మనకి మనం, లేదా మనకి ఎదుటివాళ్ళకి తెలిసిన దాంతోటే పని కానిస్తుంటాం. అందులోనే స్నేహాలు, పొరపచ్చాలు, ఆప్యాయతలు, పగలు, ప్రేమలు, ద్వేషాలూ అన్నీ.
ప్రొటీన్లు- ప్రశ్నలు
ఎందుకు?
ఒంట్లో కండ పెరిగేందుకు,
కండలోపల ఎముక పెరిగేందుకు,
కండ పైన తోలు పెరిగేందుకు,
పాడైన పార్టులు బాగయ్యేందుకు,
ఇమ్యూనిటీ బాగుండి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు,
మెదడులో నరాలు మాట్లాడేందుకు,
తిన్న తిండి అరిగేందుకు,
రక్తం పెరిగేందుకు,
కడుపులో బిడ్డ పెరిగేందుకు,
బిడ్డని కనేందుకు బాడీ సిద్ధమయ్యేందుకు,
జుట్టు పెరిగేందుకు,
రక్తం గడ్డకట్టేందుకు,
రక్తం చిక్కగా ఉండేందుకు,
ఎత్తు పెరిగేందుకు,
షుగరు అదుపులో ఉండేందుకు,
ఎందులో?
గుడ్లు, పాలు, మాంసం,
చిక్కుళ్ళు, పప్పులు, వేరు శనగ, బాదాం, పిస్తా…
అన్నం, చపాతీలో?
ఉంటుంది కానీ సరిపడదు.
శ్రేష్ఠమైన సహజ ప్రోటీను?
గుడ్డు
శ్రేష్ఠమైన తయారీ ప్రోటీను?
పాల పొడి, వే ప్రోటీను - ఇవి సురక్షితం.
శ్రేష్ఠమైన అంటే?
తిన్న మొత్తం ప్రోటీను ఒంట్లోకి వెళ్లి పనిచెయ్యడం. కొన్ని ఆహారాల్లో ఉన్న ప్రోటీను మనకి కావాల్సినవి అందించలేదు.
అంటే?
ప్రోటీన్లలో ఇరవై రకాల అమైనో ఆమ్లాలుంటాయి, ఈ ఇరవై ఉంటేనే ప్రొటీన్లు తయారవుతాయి ఒంట్లో. వీటిలో 11 మన దేహం తయారుచేసుకుంటుంది, కానీ 9 బయటినుంచి తిండిలో తప్పనిసరిగా తీసుకోవాలి. గుడ్డు, పాలలో పుష్కలంగా ఉంటాయిఇవి. మిగతావాటిలో అంతగా ఉండకపోవచ్చు.
ప్రొటీన్లు తిండిలో తగ్గితే?
పిల్లల్లో బుద్ధి మాంద్యం, ఒళ్లంతా పొంగడం, పొట్టిగా ఉండిపోవడం, గుండె అలసిపోవడం, పాలిపోవడం, ఎముకలు బలహీనపడటం
పెద్దల్లో ఇన్ఫెక్షన్లు సులువుగా రావటం, పుండు మానకపోవడం, జుట్టు ఊడిపోవడం, కండరాలు బలహీనపడటం.
రక్తపరీక్ష?
సాధారణంగా రక్తంలో ప్రొటీన్లు 6.5 నుంచి 8.5 గ్రా/డెసి లీ. ఉంటాయి. మీరు తినే తిండి మరీ దారుణం కాకపోతే 6.5 కి తగ్గదు. మీరు ఎంత తిన్నా 8.5 కంటే పెరగదు. అంటే దేహం రక్తంలో ఉండే ప్రొటీన్లను బాగా టైట్ గా కంట్రోల్ చేస్తుంది(నియంత్రిస్తుంది). ఉన్న దానికంటే పెరిగితే దేహంలో ఏదో సమస్య ఉన్నట్లు లెక్క. తక్కువ ఉంటే తక్కువ తినడమో లేక ఇంకెక్కడో ప్రొటీన్లు పోవడమో జరుగుతుందని. మొత్తంగా చెప్పేది ఏంటంటే ఐరన్ టాబ్లెట్ వేసుకుంటే ఒంట్లో ఐరన్ ని లెక్క వేసినట్లు, ప్రొటీన్లు తింటే ఒంట్లో ప్రొటీన్లని రక్త పరీక్ష ద్వారా లెక్క వెయ్యలేం.
ఎంత తినాలి?
పెద్దలు- 1 గ్రా/కేజీ బరువుకి. అరవై కేజీల బరువు ఉంటే 60 గ్రా తినాలి.
బాలింతలు, గర్భిణీలు, ఎదిగే పిల్లలు, ఆపరేషన్ అయ్యి కోలుకుంటున్నవాళ్ళు, ఐసీయూ నుంచి డిశ్చార్జి అయినవాళ్ళు, బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు, ముసలివాళ్లు - 2 గ్రా/ కేజీ బరువుకి.
ఒక్క ప్రొటీన్ తింటే సరిపోతుందా?
సరిపోదు. దేహానికి శక్తి అవసరం అది కార్బోహైడ్రేట్లు, కొవ్వులనుంచి వస్తుంది. అవి దొరకనప్పుడు దేహంలో ఒంట్లో నిల్వని ఖర్చు చేస్తుంది, అవీ అయిపోయాక ఇంకా ఒంట్లో ప్రొటీన్లని వాడుకుంటుంది శక్తి కోసం.
గుడ్లు సురక్షితమా?
సురక్షితం. పిల్లలు పూర్తి గుడ్డు తినవచ్చు. పెద్దలు తెల్లసొన మాత్రం తింటే సరిపోతుంది.
గుడ్లు ఎలా తినాలి?
పచ్చిది వద్దు. ఉడకబెట్టి, ఆమ్లెట్, ఉక్కిరి ఎలా అయినా తినవచ్చు.
తల్లిదండ్రులు పిల్లలకి గుడ్డు పెట్టాలా?
పెట్టాలి.
ప్రభుత్వం పెట్టాలా?
పెట్టాలి.
గుడ్డుకి ప్రత్యామ్నాయం ఉందా?
లేదు. గుడ్డు లో ఉండేపోషకలు ఇంకో ఆహారం ద్వారా తినాలి అంటే ఎన్నో తినాలి, బరువుపెరుగుతారు అనవసరంగా, ఇప్పటికే పిల్లల్లో స్థూలకాయం పెరుగుతోంది. పైగా ఖర్చు, తయారుచేసేందుకు సమయం వృధా.
రోజుకి ఎన్ని గుడ్లు తినవచ్చు?
ఎన్నైనా తినవచ్చు. నేను 4-8 తింటాను.
గుడ్డు తినడం వలన అనర్థాలు ఏమన్నా ఉన్నాయా?
లేవు.
మరి శాకాహారులు?
వే తినవచ్చు. ఖరీదు అలాగే అనవసర పదార్థాలు కలుపుతారు అందులో, అలాగే నాణ్యత కచ్చితంగా ఉంటుందని చెప్పలేం. కొందరిలో బాగా అపానవాయువు వస్తుంది.
గుడ్డు కంటే ఫలానాది మంచి ప్రోటీను ఇది అని అంటే?
గుడ్డు తెలుసురా నీకు అని అనండి.
సండే యా మండే, రోజ్ అండే ఖావ్.
Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi@republic@AlwaysRamCharan
మన మతాన్ని గౌరవించుకోవాలి అని @PawanKalyan గారు అంటున్నారు. దీనిలో ఇతర మతాలను ద్వేషించమని ఎక్కడ ఉంది?
ఏ నాడు పవన్ కళ్యాణ్ గారు ముస్లింలను కానీ క్రైస్తవులను కానీ కించపరుస్తూ మాట్లాడింది లేదే!
పక్క మతాలను ద్వేషించే వ్యక్తి అయితే కడప దర్గాకు 25 లక్షలు ఎందుకు ఇస్తాడు?
Bro @Mbramesh_4005
The School Fees Has Been Paid ✨☀️
Pls inform their parents Tat I will take Care of their Entire Schooling Fees Until they pass out 🏋️♂️💥
Let the children 👶 Shine ✨
No more OTC sale of cough and cold syrups!
Thank you @MoHFW_INDIA
It will protect many children from overdosing related complications including respiratory depression, coma, arrhythmias,hypertension etc. Thank you!
#coughcoldsyrups#OTC#ban#prescription#Notification
శ్రీ రమణ గోగులకు జన్మదిన శుభాకాంక్షలు
సంగీత దర్శకుడు, మిత్రుడు శ్రీ @RamanaGogula కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నేను నటించిన ‘తమ్ముడు’, ‘బద్రి’ సినిమాలకు శ్రీ రమణ అందించిన బాణీలు ప్రేక్షకులను మెప్పించాయి. ఆ బాణీలలోని కొత్తదనం యువతను ఆకట్టుకొంది. గానంలోని విభిన్న శైలి ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. ఐ.ఐ.టి. ఖరగ్ పూర్ లో ఎం.టెక్ చదివి, అమెరికాలో ఎమ్మెస్ చేసిన విద్యావంతుడు శ్రీ రమణ గోగుల. ఓ వైపు సినీ రంగంలో తన సృజనాత్మకతను చాటుతూనే వెంచర్ క్యాపటలిస్టుగా, టెక్నాలజీ సంస్థల నిర్వాహకుడిగా రాణిస్తున్న శ్రీ రమణ గోగులకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి కోరుకొంటున్నాను.
- @PawanKalyan