సమ్మక్క సారక్క దర్శనార్థం వరంగల్ వచ్చిన పారడైస్ సినీ బృందాన్ని ములుగు గట్టమ్మ దగ్గర పలకరించడం జరిగింది.
అస్తిత్వ పోరాటం, గుర్తింపు కోసం జరిగే ఘర్షణను దర్శకుడు శ్రీకాంత్ఓదెల అద్భుతంగా మలిచారు
న్యాచురల్ స్టార్, హీరో నాని @NameisNani సినిబృందం అద్భుతమైన నటనతో తెలుగు ప్రజలను మెప్పించారు.
అస్తిత్వ పోరాటానికి కేరాఫ్ అడ్రస్ తెలంగాణ, ఆ తెలంగాణ ను సాధించడం కోసం, ఇక్కడ ప్రజల గుర్తింపు కోసం వారు అండగా నిలిచిన తీరును చిత్రంలో అద్భుతంగా చూపెట్టడం హర్షణీయం.
#Paradise
గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది.
కృష్ణమ్మ తల్లిరా కన్నీల్లు రాల్చింది.
సింగరేణి తల్లి సిన్నబోయినాది.
అంటూ కాంగ్రెస్ దాష్టీకాల గురించి గొంతెత్తిన ప్రజా యుద్ధ నౌక, అలుపెరగని పోరాట యోధుడు గద్దర్ గారు..
కొడంగల్ బిడ్డను అంటూ కొడంగల్ ప్రజల ఇళ్లనే కూల్చేస్తావా @revanth_anumula ?
మద్దూరులో రాత్రికి రాత్రే పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను నడిపించే హక్కు నీకు ఎవరు ఇచ్చారు?
కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇంత కర్కశంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?
న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా గౌరవించరా?
ఒక్కసారిగా ఇండ్లు కూల్చితే, ఏండ్ల నుండి నివాసం ఉన్నవారు ఒక్కసారిగా ఎక్కడికి వెళ్తారు.
అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా?
పోలీసులను అడ్డుపెట్టుకుని బుల్డోజర్ రాజ్ అమలు చేస్తారా?
పేదల బతుకులను రోడ్డున పడేయడమేనా మీ ప్రజా పాలన?
యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని గొప్పగా చెప్పుకునే భూసేకరణ చట్టం–2013 ప్రకారం బాధితులకు తక్షణం న్యాయమైన పరిహారం, పునరావాసం కల్పించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO
పట్టభద్రులందరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు తన కుమార్తెలు శ్రీహిత, శ్రీహర్షితలతో కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ..
మహబూబ్ నగర్ నియోజకవర్గం లో అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రతి ఒక్కరూ ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని కోరారు.
రేవంత్ రెడ్డి నేతన్నలకు, పద్మశాలి సోదరులకు ఇచ్చిన హామీలు ఎక్కడ పాయె..❓
ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి పలికిన ప్రగల్బాలు..👇
👉తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల అభయ హస్తం మేనిఫెస్టో నే భగవద్గీత..
👉ఈ ఎన్నికల అభయ హస్తం మేనిఫెస్టో నే ఖురాన్..
👉ఈ ఎన్నికల అభయ హస్తం మేనిఫెస్టో నే కాంగ్రెస్ పార్టీకి బైబిల్...
అని చిలుక పలుకులు పలికిన రేవంత్ రెడ్డి ఏమయ్యాయి మీ హామీలు...❓
సకల జనభేరి | 29.09.2013
తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన సకల జనభేరి కార్యక్రమంలో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారి ప్రసంగం.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమ జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుంటూ...
#SakalaJanabheri#TelanganaMovement
KTR is Working President of BRS ...
A 5 time undefeated MLA ...
A Opposition Leader speaking on Public Issues...
Telangana Police seeking to Confiscate KTR's Passport,
CM Office leaking this to Media,
Is an insecure Move by Harvard Student Revanth Reddy who does not want KTR to attend any foreign events representing Telangana ❗️
@revanth_anumula aayanaku vasthunna invitations aapa daanike kada 😂😂 Pirikodaa ...
సకల జనభేరి (29.09.2013):-
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సకల జనభేరి ఒక కీలక ఘట్టంగా నిలిచింది. హైదరాబాద్లోని నిజాం కాలేజ్ గ్రౌండ్లో లక్షలాది మంది తెలంగాణవాదులు తరలివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిన సంఘటన.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రభుత్వం అనుసరిస్తున్న నాన్చివేత ధోరణిని వ్యతిరేకిస్తూ, ప్రజల ఆకాంక్షను స్పష్టంగా తెలియజేస్తూ నిజాం కాలేజ్ డిక్లరేషన్ ద్వారా సామూహిక హెచ్చరికను చాటారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ప్రతి పోరాటం..
ఒక చరిత్ర.. ఒక స్ఫూర్తి.. ఒక ఉద్యమ జ్ఞాపకం.
- వి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి.
#SakalaJanabheri #TelanganaMovement
పరిపాలనకు కేంద్రంగా ఉండాల్సిన రాష్ట్ర సచివాలయం.. కాంగ్రెస్ పాలనలో నిరసనల అడ్డాగా మారడం సిగ్గుచేటు.
రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు సచివాలయం వేదికగా ఆందోళనకు దిగాల్సిన దుస్థితి రావడం సీఎం @revanth_anumula , ఆర్థిక మంత్రి @Bhatti_Mallu తలదించుకోవాల్సిన విషయం.
ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్లో పెట్టి.. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా.. ఇంకెంత కాలం తప్పించుకు తిరుగుతారు?
బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ.. చిన్న కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు నెలల తరబడి పెండింగ్లో పెట్టడం దారుణం.
పెండింగ్ బిల్లుల మంజూరు కోసం 20 -30% కమిషన్ డిమాండ్ చేస్తున్నారంటూ గతంలో సచివాలయంలో ఆర్థిక మంత్రి చాంబర్ ముందు ఆందోళనకు దిగారు.
అంటే కమీషన్లు ఇవ్వలేదనే కారణంతోనే వారి బిల్లులు ఆపుతున్నారా?
రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు విడుదల చేస్తామని మే నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ నీటి మూటలేనా?
మాటలు కోటలు, దాటితే చేతలు గడప దాటవు అనడానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి?
రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల ఆవేదన వినే సమయం కూడా ఈ ప్రభుత్వానికి లేదా?
30 ఏళ్లకు పైగా సేవలందించిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? వారి గోడు ఈ ప్రభుత్వానికి పట్టదా?
2024 మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బెన్ఫిట్స్ అందక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?
సర్వీసులో దాచుకున్న సొమ్మును కూడా తిరిగి ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుండటం అమానవీయం, అనైతికం!
సమస్యలు వినడానికే సిద్ధంగా లేని ప్రభుత్వం.. పరిష్కారం ఎలా చూపుతుంది?
ప్రజల సమస్యలు వినాల్సిన ప్రభుత్వం…
ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే పోలీసులతో అడ్డుకునే దుస్థితి!
ఇదేనా కాంగ్రెస్ చెప్పిన “ప్రజా పాలన”?
ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు , 420 హామీలు అంటూ ప్రజలను మభ్య పెట్టడం...
అధికారంలోకి వచ్చాక ప్రజలకే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం!
ఇది ప్రజా పాలనా?
లేక కాంగ్రెస్ మార్క్ వంచనా?
@TelanganaCMO
డా.మన్నె క్రిశాంక్ గారితో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఘటనకి సంబంధించి నాంపల్లి పోలీసులు నమోదు చేసిన ఇల్లీగల్ కేసు లో రెండవ సారి విచారణకు హాజరయ్యారు.బ్రూటిష్ కాలం నాటి 1922 పోలీసు చట్టాన్ని అక్రమంగా క్రిశాంక్ పైన ప్రయోగించారు .
Instead of threatening Youth of filing Police cases for playing KCR's songs,
Instead of filing British Police Acts which have been Repealed by Parliament,
Revanth Govt should tell Telangana about Minister Ponguleti's Rs.650 crore Scam & ED Raids.
Revanth Govt should open its mouth on Land Allotment to Kondal Reddy's Shell Company...
- Appeared at CCS Office today for investigation.
కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోయాయి
కొల్లాపూర్లో ఎండిపోయిన పంటలను పరిశీలించిన కేటీఆర్ గారు
పర్యటనలో పాల్గొన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు
ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ
నాగర్కుంట నవీన్ రెడ్డి
మీ సేవకు ఈ అవార్డు ముగింపు కాదు.... మరింత గొప్ప సేవకు ఇది ప్రారంభం కావాలి...
• వాసవి క్లబ్ అంటే కేవలం ఒక సంస్థ కాదు…సేవ, సంస్కారం, సమాజ బాధ్యత కలిసిన ఒక సేవా కుటుంబం....
• మనం ఎంత సంపాదించినం అనేది కాదు.. ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలనే ఆలోచన గొప్పది..
• వాసవి క్లబ్ సేవల్లో వాసవి వనితా సేవలో స్ఫూర్తి దాయకం..
• వాసవి క్లబ్ ప్రాంతీయ సదస్సు అవార్డు ల ప్రధానోత్సవం లో పాల్గొన్న మాజీ మంత్రి ,ఎమ్మెల్యే @BRSHarish గారు.
ఈ సందర్బంగా హరీష్ రావు గారు మాట్లాడుతు...
ఈ రోజు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సమాజంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి, వారిని అవార్డులతో సత్కరించడం ఎంతో అభినందనీయమైన విషయం.
సేవ చేసిన వారిని గుర్తించడం కూడా ఒక సేవే.
మంచి చేసిన వారిని ప్రోత్సహిస్తే… మరింత మందికి మంచి చేయాలనే స్ఫూర్తి కలుగుతుంది.
ఆ గొప్ప బాధ్యతను వాసవి క్లబ్ నిరంతరం నిర్వహిస్తుండటం సంతోషకరం.
వాసవి క్లబ్ అంటే కేవలం ఒక సంస్థ కాదు…
సేవ, సంస్కారం, సమాజ బాధ్యత కలిసిన ఒక సేవా కుటుంబం.
వాసవి క్లబ్ సేవలు రాష్ట్ర,జాతీయ స్థాయి లో నే కాదు అంతర్జాతీయ స్థాయి లో సేవలు అందిస్తున్నారు...
విద్యార్థులకు విద్యా సహాయం చేయడం, పేదలకు వైద్య సహాయం అందించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం, మహిళా సాధికారతను ప్రోత్సహించడం వంటి అనేక కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలుస్తున్నారు.
ఆర్యవైశ్య సమాజం గురించి మాట్లాడేటప్పుడు మనకు ముందుగా గుర్తుకొచ్చేది శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు.
అమ్మవారి ఆదర్శాలను అనుసరిస్తూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం నిజమైన భక్తి అని నేను భావిస్తున్నాను.
సంపాదించడం గొప్ప విషయం కావచ్చు…
కానీ సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచన ఇంకా గొప్పది.
మన దగ్గర ఎంత సంపద ఉందన్నది కాదు…
మన వల్ల ఎంతమంది జీవితాల్లో వెలుగు వచ్చింది అన్నదే మన జీవితానికి నిజమైన విలువ.
ఈ రోజు అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు.
ఈ అవార్డు మీ సేవకు లభించిన గుర్తింపు మాత్రమే కాదు… మీపై మరింత బాధ్యతను కూడా పెంచుతుంది. మీరు చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసి మరో పదిమంది స్ఫూర్తి పొందాలి. వాళ్లు మరో వంద మందికి సహాయం చేయాలి. అలా సేవ ఒక గొలుసులా సమాజమంతా విస్తరించాలి.
ప్రత్యేకంగా యువతకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.
జీవితంలో ఎదగాలి… సంపాదించాలి… ఉన్నత స్థానాలకు చేరుకోవాలి. అదే సమయంలో మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా మర్చిపోకూడదు.
మన ఊరిలో ఒక పేద విద్యార్థి చదువు ఆగిపోకుండా చేయగలిగితే, ఒక నిరుపేద కుటుంబానికి వైద్య సహాయం అందించగలిగితే, అవసరంలో ఉన్న ఒక కుటుంబానికి అండగా నిలబడగలిగితే — అదే నిజమైన సామాజిక సేవ.
ఇలాంటి సేవా భావాన్ని యువతలో పెంపొందించే బాధ్యతను వాసవి క్లబ్ మరింత విస్తృతంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను.
సామాజిక సేవా సంస్థల సహకారం తోడైతేనే సమాజంలో మరింత వేగంగా మార్పు తీసుకురాగలం.
రాబోయే రోజుల్లో కూడా విద్య, వైద్యం, మహిళా సాధికారత, యువత ఉపాధి, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో వాసవి క్లబ్ మరిన్ని కార్యక్రమాలు చేపట్టి వేలాది కుటుంబాలకు అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన వాసవి క్లబ్ ప్రతినిధులందరికీ ప్రత్యేక అభినందనలు.
ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అనుకుంటే ఉన్న ఇల్లు కోల్పోయి రోడ్డున పడ్డ వృద్ద దంపతులు.
-@TelanganaCMO
ఇందిరమ్మ ఇల్లు వస్తుందని అధికారులు చెప్పడంతో పాత ఇల్లు కూల్చేసిన వృద్ధ దంపతులు,ఇప్పుడేమో మీరు అర్హులు కాదంటూ మాట మార్చిన అధికారులు.
-@Collector_JGN
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెంకు చెందిన వృద్ధ దంపతులు కోలిపాక వెంకటయ్య, వెంకటమ్మకు జూన్లో ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఎంపికైనట్లు పత్రాన్ని అందజేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
-@KadiyamSrihari
అయితే ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుందన్న ఆశతో పాత ఇంటిని కూల్చగా.. ఇప్పుడు వారు పథకానికి అర్హులు కాదని అధికారులు చెప్పడంతో ఇల్లు లేక రోడ్డున పడ్డ వృద్ధ దంపతులు..
-@revanth_anumula
చెయ్ కానీ అతి చెయ్యకు ఇలాంటి చిల్లర పోస్టులు పెట్టాలంటే మేము రోజుకు 100 పెడతాం కానీ పెట్టం ఎందుకంటే మాకు సంస్కారం ఉంది మీరు ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ ఉండదు అది గుర్తుపెట్టుకోండి