ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ ఆత్మబలిదానం మా హృదయాలను తీవ్రంగా కలిచివేసింది.
సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్‌కు మా ఘన నివాళులు.
��క్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలి తప్ప, ఇలాంటి ఆత్మబలిదానాలకు ఎవరూ ఒడిగట్టవద్దని హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం.
శంకర్‌కు గౌడ్ మృతికి ముఖ్యమంత్రి @revanth_anumula దే బాధ్యత. ఈ ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది.
అధికారంలోకి రాగానే ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని, ఇతర అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పడంవల్లనే ఈ దుస్థితి వచ్చింది.
మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు సైతం అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతావు రేవంత్ రెడ్డి? ఇలా ఎంతమందిని బలి తీసుకుంటావు?
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన ఆవేదనను పరిగణలోకి తీసుకొని, ప్రభుత్వం తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించి, కార్మికుల్లో విశ్వాసం కల్పించాలి.
శంకర్ గౌడ్ అమరుడైన రోజును “అప్పాయింటెడ్ డే”గా ప్రకటించి, ఆయన త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఆర్టీసీ కార్మిక సోదరులారా, మీరు చేస్తున్న పోరాటానికి మేమంతా అండగా ఉన్నాం. అధైర్యానికి లోనుకాకండి.కలిసికట్టుగా, న్యాయబద్ధంగా పోరాడి మన హక్కులను సాధించుకుందాం. ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద���దని మరోసారి మనవి చేస్తున్నాం.
జోహార్ శంకర్ గౌడ్..
#CongressfailedTelangana
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసి డ్రైవర్ శంకర్ గౌడ్ గారిది ఆత్మహత్య కాదు. అది ముమ్మాట��కీ రేవంత్ సర్కారు చేసిన హత్యే.
రెండున్నరేళ్లుగా సీఎం రేవంత్ ఆర్టీసి కార్మికులకు చేస్తున్న తీరని ద్రోహాన్ని తట్టుకోలేకే శంకర్ గౌడ్ గారు బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఆర్టీసి సంస్థ పరిరక్షణకు, తోటి కార్మికుల హక్కుల సాధనకు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ శంకర్ గౌడ్ గారి పార్థివదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులు అర్పించేందుకు కూడా అనుమతించకపోవడం అత్యంత దుర్మార్గమై��� చర్య.
పుట్టెడు దుఖంలో ఉన్న శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్��న్ రెడ్డి గారితోపాటు, బీఆర్ఎస్ నేతలు, ఆర్టీసి కార్మికులు, కార్మిక సంఘాల నేతలను నర్సంపేటలో అరెస్టుచేయడం చాలా దారుణం.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అక్రమంగా అరెస్టు చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయడంతోపాటు, శంకర్ గౌడ్ గారి కుటుంబసభ్యులు, ఆర్టీసి కార్మికుల విజ్ఞప్తిమేరకు ఆర్టీసి డిపో వద్ద నివాళులు అర్పించే అవకాశం కల్పించాలి.
కాంగ్రెస్ సర్కారు రాక్షసత్వం వల్ల కుటుంబ పెద��దను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న శంకర్ గౌడ్ గారి కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం చెల్లించాలి.
అలాగే శంకర్ గౌడ్ గారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అన్నివిధాలా ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
ఆర్టీసి కార్మికులు సమ్మె చేస్తున్నా, కనీసం సోయి లేని సర్కారు అంతులేని నిర్లక్ష్యం వల్లే ఇవాళ ఉద్యమం నాటి దృశ్యాలు, ఆత్మబలిదానాలు చేసుకు���ే పరిస్థితులు చూస్తున్నాం.
అసెంబ్లీ ఎన్నికల వేళ సవాలక్ష హామీలిచ్చిన రేవంత్ రెడ్డి కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటికీ నెరవేర్చకపోవడంతోనే ఆర్టీసి కార్మిక లోకం ఇవాళ తీవ్ర నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది.
ఆర్టీసిని నిర్వీర్యం చేసే కుట్రలను ఇకనైనా మానుకుని ఆర్టీసి కార్మికులతో చర్చలు జరిపి, ఇచ్చిన హామీలను, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి.
రాష్ట్రంలో ఒకేరోజు ముగ్గురు ఆర్టీసి డ్రైవర్లు ఆత్మహత్య ప్రయత్నాలు చేసిన సంఘటన తెలంగాణ చరిత్రలో ఓ చీకటి రోజుగా మిగిలి ఉంటుంది.
తెలంగాణలో ఏకకాలంలో ఇన్ని బాధాకరమైన సంఘటనలు జరిగినా మానవత్వం లేని కాంగ��రెస్ సర్కారులో కనీసం చలనం లేకపోవడం సిగ్గుచేటు.
ఆర్టీసి కార్మిక సోదరుల్లారా.. దయచేసి మనోధైర్యాన్ని కోల్పోకండి. మీ పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుంది.
ఈ నిరంకుశ కాంగ్రెస్ సర్కారు, ఈ అసమర్థ ముఖ్యమంత్రి మెడలు వంచి ఆర్టీసి కార్మికుల న్యాయమైన హక్కులను సాధించే వరకూ మనమంతా కలిసి సంఘటితంగా ఉద్యమిద్దాం.
జై తెలంగాణ ✊
తుగ్లక్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల నర్సంపేటలో ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వెళ్తున్న శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారిని ఆలేరు వద్ద అడ్డుకొని అక్రమంగా అర���స్టు చేసిన పోలీసులు.
@Sirikondatrs
ఒక కాంగ్రెస్ నాయకుడి దందా కోసం టెస్కో గొంతు కోయాలని చూస్తున్నారు.
టెస్కో నేరుగా సప్లై చేసే విధానాన్ని రద్దు చేసి, కాం��్రెస్ నాయకుడికి చెందిన రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థకు టెండర్ దక్కే విధంగా సీఎం కార్యాలయం పనిచేసింది.
బీఆర్ఎస్ పార్టీ ఈ కుట్రను గుర్తించి హైకోర్టులో పిటిషన్ వేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవ హైకోర్టు తప్పుబట్టి, టెస్కో ద్వారానే క్లాత్ సప్లై చేయాలని ఆదేశించింది.
- మాజీ ఎమ్మెల్యే @PSRNSPT
రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతులు రోడ్ల మీద నిరసనలు తెలుపుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న రైతులను దారుణంగా మోసం చేస్తోంది.
ఇప్పటివరకు మొక్కజొన్న కొనుగోలుపై కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ విడుదల చేయలేదు.
రైతులకు చెల్లింపులు ఎలా చేస్తారో మెమో కూడ��� జారీ చేయలేదు.
ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి కాంగ్రెస్ మంత్రులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మండలానికి ఒకటి చొప్పున ప్రారంభించారు తప్ప, అక్కడ మొక్కజొన్న కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదు.
- మాజీ ఎమ్మెల్యే @PSRNSPT
పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు.
హైకోర్టు తీర్పుతో కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రజలకు క్లారిటీ వచ్చింది.
తెలంగాణ ప్రజల జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విష ప్రచారాలు చేశారు. ఇవ్వాళ హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డి అభాసు పాలయ్యాడు.
పీసీ ఘోష్ కమిషన్ ను రాజకీయ దుష్ప్రచారం కోసమే రేవంత్ వాడుకున్నాడు, తప్పకుండా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి గుణపాఠం చెబుతారు.
- మాజీ ఎమ్మెల్యే @PSRNSPT
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ “దోచుకో-దాచుకో” అనే పథకం ప్రారంభించింది
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
🔹అందుకే ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ దోచుకుంటున్నారు
🔸కాంగ్రెస్ పార్టీ అంతా అవిన���తిమయం
🔹రేవంత్ రెడ్డి అంతా భారీ అవినీతిపరుడు దేశంలో ఇంకొకరు లేరు
🔸బీజేపీ-కాంగ్రెస్ తోడు దొంగల మాదిరి కలిసి నడుస్తున్నాయి
🔹అందుకే సింగరేణి నుంచి మొదలుకొని కేంద్ర ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవినీతిపైన విచారణ లేదు
🔸ప్రధానమంత్రి ఆర్ఆర్ టాక్స్ , హోంమంత్రి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అని చెప్పినా ఇప్పటిదాకా ఒక ఎంక్వయిరీ లేదు
🔹అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ బిజెపి ��లిసి ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నాయి
🔸సింగరేణి కార్మికుల కోసం కొట్లాడుతాం
🔹కార్మికుల సమస్యలు పట్టించుకోకుంటే… సింగరేణిలో అవినీతి ఆపకుంటే…ప్రతి బొగ్గు గనిమీద అగ్గిపుట్టిస్తాం…
మంచిర్యాల జిల్లా ��ేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో క్యాతన పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను సన్మాంచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి 'దాచుకో-దోచుకో' అన్న పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా నడిపిస్తున్నారు. అవినీతి దుకాణం తెరిచి అడ్డగోలుగా వసూళ్లకు దిగుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప��రతి పథకంలో స్వయంగా మంత్రుల నుంచి మొదలుకొని ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అవినీతికి పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన 'దాచుకో-దోచుకో-దాచుకో' పథకం సింగరేణిలోనూ నడుస్తోంది.
రేవంత్ రెడ్డి అంత చండాలపు ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరూ లేరు. రేవంత్ రెడ్డి అంత దారుణంగా, భారీ ఎత్తున దోచుకుంటున్న ముఖ్యమంత్రి కూడా దేశంలో ఇంకా ఎవరూ లేరు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి అంటే, తెలంగాణ రైతుల ముఖంలో చిరునవ్వులు రావాలి అంటే, సింగరేణి కార్మికులకు లాభం జరగాలి అంటే కేసీఆర్ తిరిగి రావాల్సిందే. తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలి అంటే కేసీఆర్ తిరిగి రావాల్సిందే.
కాంగ్రెస్ పార్టీతో బిజేపి కూడా వంత పాడుతూ సింగరేణి కుంభకోణాన్ని అడ్డుకోవడం లేదు. వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నా 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం కనీసం ఉలుకూ పలుకూ లేకుండా మౌనంగా ఉన్నది. వేల కోట్ల దోపిడీ పైన సీబీఐ ఎంక్వైరీ వేయమంటే పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్, బిజేపి చీకటి దోస్తులుగా మారి ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి బావమరిది సింగరేణిలో టెండర్లు వేస్తుంటే ఇక్కడే వసూళ్లు అవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ పథకంలో కూడా సృజన్ రెడ్డికి వందల కోట్ల కాంట్రాక్ట్‌లు ఇచ్చింది. అందుకే రాష్ట్రంలో ఇచ్చిపుచ్చుకునే విధంగా బిజేపి, కాంగ్రెస్ లు కలిసి నడుస్తున్నాయి. అందుకోసమే ఒకరి దోపిడీ ఒకరు బయటపడకుండా బ్రహ్మాండంగా కాంగ్రెస్, బిజేపి పార్టీలు పరస్పరం కాపాడుకుంటున్నాయి.
ప్రధానమంత్రి ఢిల్లీకెంచి వచ్చి రాష్ట్రంలో 'ఆర్ఆర్' (RR) టాక్స్ వసూలు చేస్తున్నారు, బిల్డర్ల దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర దోపిడీ చేస్తున్���ారు అని విమర్శించారు. కానీ రాహుల్-రేవంత్ టాక్స్ పైన ఇప్పటిదాకా విచారణకు ప్రధానమంత్రి ఎందుకు ఆదేశించలేదు? హోం మంత్రి అమిత్ షా వచ్చి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటిఎంగా మారింది, అడ్డగోలుగా కుంభకోణాలు చేస్తుంది అన్నారు. కానీ దొంగలను పట్టుకోవాల్సిన కేంద్ర హోంశాఖ మంత్రి ఒక్క విచారణకు కూడా ఆదేశం ఇవ్వలేదు. అందుకే కాంగ్రెస్, బిజేపిలు ఒకరి దొంగతనం బయటపడకుండా ఇంకొకరు కాపాడుకుంటూ వస్తున్నారు.
ఎన్ని ప్రలోభాలకు, ఎన్ని అక్రమ కేసులకు, వేధింపులకు గురి చేసినా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన ప్రజలకి, మా పార్టీ కౌన్సిలర్లకి, కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పొత్తు ధర్మాన్ని పాటించి మాతో నడిచిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ కౌన్సిలర్లకు, జిల్లా నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
రాష్ట్రంలో నీచమైన, నికృష్టమైన రాజకీయం కొనసాగుతున్నది. క్యాతనపల్లిలో 22 స్థానాలకు 14 స్థానాలు గెలిస్తే కూడా కాంగ్రెస్ పార్టీ అనేక అరాచకాలకు పాల్పడింది. క్యాతనపల్లిలో ప్రజలు తిరస్కరించిన మంత్రి వివేక్ అహం దెబ్బతినడంతో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపించేలా క్యాతనపల్లిలో సైనిక కవాతు నిర్వహించి మరి కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేశారు. 1000 మంది పోలీసులతో మాజీ ఎమ్మెల్యే సుమన్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారిని ఇబ్బందులకు గురి చేశారు.
ఎన్ని కేసుల��� పెట్టినా, దౌర్జన్యాలు చేసినా, రాళ్లు వేసినా, కౌన్సిలర్లను ఎత్తుకుపోయే ప్రయత్నం చేసినా చివరికి లక్షల రూపాయల బ్లాంక్ చెక్కులు రాసిచ్చినా కాంగ్రెస్ పార్టీ ముఖాన కొట్టిన మన కౌన్సిలర్లందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే సుమన్ క్యాతనపల్లిలో ఉంటే తమ ఆటలు సాగవని అక్రమంగా అరెస్ట్ చేసి ఆసిఫాబాద్, మంచిర్యాల సబ్ జైలు కాకుండా అదిలాబాద్ జిల్లా జైల్లో పెట���టారు. కనీసం మాజీ ఎమ్మెల్యే అన్న గౌరవం ఇయ్యకుండా తీవ్ర ఇబ్బందులకు జైల్లో గురి చేశారు.
మంత్రి వివేక్ క్యాతనపల్లి కావాలని సుమన్ ని అడుక్కుని ఉంటే ఇచ్చేసేవాడు. కానీ జైలుకు పంపి ఇబ్బందులకు గురి చేశాడు. నేను జైలులో సుమన్‌ని కలిసేందుకు పోతే, 'నేను ఇక్కడ సంవత్సరం అయినా ఉంటా కానీ మన కౌన్సిలర్లకు ధైర్యం చెప్పండి' అన్నాడు. 'కాంగ్రెస్ ఆటలను అరికట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజా తీర్పుని గౌరవించేలా కార్యకర్తలకు పోరాటం చేసేందుకు ధైర్యం నింపండి' అని కోరిండు.
క్యాతనపల్లిలో జరిగిన నికృష్టమైన రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కొనసాగిస్తున్నది. సింగరేణి ప్రాంతం మొత్తాన్ని ముఖ్యమంత్రి తన సొంత ఇంటి సామ్రాజ్యం మాదిరిగా తయారు చేశారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రెండు సంవత్సరాలు దాటినా ఒక్క హామీ అమలు చేయలేదు. రైతుల నుంచి ఆడబిడ్డల దాకా, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా అందరికీ తీవ్రమైన మోసానికి కాంగ్రెస్ పార్టీ గురి చేసింది. 'మూడు నెలల్లో పిల్లలు పుడతారా' అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, 30 నెలలు అయింది ఎందుకు గ్యారెంటీలు అమలు చేయలేదో అని మనం అడగా���ి.
కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి 'దాచుకో-దోచుకో' అన్న పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా నడిపిస్తున్నారు. అవినీతి దుకాణం తెరిచి అడ్డగోలుగా వసూళ్లకు దిగుతున్నారు. సింగరేణిలోనూ 'దాచుకో-దోచుకో-దాచుకో' పథకం నడుస్తోంది. అందుకే ముఖ్యమంత్రి గారి సొంత బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లో అన్ని కాంట్రాక్టులు ముఖ్యమంత్రి నడిపిస్తున్నాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా 'సైట్ విజిటేషన్ సర్టిఫికేట్' అనే కొత్త కుట్రను తెరలేపిండు. సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ తో టెండర్లు వేసిన వాళ్ళని బ్లాక్ మెయిల్ కి గురి చేసి బెదిరింపులకు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు దిగుతున్నారు.
సింగరేణిలో సృజన్ రెడ్డి అరాచకాలను బయట పెడితే ముఖ్యమంత్రి ఇప్పటిదాకా ఆ వేల కోట్ల కుంభకోణం పై మాట్లాడలేదు. సింగరేణి కుంభకోణం పైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడరు, స్థానిక మంత్రి కూ��ా మాట్లాడడు. పైగా గతంలో కేసీఆర్ ��ారు ఇచ్చిన 16 వేల వారసత్వ ఉద్యోగాల పైన విచారణ జరిపిస్తామని సింగరేణి ఉద్యోగులను భయపెడుతున్నారు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాల పైన ఏసీబీ విజిలెన్స్ విచారణ కాదు జరిపించాల్సింది, సృజన్ రెడ్డి అక్రమాల పైన సింగరేణి కుంభకోణం పైన.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు మెడికల్ బోర్డు పెట్టి సింగరేణి ఉద్యోగాలు వెంటనే కల్పించాలి. లేకుంటే బిఆర్ఎస్ తరపున సింగరేణ�� ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము. సింగరేణి కార్మికుల కోసం ప్రతి బొగ్గు గనిలో మళ్ళీ అగ్గి పుట్టిస్తాం, కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టం. సింగరేణికి అనేక సమస్యలు ఉన్నాయి. అయితే సింగరేణి బెల్ట్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మమ్మల్ని పోరాటం చేయమని అడుగుతున్నారు.
కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన ఒత్తిడి తీసుకురావాలి, కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేయాలి. సింగరేణి కార్మికులకు అండగా మా పార్టీ నిలబడుతుంది, సింగరేణి కార్మికుల తరపున బరాబర్ కొట్లాడుతాం. మాతో కలిసి రండి, రానున్న సింగరేణి ఎన్నికల్లో మళ్ళీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని గెలిపించుకుందాం.
"అభయహస్తం మేనిఫెస్టో పేరుట తెలంగాణ ప్రజలపై భస్మాసుర హస్తాన్ని కాంగ్రెస్ పార్టీ పెట్టి��ది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రైతుబంధుకు రామ్ రామ్ అయితది, దళితబంధుకు జై భీమ్ అయితది, తెలంగాణ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ అమ్ముకదోప్తారు అని కేసీఆర్ చెప్పారు. ఆయన చెప్పినట్లే ఇప్పుడు తెలంగాణను కాంగ్రెస్ పార్టీ దోచుకుంటుంది.
(1/2)
తెలంగాణ రాష్ట్ర & నర్సంపేట నియోజకవర్గ క్రైస్తవ సోదర, సోదరిమణులందరికి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు..
యేసుక్రీస్తు జన్మించిన ఈ పవిత్రమైన రోజున మీరు మీ కుటుంబ సభ్యులు ఆత్మీయతతో, ఒకరి పట్ల ఒకరు ద్వేషాన్ని ��దలి ప్రేమను కల్గి జీవించాలని ఆ ప్రభువుని కోరుకుంటున్నాను..
మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ గారి తండ్రి ఎర్రోళ్ల విజ్జయ అనారోగ్యం తో ఈరోజు ఉదయం చిన్నకోడూరు మండలం గంగా పూర్ గ్రామం లో మృతి చెం���గా వారి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది..
సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న కేసీఆర్ పాత వీడియో.!!
"ఇది కదా.! ముందు చూపు అంటే.." అని క్యాప్షన్స్ పెడుతూ షేర్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్..
Source: ETv Telangana
#Telangana#BRSParty#KCR#KTR#HarishRao
ప్రజలను రోడ్ల మీదకి తీసుకురావడమేనా ప్రజా పాలన అంటే?
చేతగాని కాంగ్రెస్ సన్నాసులు పాలన చేస్తుంటే..
తెలంగాణలోని ఏ పల్లె చూసినా..
ఏ ఎరువుల కేంద్రం వద్ద చూసినా..
ఇలాంటి దయనీయ పరిస్థితులే కనిపిస్తున్నాయి.
#CongressFailedTelangana
నా అభిమాన నాయకు���ు @PSRNSPT అన్న జన్మదినం సందర్భంగా BRS నర్సంపేట నియోజకవర్గ యూత్ కన్వీనర్ @shanaboina అన్న అధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగింది
@BRSparty @KTRBRS
సొంత నియోజకవర్గానికే నీళ్లిచ్చే చేతగాని దద్దమ్మ ఉత్తమ్
ఎస్సారెస్పీ ఆయకట్టు కింద ఉన్న
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై తిరుగుబాటు తప్పదు.
- మాజీ ఎమ్మెల్యే @PSRNSPT🔥
కాంగ్రెసోళ్లు కుంచిత, కుళ్ళు తో
కాళేశ్వరం కొట్టుకుపోవాలని కోరుకుంటున్నారు.
కాళేశ్వరం కొట్టుకుపోయింది అని చెప్పి
ఓట్లు అడుక్కున్న దొంగలు కాంగ్రెసోళ్లు.
ఇప్పుడు అవన��నీ అబద్దాలు అని తెలిస్తే..
జనాలు రాళ్లతో కొడతారని భయపడుతున్నారు.
- మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
@PSRNSPT
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే @PSRNSPT స్ట్రాంగ్ కౌంటర్
♦️బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు.
♦️కమిషన్ ఇచ్చిన నివ��దికను ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడంలేదు.
♦️రిపోర్ట్ బయటకు ఇవ్వకముందే రేవంత్ రెడ్డి అనుకూల మీడియా విష ప్రచారం చేస్తుంది.
♦️కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక స్కాములు జరుగుతున్నాయి. కోర్టు సమాధానం చెప్పమంటే కాంగ్రెస్ నాయకులు తప్పించుకొనితిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులకు చట్టం తెలువదా- లేక తెలిసి వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని కుటిల యత్నమా ?
♦️కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం ప్రకారం, ఒక న్యాయమూర్తి (జడ్జి)ను విచారణ కమిషన్‌కు నియమించినా, ఆ కమిషన్ న్యాయవ్యవస్థ (judiciary)లో భాగం కాదు..
♦️అంటే, ఆ కమిషన్ కోర్టుల్లా న్యాయ తీర్పులు ఇవ్వలేరు, మరియు కోర్ట్లు కలిగిన అధికారాలు వారికి ఉండవు.
♦️కమిషన్ నివేదిక ఇవ్వడం మాత్రమే చేస్తుంది. కనుక, జడ్జి ఉన్నా సరే, అది న్యాయవ్యవస్థలో భాగంగా పరిగణించబడదు .
♦️ఈ చట్టాన్ని ఉద్దేశ పూర్వకంగా తప్పుడు వివరణ ఇవ్వడం రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి మండలికి తగదు.
♦️న్యాయవ్యవస్థను కేసీఆర్, హరీష్ రావు గౌరవించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమ��్శ చేయడం వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనం.
♦️కాళేశ్వరం 100 కంపొనెంట్ల పరిధి లో కేవలం 1 కంపొనెంట్ లో, 85 పిల్లర్లలో 2 పిల్లర్లు గురించి మాత్రమే అందులో ప్రస్తావిస్తూ పూర్తి కాలేశ్వరం కూలిపోయిందని అసత్యాలు ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి పై ఉత్తంకుమార్ రెడ్డి పై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.