4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా..
ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎప్పుడూ అగ్రస్థానంలోనే కొనసాగాలని ఆకాంక్షిస్తూ
యావత్ తెలంగాణ ప్రజానీకానికి
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
జోహార్ తెలంగాణ అమరవీరులకు 🙏
జోహార్.. జోహార్..
మీ స్మృతి మాకు నిత్య స్పూర్తి..
మీ కీర్తి తరతరాలకు తరగని దీప్తి
మీ త్యాగం మహోన్నతం..
మీ స్మరణం చైతన్య జ్వలనం
మీ ఆశయాల సాధనే మా లక్ష్యం, సకల జనుల సౌభాగ్యమే మా గమ్యం.
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం
గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించి, జ్యోతిని వెలిగించి ఘన నివాళి అర్పించిన పార్టీ అధినేత కేసీఆర్.
అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళి అర్పించేందుకు నేడు తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు సాగిన అమర జ్యోతుల (కొవ్వొత్తుల) ర్యాలీని విజయవంతం చేయడం పట్ల పార్టీ శ్రేణులకు తెలంగాణ వాదులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు.
ఇప్పటికే ప్రకటించిన విధంగా జూన్ 2, జూన్ 3 తేదీల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే దశాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొని నాటి ఉద్యమ స్పూర్తిని చాటుతూ.. విజయవంతం చేయాలని మరోసారి కేసీఆర్ గారు పార్టీ శ్రేణులకు తెలంగాణ వాదులకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, మాజీ మంత్రి @BRSHarish తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, జంట నగరాల పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
#TelanganaDecade #తెలంగాణదశాబ్ది
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల్ పూడూరు గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పండని సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పడం తమను మోసం చేయడమే అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని హరీష్ రావును కోరారు.
ఆ తర్వాత హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రైతులు పండించేది రూపాయికి 90 పైసలు దొడ్డు రకం. సన్నాలకు బోనస్ ఇస్తామ నడం రైతులని దగా చేయడం, రైతుల గుండెల మీద తనడం తప్ప ఇంకోటి కాదు.
అసెంబ్లీలో రైతుల పక్షాన మేము కొట్లాడుతాం .అసెంబ్లీ బయట రైతులందరూ ఏకమై ప్రభుత్వంపై పోరాటం చేయాలి.
ప్రభుత్వం, మంత్రులు ఇప్పటికైనా మేల్కొని హైదరాబాదులో కూర్చోకుండా క్షేత్రస్థాయిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి తడిసిన మొలకెత్తిన వడ్లను కొని రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.
@BRSHarish
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరిలో అన్నపూర్ణ ప్రాజెక్టు బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిత్యం నీటితో కళకళలాడుతూ ఉండేది. రైతాంగానికి ఆదరువుగా నిలిచింది. నిరుడు మే నెలలో మండుటెండల్లో సైతం ప్రాజెక్టు నిండుకుండలా కనిపించింది.
నేడు అన్నపూర్ణ ప్రాజెక్టు అడుగంటింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును పట్టించుకోకపోవడం, ఎత్తిపోతలు నిలిపివేయడంతో నీరు లేక బోసిపోయింది. నిరుడు ఇదే సమయానికి నీటితో కళకళలాడిన ప్రాజెక్టు, ఇప్పుడు ఎడారిగా మారింది.
#CongressFailedTelangana
ఇయ్యాల రైతు కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి, రైతులందరూ ఆందోళనలో ఉన్నారు.
ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం.. బాగుపడిన చరిత్ర ఇప్పటి వరకు లేదు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSharish
#TelanganaDecade#తెలంగాణదశాబ్ది
హైదరాబాద్ ఫ్రీ జోన్.. ఓపెన్ కోటాను నాన్‌లోకల్ కోటాగా మార్చటం.. ఒక శాఖలో ఓపెన్ కోటా 30 శాతం ఉంటే మరోశాఖలో 40, ఇంకో శాఖలో 50 శాతం.. ఇదీ ఉద్యోగాల భర్తీలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు జరిగిన అన్యాయాల పరంపర.
తరతరాలుగా మన కొలువులను కొల్లగొట్టిన తీరుకు కేసీఆర్ సర్కారు శాశ్వతంగా చరమగీతం పాడింది. మన కొలువులు మన బిడ్డలే దక్కించుకునేలా ఎన్నో సంస్కరణలు, మార్పులు చేసింది. పదేండ్లల్లో పటిష్టమైన విధానాలను రూపొందించి తెలంగాణ బిడ్డలకే కొలువులు దక్కేలా చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం.
నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి నిరుద్యోగులను మోసం చేస్తుంటే ఎటు పోయింది ఈ ప్రశ్నించే గొంతు? మూగబోయిందా?
అధికార పార్టీ తొత్తు తీన్మార్ మల్లన్నను చిత్తుగా ఓడించి నిరుద్యోగ యువత గట్టిగా బుద్ధి చెప్పాలి..
మీ తరపున గట్టిగా పోరాడే ధైర్యవంతుడు.. ప్రభుత్వాన్ని నిలదీసే విద్యావంతుడు @RakeshReddyBRS ని గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
పాలన చేతకాక కరెంటు బిల్లులు, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ.
వీళ్ళ అసమర్థ పాలన సంక్షేమ పథకాలలో కోతలు, ఇంకోవైపు వాతలు లాగా ఉంది.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు వచ్చేది, నీళ్లు ఉండేవి. రేవంత్ సర్కారులో కరెంటు లేదు, నీళ్లు లేవు. వాటర్ ట్యాంకర్లు వచ్చాయి, బోర్ల బండ్లు వచ్చేశాయి.
ఐదు నెలల్లోనే వద్దురో ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు తెలంగాణ రైతన్నలు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
నిరుద్యోగులకు రూ. 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టి, బాండ్ పేపర్లు పంచి, గెలిచిన తర్వాత నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదని అసెంబ్లీ సాక్షిగా చేతులు ఎత్తేశారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కింది. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల భృతి ఇస్తామని హామీ ఇచ్చి, మేమా మాట అనలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలో కూడా పచ్చి అబద్ధం ఆడి, రైతులను మోసం చేశారు. రైతులు పండించిన వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తాము పండించిన పంటను అమ్మకానికి సిద్ధపడి బోనస్ కోసం ఎదురు చూస్తుండగా, వారందరి ఆశలు అడియాసలు చేస్తూ కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని, అది కూడా వచ్చే సీజన్ నుంచి ఇస్తామని మంత్రులు ప్రకటించడం అత్యంత బాధాకరం.
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 90 శాతం దొడ్డు రకం వడ్లనే పండిస్తారు. పది శాతం పండే సన్న వడ్లకు మార్కెట్లో మంచి డిమాండు ఉంటుంది. సన్న వడ్లకు మద్దతు ధర కంటే చాలా అధికంగా మార్కెట్లో ధర వస్తుంది. కానీ దొడ్డు రకం బియ్యానికే గిట్టుబాటు ధర రాదు. కాబట్టి బోనస్ ఇవ్వాల్సింది దొడ్డు రకం వడ్లకే. అలా కాకుండా కేవలం సన్న రకాలకే బోనస్ ఇస్తాం, అదీ వచ్చే సీజన్ నుంచి ఇస్తామనడం రైతులను దగా చేయడమే.
తాజాగా మంత్రుల ప్రకటనతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్ల, వ్యవసాయాభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమైపోయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో ఇచ్చినవే తప్ప రైతుల మేలు కోసం చేసే కార్యక్రమాలు కావని తేలిపోయింది. ఎకరానికి రూ.15,000 రైతు భరోసా సాయం ఇస్తామని, వ్యవసాయ కూలీలకు 12వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామనే హామీలను కూడా ప్రభుత్వం ఇప్పటి దాకా అమలు చేయని విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నాను. రెండు లక్షల రూపాయల రుణమాఫీ గురించి కూడా వాయిదాలు పెట్టడమే తప్ప నేటి వరకు అమలు చేసింది లేదు.
కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ సీజన్ నుంచే అన్ని రకాల వడ్లకు 500 చొప్పున బోనస్ చెల్లించాలని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
#CongressFailedTelangana
#CongressFailsTelangana
'తెలంగాణ ఏర్పడితే ఈ ప్రాంతమంతా అంధకారం అవుతుంది. కరెంట్ తీగలు బట్టలారేసుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రావు’.. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. అంటే అప్పటికి తెలంగాణ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
కానీ, ఆ వెక్కిరింతలకు చెంప పెట్టులా విద్యుత్ వెలుగులు విరజిమ్మే తెలంగాణగా మార్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లపాటు రాష్ట్రంలో కోతలు లేకుండా నిరంతరాయంగా కొనసాగిన విద్యుత్తు సరఫరా, కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన ఐదు నెలల్లో మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు పునరావృతమై కరెంట్ కోతలు మొదలయ్యాయి.
#TelanganaDecade #తెలంగాణదశాబ్ది
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పడం ఆ పార్టీ మోసానికి పరాకాష్ట.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు నాడు ఎరువుల కోసం చెప్పులు పెట్టినట్లు నేడు విత్తనాల కోసం పాస్ బుక్ లు లైన్ లో పెట్టే దుస్థితి వచ్చింది.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
నాడు ఉమ్మడి రాష్ట్రంలో వెనకబడిన తెలంగాణకు నీళ్ళు, నిధులు, నియామకాలే లక్ష్యంగా.. వ్యవసాయం దండగ అన్న చోటే.. స్వరాష్ట్రం సిద్దించాక మొక్కవోని దీక్షతో వ్యవసాయం పండుగలా చేసిన కేసీఆర్ కృషికి నిదర్శనం గత బీఆర్ఎస్ పాలన.
కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగం కనీవినీ ఎరుగని స్థాయిలో దేశంలోనే అత్యున్నత ప్రగతిని సాధించింది.
#TelanganaDecade #తెలంగాణదశాబ్ది
ఇది తెలంగాణ దశాబ్ది!
ఆరున్నర దశాబ్దాల పోరాటం..
మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు..
వేల బలిదానాలు, త్యాగాలు..
బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు..
ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష..
ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారం అయ్యింది!
ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా
స్వతంత్ర భారతదేశం ముందెన్నడూ చూడని
సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనా ఆవిష్కారం అయ్యింది!
పల్లె, పట్నం తేడా లేకుండా
ప్రగతి రథం పరుగులు తీసింది.
ఆహార ధాన్యాల ఉత్పత్తి నుండి
ఐటి ఎగుమతుల దాకా
రికార్డులు బద్దలయ్యినయి.
మీ అందరి మద్దతుతో
నీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచినం.
నిరంతర కరెంటిచ్చి వెలుగులు నింపినం.
రైతన్నల, నేతన్నల, కష్టజీవుల
కలత తీర్చినం.. కడుపు నింపినం.
వృద్ధులకు ఆసరా అయినం..
ఆడబిడ్డలకు అండగా నిలిచినం.
సకల జనుల సంక్షేమానికి తెలంగాణను చిరునామా చేసినం.
గుండెల నిండా జై తెలంగాణ
నినాదం నింపుకున్నం.
మన భాషకు పట్టం గట్టినం.
మన బతుకమ్మ, మన బోనం
సగర్వంగా తలకెత్తుకున్నం.
గంగా జమునా తెహజీబ్ కు
సాక్షీభూతంగా నిలిచినం.
అవమానాలు
అవహేళనలు
ఎదుర్కొన్న గడ్డ మీదనే
తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని
అంబరమంత ఎత్తున ఎగరేసినం.
కేసీఆర్ పాలన సాక్షిగా
ఇది తెలంగాణ దశాబ్ది!
వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని పునాది!
జై తెలంగాణ ✊
#TelanganaDecade
#తెలంగాణదశాబ్ది
(జూన్ 2, 2024 నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తి అవుతుంది)
6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..!
6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం..!!
పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నం
విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నం
కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నం
ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నం
సాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూస్తున్నం
ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నం
చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులను చూస్తున్నం
పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు చూస్తున్నం
రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు చూస్తున్నం
తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి చూస్తున్నాం
పదేళ్ల తరువాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నం
చివరికి ఇవాళ జోగిపేటలో..
విత్తనాల కోసం రైతుల మొక్కులు...
క్యూలైన్ లో పాసుబుక్కులు చూసినం...!
కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు..!
అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు..!!
ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో..
ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో..!!
జై కిసాన్
జై తెలంగాణ
#CongressFailedTelangana