𝐄𝐯𝐞𝐫𝐲 𝐏𝐞𝐫𝐬𝐨𝐧 𝐃𝐞𝐬𝐞𝐫𝐯𝐞𝐬 𝐚𝐧 𝐈𝐝𝐞𝐧𝐭𝐢𝐭𝐲. 𝐇𝐞𝐥𝐩 𝐔𝐬 𝐈𝐝𝐞𝐧𝐭𝐢𝐟𝐲 𝐇𝐢𝐦.
Hyderabad City Police Appeal: Help Identify an Unidentified Deceased Male
During the early hours of Tuesday, between 4:00 AM and 5:00 AM, an unidentified male was found hanging with a cable wire near Masab Tank–NMDC Road, within the limits of Mehdipatnam Police Station.
Description of the Deceased
Age: Approximately 35–40 years
Appearance: Believed to be Hindu
Clothing: Yellow-and-black striped T-shirt and black pants
Other Details: A helmet was found in his hand
The body has been shifted to the Osmania General Hospital (OGH) Mortuary for preservation and identification.
A case has been registered at Mehdipatnam Police Station vide Crime No. 214/2026 under Section 194 of the Bharatiya Nagarik Suraksha Sanhita (BNSS).
Anyone who can help identify the deceased or has any information related to the case is requested to contact Mehdipatnam Police Station immediately at: 📞 8712661274.
Your information could help identify the deceased and assist the investigation.
హైదరాబాద్ నగరం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకొనే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆదేశించారు. ఈ నెల 16 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగే చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ పండుగను భక్తులు అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకొనేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.
బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీ వేదికగా.. గోల్కొండ, బల్కంపేట, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ తదితర ఆలయాల్లో జరిగే బోనాల ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లపై మంగళవారం ఆయన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న భద్రతా చర్యలను ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ.. . గోల్కొండ బోనాలతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో రాబోయే 15 రోజులు అత్యంత కీలకమని గుర్తు చేశారు. ఆయా ఆలయాల వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.
హైదరాబాద్ ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లపై మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సమీక్షా సమావేశాలు నిర్వహించి భక్తుల భద్రత విషయంలో జారీ చేసిన ఆదేశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. మంత్రుల ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులందరూ అమ్మవార్లను ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టాస్క్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీమ్స్ తో పాటు స్థానిక పోలీసులను భారీగా మోహరిస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు భక్తులకు అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా ఆలయాల పరిసరాల్లో పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు.
బోనాల ఉత్సవాలకు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని, వారి భద్రతకు హైదరాబాద్ సిటీ పోలీస్ అత్యంత ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. గత ఉత్సవాల్లో మహిళలను వేధించిన 644 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ఈసారి కూడా షీ టీమ్స్ ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలన్నారు. గొలుసు దొంగతనాలు, మొబైల్ స్నాచింగ్, జేబు దొంగతనాలు, ఈవ్ టీజింగ్ వంటి నేరాలకు ఆస్కారం లేకుండా నివారణా చర్యలు చేపట్టాలన్నారు.
దేవాలయాల పరిసరాల్లో భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బోనాల ఊరేగింపులు, పోతురాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపు వంటి క్రతువులు శాంతియుతంగా సాగేలా తగినంత మంది సిబ్బందిని రంగంలోకి దించాలన్నారు. గత పండుగల తరహాలోనే ఈ బోనాల మహోత్సవ బందోబస్తును కూడా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో ఐసీసీసీ నుంచి అదనపు సీపీ (లా అండ్ ఆర్డర్ సౌత్ రేంజ్ ) శ్రీ తఫ్షీర్ ఇక్బాల్, ఐపీఎస్, డీసీపీ (అడ్మిన్) శ్రీమతి వెంకటలక్ష్మి, అదనపు డీసీపీ ఎస్బీ నర్సింహారావు పాల్గొనగా.. అదనపు సీపీ (క్రైమ్స్) శ్రీ శ్రీనివాసులు, ఐపీఎస్, జాయింట్ సీపీ (ట్రాఫిక్) శ్రీ జోయల్ డేవిస్, ఐపీఎస్ తో పాటు అన్ని జోన్ల లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
𝐀𝐰𝐚𝐫𝐞𝐧𝐞𝐬𝐬 𝐓𝐨𝐝𝐚𝐲. 𝐒𝐚𝐟𝐞𝐭𝐲 𝐄𝐯𝐞𝐫𝐲 𝐃𝐚𝐲.
Traffic Awareness Programme for School Bus Drivers & Vehicle Assistants
To enhance student safety, the Rajendranagar Traffic Police, in coordination with the Traffic Training Institute (TTI), Goshamahal, conducted a Traffic Awareness Programme at Sri Vidyaranya International School, Bandlaguda, for 50 school bus drivers and vehicle assistants (ayahs).
The session focused on:
Understanding mandatory, warning, and informatory traffic signs and road markings.
Promoting safe driving practices, including proper use of rear-view mirrors and safe overtaking.
Ensuring safe boarding and de-boarding of students and reinforcing the responsibilities of vehicle assistants in safeguarding children.
Safe navigation through roundabouts (rotaries) and adherence to traffic rules.
Creating awareness about traffic violations, legal consequences, and responsible road behaviour.
𝗦𝗲𝗿𝗶𝗮𝗹 𝗧𝘄𝗼-𝗪𝗵𝗲𝗲𝗹𝗲𝗿 𝗧𝗵𝗶𝗲𝗳 𝗡𝗮𝗯𝗯𝗲𝗱; 𝟴 𝗧𝗵𝗲𝗳𝘁 𝗖𝗮𝘀𝗲𝘀 𝗖𝗿𝗮𝗰𝗸𝗲𝗱, 𝟳 𝗦𝘁𝗼𝗹𝗲𝗻 𝗩𝗲𝗵𝗶𝗰𝗹𝗲𝘀 𝗥𝗲𝗰𝗼𝘃𝗲𝗿𝗲𝗱
The Commissioner's Task Force, Charminar Zone, in coordination with Gudimalkapur Police, apprehended a habitual two-wheeler theft offender and detected eight (08) vehicle theft cases registered across various police stations under the Hyderabad City and Malkajgiri Police Commissionerates.
The accused, Shams Bilal @ Bilal (28), a resident of Talab Katta, Hyderabad, is a habitual offender with involvement in 18 previous two-wheeler theft cases. During interrogation, he confessed to committing multiple vehicle thefts after repeatedly returning to crime for unlawful financial gain.
Based on his confession, the police recovered seven (07) stolen two-wheelers and one mobile phone, collectively valued at approximately ₹10 lakh. The recovered property is linked to theft cases registered at Gudimalkapur, Chaitanyapuri, Panjagutta, Masab Tank, Malakpet, Afzalgunj, Mehdipatnam, and Nampally Police Stations.
The operation was carried out under the supervision of Sri S. Saidababu, Inspector of Police, Charminar Zone Task Force, along with the Task Force team and the staff of Gudimalkapur Police Station, resulting in the successful detection of multiple property offences and recovery of stolen vehicles.
𝗡𝗶𝗴𝗵𝘁 𝗣𝗮𝘁𝗿𝗼𝗹𝗹𝗶𝗻𝗴 𝗙𝗼𝗶𝗹𝘀 𝗔𝘂𝘁𝗼 𝗕𝗮𝘁𝘁𝗲𝗿𝘆 𝗧𝗵𝗲𝗳𝘁; 𝗔𝗰𝗰𝘂𝘀𝗲𝗱 𝗦𝗲𝗻𝘁𝗲𝗻𝗰𝗲𝗱 𝘁𝗼 𝟳 𝗗𝗮𝘆𝘀' 𝗜𝗺𝗽𝗿𝗶𝘀𝗼𝗻𝗺𝗲𝗻𝘁
Kulsumpura Police, Golkonda Zone, secured the conviction of an accused in an E-Petty case under Section 61(b) of the City Police Act. The Hon'ble IV Special Judicial Magistrate, Manoranjan Complex, Nampally, sentenced the accused to 7 days of simple imprisonment on 13.07.2026.
The accused, M. Ganesh (30), a resident of Jiyaguda, was apprehended by the night patrolling staff while attempting to commit auto battery theft on 100 Feet Road within Kulsumpura PS limits. He was produced before the Morning Court, leading to his conviction.
The case was investigated by Sri A. Ramulu, Inspector of Police, Kulsumpura Police Station, and effectively presented before the court with the assistance of the CDO Functional Vertical team and Morning Court PC K. Naresh, resulting in the successful conviction of the offender.
వర్షాకాలంలో రోడ్లపై అదనపు జాగ్రత్తలు అవసరం. ప్రయాణానికి ముందు మీ వాహనం పరిస్థితిని తనిఖీ చేసుకోండి. నెమ్మదిగా ప్రయాణించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోండి.
#telanganapolice#saferide
ప్రతి వ్యక్తికి తొలిహీరో నాన్న. కుటుంబ బాధ్యతలను మోస్తూ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసే వ్యక్తి నాన్న. పిల్లల భవిష్యత్తే సర్వస్వంగా జీవించే ప్రతి ఒక్క తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే.
#telanganapolice#happyfathersday
స్పీడ్ కంటే మన ప్రాణం చాలా ముఖ్యమైనది. వేగంగా వెళ్లి ప్రమాదాలకు గురి కావొద్దు. నిర్ణీత స్పీడ్‌లో క్షేమంగా గమ్యం చేరండి. మీకోసం ఇంటి వద్ద కుటుంబం ఎదురుచూస్తుందని గుర్తుంచుకోండి.
#telanganapolice#ArriveAlive
డిజిటల్ అరెస్ట్ అనే పద్దతి లేదు. పోలీసుల పేరిట జరుగుతున్న కొత్త తరహా సైబర్ మోసమిది. అవగాహన, అప్రమత్తతతోనే ఇలాంటి నేరాలను అరికట్టవచ్చు.
#TelanganaPolice#DigitalArrest#BeAlert
Say No to Drugs – Choose Life, Choose Health.
Drug abuse destroys lives, families, and futures. Let us work together to create a drug-free society and protect our youth from the dangers of addiction.
#DrugFreeSociety#SayNoToDrugs#TelanganaPolice
మీ క్రెడిట్/ డెబిట్ కార్డు సేవలు నిలిచిపోతాయంటూ వచ్చే కాల్స్ పై అప్రమత్తంగా ఉండండి. నకిలీ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి జరుగుతున్న మోసాలివి. ఇలాంటి కాల్స్ వస్తే తక్షణమే సంబంధిత బ్యాంకును సంప్రదించండి.
#TelanganaPolice#BeAlert#FakeCallCenters#CyberCrime
యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వీక్ కార్యక్రమంలో డీజీపీ శ్రీ సి.వి.ఆనంద్ పాల్గొన్నారు. డ్రగ్స్ యువత భవిష్యత్తుకు ముప్పని, వాటి నిర్మూలనకు TG Police, EAGLE Force కట్టుబడి పనిచేస్తున్నాయని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, డ్రగ్-ఫ్రీ తెలంగాణ కోసం అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తప్పు మార్గంలో వాహనం నడపడం మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలనూ ప్రమాదంలో పడేస్తుంది.
ట్రాఫిక్ నియమాలను పాటించి, సరైన మార్గంలో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోండి.
#WrongRouteDriving#RoadSafety#TelanganaPolice
అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయొద్దు. తెలియనివారి నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించొద్దు. వారితో వ్యక్తిగత వివరాలు అస్సలు షేర్ చేసుకోవద్దు. సోషల్ మీడియా స్నేహాలతో జాగ్రత్తగా ఉండండి.
#TelanganaPolice#socialmediatips
ఎంత అర్జెంటు అయినా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు. ఒక్క పది నిమిషాలు పక్కకు ఆగి ఫోన్ మాట్లాడండి. మిమ్మల్ని నమ్ముకొని కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. ఫోన్లో రీల్స్ చూస్తూ డ్రైవింగ్ చేయడం, రీల్స్ చేస్తూ వాహనాలు నడపడం చాలా ప్రమాదకరం.
#telanganapolice#ArriveAlive
సైబర్ మోసాలపై మీ చిన్నారులకు అవగాహన పెంచండి. ఆర్ధిక సంబంధిత మోసాలు జరిగే తీరుతో పాటూ, వాటి బారిన పడుకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించండి. అంతేకాదు ఆన్లైన్ గేమ్స్ మాటున ఉండే సైబర్ మోసాలను కూడా వివరించండి. వారి వెబ్ యాక్టివిటీని తరచూ పరిశీలించండి.
#telanganapolice
సైబర్ సెక్యూరిటీపై మీ కుటుంబానికి అవగాహన కల్పించండి. ప్రతి రోజు పెరుగుతున్న సైబర్ మోసాలను వివరించండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పండి. పిల్లలు, పెద్దలకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించడం ముఖ్యమని గుర్తుంచుకోండి.
#TelanganaPolice#cybercrimes
Protecting children is a shared responsibility. If you suspect any form of child abuse, neglect, or exploitation, report it
immediately on 1098 Childline. Early Action can save a child's future.
#TelanganaPolice#ChildSafety#Childline1098
మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో ఫేక్ ప్రొఫైల్స్‌తో జాగ్రత్త. అందమైన ఫోటోలు పెట్టి ఆకర్షిస్తారు. తియ్యటి మాటలతో మీ వివరాలు సేకరించి మోసాలు చేస్తారు. ఇన్వెస్టిమెంట్స్తో లాభాలు అంటూ ఎవరైనా మీకు తియ్యటి మాటలు చెప్తే అస్సలు నమ్మొద్దు.
#TelanganaPolice#matrimonialscams