ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి లో మహారిషి రీసెర్చ్ సెంటర్ లో యోగా మాస్టర్ రాంబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రసంగించిన మహారిషి రీసెర్చ్ సెంటర్ సభ్యులు, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ గారు.
యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం.
యోగాను జీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు అడుగులు వేయండి.
అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు
#InternationalYogaDay#Yogaday#PalleLaxmanRaoGoud
ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @Bhatti_Mallu గారిని ప్రజాభవన్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు శ్రీ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ గారు.
ఈ రోజు కాంగ్రెస్ అగ్ర నాయకులు, లోక్ సభ ప్రతిపక్ష నేత శ్రీ @RahulGandhi గారి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లోని రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారి నివాసంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది.
బ్రిటీష్ పాలన అణచివేతపై తిరుగుబాటు జరిపి మాతృభూమి స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారి వర్ధంతి సందర్భంగా.. ఆ ధీరవనితకు శతకోటి వందనాలు...
#jhansilaxmibai#vardhanthi#pallelaxmanraogoud
ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల స్ఫూర్తితో సాధించుకున్న స్వరాష్ట్రంలో ఆర్థిక సమానత్వం, స్వావలంబన దిశగా సాగిపోదాం.. ప్రజాస్వామిక తెలంగాణ దిశగా పయనిద్దాం. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
#telanganaformationday#june2nd#pallelaxmanraogoud#telangana
రవీంద్ర భారతిలో తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ అసోసియేషన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా, ఫౌండర్ శ్రీ బుర్ర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన “శ్రీ మహానంది అవార్డ్స్” కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు శ్రీ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ధర్మనిష్టుడు, హిందూ రాష్ట్ర సామ్రాజ్య సంరక్షకుడు, నవయువ భారతావనికి స్ఫూర్తిదాత
ఛత్రపతి శంభాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళి.
#ChathrapathiShambajiMaharaj
ఈ రోజు రాష్ట్ర బీసీ సంక్షేమ & రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ @Ponnam_INC గారి జన్మదినం సందర్బంగా నేడు మినిస్టర్స్ క్వార్టర్స్ లో వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ గారు.
ఈ రోజు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో తాటి చెట్టు పై నుండి కింద పడిన బుర్ర పరమేశ్వర్ గౌడ్ గాయాలపాలయ్యి పెరాలసిస్ తో బాధపడుతున్న సందర్భంగా అతనిని పరామర్శించిన రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు శ్రీ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ గారు.
ఈ సందర్భంగా అతనిని ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.