శ్రీకాకుళం అభివృద్ధి మా లక్ష్యం!
SUDA ఆధ్యర్యంలో పెద్దపాడు నుండి రామలక్ష్మణ్ జంక్షన్ వరకు సుమారు రూ. 3.68 కోట్ల వ్యయంతో నాణ్యమైన రహదారి నిర్మాణం మరియు ఆధునిక సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులు విజయవంతంగా పూర్తి చేయడం ఆనందంగా ఉంది.
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam
క్రీస్తు పునరుత్థానం మనకు ఆశ, విశ్వాసం, ప్రేమ అనే అమూల్యమైన సందేశాన్ని అందిస్తుంది. క్షమ, కరుణ, సేవా భావాలతో జీవించాలని ప్రేరేపించే ఈ పవిత్ర ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
#Easter@PawanKalyan@JanaSenaParty
మానవాళి పట్ల అపారమైన ప్రేమ, త్యాగానికి చిరస్మరణీయమైన రోజు ‘గుడ్ ఫ్రైడే’. క్రీస్తు ప్రభువు చూపిన క్షమాగుణం, కరుణ, శాంతి, సేవా తత్వం మనందరికీ స్ఫూర్తిగా నిలవాలి. ఈ పవిత్ర సందేశాలు ప్రతి మనిషి హృదయంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ… గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
#GoodFriday
మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🙏
బజరంగబలి ఆశీస్సులతో మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, విజయాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను.
@PawanKalyan@JanaSenaParty#HanumanJayanti
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 1000 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన పాతపట్నం నియోజకవర్గానికి చెందిన జనసేన సాధక్ ఆడపక హరి కృష్ణ గారికి అభినందనలు.
#JanasenaUdyami
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 1000 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన పాతపట్నం నియోజకవర్గానికి చెందిన జనసేన సాధక్ గేదెల మిన్నారావు గారికి అభినందనలు.
#JanasenaUdyami
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 3000 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన పాతపట్నం నియోజకవర్గానికి చెందిన జనసేన సాధక్ కొరికాన భవానీ గారికి అభినందనలు.
#JanasenaUdyami
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో *20000* సభ్యత్వాలతో మొదటి స్థానం.
పాతపట్నం నియోజకవర్గం ఉద్యమి సభ్యత్వ ఇంచార్జ్ *శ్రీమతి కొరికాన భవాని* గారి ఆధ్వర్యంలో 20000 కు పైగా జనసేన పార్టీ సభ్యత్వాలు నమోదు చేసి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోచరిత్ర సృష్టించి, అత్యధిక రికార్డు సాధించిన వీరనారి 🙏
ధర్మానికి ప్రతీక అయిన శ్రీరాముడు చూపిన మార్గం మన జీవనానికి మార్గదర్శకం.ఆయన పాటించిన సత్యం, న్యాయం, కర్తవ్య నిబద్ధత ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. శ్రీరాముడి ఆశీస్సులతో మీ జీవితంలో శాంతి, సంతోషం, విజయాలు నిండాలని కోరుకుంటూ
శ్రీరామ నవమి శుభాకాంక్షలు
@PawanKalyan
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 1000 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన జనసేన పార్టీ వీరమహిళ పాతపట్నం నియోజకవర్గానికి చెందిన జనసేన సాధక్ కొరికనా భవాని గారికి అభినందనలు.
#JanasenaUdyami
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 2000 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన పాతపట్నం నియోజకవర్గానికి చెందిన జనసేన సాధక్ కొరికనా భవాని గారికి అభినందనలు.
#JanasenaUdyami
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 2000 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన జనసేన పార్టీ వీరమహిళ పాతపట్నం నియోజకవర్గానికి చెందిన జనసేన సాధక్ కొరికనా భవాని గారికి అభినందనలు.
#JanasenaUdyami
స్వీయ నియమాలు పాటిస్తూ నెలరోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరించిన అనంతరం ఆనందంగా జరుపుకునే ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అల్లాహ్ దయతో మీ అందరి జీవితాల్లో శాంతి, సంతోషం, సమృద్ధి నిండాలని కోరుకుంటున్నాను.
@PawanKalyan
13 బాధిత కుటుంబాలకు రూ. 1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేసిన శ్రీ కొరికాన రవికుమార్
-ఎమ్మెల్సీ శ్రీ @NagaBabuOffl గారు చేతుల మీదుగా చెక్కుల పంపిణీ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదాల బారినపడి మృతి చెందిన 13 బాధితుల కుటుంబాలకు శ్రీకాకుళం జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ కొరికాన రవికుమార్ "కొరికాన ఫౌండేషన్" నుంచి ఒక్కో కుటుంబానికి రూ. 1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. జనసేన సభ్యత్వం గడువు ముగిసిన అనంతరం వీరు ప్రమాదాలకు గురయ్యారు. ప్రమాద బీమా అందుకోలేని పరిస్థితుల్లో ఉన్న బాధిత కుటుంబాలకు రూ. 1 లక్ష ఇవ్వడానికి శ్రీ కొరికాన రవికుమార్ ముందుకొచ్చారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎచ్చెర్లలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు చేతుల మీదుగా ఈ చెక్కులను అందజేశారు. ఆసి రామారావు, బైరెడ్ల రమేష్(ఇచ్చాపురం), కర్రి రాజు, ఇల్లాకుల నవీన్(పలాస), ముల్లి చంద్ర రావు(పాతపట్నం), కర్రి చంద్ర రావు, టెంక సంజీవ్ (నరసన్నపేట), పిసిని రామారావు (ఆమదాలవలస), కొర్లాం శోభన్ బాబు (శ్రీకాకుళం), బడే నరసింహ మూర్తి, ముద్దాడ జ్యోతి బాబు (శ్రీకాకుళం), పోతుమల అప్పన్న, బచ్చల భీమా రావు (టెక్కలి) మరణించగా వీరి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికీ రూ. 1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. సంబంధిత నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీలు, పీవోసీలు పాల్గొన్నారు.
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి వినమ్ర నివాళులు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగం తెలుగు జాతి చరిత్రలో చిరస్మరణీయం. వారి ఆశయాలు, ఆత్మగౌరవ స్పూర్తి మనందరికీ మార్గదర్శకం.
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam