రేవంత్..
నీ దరిద్రిపుగొట్టు పాలనకు దక్కిన
అసమర్థ ఆస్కార్ అవార్డు ఇది...
ఈ ఫోటోను ఫ్రేమ్ కట్టించుకుంటావో..
మెడలో వేసుకుని ఊరేగుతావో నీ ఇష్టం..
అన్నదాతను “అప్పులపాలు” చేసిన..
చేతకాని పాలకులను చూశాం కానీ..
“చెప్పులపాలు” చేసిన చెత్త రికార్డు మాత్రం నీదే..
బస్తా యూరియా కోసం..
రైతు బతుకును బజారున పడేశావు..
అందరి కడుపునింపే అన్నదాతను..
పాదరక్షల పాల్జేసిన నీ పాపం ఊరికే పోదు
జై కిసాన్
జై తెలంగాణ
నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోసాడు!
నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడు!
నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు!
నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్ కు ఊపిరి పోసాడు!
చిట్టినాయుడు!
నువ్వా! KCR పేరును తుడిచేది?
తెలంగాణ చరిత్ర KCR!
మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish లేఖతో నిద్రలేచిన కాంగ్రెస్ సర్కార్
ఎండిపోతున్న రిజర్వాయర్లను నింపాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ
నేడు మిడ్ మానేరు నుండి నీటి పంపింగ్ ప్రారంభం... అన్నపూర్ణ రిజర్వాయర్ లోకి వస్తున్న నీళ్లు
#KaleshwaramProject
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకొన్నారు. ప్రభుత్వం భావిభారత పౌరుల పట్ల ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరం.
విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించ��� సిఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం, ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం.
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామాగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండడం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదు.
డిప్యూటీ సీఎం @Bhatti_Mallu గారు వెంటనే స్పందించి, మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను, కార్మికుల జీతాలను చెల్లించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని కోరుతున్నాను.
కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా..?
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా..?
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణం, అత్యంత బాధాకరం.
సాగునీరు, కరెంటు మాత్రమే కాదు.. విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకున్నది.
కాంగ్రెస్ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయి. ఐదు నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది.
రైతన్నలపై లాఠీలు ఝులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పాలి. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, విత్తనాలను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వె��టనే చర్యలు చేపట్టాలి.
#CongressFailedTelangana
#AntiFarmerCongress
పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది తెలంగాణలో పరిపాలన
ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ గారు తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా-జమునా తహజీబుకి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉం���ె అది రాచరిక పోకడనట
కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి “గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్“ అని పాడుకోవాలి !!??
“కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప” అని అదే రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి !!??
అసలు ముఖ్యమంత్రికి గాని, ఆయన మంత్రిమండలిలో ఒక్కరికైనా రాష్ట్రగీతంలో ఏమున్నదో తెలుసా ?
రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..?
విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు ??
పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ?
ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది ??
ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప..
ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కల���దా ??
నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..!
నేడు.. విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు..!!
పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి..
ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి ??
సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు..
ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా ??
తెల్లవారుజామున 4 గంటలకు లైన్ లో నిలబడితే..
సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా ??
గత పదేళ్లపాటు.. 10 నిమిషాల్లో అందిన విత్��నాలు..
10 గంటలపాటు పడిగాపులు పడినా అందించలేరా ??
రంగారెడ్డి నుంచి.. కామారెడ్డి దాకా..
రైతులకు ఏమిటీ కష్టాలు.. ఇంకెన్నిరోజులు ఈ కన్నీళ్లు..
దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ..
అన్నదాతకే తిండితిప్పలు లేకుండా చేస్తారా ??
బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేస్తారా ??
ఇప్పటికైనా.. సరిపడా విత్తనాల స్టాక్ తెప్పించండి..!
బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా కళ్లెం వేయండి..!!
కాంగ్రెస్ వచ్చింది.. కాటగలిసినం అంటున్న..
అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకండి..!!
లేకపోతే..
రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని..
కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదు..!!
జై కిసాన్
జై తెలంగాణ
ముఖ్యమంత్రి గారు..
ఇదేం రెండునాల్కల వైఖరి..!
ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన..!!
మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం..!
చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు..!!
అవి రాచరికపు గుర్తులు కాదు..!
వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు..!!
వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు..!!!
జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా ?
“కాకతీయ” కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే.. “చార్మినార్”
అధికారిక గీతంలో కీర్తించి..!!
అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా..??
చార్మినార్ అంటే.. ఒక కట్టడం కాదు..
విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ కు ఐకాన్
కాకతీయ కళాతోరణం అంటే.. ఒక నిర్మాణం కాదు..
సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం..
తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి..
వీటిని తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమే..!
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే..!!
మీ కాంగ్రెస్ పాలిస్తున్న...
కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికరపు గుర్తులున్నాయి..
మరి వాటిని కూడా తొలగిస్తారా చెప్పండి..??
భారత జాతీయ చిహ్నంలోనూ..
అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన మూడు సింహాలు��్నాయి..
జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉంది..
వాటి సంగతేంటో సమాధానం ఇవ్వండి..??
కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చేస్తారా ?
ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూల్చేస్తారా ?
ఇవాళ తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారు..
రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ చెరిపేస్తారా..?
గత పదేళ్లుగా..
ప్రభుత్వ అధికారిక చిహ్నంపై..
యావత్ తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉంది..
సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకమూ ��ంది..
రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో..
రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించం
పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా...
మీ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తాం..!
తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం..!!
జై తెలంగాణ
జై బీఆర్ఎస్
మరోసారి కాంగ్రెస్ మార్క్ మోసం!
రైతులు ఎంతైనా వడ్లు పండించుకోండి రూ. 500 బోనస్ ఇచ్చి కొనే బాధ్యత నాది అని సరిగ్గా నెల రోజుల క్రితం ఏప్రిల్ 21న నిజామాబాద్ సభలో చెప్పిన సీఎం రేవ���త్.
ఈరోజు క్యాబినెట్ మీటింగ్ తర్వాత స��్న వడ్లు పండించిన వారికి మాత్రమే రూ. 500 బోనస్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన.
కాంగ్రెస్ అంటేనే దగా, మోసం!
ఎన్నికలకు ముందే స్పష్టంగా చెప్పాము కదా Shiva గారు;
మీకు “కాంగ్రెస్ కావాలా, కరెంటు కావాలా“ తేల్చుకోండి అని
మార్పు మార్పు అన్నారు, 2014 కంటే ముందటి చీకటి రోజులు మళ్ళీ తెచ్చారు కాంగ్రెస్ వాళ్ళు
#CongressFailedTelangana
వందేళ్ళ చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కాంగ్రెస్ పాలనలో
కరెంటు కొరత, నీళ్ల కొరత ఉందని విద్యార్థులను హాస్టళ్ల నుండి ఖాళీ చేయించిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదు.
రాష్ట్రంలో కరెంట్ కోతలు, తాగు నీటి కొరత తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏముంటుంది.
రాష్ట్రంలో కరెంటు కోతలే లేవని దబాయిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నెలకొన్న పరిస్థితులకు రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు ఏం సమాధానం చెబుతారు.
విద్యార్థుల జీవితాలను, వారి భవిష్యత్తును ప్రభావితం చేసే ఇలాంటి సంకుచిత చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నాం.
తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయింది.
ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారు.
నాతోపాటు ఉన్న మాజీ ��ాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నదని ఈ సందర్భంగా నాకు చెప్పారు.
రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది?
రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి.
జై తెలంగాణ ✊