కాంగ్రెస్ సర్కార్ చేతగానితనానికి 'యూరియా యాప్' ఒక నిదర్శనం
పల్లె ప్రాంతాలపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS నిప్పులు🔥
రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న మొబైల్ అప్లికేషన్ విధానం రైతు వ్యతిరేఖ విధానం
యూరియా యాప్ నాటకం - లైన్లను దాచే కుట్ర
♦️రైతుల లైన్లు, తమ చేతగానితనం బయటి ప్రపంచానికి కనిపించకుండా దాచిపెట్టేందుకే ఈ 'మొబైల్ యాప్ నాటకాన్ని' కాంగ్రెస్ మొదలుపెట్టింది
♦️ఇప్పటికైనా ప్రభుత్వం 'లైన్లను దాచే' ప్రయత్నాలు పక్కనబెట్టి, అసలు సమస్యపై దృష్టి సారించాలి
♦️కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస ప్రణాళికా జ్ఞానం లేకపోవడం వల్లనే నేడు రాష్ట్రంలో యూరియా కష్టాలు మొదలు
♦️కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు ఎరువుల కోసం రైతులు ఎప్పుడూ క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి రాలేదు
♦️రైతన్నలకు తక్షణమే అవసరమైన మేర యూరియాను సరఫరా చేయాలని డిమాండ్
♦️రైతులకు సమస్యలు సృష్టించడం మానేసి, చిత్తశుద్ధితో వారి సంక్షేమం కోసం పనిచేయాలి.
గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పల్లె ప్రాంతాలపై పగబట్టినట్లు వ్యవహరిస్తోందని, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేలా పథకాల అమలును అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు. తాండూరు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు మరియు వార్డు సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
రైతులకు అందాల్సిన రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి కీలక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనబెట్టిందని కేటీఆర్ విమర్శించారు. సాగుకు అవసరమైన కరెంట్ సరఫరాను కూడా అస్తవ్యస్తం చేసి, అన్ని అంశాల్లో ప్రజలను పట్టిపీడిస్తోందని ధ్వజమెత్తారు. రైతాంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి లేమివల్లనే నేడు పల్లెల్లో అసంతృప్తి నెలకొందని ఆయన పేర్కొన్నారు.
యూరియా యాప్ నాటకం - లైన్లను దాచే కుట్ర:
రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న మొబైల్ అప్లికేషన్ విధానాన్ని కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల అవసరాలకు తగ్గట్లుగా యూరియా సంచులను సరఫరా చేయలేక, ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా ఇస్తామని రైతులను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. ఒకప్పుడు నేరుగా దుకాణాల వద్దకే వెళ్లిన రైతులకు ఎరువులు అందించలేని ఈ చేతగాని ప్రభుత్వం, ఇప్పుడు యాప్ ద్వారా ఇస్తామంటే ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాలు, వారి లైన్లు బయటి ప్రపంచానికి కనిపించకుండా దాచిపెట్టేందుకే ఈ 'మొబైల్ యాప్ నాటకాన్ని' కాంగ్రెస్ మొదలుపెట్టిందని ఆయన ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు ఎరువుల కోసం రైతులు ఎప్పుడూ క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి లేదని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస ప్రణాళికా జ్ఞానం లేకపోవడం వల్లనే నేడు రాష్ట్రంలో యూరియా కష్టాలు మొదలయ్యాయని ఆయన అన్నారు. "కేసీఆర్ గారికి రైతులపై ఉన్నట్లుగా గుండెల్లో ప్రేమ ఉంటే, రైతన్నలకు ఈ సమస్యలు వచ్చేవి కావు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ప్రేమ, చిత్తశుద్ధి రెండూ లేవు" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం 'లైన్లను దాచే' ప్రయత్నాలు పక్కనబెట్టి, అసలు సమస్యపై దృష్టి సారించాలని కేటీఆర్ హితవు పలికారు. రైతన్నలకు తక్షణమే అవసరమైన మేర యూరియాను సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు సమస్యలు సృష్టించడం మానేసి, చిత్తశుద్ధితో వారి సంక్షేమం కోసం పనిచేయాలని కోరారు.
మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్రంగా కలచివేసింది. 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలి..
42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ పిలుపుమేరకు రేపు 18 వ తేదీ శనివారం రాష్ట్ర బంద్ లో భాగంగా తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని మనవి..
హైదరాబాద్ అభివృద్ధికి కేటీఆర్ – కేసీఆర్ గార్ల కృషిని గుర్తు చేస్తూ, ప్రజా మద్దతు కోరడం జరిగింది..
మళ్లీ అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటు 🚗 వేయాలి..
BRS అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించండి..
#JubileeHillsBypolls#VoteForCar#BRSCampaign
"Telangana is a reality because of KCR. Don't believe what BJP and Congress. Ultimately truth will prevail": BRS Working President KT Rama Rao on KCR being summoned in irrigation project scam
@umasudhir@KTRBRS
జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే, హైదరాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం తీవ్ర బాధాకరం. ఇది పార్టీకి తీరనిలోటు.
మాగంటి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం.
గౌరవ పైలెట్ రోహిత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా తాండూరులోని ఆయన నివాసంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు.మాతా శిశు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి పండ్ల పంపిణి అనంతరం పలువురు నాయకులు, కార్యకర్తలు బిఆర్ఏస్వీ,రోహితన్న యువసేన సభ్యులు రక్తందానం చేశారు
Thank You, Dallas 🙏
BRS hosted the largest-ever public meeting by an Indian state leader in the United States.
Thank you all for the overwhelming support and massive turnout for this historic feat.
A special thanks to all the organizations..
శ్రీ రాముడి కృపతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి..
మళ్ళీ వచ్చేది మన బీఆర్ఎస్ ప్రభుత్వమే..
-పైలెట్ రోహిత్ రెడ్డి
ఎన్ఆర్ఐలతో కలిసి టెక్సాస్ లోనీ ప్రముఖ ఆలయం కార్యసిద్ధి హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన పైలెట్
The world’s largest campuses of Google, Microsoft, Amazon, Meta and other most valued Tech companies in the world is in my state, Telangana.
The change in the landscape of Hyderabad over the last decade has been incredible.
- BRS Working President @KTRBRS
పహల్గాం నెత్తుటి గాయానికి దీటైన జవాబిచ్చిన భారత సైన్యం ధైర్యసాహసాలకు జేజేలు.
‘ఆపరేషన్ సిందూర్'తో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలు కూల్చిన
భారత సైన్యానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున సెల్యూట్.
జై హింద్!
#OperationSindooor#IndianArmy
Saluting the amazing Indian Armed Forces for their precision strikes on terrorist camps in PoK and Pakistan
Wishing them more power and strength in completely eliminating terrorist infrastructure
Jai Hind 🇮🇳
#OperationSindoor
Thank you, Telangana, for reposing your unwavering faith in KCR garu Ji by turning out in unprecedented numbers
The #BRSat25 meeting, one of the largest political gatherings in the country's history, was meticulously planned and flawlessly executed
The sheer strength of the @BRSparty was on full display at the meeting, even as lakhs of people couldn't reach the venue due to traffic mismanagement by the state police
Heartfelt thanks to the people of Telangana, the organisers, BRS leaders, cadre, and social media warriors for making the event a truly historic and resounding success. Thanks to the media fraternity for the wonderful coverage
The BRS Party's Silver Jubilee meeting reaffirmed that the party is all set to make a roaring comeback in Telangana
#JaiTelangana
#BRS25
#BRS25Years