#JanaSenaWorkshop#Khammam#JanaSenaTelangana#JSPForTelangana
ఖమ్మం జిల్లా కేంద్రంలోని రెస్ట్ ఇన్ హోటల్ వేదికగా నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా డిజిటల్ మీడియా సమ్మేళనంలో భాగంగా మధ్యాహ్న భోజన విరామం అనంతరం సోషల్, డిజిటల్ మీడియా కార్యకర్తలకు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు.
ఈ వర్క్‌షాప్‌లో జనసేన పార్టీ నాయకులు, సోషల్, డిజిటల్ మీడియా రంగంలో విశేష అనుభవం కలిగిన శ్రీ వినీల్ విశ్వంభర దత్త్ పాల్గొని, సోషల్ మీడియా ప్రచార వ్యూహాలు, డిజిటల్ మీడియా వినియోగం, కంటెంట్ రూపకల్పన, ప్రచారంలో పాటించాల్సిన మెలకువలు తదితర అంశాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు,అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాస్ అధ్యక్షతన, జనసేన పార్టీ నాయకులు సాయి ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ తాళ్లూరి రామ్ మాట్లాడుతూ.. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో సోషల్, డిజిటల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రతి కార్యకర్త సోషల్, డిజిటల్ మీడియా మెలకువలను నేర్చుకుని, వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కార్యకర్తలకు మరింత ఉపయోగకరంగా ఉండేలా భవిష్యత్తులో ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లను మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు.
Wishing the one and only Megastar, Padma Vibhushan @KChiruTweets Garu, a very Happy Birthday! ❤️
A legendary actor, an icon of Indian cinema and an inspiration to millions. His extraordinary acting, immense contribution to Indian cinema, humility and journey continue to inspire generations.
May the Megastar continue to shine, entertain and inspire for many more glorious years. Wishing Chiranjeevi Garu good health, happiness and everlasting success.
#HBDMegastarChiranjeevi
🪔 మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు 🎂🙏
మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా మియాపూర్ కాళీమాత టెంపుల్లో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ డా. మాధవరెడ్డి గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 🙏
ఈ కార్యక్రమంలో ప్రవీణ్ సాహూ, హరి నాయక్, కేశవరావు, పుష్పలత, సుధాకర్, రమేష్ రెడ్డి, శ్రీను, గోపి తదితరులు, జనసైనికులు మరియు చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 🎉❤️
జై చిరంజీవి ❤️ | జై జనసేన ✊
తెలంగాణ రాష్ట్ర సిద్ధాంత కర్త ఆచార్య శ్రీ జయ శంకర్ సార్ గారి జయంతి మరియు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేసిన మన గద్దర్ అన్న వర్ధంతి కారణంగా… పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
#JayashankarSir#Gaddharanna
IDA గాంధీనగర్ MTAR EOU కంపెనీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ @JSPshankargoud గారు
ఈయొక్క కార్యక్రమంలో జనసేనపార్టీ కార్మిక నాయకులు దారపు దుర్గాప్రసాద్ గారు, నియోజకవర్గ ఇన్చార్జ్ నందగిరి సతీష్ గారు,
ప్రవీణ్ సాహు
శేరిలింగంపల్లి
IDA గాంధీనగర్ MTAR EOU కంపెనీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జనసేన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఐడిఏ గాంధీనగర్ లో గల MTAR EOU కంపెనీ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని గత వారం రోజులుగా సమ్మెకు దిగారు
ఈరోజు దీక్షా శిబిరం వద్దకు విచ్చేసిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారు వారికి మద్దతు తెలియజేస్తూ జనసేన పార్టీ వారికి అండగా నిలుస్తుందని కార్మిక సమస్యలపై పోరాడేందుకు ఎల్లప్పుడూ జనసేన పార్టీ తోడుగా ఉంటుందని తెలియజేశారు అనంతరం BRTU ,CITU,BMS,యూనియన్ నాయకులతో కూడా చర్చించారు
ఈయొక్క కార్యక్రమంలో జనసేనపార్టీ కార్మిక నాయకులు దారపు దుర్గాప్రసాద్ గారు, నియోజకవర్గ ఇన్చార్జ్ నందగిరి సతీష్ గారు, పార్టీ శ్రేణులు ప్రవీణ్ సాహు, మహేష్ రావు, రాజు, అశోక్, శ్రీరాములు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు
🚧 మియాపూర్ మయూరి నగర్ డివిజన్లో రోడ్డు సమస్యపై జనసేన పార్టీ నిరసన 🚧 మియాపూర్ మయూరి నగర్ డివిజన్ పరిధిలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుంచి SMR వినయ్ హైలాండ్స్ వరకు (నడిగడ్డ తండాకు వెళ్లే రోడ్డు) తవ్వకాలు చేపట్టి నెలలు గడిచినా పనులు పూర్తి కాకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 📌 ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు: 🔸 ఉదయం పాఠశాల బస్సుల రాకపోకలతో తీవ్ర ట్రాఫిక్ సమస్య. 🔸 ఉద్యోగులు, విద్యార్థులు, స్థానికులు కార్యాలయాలు మరియు ఇతర అవసరాల కోసం ప్రయాణించడంలో ఇబ్బందులు. 🔸 దుమ్ము, బురద, గుంతల కారణంగా ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. 📢 జనసేన పార్టీ డిమాండ్: ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే రోడ్డు పనులను పూర్తి చేసి, రోడ్డును శాశ్వతంగా పునరుద్ధరించాలని జనసేన పార్టీ బలంగా డిమాండ్ చేస్తోంది. 🤝 ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: ప్రవీణ్ సాహు, హరినాయక్, మాధవ్ రావు, కేశవ్ రావు, వీరమహిల హరిత గారు మరియు జనసేన పార్టీ జనసైనికులు. ప్రజల సమస్యల పరిష్కారమే జనసేన లక్ష్యం. ప్రజల కోసం... ప్రజలతో... జనసేన! ✊ #pawankalyan #janasenaparty #serilingampally #politics #telanganajanasenaparty
వైశాలి నగర్ విషాద ఘటనపై జనసేన పార్టీ నిరసన – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలో బాలయ్య అనే వ్యక్తి మ్యాన్‌హోల్‌లో పడి ప్రాణాలు కోల్పోయిన అత్యంత విషాదకర సంఘటన పట్ల జనసేన పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనలో మృతి చెందిన బాలయ్య కుటుంబానికి జనసేన పార్టీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొంది.
ఈ ఘటనపై పూర్తి స్థాయి, పారదర్శక విచారణ నిర్వహించి, సంఘటనకు బాధ్యులైన అధికారులపై మరియు సంబంధిత బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అలాగే బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ పరంగా ఉపాధి కల్పించాలని కోరింది.
ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్, డ్రైనేజీ వ్యవస్థల లోపాలు, రహదారుల నిర్వహణలో ఉన్న సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, ఇలాంటి విషాద సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది.
జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆధ్వర్యంలో వైశాలి నగర్ ప్రాంతంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రవీణ్ సాహు, సుధాకర్, నవీన్, శివ, రవి శర్మ , గఫార్, వీరమహిళలు పుష్పలత, అనుపమ మరియు జనసైనికులు పాల్గొన్నారు
@JSPTelangana@JSPShatagniTeam@JanaSenaParty@itsRamTalluri@NagaBabuOffl
మియాపూర్ సర్కిల్ SIR నిర్వహణలో పారదర్శకత, అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని ఏఈఆర్వోకు జనసేన పార్టీ శేర్లింగంపల్లి ఇంచార్జ్ డా. మాధవ రెడ్డి వినతి
జనసేన పార్టీ శేరిలింగంపల్లి ఇన్చార్జ్ డా. మాధవ రెడ్డి మియాపూర్ సర్కిల్ SIR నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికత మరియు అన్ని గుర్తింపు పొందిన, నమోదిత రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని కోరుతూ మియాపూర్ సర్కిల్ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (AERO) గారికి, శేరిలింగంపల్లి (54) నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) ద్వారా వినతిపత్రాన్ని సమర్పించారు.
మియాపూర్ సర్కిల్లో నిర్వహించే అధికారిక రాజకీయ పార్టీ సమావేశాలకు జనసేన పార్టీ ప్రతినిధులకు ఆహ్వానాలు అందడం లేదని, దీనిపై స్పష్టత ఇవ్వడంతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు.
అలాగే నేను కేఎస్ఆర్ ఎన్క్లేవ్, దీప్తి శ్రీ నగర్ డివిజన్, ప్రాంతంలో నమోదిత ఓటరుగా ఉన్నప్పటికీ సంబంధిత బీఎల్ఓ (BLO) నుంచి ఓటర్లకు సంబంధించిన ఫారాలు లేదా సమాచారాలు అందలేదని వినతిపత్రంలో పేర్కొన్నారు.
మై హోమ్ జ్యువెల్ , మదీనగూడ, దీప్తి శ్రీ నగర్ డివిజన్, కేఎస్ఆర్ ఎన్క్లేవ్ కాలనీ ప్రాంతాల్లో SIR నిర్వహణలో పూర్తి పారదర్శకత, BLO ల నిష్పక్షపాతము గా విధులు నిర్వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలి , అలాగే ఈ వినతిపత్రంపై తీసుకున్న చర్యలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని డా. మాధవ రెడ్డి ఎన్నికల అధికారులను కోరారు.
ప్రవీణ్ సాహు, ప్రదీప్,కేశవ్ రావు, రాజేష్, హరి నాయక్, అశోక్,షణ్ముఖ్ శర్మ, వి గోపి, కుమార్, జక్కా, రామాంజనేయులు, మహేంద్ర, అంజి, ఓబులేసు వీరమహిల హరిత గారు తదితరులు పాల్గొన్నారు.
@JSPTelangana@JanaSenaParty@PawanKalyan@NagaBabuOffl@AjayaKumarJSP@itsRamTalluri@urRKsagar
జీ.హెచ్.ఎం.సీ హెడ్ ఆఫీసులో అమ్మవారిబోనాల జాతర సందర్భంగా
యాటెల్లి దంగురాజు, చిన్నసాగా శ్రీధర్ మరియు జి హెచ్ ఎం సి ఎంప్లాయిస్ మరియు యూనియన్ సభ్యులు ఆహ్వానా మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ @JSPshankargoud గారు పాల్గొన్నారు.
#Telanganabonalu#pawankalyan
GHMC HEAD OFFICE లో బోనాల ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్
నగరం నడిబొడ్డున
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ లో స్వచ్ఛ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు యాటెల్లి దంగురాజు, శ్రీధర్ మరియు యూనియన్ సభ్యులు నిర్వహించిన శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ అమ్మ చల్లని దీవెనతో పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం నిలకడగా ఉండాలని మున్సిపల్ కార్మికుల కుటుంబాలు, తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని
వర్షాలు బాగా పడి రైతులంతా సంతోషంగా ఉండాలి అని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్మిక నాయకులు దారపు దుర్గాప్రసాద్,
పార్టీ సీనియర్ నాయకులు నందగిరి సతీష్, నాయకులు ప్రవీణ్ సాహు, రాజు, శ్రీనివాస్, లలిత గారు తదితరులు పాల్గొన్నారు.
Team Journalist Raghu ఖబర్దార్ ☝️🗿
కోడి చెరువు కబ్జాపై నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా ఆక్రమణలు చెయ్యలేదు, నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయలేదని తెలిపారు.
ఇట్లు…
@PrawinSahuJsp 🤫
శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు.
దేశద్రోహులకు ఆశ్రయం కల్పిస్తానంటూ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ గారి వ్యాఖ్యలను ఖండిస్తూ, దేశ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారి సభ సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలియజేసే ప్రయత్నం చేసిన @drmaadhavareddy గారిని, ఇతర జనసేన నాయకులను అప్రజాస్వామికంగా అరెస్టు చేశారు.
ముందస్తు అరెస్టుకు గురైన నాయకులను కలిసి, వారికి సంఘీభావం తెలిపి, పోలీసులతో మాట్లాడి వెంటనే వారిని విడుదల చేయాలని కోరిన తెలంగాణ జనసేన నాయకులు.
#JanaSenaTelangana
పాకిస్తానీయులకు, దేశద్రోహులకు ఆశ్రయం కల్పిస్తామంటూ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే శ్రీ ఆరికేపూడి గాంధీ గారు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేయాలని భావించిన తెలంగాణ జనసేన నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
శేరిలింగంపల్లిలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సభ ప్రారంభానికి ముందే జనసేన నాయకులు డా. మాధవ్ రెడ్డి గారు, ప్రవీణ్ సాహు గారు, హరి నాయక్ గారు, కేశవ్ రావు గారు, మాధవ్ రావు గారు, రమేష్ రెడ్డి గారు, సుధాకర్ గారు, తిరుపతి గారు, వీర మహిళ అనుపమ గార్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు. అలాంటి నిరసనలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
అరెస్టు చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని, అలాగే శ్రీ ఆరికేపూడి గాంధీ గారితో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పించేలా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాము.
ఖమ్మం నగరంలో 12 సంవత్సరాల బాలికపై జరిగిన అమానుష ఘటనపై జనసేన పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను, ఆమె తల్లిదండ్రులను జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి @urRKsagar గారు శనివారం పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం Rk సాగర్ గారు మీడియాతో మాట్లాడుతూ సమాజం తలదించుకునేలా ఉన్న ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులకు కఠినమైన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. నిందితుడు ఎంతటి వారైనా సరే, చట్టం ముందు నిలబెట్టి కచ్చితంగా ఉరిశిక్ష పడేలా చేయాలని ఆర్కే సాగర్ గారు ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం పార్లమెంట్ కో ఆర్డినేటర్ రామకృష్ణ మిరియాల గారు మాట్లాడుతూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన ఉచిత వైద్యం అందించాలని, బాధితురాలి కుటుంబానికి ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలవాలని డిమాండ్ చేశారు. నిందితుడికి తక్షణమే ఉరిశిక్ష విధించడమే ఆ కుటుంబానికి నిజమైన న్యాయం అని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేతలు హామీ ఇచ్చారు. శేరిలింగంపల్లి ఇంచార్జి మాధవ రెడ్డి గారు, జనసేన నాయకులు మాధవరావు గారు , కొల్లా శంకర్ గారు , మహేష్ గారు , పుష్ప గారు ,ప్రవీణ్ గారు , అనుపమ గారు తదితరులు పాల్గొన్నారు 🙏
#JusticeForKhammamGirl #JanaSenaWithVictim
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ గారు, రాష్ట్ర నాయకులు రాధారం రాజలింగం, దామోదర్ రెడ్డి, మండపాక కావ్య, పొన్నూరు సాయి శిరీష, దాసరి రవిష్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో బిట్ల రమేష్, శ్రీనివాస్ రాయి, రావుల మధు, రావు రమేష్, వెంకట చారి, చుక్క నాని, జూబ్లీ హిల్స్ రమేష్, నరేష్, గంగం అజయ్ కుమార్, వెంకట లక్ష్మి, భవ్య రెడ్డి, ప్రవీణ్, గోపాల్ వర్మ, సీతారాం మరియు జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#AmbedkarJayanti #JSPTelangana
సంగారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ AD HOC కమిటీ సభ్యులు, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి డా మాధవరెడ్డి గారు ప్రచారం
సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల భాగంగా గ్రేటర్ హైదరాబాద్ AD HOC కమిటీ సభ్యులు శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ డా మాధవరెడ్డి గారు, జనసేన పార్టీ అభ్యర్థి 21వ వర్డ్ శ్రీమతి సాయి కీర్తన గారిని గెలిపించాలని ప్రచారం లో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు వీర మహిళలు AD HOC కమిటీ సభ్యులు పుష్పలత, మద్దూరి నాగలక్ష్మి, వి.లక్ష్మీ నాయుడు,పాలురి భవానీ నాయుడు,
ప్రవీణ్ సాహు,కాసాని అశోక్,హరి నాయక్, రాజేష్ సిరా,నవీన్, సాయి కృష్ణ,కృష్ణా,వేణుగోపాల్ రెడ్డి,రమణ,విజయ్,శ్రవణ్ కుమార్ GSK,పవన్,కేశవ,మనోజ్,మరియు సంగారెడ్డి జన సైనికులు, వీర మహిళలు,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
@JSPTelangana@JanaSenaParty@PawanKalyan@itsRamTalluri@TeamRamtalluri@urRKsagar