మహాచండీ నమోస్తుతే.
బోధన్ నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడు సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, బోధ్ పట్టణంలోని వారి స్వగృహం నందు 3వ రోజు భక్తి శ్రద్ధలతో మహాచండీ హోమాన్ని నిర్వహించడం జరిగింది.
చాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా సాలూర మండలంలోని సాలంపాడ్ క్యాంపు గ్రామంలో పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాలు, దుర్మార్గ పాలనను ఎండగట్టడంతో పాటు గత పదేళ్లుగా అభివృద్ధికి అడ్���ంకి గా మారిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి, దేశ వ్యాప్తంగా సాహసోపేత నిర్ణయాలు, చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో పూర్తిస్థాయిలో ప్రతి ఇంటికి చేరాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకురావాలని వివరించాం.
#ChaiPeChwrcha
చాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా సాలూర మండలంలోని మందర్న గ్రామంలో పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకుని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల��ు వివరించాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, చేసే అభివృద్ధిని వివరించి చైతన్యం కల్పించాం.
#CgaiPeCharcha
రెంజల్ మండలంలోని సాటాపూర్ లో బిజెపి మండల పార్టీ కార్యాలయాన్ని వడ్డీ మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ గారు, రెంజల్ మండల అధ్యక్షులు గోపికృష్ణ గారు, జడ్పీటీసీ మేక సంత��ష్ గారు, ఎంపీపీ రజిత కిషోర్ గారు, బీజేవైఎం బోధన్ అసెంబ్లీ కన్వీనర్ యోగేష్ గారు, ప్రధాన కార్యదర్శి సంగేమ్ శ్రీను గారు, పోచయ్య గారు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బోధన్ పట్టణంలో బోధన్ ప్రగతి కై - ఇంటి ఇంటికి బిజెపి కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. 25 వ వార్డు రాకాసిపేట్ లోని నల్ల పోచమ్మ నుండి ప్రారంభం అయిన కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. ప్రతిచోటా బిజెపి ని ఆశీర్వదిస్తూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి గురించి సానుకూలంగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ సర్కారు పాపానికి బోధన్ నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి జరగాలంటే బిజెపి ��ెలవాలంటూ మద్దతు తెలుపుతున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. జై బిజెపి.
చాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా రెంజల్ మండలంలోని దండి గుట్టతండా , కిసాన్ తండా గ్రామాలలో పర్యటించి స్థానికులతో కలిసి స్థానిక సమస్యలు తెలుసుకుని, పరిష్కారం దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చాం. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గత పదేండ్లుగా ప్రజలు పడుతున్న గోస పోవాలంటే, సుపరిపాలన అందాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని చైతన్యం చేయడం జరిగింది. మన లక్ష్యం.. బిజెపి విజయం.. బోధన్ నియోజకవర్గ అభివృద్ధి. ఆశీర్వదించండి. మద్దతు తెలపండి. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు.
#ChaiPeCharcha
చాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలంలోని బ్రాహ్మణ పల్లి, ARP క్యాంపు, జైతాపూర్, దుబ్బా తండా గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి పర్యటించాం. స్థానికుల సమస్యలు తెలుసుకుని, పరిష్కారం దిశగా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభ��త్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాల గురించి వివరించి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి మద్దతు తెలపాలని అభ్యర్థించాం.
#ChaiPeCharcha
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపి, దీక్షలో పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా బయటకు రావాలని కోరుకుంటున్నాను.
అసత్యంపై సత్యం,
అధర్మంపై ధర్మం,
అధైర్యంపై ధైర్యం
చెడుపై మంచి విజయం సాధించిన రోజు 'విజయదశమి'
విజయానికి సంకేతంగా నిలిచే ఈ దసరా మీ జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ
ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు
భరతమాత ముద్దు బిడ్డ, బలమైన భావిభారత నిర్మాణానికి నిత్���కృషీవలుడు, దేశ రక్షణకై రాజీలేని నిర్ణయాలతో ముందడుగు వేసే ధైర్యశాలి కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు
శ్రీ అమిత్ షా గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.
చాయి పే చర్చ కార్యక్రమంలో భాగంగా నవీపేట్ మండలంలోని నాళేశ్వర్ మరియు లింగాపూర్ గ్రామంలో ఉన్న సమస్య��� గురించి తెలుసుకొని, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వారికి వివరించడం జరిగింది.
వన్నె తరగని వేడుక
వేల పువ్వుల కూడిక
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక
ఏండ్ల సంది ఈ నేల మీద సాగుతున్న పూలజాత 'మన బతుకమ్మ'
తెలంగాణ ఆడపడుచులకు
"సద్దుల బతుకమ్మ" శుభాకాంక్షలు.
దేవి నవరాత్రి ఉత్సవాల సందర్బంగా బోధన్ పట్టణంలోని హోసింగ్ బోర్డు సరస్వతి నగర్ లోని అమ్మవారి మండపం వ���్ద అమ్మ ఆశీస్సులు తీసుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాను.
చాయి పే చర్చ కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలంలోని కుర్నా పల్లి గ్రామంలో అమ్మ వారి మండపం వద్ద దుర్గామాత ఆశీస్సులు తీసుకొని అక్కడ ఉన్న సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది.
చాయి పే చర్చ కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలంలోని తనకలన్ గ్రామంలో పర్యటించి స్థానికులతో కలిసి అక్కడ ఉన్న సమస్యల గురించి తెలుసుకొని, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వారికి వివరించడం జరిగింది.