భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ నెల 28వ తేదీన తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శంషాబాద్ లోని రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుండి 9 జిల్లాల పార్టీ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్ గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల పరిధిలోని సుమారు 15 వేల మంది బూత్ స్థాయి అధ్యక్షులు, కార్యకర్తలతో భారీ సమావేశం జరగనుంది. తెలంగాణలో బిజెపి అధికారమే తదుపరి లక్ష్యమనే స్పష్టమైన సందేశాన్ని మన జాతీయ అధ్యక్షులు ఇక్కడి నుండి ఇవ్వబోతున్నారు. ఘటకేసర్ లో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో, అలాగే వీబీఐటీ క్యాంపస్ లో విద్యార్థులు, యువతతో జరిగే ప్రత్యేక కాన్ క్లేవ్ లో వారు పాల్గొంటారు. తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమే. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అన్నీ కలిసొచ్చినా బిజెపిని ఓడించడం ఎవరి తరం కాదు. తెలంగాణలో మార్పు కోసం కార్యకర్తలంతా కదం తొక్కాలి!
- శ్రీ @N_RamchanderRao గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
#TelanganaWelcomesNitinNabin
గౌరవనీయ జాతీయ అధ్యక్షులు శ్రీ @NitinNabin గారు జూన్ 28 నుంచి జూన్ 30 వరకు మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు.
జూన్ 28న ఆయన రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు, అదే వేదిక నుంచి మరో 9 జిల్లా బీజేపీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. సాయంత్రం నాంపల్లి గ్రౌండ్స్‌లో బీజేపీ క్షేత్రస్థాయి బూత్ అధ్యక్షుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఆ తరువాత నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి విచ్చేసి, రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు.
జూన్ 29న శ్రీ నితిన్ నబిన్ గారు VBITలో నిర్వహించనున్న వికసిత్ భారత్ యువ సంవాద్ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అనంతరం వరంగల్‌కు చేరుకుని గిరిజన సమూహాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఆ తరువాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ బూత్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం రాత్రి బస కోసం హైదరాబాద్‌కు తిరిగి చేరుకుంటారు.
జూన్ 30న ఘట్కేసర్లో జరిగే @BJP4Telangana రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరై ప్రసంగించనున్నారు. అనంతరం న్యూఢిల్లీకి బయలుదేరనున్నారు.
సమస్త తెలంగాణ బీజేపీ పరివార్ తరఫున ఆదరణీయ అధ్యక్షుడికి తెలంగాణకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.
25 జూన్ 1975: భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటి.
1975లో ఇదే రోజున, అధికారంలో కొనసాగాలనే దురాశతో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీని విధించి, రాజ్యాంగ స్ఫూర్తిని అణచివేసింది. ప్రజాస్వామ్య స్వరాలను మూగబోయేలా చేసి, పౌర స్వేచ్ఛలను హరించి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి చేసింది.
ఆ నియంతృత్వ కాలంలో పౌరుల ప్రాథమిక హక్కులను నిలిపివేశారు.పత్రికా స్వేచ్ఛపై సెన్సార్ విధించారు, ప్రతిపక్ష నాయకులను జైళ్లలో పెట్టారు. నిజం మాట్లాడినందుకే వేలాది మంది కార్యకర్తలు, జర్నలిస్టులు, సాధారణ పౌరులు అకారణంగా నిర్బంధించబడ్డారు.
అయినా, అలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా దేశంలోని అనేక మంది యువకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు ధైర్యంగా నిలబడ్డారు. వారు నిర్భయంగా తమ స్వరాన్ని వినిపించి, అణచివేతను భరించి, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడారు.
ఆ నియంతృత్వ చీకటి అధ్యాయాన్ని భవిష్యత్ తరాలు ఎప్పటికీ మరచిపోకూడదనే ఉద్దేశంతో, ఈ రోజును ‘రాజ్యాంగ హత్యా దినం’గా గుర్తించే నిర్ణయం తీసుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి కృతజ్ఞతలు.
ఈ రోజున, ఎమర్జెన్సీని ప్రతిఘటించి, అన్యాయాన్ని ఎదుర్కొని, రాజ్యాంగ పరిరక్షణ కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన ప్రజాస్వామ్య యోధులందరికీ నా వినమ్ర నివాళులు.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను, పౌర స్వేచ్ఛలను కాపాడడంలో మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అటువంటి చీకటి అధ్యాయం భారత్‌లో మళ్లీ పునరావృతం కాకూడదని సంకల్పిద్దాం.
#SamvidhanHatyaDiwas
DID YOU KNOW: Justice Jagmohan Sinha, who authored the judgment disqualifying Indira Gandhi from the Prime Ministership, was hounded by the Congress MP of Prayagraj and was forced to disappear for ten days just to write his verdict. Even a special CID task force hunted for Justice Jagmohan Sinha's judgment, threatening his secretary late at night.
This is how the Congress used to pressurise institutions and today it shamelessly talks about Constitution.
#SamvidhanHatyaDiwas
హైదరాబాద్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయం! బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు ఎన్ని నాటకాలు ఆడినా ఇక్కడ గెలిచేది బీజేపీనే. ఓటరు జాబితాలోని దొంగ ఓట్లను ఏరిపారేస్తాం. మన దేశ ఓటరు జాబితాలో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, పాకిస్తానీలు ఉండాలా వద్దా? అని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను సూటిగా ప్రశ్నిస్తున్నాను.
బెంగాల్లో టీఎంసీ ఎన్ని దాడులు చేసి, మన కార్యకర్తలను పొట్టనపెట్టుకున్నా.. అక్కడి ప్రజలు బీజేపీకే పట్టం కట్టి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు. ఆ దెబ్బకు సరిహద్దుల్లోని అక్రమ చొరబాటుదారులు భయంతో దేశం విడిచి పారిపోతున్నారు. ఈ దేశం మనది, హక్కు మన పౌరులది!
- శ్రీ @N_RamchanderRao గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు భారత రాష్ట్రపతి గౌరవనీయ శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాలను ప్రదానం చేయడం దేశం మొత్తానికి ఎంతో గర్వకారణం.
పద్మ పురస్కారాలతో సత్కారం అందుకున్న తెలుగు ప్రముఖులకు ప్రత్యేక అభినందనలు:
🔸 శ్రీ మాగంటి మురళీ మోహన్ గారు – కళ
🔸 శ్రీ గడ్డే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు – కళ
🔸 డాక్టర్ కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణియన్ గారు – విజ్ఞాన శాస్త్రం మరియు ఇంజనీరింగ్
🔸 శ్రీ రామా రెడ్డి మామిడి గారు – సహకార అభివృద్ధి
🔸 డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ గారు – సైన్స్ ఇంకా ఇంజనీరింగ్
🔸 డాక్టర్ చంద్రమౌళి గడ్డమానుగు గారు – సైన్స్ ఇంకా ఇంజనీరింగ్
మీ అసాధారణ సేవలు సమాజాన్ని సుసంపన్నం చేశాయి, ఆయా రంగాల అభివృద్ధికి విశేషంగా దోహదపడ్డాయి, అలాగే తెలుగు సమాజానికి అపార గర్వకారణంగా నిలిచాయి.
ఈ గర్వకారణమైన ఘనత సాధించిన పురస్కార గ్రహీతలందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
మీ అంకితభావం, ప్రతిభ, నైపుణ్యం, ఆవిష్కరణ, సమాజానికి చేసిన విశేష సేవల ద్వారా మీరు దేశ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. మీ నిరంతర శ్రమ, ప్రతిభ, జాతి నిర్మాణానికి అందించిన సేవలకు ఈ గౌరవం నిజమైన జాతీయ గుర్తింపు.
#PeoplesPadma
జ్వలంత జాతీయవాద చింతకుడు, గొప్ప విద్యావేత్త, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, మన మార్గదర్శకులు పూజ్య డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా, నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించాను.
“ఒక దేశం, ఒక జెండా, ఒక రాజ్యాంగం” అనే దృఢ సంకల్పంతో, మాతృభూమి భారతదేశ ఐక్యత మరియు సమగ్రత కోసం డా. ముఖర్జీ గారు తన ప్రాణాలను అర్పించారు. ఆయన జీవిత త్యాగం, ధైర్యం, తపస్సు మరియు అచంచల దేశభక్తి చిరస్మరణీయ గాథగా నిలిచింది.
జాతీయ ఐక్యత, సాంస్కృతిక వైభవం మరియు దేశ సంక్షేమం పట్ల ఆయన చూపిన నిబద్ధత ప్రతి భారతీయుడికి నిరంతరం స్ఫూర్తినిస్తుంది. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ లక్ష్యం వైపు మనం ముందుకు సాగుతున్న ఈ ప్రయాణంలో, ఆయన ఆదర్శాలు ప్రతి అడుగులోనూ మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే త్యాగం, పోరాటం చేసిన ఈ మహనీయ జాతీయ నాయకుడికి పునఃపునః వందనాలు.
ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్లు శ్రీ సీహెచ్. విద్యాసాగర్ రావు గారు, శ్రీ బండారు దత్తాత్రేయ గారు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్లు ఎక్కడ?
ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడ?
నిరుద్యోగ భృతి ఎక్కడ?
బూటకపు హామీలు, అబద్ధపు వాగ్ధానాలతో కాంగ్రెస్ తెలంగాణ యువతను మోసం చేసింది.
వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది.
రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు.
1975లో ఎమర్జెన్సీ విధించి, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కుతూ రాజ్యాంగ స్ఫూర్తిని కాంగ్రెస్ ఎలా హతమార్చిందో దేశం మరచిపోలేదు.
आज भारत की युवा आबादी का खेल के प्रति आकर्षण और प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में एक स्पष्ट रोडमैप नजर आता है।
– माननीय राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin जी
“నేడు భారత్ వేస్తున్న ప్రతి అడుగు, రాబోయే 1000 ఏళ్ల భవిష్యత్తును నిర్మిస్తోంది.
ప్రపంచానికి భారత్ అందిస్తున్న అతిపెద్ద గ్యారంటీ ఇదే !”
— Hon’ble PM Shri @narendramodi#RepublicSummit
నరేంద్ర మోడీ గారు యువతను కేవలం ఉద్యోగులుగానే కాకుండా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. నాడు ఇచ్చిన మాట ప్రకారం ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ గడ్డపై సగర్వంగా జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై అని నినదించేలా చేశారు.
కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి ఏమైందని అడిగితే అహంకారంతో మాట్లాడుతున్నారు. మా బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీల జోలికి రావాలంటే ముందు మా బీజేవైఎం కార్యకర్తలను దాటి రావాలి. మా యువమోర్చా కార్యకర్తలు కదిలితే సెక్రటేరియట్ గోడలు బద్దలవుతాయి. సిద్ధాంతాల కోసం పనిచేసే మా కార్యకర్తలతో పెట్టుకుంటే ఖబడ్దార్ రేవంత్ రెడ్డి!
- శ్రీ @GaneshKunde8 గారు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు
#12YearsOfSeva
గౌరవనీయ ప్రధాని శ్రీ @narendramodi యువత సాధికారతకు, అవకాశాలకు, వారి ఆశయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటే, తెలంగాణ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి యువతను మోసం చేసారు.
బుద్ధీ జ్ఞానం ఉన్నవారెవరైనా రాజ్యాంగాన్ని గౌరవిస్తారు.. కానీ ప్రకాశ్ రాజ్ లాంటి వారు మాత్రం తామేదో రాజ్యాంగానికి విలువనిస్తాం అని బయటకు కలరింగ్ ఇస్తూ, రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తూ దొరికిపోతుంటారు
నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉండమని రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉంది ప్రకాశ్ రాజ్ గారూ? ఒక వ్యక్తికి ఒకే ఓటు హక్కు ఉండాలనే కనీస చట్టం కూడా తెలియకుండా మాట్లాడే ఇలాంటి వ్యక్తులు రాజ్యాంగం మీద, కేంద్ర ప్రభుత్వం మీద, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మీద చేసే తప్పుడు ప్రచారాలను, డ్రామాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీ ద్వంద్వ విధానాలు, బూటకపు నీతులు ఇక సాగవు!
अंतर्राष्ट्रीय योग दिवस की बड़ी सफलता इस बात का प्रमाण है कि योग न केवल दुनियाभर में करोड़ों लोगों को शारीरिक रूप से स्वस्थ बना रहा है, बल्कि उन्हें आत्मविश्वास के साथ सकारात्मक जीवन जीने के लिए प्रेरित भी कर रहा है।
चित्तप्रशमनोपायो योग इत्यभिधीयते। प्राणस्पन्दनिरोधो वा द्वेधा योगस्य धारणा॥