త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని దర్శించుకున్న శ్రీ @PawanKalyan గారు
•ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి స్వామి వారికి ప్రత్యేక పూజలు
•శ్రీకృష్ణునికి, శ్రీరామ స్వామి, అయ్యప్పస్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ
•దీపాలంకరణ, మీనుట్టు, వేది వజిపాడు సేవల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
సుప్రసిద్ధ శ్రీరామ క్షేత్రం, నాలాంబలం యాత్రలో విఖ్యాతిగాంచిన క్షేత్రాల్లో ఒకటిగా పేరు పొందిన కేరళం రాష్ట్రంలోని త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆలయంలో విశిష్ట సేవల్లో ఒకటిగా పేరున్న దీపారాధన సేవలో పాల్గొన్నారు. ఒక్క రోజు దీపారాధన సేవకు విరాళం అందించి, స్వయంగా దీపాలు వెలిగించి సేవలో పాల్గొన్నారు. ఆలయం ప్రధాన ద్వారం ఎదురుగా, శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రధాన దీపాల్లో జ్యోతి ప్రజ్వలన గావించారు. దీపారాధనతోపాటు ఆలయ సంప్రదాయాలను అనుసరించి మీనుట్టు, వేది వజిపాడు సేవల్లోనూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. శంఖుచక్రాలతోపాటు ధనుస్సు, హారం ధరించిన శ్రీ రామస్వామి వారి అద్భుత రూపాన్ని దర్శించి, సంధ్యాకాల అర్చనలు నిర్వహించారు. శ్రీరామ స్వామి వారితో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీకృష్ణునికి, అయ్యప్ప స్వామకి పట్టు వస్త్రాల సమర్పించారు. అనంతరం గర్భాలయంలో మూలవిరాట్టుకి కుడివైపు ఉన్న దక్షిణా మూర్తికి, నైరుతి దిక్కున ఉన్న వినాయకుడికి, అనంతపద్మనాభ స్వామి వారి శయన రూపానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మేల్ శాంతి(ప్రధాన అర్చకులు) శ్రీ రామన్ తిరుమేని గారు పూజ అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. అంతకు ముందు శ్రీరామ స్వామి క్షేత్రానికి విచ్చసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కొచ్చిన దేవస్థానం బోర్డు ఛైర్మన్, శ్రీరామ స్వామి ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ అడ్మినిస్ట్రేటర్, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
•తీర్వా నదిలో చేపలకి ఆహారం.. వేది వజిపాడు సేవకు విరాళం
శ్రీరామ స్వామి వారి దర్శనానికి ముందు ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి అదే ప్రాంగణంలో ఉత్తర దిక్కున ఉన్న శ్రీకృష్ణుని శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. అనంతరం మీనుట్టు (చేపలకు ఆహారం అందించడం) సేవలో పాల్గొన్నారు. తీర్వా నదికి ఆలయం అనుకుని ఉండడంతో, ఆ నదిలో చేపలకి ఆహారం అందించడం ఆచారంగా వస్తోంది. ఇక్కడ చేపలకు ఆహారం అందించి మత్స్యావతార రూపుడైన విష్ణుమూర్తికి స్వయంగా ఆహారం అందించినట్టు భక్తులు భావిస్తారు. స్వామి దర్శనానంతరం వేడి వజిపాడుగా పిలిచే బాణాసంచ పేల్చే సేవలో పాల్గొన్నారు. త్రిప్రయార్ ఆలయం తెరిచి ఉన్నంత సమయం బాణాసంచా పేల్చడం ఇక్కడ ఆచారం. సీతాదేవి ఆచూకి లభించిన విషయాన్ని తన పొలికేక ద్వారా శ్రీ ఆంజనేయ స్వామి వారు శ్రీరాముడికి చేరవేయగా, రామస్వామి బాణాసంచ పేలుడుతో బదులిచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. దాన్నే త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయంలో నేటికీ పాటిస్తున్నారు. వేది వజిపాడుగా పిలిచే ఈ సేవలో పాల్గొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, 1,001 టపాసులు పేల్చేందుకు అయిన మొత్తాన్ని విరాళంగా సమర్పించారు. చివరిగా శ్రీ శాస్తగా భక్తులు కొలుచుకునే అయ్యప్పస్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
త్రిప్రయార్ లోని శ్రీరామ స్వామి విగ్రహం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిచే పూజలందుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ద్వారకానగరం సముద్ర గర్భంలో కలసిపోయిన అనంతరం రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలు కేరళం తీరానికి కొట్టుకువచ్చినట్టు చరిత్ర చెబుతోంది. కేరళంలో ఆలయానికి సమీపంలో ఆయుర్వేద వైద్యం చేయించుకుంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం స్వామి సేవలో పాల్గొన్నారు.
ఈ కూటమి కేవలం పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైంది - మురళి మోహన్ ❤️
ఇప్పటికైనా కళ్ళు తెరవండి పచ్చకామెర్ల బ్యాచ్. ఇంకా కళ్యాణ్ గారి మీదే ఏడుస్తాం అంటే మీ మీద మీరే ఉమ్మేసుకున్నట్లు..
#PawanKalyan#NDA
ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్, డీపీఆర్ పనులు ప్రారంభం
•ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రత్యేక పర్యవేక్షణలో సర్వే ప్రారంభించిన ఐఐటీ మద్రాస్
•తీర ప్రాంతం వెంబడి ఐదుగురు సభ్యుల నిపుణుల బృందం డ్రోన్ సర్వే
•అత్యాధునిక సాంకేతికతతో బీచ్ ప్రొఫైల్, తీరాల మ్యాపింగ్ చేస్తున్న బృందం
•తీరం వెంబడి ఇసుక, మట్టి అవశేషాల నమూనాల సేకరణ, పరీక్షలు
•అధ్యయనం పూర్తయిన అనంతరం రక్షణ గోడ అలైన్‌మెంట్‌పై కసరత్తులు
•డిజైన్, డీపీఆర్ తో పాటు సమాంతరంగా పర్యావరణ అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని శ్రీ @PawanKalyan గారు ఆదేశం
పిఠాపురం నియోజక వర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతవాసుల దశాబ్దాల కల సాకారం దిశగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం దిశగా కీలక అడుగులు ప్రారంభమయ్యాయి. రక్షణ గోడ నిర్మాణానికి సాంకేతిక సహకారం అందించేందుకు ఒప్పందం చేసుకున్న ఐఐటీ- మద్రాస్ పనిని ప్రారంభించింది. రూ. 323 కోట్లనేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్‌తో నిర్మితమవుతున్న ఈ రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి డిజైన్, డీపీఆర్ రూపకల్పన కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఐఐటీ మద్రాస్ ప్రతినిధి బృందం అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో సముద్ర గర్భంలోనూ, తీర ప్రాంతం వెంబడి సర్వే చేపట్టింది.
తీర ప్రాంత ఇంజినీరింగ్, సముద్ర పరిశోధనల్లో విశేష అనుభవం కలిగిన ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం గత వారం రోజులుగా ఉప్పాడ తీర ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వేలు చేపట్టింది. అధునాతన డ్రోన్లతోపాటు బీచ్ ప్రొఫైలింగ్, తీర ప్రాంతాల మ్యాపింగ్ కోసం ట్రింబుల్ ఆర్980 జీఎన్ఎస్ఎస్ ఆర్టీకే సాంకేతికతను వినియోగిస్తున్నారు. తీర ప్రాంత భౌగోళిక పరిస్థితులు, సముద్ర అలల ప్రభావం, తీర కోత తీవ్రత, భూభాగ మార్పులు, సముద్ర ప్రవాహాల దిశలు వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేస్తున్నారు. నీటి అడుగు భాగం నుంచి బీచ్ వరకు ఇసుక కణాల సేకరణ, సమగ్ర అధ్యయనం సాగుతోంది. వీటితోపాటు ఉప్పాడ తీర ప్రాంతం వెంబడి ఇసుక, మట్టి అవశేషాల నమూనాలు సేకరించి, శాస్త్రీయ అధ్యయన ప్రక్రియ కొనసాగిస్తున్నారు. బాతిమెట్రిక్ సర్వే ద్వారా సముద్రపు లోతు, సీ బెడ్ స్థాయిలు, వాటి మార్పులను గుర్తిస్తున్నారు. బీచ్ ఆకృతి, వాలు, ఎత్తుపై అధ్యయనం కొనసాగుతోంది. షోర్లైన్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. తీర ప్రాంత కోతను అంచనా వేయడంలో ఈ అధ్యయనం కీలక పాత్ర పోషిస్తుంది.
ఉప్పాడ సముద్ర తీరం వెంబడి ప్రతిపాదిత రక్షణ గోడ నిర్మాణానికి అనువైన అలైన్‌మెంట్‌ను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. భవిష్యత్తులో సముద్ర కోత ప్రభావాన్ని సమర్థవంతంగా, సుదీర్ఘకాలం ఎదుర్కొనే విధంగా డిజైన్ రూపకల్పనకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. ఈ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఐటీ మద్రాస్ ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి డిజైన్, డీపీఆర్ తదితర సాంకేతిక అంశాలపై దృష్టి సారించనుంది.
గత నాలుగు దశాబ్దాలుగా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు సముద్ర కోత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వందల ఎకరాలు, పలు గ్రామాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఎంతో మంది నిర్వాసితులు కాగా, రైతులు వందల ఎకరాల పంట భూములను సైతం కోల్పోయారు. ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) ప్రతిపాదన మేరకు సీ ప్రోటెక్షన్ వాల్ , గ్రోయిన్ ఫీల్డ్, హోప్ ఐలాండ్ పరిసరాల్లో ప్రకృతి ఆధారిత తీర రక్షణ చర్యలు చేపట్టేందుకు ఆమోదం లభించింది. అందుకు అనుగుణంగా డీపీఆర్ రూపకల్పన పనులు ప్రారంభమయ్యాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పిఠాపురం పర్యటన సందర్భంగా డిజైన్, డీపీఆర్ పై ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందంతో చర్చించనున్నారు. నిర్ణీత గడువు లోపు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా డిజైన్, డీపీఆర్ రూపకల్పన సమాంతరంగా పర్యావరణ, తదితర అనుమతుల ప్రక్రియ పూర్తి చేసి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
తాను అభిమానించే నాయకుడి అడుగుజాడల్లో నడవాలి, ఆ నాయకుడి జన్మదినాన ఒక మరువలేని బహుమతి ఇవ్వాలని ఒక సంకల్పం చేసుకుంది మృదుల చదలవాడ. ఈమె నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన ఒక వీరమహిళ.
అనకున్న వెంటనే రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం, తులసిపాక గ్రామం చేరుకున్నారు. ఇక్కడ నుంచే అసలైన ప్రయాణం. తులసిపాక గ్రామము నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఏరువాడ అనే గిరిజన గ్రామము. వాహనాల బాట లేదు, చిక్కటి అడవి, కొండ ప్రాంతము.... ఏరులు, వాగులు దాటుకుంటూ ప్రయాణం.
30 గిరిజన కుటుంబాలు నివసిస్తున్న ఈ ఏరువాడ గ్రామానికి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన అనగా సెప్టంబర్ 2వ తారీఖున మృదుల చేరుకొని, ఆ గ్రామ ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు, కూరల విత్తనాలు, మందుల కిట్లు, తదితర వస్తువులు పంచిపెట్టారు.
ఆ గిరిజన ప్రజల గుండెల్లో @pawankalyan గారి మీద ఉన్న ప్రేమను, ఆప్యాయతను స్వయంగా వీక్షించిన ఈ వీరమహిళ, ఆ గ్రామస్ధులు వారి గ్రామానికి రోడ్డు వేయించమనే కోరికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్తానని హామి ఇచ్చారు.
ఆ వీర మహిళ ప్రయాణం ఈ క్రింద వీడియోలో !!
@pawankalyan @janasenaveeramahila @jspshatagni @ajayakumarJSP@m_somayajula
సినిమాతో పరిచయం అయ్యావు.....
రాజకీయం లో మార్గదర్శం అయ్యావు ....
నీకు నువ్వే పొట్టి....
నీకు ఎవరు రారు సాటి
Advance Happy Birthday Kalyan Babu ❣️
#Panja4K@PawanKalyan
రేయ్ N.. ఫ్యాన్స్ మీ డ్రాగెన్ సినిమా తీసేది ఇతనే కదా. మీరేమో చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారు కానీ అదే డైరెక్టర్ కి మా హీరో @KChiruTweets గారే ఇన్స్పిరేషన్ అది తెలుసుకోండి రా ముందమూరి ఫ్యాన్స్. డ్రాగన్ లో ఇచే ప్రతి ఎలివేషన్ చిరంజీవి గారిని చూసే ఇస్తున్నాడు నీల్ మావా 🤙🔥
ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు చెప్పిన మాట :
గూండా సినిమా క్లైమాక్స్ కోసం ఒక డూప్ ని రెడీ చేస్తుంటే చిరంజీవి గారు వచ్చి నాతో ఇండస్ట్రీలో నేను కొత్తగా అడుగులు వేస్తున్నాను నా ప్రయాణం ఇంకా చాలా దూరం ఉంది ఇప్పుడే డూపులను పెట్టి సుఖాలకు అలవాటు పడిపోతే నా ప్రయాణం సాగించలేను నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేను అని చెప్పి కనీసం తాడు కూడా కట్టుకోకుండా ట్రైన్ కిందికి వెళ్లిపోయారు.. ఆ సీన్ పూర్తి అయ్యేవరకు నా గుండె ఆగిపోయినంత పని అయింది.
పని రాక్షసుడు అని వినడమే కానీ ఫస్ట్ టైం చూశాను.అతడే చిరంజీవి అని అన్నారు.
కేవలం డాన్స్ కి మాత్రమే కాదు,ఫైట్స్ కి కూడా కేరాఫ్ అడ్రస్. " మెగాస్టార్" 🤙
ఒక మూస ధోరణిలో కొట్టుకుపోతున్న ఫైట్స్ కి కొత్త అర్థాలు చెప్పిన యూనివర్సల్ ఫైటర్ "మెగాస్టార్"🤙
డూప్స్ లేకుండా ఫైట్స్ చేయడం మొదలుపెట్టి ఎంతోమందిని ఆ దిశగా ముందుకు సాగడానికి బాట వేసిన హీరో "మెగాస్టార్ " 🤙
డాన్స్ అయినా ఫైట్ అయినా మెగాస్టార్ చేస్తేనే దానికి ఒక అందం విలువ..
ఏదైనా సరే మెగాస్టార్ కి ముందు మెగాస్టార్ కి తర్వాతే.
భవిష్యత్తులో పేదలకు #ఉచితవిద్య అందించే దిశలో ఆలోచిస్తున్న మనసున్న మారాజు, సేవే తన జీవిత లక్ష్యంగా మార్చుకుని నాలాంటి ఎందరికో సేవా మార్గదర్శిగా నిలిచిన పద్మవిభూషణ్, భారత జాతి రత్నం, మన అన్నయ్య మెగాస్టార్ డాక్టర్ #చిరంజీవి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
నా ఆయుష్షు కూడా తీసుకుని మీరు నిండు నూరేళ్లూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నా అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KChiruTweets@swaminaidu_r
Happy Birthday to my BOSS, Megastar @KChiruTweets Garu🎂💐❤️!!
An icon who continues to inspire millions with his humility, compassion and service to society.
Wishing you good health, happiness and many more glorious years ahead🙏❤️!!!
Happy Birthday, Boss! 🌟
#JanaSenaTelangana #PawanKalyan
1990లలోనే ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక “భారతీయ సినీ పరిశ్రమకు మెగాస్టార్” అని కీర్తించింది.
బాలీవుడ్ సైతం తలవంచి సలాం కొట్టిన పేరు…
తెలుగు సినిమా సత్తాను దేశానికి చాటిన మహానటుడు…
అతడే మెగాస్టార్ చిరంజీవి! 🔥
#HBDMegastarChiranjeevi
అంతమందిని ఈయన తొక్కుతుంటే ... అందరు కలసి ఈయన్ని తొక్కేయలేకపోయారా...🤣🤣
Boss ra lucha na kodakallara 💪🏻🙌🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Hardwork,Preservance and discipline tho vachina Position ra adi🙏🏻
@KChiruTweets