#PureNostalgia
వారానికో సినిమా మ్యూజిక్ డైరెక్షన్ :
ఇదొక రికార్డ్
—————————————
ఏడాదికి 52 వారాలు ఉన్నట్టుగా,
52 సినిమాలకు సంగీత దర్శకత్వం చేయటం సాధ్యమేనా!?
ఎస్... సాధ్యమే.
ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి చక్రవర్తి.
1985లో ఏకంగా 52 సినిమాలకు సంగీత దర్శకత్వం చేశారు.
అంటే వారానికో సినిమా అన్నమాట. అసలు ఒక సినిమాకు సంగీతం సమకూర్చడానికే నెలలు పడుతుంటే, ఈయన అంత వేగంగా, అంతే నాణ్యంగా ఎలా స్వరాలు సమకూర్చారో మరి.
ఇలాంటివి వింటేనే..
ఆయన మరమనిషా? స్వరమనిషా? అనిపిస్తుంది.
1980లో 38 తెలుగు చిత్రాలకు సంగీతం సమకూరిస్తేనే అందరూ నోరెళ్ల బెట్టారు.
కట్ చేస్తే - 1983లో 40 సినిమాలకు మ్యూజిక్ చేసి తన రికార్డు తానే బద్దలు కొట్టారు చక్రవర్తి.
1984లో మళ్లీ రికార్డు బ్రేక్ చేసి 46 సినిమాలకు స్వర సారథ్యం వహించారు.
ఇక పీక్ లెవెల్ అంటే మాత్రం 1985 నే చెప్పాలి. 1986లో కూడా ఏమాత్రం తగ్గలేదు. ఒకే ఒక్క సినిమా తగ్గిందంతే . ఆ ఏడాది 51 చిత్రాలకు పని చేశారు.
1980వ దశకం ఆయన కెరీర్లో స్వర్ణ యుగం. తన పాటలతో, రీ రికార్డింగ్ తో దడ దడలాడించేశారు. 90 లకు వచ్చేసరికి ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఓవరాల్ గా చూస్తే 959 చిత్రాలకు చక్రవర్తి సంగీత దర్శకత్వం చేశారు. 4 తమిళం, 60 కన్నడం, 1 మలయాళం, మిగతావి తెలుగు. ఇలా తెలుగులో అత్యధిక చిత్రాలకు సంగీత దర్శకత్వం చేసిన రికార్డు చక్రవర్తిదే. ఇక ఆ రికార్డును బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదేమో!?
1985 లో చక్రవర్తి చిత్రాల చిట్టా:
——————————————-
అగ్ని పర్వతం
చట్టంతో పోరాటం
ఆత్మబలం
పుత్తడి బొమ్మ
ఆలయ దీపం
దేశంలో దొంగలు పడ్డారు
దొంగ
మహా సంగ్రామం
న్యాయం మీరే చెప్పాలి
మరో మొనగాడు
అపనిందలు ఆడవాళ్లకేనా?
బందీ
శ్రీకట్న లీలలు
బాబాయ్-అబ్బాయ్
మాయా మోహిని
నేరస్తుడు
భార్యాభర్తల బంధం
చిరంజీవి
మాంగల్య బలం
ఆడపిల్లలే నయం
భలే తమ్ముడు
రగిలే గుండెలు
ఓ తండ్రి తీర్పు
ముచ్చటగా ముగ్గురు
దేవాలయం
ఊరికి సోగ్గాడు
మహారాజు
అమెరికా అల్లుడు
పల్నాటి సింహం
ముగ్గురు మిత్రులు
పచ్చని కాపురం
వజ్రాయుధం
పులి
మాయదారి మరిది
సంచలనం
మంత్రదండం
రక్త సిందూరం
అడవిదొంగ
రణరంగం
వందేమాతరం
దాంపత్యం
ఇల్లాలే దేవత
ఇల్లాలు వర్థిల్లు
జై భేతాళ (3 డి)
కత్తుల కొండయ్య
శ్రీమతిగారు
ప్రతిఘటన
విజేత
పట్టాభిషేకం
సాగర్
అనగనగా ఒక ఇల్లు
కొంటె కాపురం
శ్రీవారు
- పులగం చిన్నారాయణ
#PulagamTalkies
#ఆనాటిఆనవాళ్లు
@santhoo9 ప్రకాశ్ రాజ్ నటనని చూసి, కోట కంటే గొప్పోడు అనేవాళ్లు, ఆన్లైన్ యుగంలో పుట్టిన పిల్లలు. ‘గణేష్’ మూవీలో ఆయన చేసిన విలనిజం, ‘ఆహా నా పెళ్లంట’ వంటి జంధ్యాల సినిమాల్లో కామెడీ, ‘ఇడియట్’ వంటి సినిమాల్లో ఎమోషన్స్.. కోట ‘నటనలో ఎవ్వరికీ అందని కోట’...
ఎన్నో అవమానాలు, మరెన్నో ఎదురుచూపులు
టన్నుల్లో టాలెంట్ ఉన్నా, దాన్ని సరిగ్గా వాడుకోలేదనే విమర్శలు
అవకాశం ఇవ్వాలని చెప్పేవాళ్లే కానీ, ఆడించేవాళ్లు కనిపించని రోజులు
అవకాశం వస్తే, దాన్ని వృథా చేస్తాడనే వాదనలు
అన్నింటినీ దాటి, సంజూ శాంసన్ శాసించాడు.. #SanjuSamson#INDvsWI