కరెంట్ కోతలు కేవలం ఒక ఇంటి సమస్య కాదు. ఇంట్లో విద్యుత్ లేకపోతే విద్యార్థుల చదువు ప్రభావితమవుతుంది. రైతుకు కరెంట్ లేకపోతే పంట ప్రభావితమవుతుంది. పరిశ్రమకు విద్యుత్ లేకపోతే ఉత్పత్తి దెబ్బతింటుంది. చిన్న వ్యాపారానికి విద్యుత్ అంతరాయం వస్తే ఆదాయం తగ్గుతుంది. అందుకే విద్యుత్ రంగం ప్రతి కుటుంబం, ప్రతి రైతు, ప్రతి పరిశ్రమ జీవితంతో ముడిపడి ఉంది. ప్రజలకు అవసరమైన విద్యుత్‌ను అందించకుండా, అదే సమయంలో బిల్లులు పెంచడం దుర్మార్గపు ఆలోచన. కాంగ్రెస్ విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి.
#Congressfailedintelangana
ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది!
యువత ఆలోచించాలి…
పట్టభద్రులు ఆలోచించాలి…
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనించాలి!
పట్టుదలతో పనిచేద్దాం…
ప్రతి పట్టభద్రుడిని కలుద్దాం…
ప్రతి అర్హుడి ఓటర్ నమోదు చేయిద్దాం…
బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం! 🚗
షాద్‌నగర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ గారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
#BRS #Graduatemlc
📢 పట్టభద్రులకు విజ్ఞప్తి.. శాసన మండలి ఓటరుగా నమోదు చేసుకోండి 🗳️
మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల ఎలక్షన్స్ కోసం షాద్ నగర్ నియోజకవర్గ పట్టభద్రులు షాద్ నగర్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఓటర్ నమోదు చేసుకోగలరు.
@BRSparty#shadnagar
"నాడు ఉపాధిని కల్పిస్తే.. నేడు ఉపాధిని మర్చిపోయారు"
◆ కేసీఆర్ పాలనలో పోలీస్, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖలో ఎన్నో ఉద్యోగాలు భర్తీ చేశారు
◆ నేటి రేవంత్ రెడ్డి పాలనలో ఉపాధి ఊసే లేదు
◆ నిరుద్యోగులను పట్టించుకునే దిక్కులేదు
◆ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది
◆ యువత ఆలోచించాలి, పట్టభద్రులు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును గ్రహించాలి
◆ పట్టుదలతో పార్టీ శ్రేణులు పనిచేసి బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని పెద్ద మెజార్టీతో గెలిపించాలి
◆ ఓటర్ నమోదు పై అన్ని వర్గాల పార్టీ శ్రేణులు దృష్టి సారించాలి
◆ షాద్ నగర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారనే విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమైందని మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ అన్నారు. సోమవారం షాద్ నగర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎన్నికల ఓటర్ నమోదుపై నిర్వహించిన పార్టీ శ్రేణుల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ పాలనలో రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్ శాఖలో వేల ఉద్యోగాలను భర్తీ చేశారని, రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తామని, నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేస్తామని నిరుద్యోగుల సాక్షిగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యువతకిచ్చిన మాట తప్పిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేజీ టు పిజీ వరకు ఉచిత విద్యనుఅందించడంతోపాటు కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత కేసిఆర్ కు దక్కితే, ఉన్న ప్రభుత్వ విద్యను నీరుగారిచే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవర్తిస్తుందని ఆరోపించారు. గత మూడు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును యువత గ్రహించాలని, పాలన తీరును ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని, నేటి నుంచే గెలుపు కోసం కృషి చేసేందుకు ఐక్యమత్యంగా నిలబడాలని కోరారు. పట్టభద్రుల ఓట్ల నమోదు ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొని, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుని కలిసి నమోదు చేయించాలని కోరారు. ఆన్లైన్, ఆఫ్లైన్లలో నమోదు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి స్థాయి అవగాహన పెంచుకొని , ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, రవీందర్ యాదవ్, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబల్ నాయక్, మహిళా కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మితో పాటు మాజీ మార్కెట్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ పీఏసీఎస్ చైర్మన్లు, మాజీ గ్రంథాలయ చైర్మన్లు, మాజీ వైస్ చైర్మన్లు, మాజీ వైస్ ఎంపీపీలు, బీఆర్ఎస్ మండల, గ్రామ, మున్సిపాలిటీ, వార్డు అధ్యక్షులు, ప్రస్తుత మరియు మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ యువత, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
#graduatemlcelection
#congressfailedintelangana
@BRSparty@KTRBRS
📢 పట్టభద్రులకు విజ్ఞప్తి.. శాసన మండలి ఓటరుగా నమోదు చేసుకోండి 🗳️
మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ మరియు వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల్లోని అర్హులైన పట్టభద్రులందరూ దయచేసి గడువు తేదీలోగా వెంటనే మీ ఓటు నమోదు చేసుకోండి:
🔗 ఆన్లైన్ లింక్: https://t.co/EvKgPfkIAd
షాద్ నగర్ నియోజకవర్గంలో గణేష్ మండపాల సందర్శన..
భక్తి కార్యక్రమాల్లో రవీందర్ యాదవ్
షాద్‌నగర్ నియోజకవర్గంలోని పలు వినాయక మండపాలను సందర్శించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ గారు.
భక్తులతో మమేకమై, ప్రత్యేక పూజల్లో పాల్గొని వినాయకుడి ఆశీస్సులు పొందారు.
వినాయక ఉత్సవాలు భక్తి భావానికి ప్రతీక – ఐక్యతకు వేదిక
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్
షాద్‌నగర్ పట్టణంలో కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ వినాయక మండపాలను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ సందర్శించారు.
"గిరిజన రిజర్వేషన్ల 10% సాధించి సెప్టెంబర్ 17కి నాలుగేళ్లు"
◆ తండాల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించాలి
◆ గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చారు.. హామీలు మాత్రం గాలికి వదిలేశారు
◆ మూడు గిరిజన కార్పొరేషన్లు ఏమయ్యాయి? రూ.500 కోట్ల హామీ ఎక్కడ?
◆ గిరిజనులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి
- మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
షాద్‌నగర్: షాద్‌నగర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అధ్యక్షతన షాద్‌నగర్ నియోజకవర్గ గిరిజన నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ గిరిజన సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, గిరిజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో గిరిజనుల జనాభా ప్రాతిపదికన 6 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌దేనని అన్నారు. 2022 సెప్టెంబర్ 17న 10 శాతం రిజర్వేషన్లపై నిర్ణయం ప్రకటించబడిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 17వ తేదీకి గిరిజన రిజర్వేషన్ల పెంపు నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని తండాల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేయాలని గిరిజన నాయకులు, కార్యకర్తలకు అంజయ్య యాదవ్ పిలుపునిచ్చారు.
*కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయి?*
2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు అనేక హామీలు ఇచ్చిందని అంజయ్య యాదవ్ అన్నారు. పోడు భూములపై అర్హులైన గిరిజనులందరికీ హక్కులు కల్పించి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మూడు గిరిజన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఒక్కో కార్పొరేషన్‌కు సంవత్సరానికి రూ.500 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తామని చెప్పారు. ప్రతి మండలంలో గిరిజన పాఠశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మరి ఆ మూడు గిరిజన కార్పొరేషన్లు ఎక్కడ? ఒక్కో కార్పొరేషన్‌కు సంవత్సరానికి రూ.500 కోట్లు కేటాయిస్తామన్న హామీ ఏమైంది? ఒక్క రూపాయి అయినా కేటాయించారా? ప్రతి మండలంలో గిరిజన పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట ఏమైంది? అని అంజయ్య యాదవ్ ప్రశ్నించారు.
#Congressfailedtelangana
#Congresslootstelangana
షాద్‌నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు.
ఈ పవిత్రమైన వినాయక చవితి సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
ఆనాడు హిట్లర్‌కు ఏ గతి పట్టిందో..
రేపు నీకూ అదే గతి పడుతుంది రేవంత్.
నీ ప్రభుత్వం ఉండేది ఇంకా 823 రోజులే...
నిన్ను వదిలిపెట్టేదే లేదు!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
⚠️ కేసీఆర్ ఇంటిపై దాడికి సర్కారీ కుతంత్రం 😡
✊🏻 జనం దెబ్బకు కాంగ్రెస్ మూకలు పరారీ! 🤡
🆘 అసెంబ్లీ నుంచి ఎర్రవల్లి దాకా రేవంత్ సేన వీరంగం
💥 అడుగడుగునా అడ్డుకొని ఉరికించిన ప్రజాగ్రహం
📌ఎదురు తన్నిన రేవంత్ డైవర్షన్.. 8 గంటలు హైటెన్షన్
🚔 కాంగ్రెస్ ఎమ్మెల్యేల నాయకత్వంలో మాజీ సీఎం నివాసం వైపు దూసుకొచ్చిన కిరాయి ముఠాలు. కాంగ్రెస్ గూండాలకు ఎస్కార్ట్ ఇచ్చి మరీ నడిపిన ఖాకీలు
📣 కేసీఆర్ కోసం రోడ్డుమీదికి వచ్చిన అభిమానులు
✊🏻 రక్షణ కవచంగా నిలిచిన ఎర్రవల్లి పరిసర పల్లెలు. వచ్చినవారిని వచ్చినట్లు తన్ని తరిమిన ప్రజలు
తెలంగాణ బాంచెన్ అంటది.. బడితెలు పడుతది.
కన్నూమిన్నూ కానక విర్రవీగితే వీపులు సాపు చేస్తది
ముందున్నది ముసళ్ల పండుగ. తస్మాత్ జాగ్రత్త!!
రేవంత్‌రెడ్డి బలగం మరో దారుణానికి ఒడిగట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేండ్ల పాటు ప్రగతి పథంలో నడిపించిన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడికి తెగబడే దుస్సాహసం చేసింది.
ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడి చేసేందుకు కాంగ్రెస్ మూకలు చేసిన ప్రయత్నాలను.. ప్రజలే పెట్టని గోడలా అడ్డుకున్నారు. తమ నేత కోసం ఊరూరా రోడ్లమీదికి వచ్చారు.
వచ్చిన గూండాలను వచ్చినట్టు పల్లెపల్లెనా అడ్డుకున్నారు. చీపుర్లు, చెప్పులతో వారిని తరిమికొట్టారు.
పోలీసులు సహకరించినా, ప్రజలు ప్రతిఘటించడంతో ముష్కర మూకలు తోకముడిచాయి.
"ఎమ్మెల్యే శంకర్ నోటి దురుసుపై బీఆర్ఎస్ భగ్గుమంది"
- కేసీఆర్ చావు కోరే స్థాయికి ఎమ్మెల్యే శంకర్ దిగజారడం సిగ్గుచేటు
- మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పిలుపుతో నియోజకవర్గవ్యాప్తంగా ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ చావును కోరుతూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమని, రాజకీయాల్లో ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలకు తావు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పిలుపుమేరకు షాద్‌నగర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
"420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? – బీఆర్ఎస్ డిమాండ్"
◆ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ నిరసన
◆ షాద్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో అధికారులకు వినతిపత్రాలు
వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆదేశాలతో షాద్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నప్పటికీ ఇచ్చిన హామీల్లో అనేకం ఇంకా అమలుకు నోచుకోలేదని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, ఉద్యోగులు, పేదలు, సామాన్య ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని, ఇకనైనా కాలయాపన చేయకుండా ప్రతి హామీ అమలుకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వెయ్యి రోజుల పాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని, మిగిలిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నిరంతరం ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
"ఖబడ్దార్ వీర్లపల్లి శంకర్!"
" కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం"
◆ తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ను అవమానిస్తే సహించేది లేదు
- మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
◆ షాద్‌నగర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఆందోళన
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసి, ప్రత్యేక రాష్ట్రం కోసం కోట్లాది తెలంగాణ ప్రజలను ఏకం చేసిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసినట్లు ఆరోపిస్తున్న అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ షాద్‌నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తీవ్ర నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను అవమానించేలా మాట్లాడటం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని అన్నారు. రాజకీయంగా విమర్శలు చేయాలంటే విధానాలు, పాలనపై చేయాలని, వ్యక్తిగతంగా దిగజారి మాట్లాడటం సరికాదని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ చేసిన కృషిని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదని అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోబోవని హెచ్చరించారు. కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అంజయ్య యాదవ్ డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి హుందాగా వ్యవహరించాలని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
"మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసే అధికారం ఎవరిచ్చారు"
◆ మహిళా ఎమ్మెల్యేల పై దాడి అప్రజాస్వామికం
◆ మహిళా ఎమ్మెల్యేలకు రక్షణ లేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి
◆ వెయ్యి రోజుల ప్రజాపాలనలో ప్రజల అవస్థలు
మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసే అధికారం ఎవరిచ్చారుని మాజీ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకురాలు ప్రశ్నించారు. అసెంబ్లీ వద్ద మహిళ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
"షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన ఆందోళనలు..."
◆ కేసీఆర్ చావు కోరిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు
◆ అంజయ్య యాదవ్ పిలుపుతో నియోజకవర్గ వ్యాప్తంగా భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావు కోరేలా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పిలుపు మేరకు షాద్‌నగర్ నియోజకవర్గవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గంలోని వివిధ మండల కేంద్రాలు, గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మలను దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శంకర్ వ్యాఖ్యలను ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
"ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి"
- షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ డిమాండ్
◆ షాద్ నగర్ లో ప్రభుత్వ ప్రజావాణి కార్యక్రమంలో నిరసన
◆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసన, ప్రదర్శన
◆ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వినతిపత్రం అందజేత
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను, హామీలను వెంటనే అమలు చేసి తీరాలని బీఆర్ఎస్ పార్టీ షాద్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొని, స్థానిక ఎంపీడీవో శ్రీకాంత్‌కు విజ్ఞాపన పత్రాన్ని (మేమోరాండం) అందజేశారు. పట్టణ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు దాటుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను సమర్థవంతంగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రధాన డిమాండ్లను అంజయ్య పేర్కొంటూ మహాలక్ష్మి, పింఛన్లు మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, ఉచిత స్కూటీలను తక్షణమే అందించాలని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెంచిన రూ. 4,000 పింఛన్‌ను అమలు చేయాలని కోరారు. రైతు సంక్షేమంలో రైతులకు 'రైతు భరోసా', పంట బోనస్, నిరంతర ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించడంతో పాటు రైతు కూలీలకు ఏటా రూ 12,000 అందించాలని స్పష్టం చేశారు. ఉపాధి, విద్య నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతితో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా స్థానిక సమస్యలలో భాగంగా నియోజకవర్గంలో ఆగిపోయిన పారిశుద్ధ్య నిర్వహణను వెంటనే పునరుద్ధరించాలని, హక్కుల కోసం ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలని ప్రభుత్వానికి హెచ్చరించారు. నియోజక వర్గ నలుమూలల నుండి పెద్ద ఎత్తున హాజరైన బీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను అధికార పార్టీ నాయకులు టార్గెట్ చేయడం మంచి పద్దతి కాదని హెచ్చరించారు.