మహిళా సాధికారత అనేది కేవలం నినాదం కాదు.. దే��� అభివృద్ధిలో మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పించాలన్న ప్రధాని శ్రీ @narendramodi గారి దృఢ సంకల్పం. దేశ జనాభాలో సగభాగమైన మహిళల కలలు, ఆకాంక్షలకు బలమిస్తూ, వారికి నిర్ణయాధికారంలో సముచిత స్థానం కల్పించి, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలన్న లక్ష్యం దిశగా ఎన్ని రాజకీయ అడ్డంకులు ఎదురైనా, మహిళా సాధికారత కోసం సాగుతున్న ఈ ప్రస్థానం ఆగదు
సీనియర్ పార్లమెంటేరియన్, మాజీ ఎంపీ శ్రీ రాయపాటి సాంబశివరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి, విచారానికి గురిచేసింది. గుంటూరు, నరసరావుప��ట నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ.. ఐదుసార్లు లోక్సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘ కాలం ప్రజాజీవితంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి, వారికి సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నేత్రుత్వంలోని కేంద్ర NDA ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసింది. మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేసే డీలిమిటేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్న నేపథ్యంలో, ఈ బిల్లు ఆవశ్యకతను గుర్తించిన పలు రాజకీయ పార్టీలు కేంద్ర NDA ప్రభుత్వానికి మద్దతుగా ముందుకు వస్తున్న కీలక సమయంలో INC పార్టీ తన రాజకీయ స్వార్థంతో ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించడం విచారకరం. మహిళల ఆకాంక్షలకు, సాధికారతకు అడ్��ుపడే ఇటువంటి వైఖరిని దేశ ప్రజలు క్షమించరు. మహిళా సాధికారత పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ఈ బిల్లు ప్రాధాన్యతను గుర్తించి, మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించే ఈ చారిత్రాత్మక ప్రక్రియకు సహకరించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
నేర్చుకోవడానికి వయోపరిమితి లేదు. నిరంతరం నేర్చుకుంటూ, ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవడమే వ్యక్తిగత అభివృద్ధికి అసలైన పునాది అంటూ స్ఫూర్తిదాయక సందేశాన్ని నేటి 'మన్ కీ బాత్' 140వ ఎపిసోడ్లో ప్రధాని శ్రీ @narendramodi గారు వివరించడం అభినందనీయం. ప్రభుత్వ ఉద్యోగులు నిరంతరం నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ, ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించేలా కేంద్ర NDA ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 'iGOT కర్మయోగి' వేదిక ఒక గొప్ప ముందడుగు. నేర్చుకోవడాన్ని నిరంతర ప్రక్రియగా మార్చుకుంటూ, నైపుణ్యవంతమైన మానవ వనరులను తీర్చిదిద్దినప్పుడే 'వికసిత భారత్' నిర్మాణం సాకారం అవుతుంది.
సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును అనుసరించి, తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ప్రాచీన ''దీపత్తూణ్'' రాతి స్తంభం వద్ద హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్ల పర్యవేక్షణలో నేడు సంప్రదాయ కార్తీక దీపాన్ని భక్తిశ్రద్ధలతో వె��ిగించారు. శతాబ్దాల నాటి సనాతన సంప్రదాయాలకు, హిందువుల విశ్వాసాలకు లభించిన ఈ గుర్తింపు భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన గౌరవం.
గ్రామీ అవార్డు గ్రహీత అమెరికన్ అకాపెల్లా గాన బృందం 'చాంటిక్లియర్' స్విట్జర్లాం��్లోని సోల్స్బర్గ్ ఫెస్టివల్ 2026లో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన అద్భుత సంకీర్తన 'బ్రహ్మమొక్కటే' ను ఆలపించడం ఎంతో ఆనందదాయకం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ గర్వకారణం. మానవులందరిలో సమానత్వ భావన, సమస్త జీవుల ఏకత్వాన్ని చాటే ఈ సంకీర్తన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, తెలుగు సంస్కృతి, సాహిత్యం, ఆధ్యాత్మిక వైభవాన్ని దేశ సరిహద్దులు దాటి విశ్వవ్యాప్తం ���ేస్తోంది.
గౌరవనీయ కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ మరియు నూతన & పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి శ్రీ @JoshiPralhad గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వినియోగదారుల సంక్షేమం, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం, పునరుత్పాదక ఇంధన రంగ అభివృద్ధిలో మీ నిబద్ధత ఎంతో స్ఫూర్తిదాయకం. భగవంతుడు మీకు నిండు నూరేళ్ల ఆయుర���రోగ్యాలు ప్రసాదించాలని, ప్రజాసేవలో మీరు మరెన్నో శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సామాజిక అసమానతలను రూపుమాపడానికి, బహుజన విద్యావ్యాప్తికి తన జీవితాన్నే అంకితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతీరావ్ ఫులే గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. దేశంలోనే తొలిసారిగా స్త్రీ విద్య కోసం పాఠశాల స్థాపించి, సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన పోరాటం మనందరికీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కార్యరూపం కల్పిస్తూ, 2029 లోక్సభ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలుకు మార్గం సుగమం చేసే డీలిమిటేషన్ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం చారిత్రాత్మక నిర్ణయం. రాష్ట్రాల వారీగా లోక్సభ స్థానాలను 50% పెంచుతూ మహిళలకు మరింత విస్తృతమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే ఈ కీలక ముందడుగు, ప్రధాని శ్రీ @narendramodi గారి దృఢ సంకల్పం, చిత్తశుద్ధికి నిదర్శనం.
నేడు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశాన్ని న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే విలువలతో ముందుకు నడిపించే మార్గదర్శి మన భారత రాజ్యాంగం. ప్రతి పౌరుడికి హక్కులు, ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పిస్తూ దేశ ఐక్యతను బలోపేతం చేయడానికి, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధికి రాజ్యాంగం దిశానిర్దేశం చేస్తోంది. ప్రపంచంల��నే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారితో పాటు రాజ్యాంగ రూపకల్పనలో భాగస్వాములైన మహనీయులందరినీ మనం నిత్యం స్మరించుకుంటూ, వారి కృషికి కృతజ్ఞతలు తెలుపుకుందాము.
ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన మూలస్తంభం మన న్యాయవ్యవస్థ. రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ, సామాన్యుడికి సైతం సత్వర, నిష్పక్షపాత న్యాయం అందించడమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్న గౌరవ న్యాయమూర్తులకు, న్యాయవాదులకు మరియు న్యాయ వ్యవస్థలోని ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు.
చట్టబద్ధమైన పాలనతోనే సమాజంలో శాంతి, భద్రతలు మరియు దేశ ప్రగతి సాధ్యమవుతాయి. ప్రతి పౌరుడికి చట్టాలపై అవగాహన పెరగాలని, అందరికీ సమన్యాయం అందాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!
భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు, 'మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా' డాక్టర్ వర్గీస్ కురియన్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
సహకార ఉద్యమం ద్వారా లక్షలాది మంది పాడి రైతుల జీవితాల్లో వెలుగులు నింపి, మన దేశాన్ని పాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిపిన ఆయన కృషి చిరస్మరణీయం. ఈ సందర్భంగా మనందరికీ పౌష్టికాహారాన్ని అందిస్తున్న పాడి రైతులందరికీ ��భినందనలు తెలుపుతూ.. ప్రజలందరికీ జాతీయ పాల దినోత్సవ శుభాకాంక్షలు!
గతంలో పన్నుల విధానంలోని లోపాలు, ఆదాయ లీకేజీలతో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరిస్తూ, గత ఏడాది నవంబర్ 23 నాటికి నమోదైన రూ.62,604 కోట్ల రాష్ట్ర సొంత ఆదాయంతో పోలిస్తే, ఈ ఏడాది అదే తేదీ నాటికి రూ.74,342 కోట్లకు చేరి 18.7% వృద్ధిని నమోదు చేయడం విశేషం. ప్రజలపై ఒక్క రూపాయి కూడా అదనపు పన్నుల భారం మోపకుండా, ఎలాంటి ఛార్జీలు పెంచకుండానే ఈ వృద్ధిని సాధించడం NDA కూటమి ప్రభుత్వ సమర్థవంతమైన పాలనకు నిదర్శనం. AI, డిజిటలైజేషన్ వంటి ఆధునిక సాంకే��ికతను వినియోగించడంతో పాటు, పారదర్శక సంస్కరణల ద్వారా ఆదాయ లీకేజీలను అరికట్టడం వల్ల ప్రధాన శాఖల్లో ఆదాయం గణనీయంగా పెరిగింది. సామాన్యుడిపై అదనపు భారం వేయకుండా, సమర్థవంతమైన పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, స్వర్ణాంధ్ర నిర్మాణానికి NDA కూటమి ప్రభుత్వం బలమైన పునాది వేస్తోంది.
ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి దార్శనిక నాయకత్వంలో గత 12 ఏళ్లలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 2014లో 304 బిలియన్ డాలర్ల నుంచి 2026 నాటికి 785.7 బిలియన్ డాలర్లకు పెరిగి, 2.5 రెట్లకు పైగా వృద్ధి సాధించడం మన దేశ ఆర్థిక బలానికి, స్థిరత్వానికి నిదర్శనం. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులను సమర్థంగా ఎదుర్కొంటూ, అంతర్జాతీయంగా భారత్ ఆర్థికంగా మరింత దృఢంగా ఎదుగుతోంది.
సిక్కు మత స్థాపకులు, ఆధ్యాత్మిక గురువు శ్రీ గురునానక్ దేవ్ జీ జయంతి సందర్భంగా సిక్కు సోదర సోద��ీమణులకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
'దేవుడు ఒక్కడే.. మానవులందరూ సమానమే' అనే విశ్వమానవ సందేశాన్ని చాటిచెప్పిన గురునానక్ దేవ్ జీ, నిజాయితీతో కష్టపడి సంపాదించడం, సంపాదించిన దానిలో ఇతరులతో పంచుకోవడం, నిస్వార్థంగా సేవ చేయడం వంటి గొప్ప జీవిత సూత్రాలను బోధించారు. ఆయన ఆశయాలు, ఆదర్శాలు ప్రతి ఒక్కరిలో సేవాభావాన్ని, ఐక్యతను పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నాను.
పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళామణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పర్వదినంగా భావించే కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక చింతనకు, భక్తిభావానికి, దైవానుగ్రహానికి ప్రతీక. ఈ శుభద���నాన వెలిగించే దీపాలు అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును నింపాలనే గొప్ప సందేశాన్ని అందిస్తాయి. కార్తీక దీపారాధన మనలో ఆత్మశుద్ధి, సత్ప్రవర్తన, ధర్మనిష్ఠ వంటి సద్గుణాలను పెంపొందించుకోవాలనే స్ఫూర్తినిస్తుంది. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతిసౌభాగ్యాలు వెల్లివిరిసేలా చేయాలని, ఆ భగవంతుని కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాం���్షిస్తున్నాను
Thana expressions, dialogue timing, body language anni kalisthe comedy next level 😂🔥 Sankranthi ki manchi fun expect chesthunna! #FamilyPack@sreevishnuoffl
నేడు విజయవాడ నగర మేయర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ @VangaveetiOffl గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే, నూతన కార్పొరేటర్లుగా బాధ్యతలు చేపడుతున్న ప్రతి ఒక్కరికీ నా అభినందనలు.
నేడు కొలువుదీరనున్న నూతన నగర పాలకవర్గాని��ి విజయవాడ సమగ్ర అభివృద్ధి మరియు నగర ప్రజల ఆకాంక్షల సాధనలో నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. పార్టీలకు అతీతంగా, అందరం సమిష్టి కృషితో, కలిసికట్టుగా పనిచేస్తూ మన విజయవాడ నగరాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్దాం. (File Photo)
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి జయంతి సందర్భంగా వారికి భక్తిపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ప్రేమ, మానవత్వం, సేవాభావం వంటి విలువలను తన జీవిత సందేశంగా ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయి బాబా గారు. విద్య, వైద్��ం, తాగునీరు వంటి ప్రాథమిక అవసరాలను పేదలకు ఉచితంగా అందిస్తూ, లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్నో గ్రామాలకు, ప్రత్యేకించి రాయలసీమలోని కరువు పీడిత ప్రాంతాలకు సురక్షిత తాగునీటిని అందించి ప్రజల దాహార్తిని తీర్చారు. 'మానవ సేవే మాధవ సేవ' అనే ఆయన సందేశం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన చూపిన సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ పయనిస్తూ సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను.