teacher's focus should remain on education, not medical expenses. UP's cashless healthcare initiative provides a crucial financial shield during medical emergencies.
#YogiCashlessChikitsa
Jab innovation aur anticipation ek saath milte hain, tab Galaxy Unpacked jaisa moment banta hai. 🚀 #NewShape ko pre-reserve karke excitement ko next level par le jao.
ఇండోనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రబోవో సుబియాంటో గారు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని కొనియాడుతూ, 'మీ అద్భుత రాజకీయ ప్రస్థానాన్ని అనుసరిస్తూ, మీ సంక్షేమ పథకాలను మరియు అభివృద్ధి నమూనానే స్ఫూర్తిగా తీసుకుని పాలిస్తున్నాను' అని చేసిన వ్యాఖ్యలు మనందరికీ ఎంతో గర్వకారణం.
మన గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారు నేడు కేవలం మన దేశ యువతకు, రాజకీయ నాయకులకే కాదు.. ప్రపంచ దేశాల అధిపతులకు మరియు ప్రజలకు కూడా గొప్ప స్ఫూర్తిప్రదాత అనడంలో సందేహం లేదు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వీబీ జీరామ్‌జీ' పథకం అమలులో, తొలిరోజే అత్యధిక ఉపాధి కల్పనతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవడం NDA కూటమి ప్రభుత్వ పాలనా చిత్తశుద్ధికి నిదర్శనం. అదేవిధంగా, ఈ పథకం కింద తొలి విడతగా రాష్ట్రానికి రూ.1,414.16 కోట్ల నిధులు విడుదల కావడం హర్షణీయం. గ్రామీణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూ, ముందుకు సాగుతోంది.
డెహ్రాడూన్‌లో జరిగిన 21వ నేషనల్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన రాష్ట్ర క్రీడాకారిణి, జిల్లా వాసి అయిన పెదిరెడ్ల చైత్ర దీపికను ఈరోజు తాడిగడప క్యాంప్ కార్యాలయంలో అభినందించడం జరిగింది.
ఇప్పటివరకు ఆర్టిస్టిక్, ఐస్ స్కేటింగ్ విభాగాల్లో 62 పతకాలు సాధించి తన అద్భుత ప్రతిభతో మన రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన చైత్ర దీపిక, భవిష్యత్తులో మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించి దేశానికే గర్వకారణంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.
పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే జీవిత లక్ష్యంగా, ప్రజల కోసం అంకితభావంతో సేవలందించిన మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా నిన్న విద్యాధరాపురంలోని VM రంగా జంక్షన్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించాను. అనంతరం అక్కడ ఉన్న పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. శ్రీ మోహన్ రంగా గారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరం మన వంతు కృషి చేయడమే మనం ఆయనకు అందించే నిజమైన నివాళి.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే క్రమంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ జరుగుతున్న అభివృద్ధి పనులను కూటమి నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించాను. ఇన్సెంటివ్ ఫండ్స్ రూ.7 కోట్లతో ఐరన్ యార్డ్, బైపాస్ రోడ్డు, పార్థసారధి రోడ్డు, పంజా సెంటర్లలో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీల నిర్మాణం, అలాగే VMC జనరల్ ఫండ్స్ రూ.1.20 కోట్లతో బాక్స్ కల్వర్టుల పనులను ఇప్పటికే ప్రారంభించటం జరిగింది. ఈ నిర్మాణ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా, అత్యున్నత నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, నిర్దేశిత కాలవ్యవధిలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించడమైనది.
ప్రజల కష్టాల్లో అండగా నిలవడమే ప్రజా ప్రతినిధిగా నా బాధ్యతగా భావిస్తూ, అందులో భాగంగా నేడు భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 48 మంది లబ్ధిదారులకు రూ.34,07,396 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కూటమి నాయకులతో కలిసి అందజేయడం సంతోషంగా ఉంది.
గత రెండేళ్ల కూటమి పాలనలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 866 మంది లబ్ధిదారులకు రూ.10.61 కోట్లకు పైగా CMRF ద్వారా సాయం అందించి ఆపదలో ఉన్న కుటుంబాలకు భరోసాగా నిలవటం జరిగింది. ప్రజల సంక్షేమమే తొలి ప్రాధాన్యంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను.
పశ్చిమ విజయవాడ ప్రజలకు నేను ఇచ్చిన మరో ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా కీలక ముందడుగు వేయడం జరిగింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వన్‌టౌన్–టూటౌన్ కనెక్టివిటీ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఎర్రకట్ట–రాజరాజేశ్వరిపేట రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని నేడు రైల్వే అధికారులతో కలిసి పరిశీలించి, వెంటనే DPR సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాను. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే వన్‌టౌన్–టూటౌన్ మధ్య రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు ట్రాఫిక్ సమస్యలకు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. అలాగే స్థానిక వ్యాపార కార్యకలాపాలు వేగం పుంజుకుని, పశ్చిమ విజయవాడ అభివృద్ధికి ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తుంది.
భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి, జ్ఞాన దీప్తి, మన సంస్కృతికి ప్రతిరూపం శ్రీ స్వామి వివేకానంద గారి స్మృతి దినం సందర్భంగా ఆ మహనీయుడికి నా హృదయపూర్వక నివాళులు. "లేవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి" అంటూ ఆయన అందించిన సందేశం యువతకు నిరంతర స్ఫూర్తి.
మన్యం ప్రజల విముక్తి కోసం, స్వేచ్ఛా వాయువుల కోసం బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహస్వప్నంలా నిలిచిన విప్లవ జ్యోతి, ధైర్యసాహసాలకు మారుపేరు అయిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను.