జనసేన పార్టీకి, నాయకులకు, జనసైనికులు, వీర మహిళలకు ఎంతో ప్రత్యేకమైన రోజు జనసేనాని @PawanKalyan గారి పుట్టినరోజైన సెప్టెంబర్ 2వ తారీఖున ఘనంగా "జనసేన యువజన విభాగం" ఆవిష్కరణ.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమున్న ప్రతి చోట జనసేన పోటీ చేస్తుంది. మన కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, ఈ రెండేళ్లలో రూ. 1.46 లక్షల కోట్లతో అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా అభ్యర్థులు చెప్పగలగాలి.
సెప్టెంబర్ 2వ తేదీన జనసేన యువజన విభాగం ఆవిష్కరణ పిఠాపురంలో
- 175 నియోజక వర్గాలలో ఘనంగా కార్యక్రమం నిర్వహణ
- తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు
జనసేన పార్టీ యువజన విభాగాన్ని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఆవిష్కరించనున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11 గంటలకి యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని జన సైనికులు, వీర మహిళలు, నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ , రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ రోజు యువజన విభాగం లోగో, గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆన్ లైన్ ద్వారా పార్టీ శ్రేణులకు సందేశం ఇస్తారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం కేరళలో చికిత్స తీసుకొంటున్న సంగతి విదితమే. యువజన విభాగం ఏర్పాటు ఉద్దేశం, విభాగం లక్ష్యాలు, యువతలో రాజకీయ చైతన్యం తదితర అంశాలపై దిశానిర్దేశం చేస్తారు.
యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
The wait is almost over! 👀❤️🔥
#Panja4K Vimal Celebration Show details & ticket distribution update coming tomorrow morning (Sunday).
Get ready, Pawan Kalyan fans! 🔥🔥
Stay Tuned to @VimalPKFC ! 🫡
Happy Birthday, dear @iamnagarjuna 💐
May God bless you with good health, happiness and many more wonderful years ahead.
Many congratulations and best wishes on your landmark 100th film #King100. 🤗
Heartiest congratulations to my dear brother Ravi on the blockbuster success of #Irumudi 💐
Thoroughly enjoyed the film from beginning to end. What a phenomenal performance @RaviTeja_offl, you carried Trinadh character entirely on your shoulders 👏🏻
Director @ShivaNirvana, you have done a wonderful job presenting the film with such depth and emotion.
Blessings to #BabyNakshathra for a very bright future, My warm congratulations to the entire cast and crew, and to producers Naveen Yerneni and Ravi Shankar of @MythriOfficial, on this well-deserved success.
ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే.
ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు.
మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి!
#LiveAndLetLive
@priya_Bshankar@saikumaractor@gvprakash
చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాద ఘటనపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారుల నుంచి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని స్పష్టం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రైవేటు బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, తనిఖీలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు.
-ఉప ముఖ్యమంత్రివారి కార్యాలయం