సాగునీటి కోసం రైతు సంగ్రామం! 🔥
రైతుల్లో పెల్లుబికిన ఆగ్రహం..
జూరాల గేట్లు ఎత్తివేత!
వారం రోజులుగా సాగునీటి కోసం రైతులు ధర్నాలు చేస్తున్నా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. పంటలు ఎండిపోతుంటే ఇక సహించలేక.. రైతులు జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకుని తాళాలు బద్దలుకొట్టి ఎడమ కాలువ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసుకున్నారు.
రైతులు గేట్లు తెరిచిన అనంతరం అధికారులు వాటిని మూసివేయడం.. మళ్లీ రైతులు ఆందోళనకు దిగకుండా జూరాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం.. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
రైతు పంటను కాపాడేది నీరు.. రైతు సహనాన్ని పరీక్షించొద్దు!
రైతుల ఆగ్రహ జ్వాలల ముందు నీ అహంకారం బద్దలవ్వడం ఖాయం రేవంత్!
నీ పని అయిపోయింది రేవంత్!
తెలంగాణ సమాజం నీ పచ్చి అబద్ధాలను, మోసాలను పసిగట్టింది, నీ దిగజారుడు చిల్లర మాటలను ఛీత్కరిస్తోంది.
అందుకే.. ట్యాంక్ బండ్ దగ్గర వినాయక నిమజ్జనం సాక్షిగా తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో మళ్లీ "కేసీఆర్ గారే రావాలి" అని కోరుకుంటున్నారు!
నీళ్లు ఉన్నా మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం!
ఇది కాలం తెచ్చిన కరువు కాదు..
కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువు!
#CongressFailedTelangana#CongressBetrayedFarmers
పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వంపై
అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు
ఇది బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి దక్కిన విజయం
రేవంత్ ఫిరాయింపు, చిల్లర రాజకీయాలకు ఇదే చెంపపెట్టు!
- ఎమ్మెల్యే @KaushikReddyBRS🔥
సీఎం రేవంత్..
నువ్వు చేసిన ఆరోపణల్లో ఒక్కటంటే ఒక్కశాతం నిజం లేకపోయినా.. నీకు ఓ ఆఫర్ ఇస్తున్నా..
మా కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ పనిగట్టుకుని చేస్తున్న విషప్రచారంపై.. నీకు ఓ సవాల్ విసురుతున్నా..
మాకున్న ఆస్తులన్నీ రాసిస్తాం… రాష్ట్రంలోని పేద ప్రజల ఖాతాలో రూ.లక్ష కోట్లు వేస్తావా..??
తెలంగాణలోని పేద ప్రజల ఖాతాలో వెంటనే నువ్వు లక్ష కోట్లు వేస్తానంటే.. మా పేరుతో ఉన్న ప్రతి ఇంచు భూమిని రాసిస్తాం..
లేకపోతే… నీ పిచ్చి ప్రచారాన్ని ఇకనైనా మానుకుని వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు.
వెయ్యి ఎకరాల ఫామ్ హౌజ్ అంటూ నువ్వు ఇంతకాలం చేసిన విషప్రచారం బెడిసి కొట్టడంతో.. కేసీఆర్ గారి కుటుంబానికి లక్షకోట్ల భూములు అంటూ ఈ విష ప్రచారం చేయడానికి సిగ్గనిపిస్తలేదా ??
కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది కేవలం 67 ఎకరాలు మాత్రమేనని నువ్వే అసెంబ్లీలో స్వయంగా ఒప్పుకున్నాక కూడా మళ్లీ కుతంత్రాలతో కట్టుకథలు అల్లుతావా ??
నీ వెయ్యిరోజుల పాలనా వైఫల్యాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకే ఈ కుట్ర చేస్తున్నట్టు తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది.
420 హామీల మోసాలనుంచి, 22 ఏ భూకుంభకోణం నుంచి ఈ చిల్లర ఆరోపణలతో నాలుగుకోట్ల ప్రజల దృష్టిని మళ్లించలేవు.
నువ్వు చేసిన ఆరోపణల్లో విషం తప్ప విషయం లేదు. అందులో అసత్యాల వరద, అబద్ధాల బురద తప్ప ఒక్కటంటే ఒక్క శాతం నిజం లేదని తెలిసినా ఎందుకీ కుప్పిగంతులు..??
గతంలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం పేరిట ఇలాగే దుష్ప్రచారం చేసి నేటికీ ఒక్క పైసా అవినీతిని నిరూపించలేకపోయావు.
ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబానికి లక్ష కోట్ల భూముల పేరిట మరో అబద్ధాల జపం చేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారని అనుకోవడం నీ అవివేకానికి నిదర్శనం.
తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి, నాలుగు కోట్ల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ గారి జీవితం ఓ తెరిచిన పుస్తకం.
ఓవైపు రైతులు కరెంట్ కోతలు, యూరియా సంక్షోభం, సాగునీటి తండ్లాటతో అల్లాడుతుంటే సోయిలేకుండా ప్రధాన ప్రతిపక్షంపై బురదజల్లుతావా ??
నిరుద్యోగులకు తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి వెయ్యి రోజులైనా పట్టుమని పదిశాతం భర్తీచేయని నీ చేతకానితనాన్ని ఇలాంటి విష ప్రచారంతో కప్పిపుచ్చలేవు.
పవిత్రమైన అసెంబ్లీని కూడా అసత్యాలు, అభూతకల్పనలతో చట్టసభ గౌరవానికి భంగం కలిగించి క్షమించరాని పాపాన్ని ఇప్పటికే మూటగట్టుకున్నావు.
22ఏ కింద కోటి 20 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాతో చేర్చడం వెనకే... నువ్వు చెబుతున్న లక్ష కోట్ల భూముల కుంభకోణం దాగి ఉంది.
అక్రమ దందాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలతో అడ్డదారిలో అందలం ఎక్కిన నీకు దోచుకోవడం, కుంభకోణాలు చేయడం తప్ప, పరిపాలన చేతకాదని సకల జనులకు అర్థమైపోయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే మీ అవినీతి అక్రమాలు, కుంభకోణాలన్నంటినీ బయటపెడతాం.. మీరు దోచుకున్న ప్రతిపైసాను తెలంగాణ ప్రజల సాక్షిగా కక్కిస్తాం..
జై తెలంగాణ
Danam Nagender Episode Exposes Congress’s Double Standards on the Constitution
The Telangana High Court’s judgment in the Danam Nagender disqualification case has exposed the Congress Government’s double standards.
Danam Nagender won on a BRS ticket, defected to Congress, and continued as an MLA while contesting the Lok Sabha election as a Congress candidate. Yet, instead of protecting the sanctity of the people’s mandate, the Speaker’s decision gave him protection. The High Court’s intervention has now raised serious questions about the Speaker’s handling of the matter.
@RahulGandhi ji goes around the country claiming to be the champion of the Constitution, while Congress’s 2024 manifesto promised to amend the Tenth Schedule and make defection an automatic ground for disqualification. But when defections benefit Congress, where does that constitutional commitment disappear?
In the light of the High Court’s order, the Speaker should, at least now, act on the disqualification petitions against the other defected MLAs in accordance with the Constitution and the law.
If Rahul Gandhi is truly committed to protecting the Constitution, he should instruct CM Revanth Reddy to ask all the defected MLAs to resign and seek a fresh mandate from the people.
@INCIndia and Rahul Gandhi must answer the people. Is their commitment to the Constitution genuine, or does it change with political convenience?
Satyameva Jayate!
Satyameva Jayate !!
BRS MLA Danam Nagendar who defected to Congress got disqualified by the Hon’ble High Court today
The rest of the defectors will also meet the same fate soon
ధర్మపురి నియోజకవర్గం ఎండపెల్లి మండల అధ్యక్షులు సింహాచలం జగన్ గారు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నందున వారి కుటుంబానికి @BRSparty తరఫున @KTRBRS గారు 10 లక్షల ఆర్థిక సాయం చేయడం జరిగింది..
@BRSHarish@BrsSabithaIndra@balkasumantrs
My Heartfelt Birthday wishes to the Hon’ble Prime Minister Shri @narendramodi Ji.
Wishing you good health, happiness and strength always sir.
Your leadership and vision for a Viksit Bharat continue to inspire millions across the country.
Moved by your tireless hardwork and selfless service to the nation, I'm joining the Seva Sankalp Abhiyan.
As my contribution to this initiative, I pledge to provide skill development to 1000 women in the coming months.
రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా..
బీఆర్ఎస్ హయాంలో ధరణి విషయంలోగానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో భూ భారతి విషయంలోగానీ జరిగిన వ్యవహారాలపై విచారణ జరిపిద్దాం.
సుప్రీంకోర్టు జడ్జితో అయినా, హైకోర్టు జడ్జితో అయినా విచారణకు మేం సిద్ధం..
నువ్వు సిద్ధమా ? @revanth_anumula
#CongressFailedTelangana
#CongressLootingTelangana
పాలమూరు నీటి గోసను తీర్చిన అపర భగీరథుడు కేసీఆర్!
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పంపులు ప్రారంభించి నేటికి మూడేళ్ళు
ఉమ్మడి పాలనలో వలసలకు, కరువు కాటకాలకు నెలవుగా నిలిచిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌ది.
పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది.
ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సాగునీరు అందించేందుకు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు.. 12.30 లక్షల ఎకరాలను కృష్ణా జలాలతో తడిపేందుకు ప్రణాళికలు రచించారు.
సరిగ్గా మూడేళ్ల క్రితం, సెప్టెంబర్ 16, 2023 న నార్లాపూర్ పంపును కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది.. ఆ తర్వాత వచ్చిన రేవంత్ సర్కార్ పాలమూరు ప్రజల నీటి అవసరాలను పూర్తిగా విస్మరించింది.
నార్లపూర్ పంపును ఆన్ చేసి మూడేళ్ళు నిండిన సందర్భంగా.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిపోయిన కొన్ని పనులను త్వరతగతిన పూర్తి చేసి, పంట పొలాలకు నీళ్ళు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాను.
కేసీఆర్ మీద కక్షతో పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టొద్దని హెచ్చరిస్తున్నాను.