కుంటి సాకులు చెప్పి, సంబంధం లేని కాగితాలు చూపి ప్రతిపక్షం అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పకుండా "తగుదునమ్మా" అంటూ వచ్చి తప్పించుకున్నట్లు ఉంది @Bhatti_Mallu గారి పత్రికా సమావేశం.
విద్యుత్ వినియోగదారులపై ట్రూప్ అప్ చార్జీల పేరిట 5,420 కోట్ల భారం మోపడం గురించి BRS ప్రశ్నిస్తే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోవడం ప్రజా పాలన అంటారా?
ప్రజలపై మోపిన భారాన్ని ఉపసంహరించుకొని పండుగ పూట శుభవార్త చెబుతారనుకుంటే భట్టి గారు ఉసూరుమనిపించారు.
కానీ 5,420 కోట్ల భారం ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తామని భట్టి గారు పక్కనే కూర్చొని అధికారులతో చెప్పించడం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనం.
రైతులు రోడ్ల మీదకు వచ్చి కరెంట్ కోసం ధర్నాలు చేస్తుంటే, కోతలే లేవు అని చెప్పడం మీకే చెల్లింది.
మీరు సక్రమంగా కరెంట్ సరఫరా చేస్తే రైతులు ఎందుకు సబ్ స్టేషన్ల ముందు వస్తారు? ఎందుకు రోడ్లపై ధర్నాలు చేస్తారు?
BRS ప్రభుత్వ హయాంలో ఏనాడైనా ఇలా రైతులు రోడ్లెక్కారా? మీరు తెస్తానన్న అనాటి రోజుకు ఇవేనా?
ప్రజల సమస్యల గురించి మాట్లాడుతుంటే సవాళ్లు విసిరన భట్టి గారూ..మేము అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా ఎందుకు సమాధానం చెప్పలేదు?
భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ 15.02.2018 నాటి F. No. 23014/1/2018-CLD ప్రకారం, ఎస్సీసీఎల్ (SCCL) గనుల నుండి 14 MTPA G-9 గ్రేడ్ బొగ్గును యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు కేటాయించింది.
మరి కేటాయింపు లేదు అని ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎందుకు సత్య దూరపు మాటలు మాట్లాడారు?
ఎల్ ని నో సాకు చెబుతూ యాదాద్రిలో 3000 మెగావాట్లు, భద్రాద్రిలో 540 మెగావాట్లు, కేటిపిఎస్ లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అగిన మాట నిజం కాదా? ఇది మీ పరిపాలన వైఫల్యం కాకుంటే మరేమిటి?
రాష్ట్రంలో మొత్తంగా 140 మిలియన్ యూనిట్ల కెపాసిటీ ఉంటే 89 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు మీరే చెప్పారు కదా. ఇది మీ వైల్యం కాదా?
బొగ్గు ఉన్న దగ్గరే విద్యుత్ ప్లాంట్ ఉండాలె అని చెబుతున్న మీరు, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాయలసీమలో నీళ్ళు, బొగ్గు లేని చోట థర్మల్ ప్లాంట్ పెట్టింది నిజం కాదా? ఆనాడు ఎందుకు మౌనంగా ఉన్నారు?
సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫెట్ అనే నిబంధన పెట్టి అధిక ధరలకు టెండర్లు కట్టబెట్టి, అనుయాయులు లబ్ధి చేకూర్చింది మీ ప్రభుత్వం కాదా? ఇప్పటికీ ఆ టెండర్లు రద్దు చేయనిది, విచారణ జరపంది నిజం కాదా?
మన రాష్ట్ర విద్యుత్ అవసరాలు పక్కన పెట్టి, సింగరేణి నిర్మిస్తున్న 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ను రాజస్తాన్ రాష్ట్రానికి ఇవ్వాలని మీరు ఒప్పందం చేసుకున్నది స్వయంగా మీరు కాదా? ఇది రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసే నిర్ణయం కాక మరేమిటి?
రూపాయి పెట్టుబడి లేకుండా, తక్కువ ధరకు 1600 మెగావాట్ల విద్యుత్ ను మన రాష్ట్రానికి ఎన్టీపీసీ సరఫరా చేస్తానన్నా దాన్ని తిరస్కరించి, ఈరోజు విద్యుత్ కోతలకు కారణం అయ్యింది మీరు కాదా?
40లక్షల టన్నుల బొగ్గు నిల్వలు లేనివి ఉన్నట్లు చూపి ఇన్కమ్ టాక్స్, కోల్ సెస్, DMFT చెల్లించి మోసం చేసింది నిజం కాదా?
ఆ 40 లక్షల టన్నుల బొగ్గు ఎటు పోలేదని బుకాయించిన మీరు, ఈనాడు బొగ్గు కొరత ఉందని చెప్పడం తలా తోక లేని వ్యవహారం కాదా? నిజంగా ఆ 40 ఆ లక్షల టన్నుల బొగ్గు ఉండి ఉంటే, ఈరోజు కరెంట్ కష్టాలు ఎందుకు ఉంటాయి?
నదుల్లో నీళ్లు ఉన్నా మోటార్లు నడప నీళ్లు లిఫ్ట్ చేయక సాగు నీళ్లు అందించలేదు.
బొగ్గు నిల్వలు పెట్టుకోకుండా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయక రైతులకు కరెంట్ సరఫరా చేయడం లేదు.
మీ పాలన నిర్లక్ష్యం వల్ల సాగు నీటి కొరత, కరెంట్ కొరత వచ్చింది నిజం కాదా?
సింగరేణి సహా విద్యుత్ సంస్థలను IPO, కొత్త అప్పుల దిశగా తీసుకు వెళ్లేందుకు ఎనర్జీ రిఫార్మ్స్ కమిటీనీ ఏర్పాటు చేసి, దానికి చైర్మన్ గా ప్రొఫెసర్ అరవింద్ సుబ్రమణ్యంను నియమించాలనే ప్రతిపాదన నిజమా కాదా? ఆ నోట్ ఫైల్ బహిర్గతం చేయగలరా?
నెహ్రూ సోషలిజం పేరుతో ప్రభుత్వ రంగ స్థలం కాపాడుతున్నామని డబ్బా కొట్టుకున్న మీరు.. యాదాద్రి పవర్ ప్లాంట్ లో కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాలను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టింది నిజం కాదా?
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులంతా రోడ్డెక్కి ధర్నాలు చేసింది నిజం కాదా?
కరెంటు లేక చేను ఎండిపోతుందంటూ.. పాటలతో
యాదాద్రి జిల్లా, నారాయణపూర్ మండలం, చిమిర్యాల విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు బతుకమ్మ ఆడుతూ కాంగ్రెస్ సర్కార్‌పై నిరసన తెలిపిన మహిళలు.
#CongressFailedTelangana
నన్ను అరెస్ట్ చేసే కుట్రను భగ్నం చేసిన సికింద్రాబాద్ కోర్టు న్యాయమూర్తికి ధన్యవాదాలు చెప్తున్నాను.
“ఈ రూ.13,200 కోట్లు ఏంటి?” అని న్యాయమూర్తి గారు నన్ను అడిగారు.
“మెడికవర్ ఆసుపత్రిని అమ్మేస్తే వచ్చిన డబ్బులకు సంబంధించిన వివరాలు” అని చెప్పాను.
కేటీఆర్, హరీష్ రావులపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు వారు విచారణకు సిద్ధమని చెప్పారు.
కానీ మేము ఆధారాలతో సహా రేవంత్ రెడ్డి కుటుంబం దోపిడీలను బయటపెడితే సమాధానం ఉండదు.
- బీఆర్ఎస్ నాయకుడు @Krishank_BRS
🆘 లక్కీ రెస్టారెంట్‌కు అనుముల బ్రదర్స్ ధమ్కీ 📣
🏨 హోటల్ అప్పగించాలని యజమానికి వేధింపులు❗
⚠️ లక్కీ రెస్టారెంట్‌పై రేవంత్ బ్రదర్ కన్ను.. పీఏ ద్వారా తీవ్ర ఒత్తిడి
📢 అంతకుముందే లైసెన్సు రద్దు చేసిన 'టీజీసేఫ్', నిర్మాణం పాక్షికంగా కూల్చివేత
🚨 ఎంతోకొంత తీసుకుని వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్నరు బాధితుల ఆవేదన.. రోడ్డుపై బైఠాయించి నిరసన
అనుముల బ్రదర్స్ కన్ను పడితే ఆ ప్రాపర్టీ వారికి ఇవ్వాల్సిందే. లేదంటే ప్రభుత్వ శాఖల్లో ఏదో ఒకదాన్ని అడ్డుపెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడతారు. ఎక్కడా సీన్లో వారు కనిపించకపోయినా వివాదం మొదలైనప్పటి నుంచి ప్రతి సందర్భంలోనూ వారి ప్రస్తావన, వారి అనుయాయులు తప్పనిసరిగా ఉంటారు. మాదాపూర్‌లో అక్రమ కట్టడాలు, హోటళ్లు, రెస్టారెంట్లకు సంబంధించిన వ్యవహారాల్లో ఇప్పటికే నెలవారీ మామూళ్లు ముట్టడమే కాకుండా అవసరమైన చోట పాగా వేయడానికి రంగం సిద్ధం చేసుకున్న బిగ్ బ్రదర్ తాజాగా లక్కీ రెస్టారెంట్‌పై కన్నేశారంటూ స్వయంగా ఆ రెస్టారెంట్ నిర్వాహకురాలు రెహానా బహిరంగ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.
ముందుగా మాదాపూర్ ప్రాంతంలో రెస్టారెంట్లపై ఫుడ్‌సేఫ్టీ అధికారులతో దాడులు చేయించి హోటళ్లు సీజ్ చేయించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడిచేసి రెస్టారెంట్ లైసెన్సు రద్దు చేసిన తర్వాత దాని ముందు భాగాన్ని ప్రభుత్వ అధికారులు బుల్డోజర్తో కూల్చేశారు. అంతకుముందే బిగ్‌బ్రదర్ తన పీఏ ద్వారా అడిగితే ఆ రెస్టారెంట్‌ను ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో ఏకంగా దాడులు, కూల్చివేతలకు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే వారి రెస్టారెంట్‌ను సీజ్ చేయించి, అక్కడ కూల్చివేతలు చేపట్టి స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేశారు.