నీ కోసం కాదుకదా నీ నడక,
నువు చేరలేని గమ్యమేముంది కనక,
నా లోపలి ఏలికా!
చూపిస్తున్నావు మొత్తం నీ పోలిక..
ఔనని, కాదని అల్లరిపెడుతూ
కరిగిపోతోంది కాలం,
కనులు తెరచినా, మూసుకొన్నా
కనిపిస్తోంది నీ ప్రతిబింబం..
3/3
🙏🏼🕉️🙏🏼
రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్
పోలిక
నీకన్నా ముందే వచ్చి స్థిరపడింది
నూవ్వొస్తావన్న నమ్మకం,
నీ చూపుతోనే తగిలింది
నన్ను నిద్రనుండి మేల్కొలిపిన బాణం..
నీ చుట్టూ తెలియని కథలెన్నో
సుడులు తిరుగుతున్నాయి,
నీ మౌనంలో అలుపెరుగని అక్షరాలు
ఆటలాడుతున్నాయి..
1/3
పువ్వుపువ్వులో విరుస్తోంది
నీ కులుకుసుగంధం,
నవ్వునవ్వులో మెరుస్తోంది
నీ వెలుగుప్రబంధం..
నువ్వు ఒక్క క్షణం ఆగావంటే
పాత్రలో అమృతాన్ని ఒంపుకొంటాను,
రేపటిపుటలో చెక్కుచెదరని
జ్ఞాపకంలా నింపుకొంటాను..
తీరం దాటని నావకు
రేవంతా అంబరమే,
దూరం తెలియని అలకు
బ్రతుకంతా సంబరమే..
2/3
👆ఇప్పుడు ప్రజలే రాజులు. నేను ఈ కాలంలో "యథా ప్రజా తథా రాజా" అనుకుంటాను. మనం దొంగలం అయితేనే, మన నాయకుడిని దొంగల నాయకుడు అంటారు. మన కులమతాల పేరుతో లేదా ఇంకా ఏదన్నా స్వార్థంతో చెడ్డవాడైనా ఎంచుకుంటున్నామంటే మన దైనందిన జీవితంలో భ్రష్టుపట్టిపోయామనే ఆర్థంతో పద్యాన్ని తిరగరాయగలరా?
చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది. ఈ ప్రసిద్ధ సూక్తి సాధారణంగా రామాయణం లోని “మారీచుని స్వర్ణమృగ ఉపాఖ్యానం”తో అనుసంధానించి ఉటంకించబడుతుంది. అయితే ఇది వాల్మీకి రామాయణంలోని యథాతథ శ్లోకం కాదు; తర్వాతి కాలంలో ప్రసిద్ధి చెందిన సుభాషితరూపం అని పేర్కొంటారు.
బంగారులేడి సృష్టిలో ఉన్నదా? మునుపు ఎవరైనా కన్నారా? ఎన్నడయినా విన్నారా? అయినప్పటికీ రాముడు తృష్ణతో (తన చెలి కోరిందని) (పాఠాంతరం - జానకి తృష్ణతో) ముందు వెనుకలు యోచించకుండా బంగారులేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి.
పద్యతాంబూలం
మన సాహితి పలుచబడుచు
మనిషే వ్యాపారమైన మన చిత్రములన్,
తన పాటల వినసొంపగు
మనసున్నది యని తెలిపెను మన ఆత్రేయే..🙏🙏🙏
- రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్
మా గోత్రాన్ని తన ఇంటిపేరుగా మలచుకొన్న మన(సు)కవి శతజయంతి సందర్భంగా ఐదేండ్ల క్రితం వ్రాసుకొన్నది🙏🏼