🔸బీజేపి మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ZA బేగ్ గారి తండ్రి అబ్దుల్ రజాక్ బేగ్ గారు ఇటీవల పరమపదించారు.
కొవ్వూరులో ZA బేగ్ గారిని, వారి కుటుంబసభ్యులను పరామర్శించడం జరిగింది.
🔹బీజేపి తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీ చిక్కం మోహిని గారు ఇటీవల అస్వస్థత గురయ్యారని తెలుసుకొని, వారిని పరామర్శించడం జరిగింది.
అన్నయ్య ( @tarak9999 ) గారికి, Tiger లా డబ్బింగ్ కి వచ్చారు
“మీరెప్పుడో అన్నారు… ‘అఖిల్ ఎప్పుడో కొడతాడు’ అని.
I hope I made you proud. ”
- @AkhilAkkineni8
#AkhilAkkineni :
"మా అన్నయ్య #NTR గారికి Thanks...
ఒక్క Phone Call కొట్టగానే Dubbingకి వచ్చేశారు.
ఆయన ఎప్పుడో ఒక మాట అన్నారు... "అఖిల్ కొడతాడు" అని.
I hope I make you proud."
#LENIN
రాజకీయాలు, అభిప్రాయాలు మారవచ్చు, కానీ తల్లిదండ్రులు మాత్రం మారరు, చివరికి మనతో మిగిలేది పదవులు కాదు, మనం వారితో గడిపిన జ్ఞాపకాలే, ఎవరో మెప్పు కోసం కన్నవారితో ఏఖీభవించకపోయినా పర్లేదు కానీ వ్యతిరేకించొద్దు, తల్లిదండ్రులును బాధపెట్టకుండా చూసుకుంటే అదే నిజమైన విజయం...
@kr_barlapudi
BREAKING NEWS
చనిపోవడానికి ముందు కుటుంబ సభ్యులకు లేఖ రాసి ఉంచిన ముద్రగడ.
చనిపోతే అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించకూడదు.
పోలీసుల గౌరవ వందనం అవసరం లేదు.
బతికి ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టి మరణానంతరం ఇచ్చే గౌరవం, గుర్తింపు అవసరం లేదు.
కుటుంబ సంప్రదాయాల ప్రకారం దహనం చేయొద్దు ఖననం చేయాలి.
ఇంటి ఆవరణలో ఎక్కడ ఖననం చేయాలో కూడా చెప్పిన ముద్రగడ.
ఖననం చేస్తే ఇక్కడే ఉంటాను.
నేను చనిపోయిన తర్వాత నా భార్య బొట్టు గాజులు, తీయవద్దు.
పుణ్య స్త్రీ గానే ఉండాలి.
- ముద్రగడ
గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన భుజానికి జరిగిన శస్త్ర చికిత్సకు అయిన ఖర్చు మొత్తం సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారు. ఆపరేషన్ తోపాటు ప్రయాణానికి అయ్యే ఖర్చులు మొత్తం స్వయంగా భరిస్తున్నారు. గతంలో ముక్కుకి జరిగిన శస్త్ర చికిత్స సైతం సొంత నిధులతోనే చేయించుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తినప్పుడు చికిత్సకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నుంచి పొందే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదన్న స్వీయ నిబంధనను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారు.
గతంలో పద్మనాభం గారి భార్యకి క్యాన్సర్ వచ్చింది అని వాళ్ళ కూతురి ఇంటికి వెళ్తే కనీసం 5 నిమిషాలు ఇంట్లోకి రానివ్వలేదు 🥺💔
చనిపోయాక ఎక్కడ లేని ప్రేమ వస్తుంది 💦
Babu & Pawan Grant State Honours to Mudragada!
Former minister Mudragada Padmanabham will be accorded official state honours during his funeral. CM #ChandrababuNaidu and Deputy CM #PawanKalyan took the decision after speaking over the phone, directing officials to make the necessary arrangements in recognition of his public and political service.
BREAKING NEWS
ముద్రగడ కూతుర్ని అడ్డుకుంటున్న ఆయన అభిమానులు.
క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.
కనీసం ఫ్రీజర్ బాక్స్ కూడా టచ్ చేయనివ్వని బంధువులు.
ఆమెను బయటకు పంపేయాలని ముద్రగడ భార్య డిమాండ్.
కాపు ఉద్యమ ధ్రువతారకు శ్రద్ధాంజలి..
కాపు ఉద్యమ ధ్రువతార, ప్రజాసేవకుడు, మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణవార్త తీవ్ర వ్యధను కలిగించింది.
ఆయన పవిత్ర ఆత్మకు సద్గతి కలగాలని, శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. 🙏
వారి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, అనుచరులకు, లక్షలాది మంది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి.
ఓం శాంతి!
ఆయన మరణం సందర్భంగా, ఆయన జీవన ప్రయాణాన్ని, సమాజం కోసం చేసిన సేవలను, ముఖ్యంగా రేపటి తరానికి తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నాను
శ్రీ ముద్రగడ పద్మనాభం గారు తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి ప్రాంతానికి చెందిన ప్రముఖ ప్రజానాయకుడు. ఆయన రాజకీయ జీవితాన్ని భారత జాతీయ కాంగ్రెస్లో ప్రారంభించిన ఆయన, అనంతరం తెలుగు దేశం పార్టీలో కూడా కీలక పాత్ర పోషించారు.
శాసనసభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందించారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చేపట్టినా, చివరకు తన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు కంటే కాపు సమాజ హక్కుల కోసం పోరాటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత, తొలి ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి గారి హయాంలో ఎటువంటి అధికారిక సర్వేలు, కమిషన్ సిఫార్సులు లేకుండానే కాపు సామాజిక వర్గాన్ని బీసీ జాబితా నుండి తొలగించారు.
అంతకుముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలో అమలులో ఉన్న జాబితాల ప్రకారం కాపులు వెనుకబడిన తరగతుల జాబితాలో ఉండేవారు.
తరువాత 1961లో ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారి హయాంలో కాపులను తిరిగి బీసీ జాబితాలో చేర్చినా, అనంతరం మళ్లీ శ్రీ నీలం సంజీవరెడ్డి గారి పాలనలో ఆ హోదా తొలగించబడింది, ఇది ముమ్మాటికీ అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు కాపు కులానికి ఉద్దేశ పూర్వకంగా చేసిన ద్రోహమే.
దీనిని సరిదిద్ది తిరిగి కాపులకు బీసీ గుర్తింపు తేవాలి అన్న లక్ష్యంతో శ్రీ ముద్రగడ పద్మనాభం గారు అన్ని కులాలను కలుపుకొని దశాబ్దాల పాటు రాజీలేని ఉద్యమాన్ని నడిపించారు. అనేక నిరాహార దీక్షలు, ప్రజా ఉద్యమాలు, అరెస్టులు, వ్యక్తిగత అవమానాలు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు.
రాజకీయ పరిణామాల కారణంగా ఆయన వివిధ పార్టీలతో అనుబంధం కలిగి ఉన్నప్పటికీ, ముఖ్యంగా చివరి దశలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు ఆయన ప్రజాదరణపై ప్రభావం చూపినప్పటికీ, కాపు రిజర్వేషన్ల కోసం ఆయన చేసిన దీర్ఘకాల పోరాటం, త్యాగం, నిబద్ధతను చరిత్ర ఎప్పటికీ మాసిపోదు.
కాపు సామాజిక వర్గాన్ని తిరిగి బీసీ జాబితాలో చేర్చాలనే జీవితాశయం నెరవేరకముందే ఆయన మన మధ్య నుండి దూరం కావడం అత్యంత విషాదకరం.
ఆయన ఆశయ సాధనే ఆయనకు నిజమైన నివాళి. కాపు సమాజానికి జరిగిన చారిత్రక అన్యాయాన్ని శాస్త్రీయంగా, రాజ్యాంగబద్ధంగా పరిష్కరించే సంకల్పాన్ని ఏ ప్రభుత్వం ప్రదర్శిస్తే, ఆ సంకల్పమే ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూర్చే నిజమైన నివాళిగా నిలుస్తుంది.
శ్రీ ముద్రగడ పద్మనాభం గారి సేవలు, పోరాట స్ఫూర్తి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
ఆయనను మోసం చేసిన వాళ్ళు తెలుసుకోవలసింది ఆయన ఉద్యమం ఆయన మరణంతో ఆగదు అది మరింత బలపడి విజయం సాధిస్తుంది..
- బొలిశెట్టి సత్యనారాయణ
#కులాలను_కలిపే_ఆలోచన_విధానం
#Rip ముద్రగడ పద్మనాభం గారు..
2018 లో ఆయన ఇంటికి వెళ్లాను..ఇంటర్వూ కోసం
ఆయన మొండితనం.రాజకీయాలు..ఉద్యమాలతో పాటు
ఆప్యాయంగా పలకరింపు..ఆతిధ్యం..అభిమానం
ఇవన్నీ ఎప్పటికీ మరిచిపోలేను.
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరనే వార్త ఎంతో బాధాకరం.
ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తన నమ్మకాల కోసం రాజీ పడని వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ…
వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మద్దతుదారులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి. 🙏
ముద్రగడ పద్మనాభం గారి ఓపిక చూసి మేము ఆశ్చర్యపోయేవాళ్లం. తుని ఉద్యమ సమయంలో వేలాది మంది అతిథులు వచ్చినా.. పద్మనాభం గారు తన చేతులతో వారికి వడ్డించేవారు. మాలాంటి నాయకులకు ఆయన ఒక రోల్ మోడల్.
-దాడిశెట్టి రాజా గారు, మాజీ మంత్రి