It was an honour to attend the launch of Belonging: A Journey of Love, the autobiography of CPP Chairperson
Smt @SoniaGandhi ji.
A life’s journey, shaped by experiences, relationships and enduring values, offers reflections that go beyond the individual and inspire generations. Such works are a valuable contribution to our collective understanding of life and leadership.
#SoniaGandhi
Hearty congratulations and warm welcome to Shri B. M. Sandeep ji on being appointed as the AICC In-charge of #Telangana
We look forward to working with you to strengthening the Congress family in Telangana.
It is an honour to welcome delegates from across the world to #Telangana and our vibrant capital, Hyderabad, for the #BharatSummit .
With over 1,000 delegates invited from 70 countries, this summit represents a collective commitment to democracy, equality, social justice and human dignity. Though several delegates were denied visas by the Union Government, the spirit of this global gathering remains undeterred.
Today, the world faces a defining choice between those who seek to strengthen democratic institutions and those who seek to undermine them.
Across the world, people share common aspirations — dignity, education, employment, accessible healthcare and a better future. Addressing these aspirations is our collective responsibility.
In India, our leader Shri Rahul Gandhi is at the forefront of this struggle, defending voting rights, constitutional values and social justice for Dalits, minorities and OBCs. We must stand united behind his leadership to bring about the change our country deserves.
No force can stop a movement that draws its strength from the people and its purpose from the Constitution.
Let the Bharat Summit be more than a gathering of global voices. Let it become a shared commitment to defending democracy, advancing equality and building a more just and inclusive world.
Together, let us carry this message from Hyderabad to the world.
#RahulGandhi #TelanganaRising
అరిగిన పాదాలు..
అలసిన జీవితాలు…
కాలంతో పరుగు తీసినా…
బతుకు భరోసా లేని కష్టజీవులు..
గిగ్ వర్కర్లు…
లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా తెలంగాణలో గిగ్ వర్కర్ల సామాజికభద్రత, సంక్షేమ పథకం అమలు ప్రారంభమైన వేళ…
#GigWorkersWelfare#RahulGandhi
శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్ వరకు గిగ్ వర్కర్లతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్న @RahulGandhi , ముఖ్యమంత్రి @revanth_anumula ❤️
భారీ ఎత్తున హాజరైన గిగ్ వర్కర్లు.
హైదరాబాద్ ప్రజల భవిష్యత్తుకు అత్యంత కీలకమైన మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులన్నీ లభించాయని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు వెల్లడించారు. ఇందుకు త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. 55 కి.మీ. మేరకున్న మూసీలో తొలివిడతగా 21 కి.మీ. పునరుజ్జీవన కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు.
✅#Hyderabad నగరంలోని అత్యంత కీలకమైన హైటెక్ సిటీ ప్రాంతంలో అత్యంత అద్భుతంగా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.
✅ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, నగరంలో చెరువులను చెరబట్టిన వారి నుంచి విముక్తి కల్పించడంలో ఎలాంటి సమస్యలొచ్చినా ఎదుర్కొని నిలబడి పరిష్కరించి నగరాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు.
✅“మూసీ నదిని ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నా. నా సంకల్పం మంచిదైనప్పుడు, భవిష్యత్తు తరాలకు ప్రయోజకరంగా ఉన్నప్పుడు ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నా. కొందరికి బాధ కలిగించవచ్చు. కానీ నాకంటూ స్వార్థం లేదు. ఎవరిపైనా కోపం లేదు. ఈ ప్రకృతిని కాపాడాలన్నదే నా ఆకాంక్ష” అని పేర్కొన్నారు.
✅#ThammidikuntaLake ను పునరుద్ధరించాలన్న నిర్ణయం తీసుకునప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయం వల్ల కొందరి మనసును నొప్పించి ఉండొచ్చు. కానీ రాబోయే కొన్ని తరాలకు ఉపయోగపడుతుంది.
✅14 ఎకరాల స్థలాన్ని 30 ఎకరాలకు విస్తరించి అద్భుతమైన చెరువుగా తీర్చిదిద్దడంలో సినీనటుడు @iamnagarjuna గారు పెద్దమనసు చేసుకుని ఈ సమాజానికి తనవంతుగా ముందుకొచ్చి 2 ఎకరాల స్థలాన్ని అందించారు. ఉదాత్తమైన నిర్ణయంతో నాగార్జున గారు సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ హీరోలా నిలబడ్డారు.
✅ఈ ప్రారంభ కార్యక్రమానికి తక్కువ సమయం ఉన్నప్పటికీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున గారికి అభినందనలు. ఇలాంటి కార్యక్రమాల్లో పెద్దమనసుతో ముందుకొచ్చి అభివృద్ధిలో భాగస్వాములైన వారిని సత్కరిస్తామని శాసనసభ వేదికగా ప్రకటించాం. ఈ కార్యక్రమానికి వచ్చీరాగానే ముందుగా నాగార్జున గారికి శాలువా కప్పి సత్కరించాం.
✅హైదరాబాద్ నగరమంటేనే లేక్స్ అండ్ రాక్స్. గొలుసుకట్టు చెరువులతో అత్యంత సుందరమైన రాక్ ఫార్మేషన్తో ఉంటుంది. శిల్పులు చెక్కని శిల్పాలుగా ఎంతో సౌందర్యవంతంగా ఈ రాక్ ఫార్మేషన్ ఉంటుంది.
✅హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు 1372 చెరువులు ఉండేవి. వివిధ కారణాలతో 50 శాతం చెరువులు కనుమరుగయ్యాయి. పట్టణాలకు వలసొచ్చి జీవనాధారం లేక మూసీ పక్కనే నివాసం ఏర్పాటు చేసుకోవడం, కొందరు కబ్జాలకు పాల్పడటం, ప్రభుత్వాల నిర్లక్ష్యం.. కారణాలు ఏవైనా చెరువులు కనుమరుగయ్యాయి.
✅నగరంలో తమ్మిడికుంటతో పాటు బతుకమ్మకుంట, బుమ్-రుక్నుద్దౌలా, సున్నం చెరువు,నల్లచెరువు, ఫాక్స్ సాగర్, మియాపూర్ చెరువు.. దాదాపు 20 చెరువులను పునరుద్ధరించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. కొన్నిచోట్ల 10 ఎకరాల నుంచి 500 ఎకరాల మేరకు విస్తరించి ఉండాల్సిన చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి.
✅వర్షాలొచ్చినప్పుడు రోడ్లన్నీ జలమయమై, గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్స్ ఎందుకు అవుతున్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. నీళ్లు ఉండాల్సిన ప్రాంతాలను మనం ఆక్రమించుకుంటే, మనం ఉండాల్సిన చోటకి నీళ్లొస్తున్నాయి. బస్తీల్లో కుటుంబాలకు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
✅1908 లో భారీ వరదల కారణంగా వేలాది మంది మరణించారు. నిజాం నవాబు ఆలోచన చేసి గ్లోబల్ టెండర్లను పిలిచి ప్రఖ్యాత ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని నియమించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నిర్మించారు. 1920 నాటికి వాటిని పూర్తి చేయగా, వందేళ్ల నాటి ఆ రిజర్వాయర్లు ఈరోజు హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చుతున్నాయి.
✅నిజాం కాలంలో వందేళ్ల కిందటే మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేశారు. మూసీ వెంట పురానాపూల్ బ్రిడ్జి, సిటీ కాలేజీ, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి, బ్రిటిష్ రెసిడెన్సీ వంటి ఎన్నో చారిత్రక కట్టడాలు నిర్మించారు. అనేక వ్యాపారాలకు కేంద్రంగా విలసిల్లింది.
✅ప్రభుత్వాలు చూపించాల్సినంత శ్రద్ధ చూపించకపోవడంతో అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. చివరకు మూసీ కూడా మూసుకుపోయే ప్రమాదం ఏర్పడింది.
✅మూసీ కాలుష్యంతో నల్గొండ జిల్లా ప్రజలు అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. నల్గొండ ప్రజల పాలిట విషంగా మారింది. ఆ ప్రాంతంలో పుట్టబోయే పిల్లలు లోపాలతో పుడతారని కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న జంటలను ఆ ప్రాంతంలో నివసించనీయకుండా పంపించేస్తున్నారు. నేను ఆ ప్రాంతంలో ప్రత్యక్షంగా పరిశీలించా. రైతులతో మాట్లాడా.
✅నల్గొండ జిల్లాకు ఒకవైపు ఫ్లోరైడ్ బాధ ఉంటే మరోవైపు కాలుష్యకోరల్లో చిక్కుకుంది. పాలకులు తమపై కక్ష కట్టి కాలుష్యాన్ని వదిలి మా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అక్కడి రైతులు ఆవేదన చెందుతున్నారు.
✅సబర్మతీ రివర్ ఫ్రంట్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లో గంగా, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్ లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచంలో ఏ నాగరికత పరిశీలించినా నదీ పరీవాహక ప్రాంతాలే అభివృద్ధి చెందాయి. నదీ పరీవాహక ప్రాంతాల్లోనే నాగరికత విలసిల్లింది.
✅ఇది మూసీ ప్రక్షాళన. సుందరీకరణ కాదు. మూసీ ప్రక్షాళన అందరి జీవితాలతో ముడిపడి ఉంది. మూసీని ప్రక్షాళన చేయాల్సిందే. అందులో ఏ ఒక్కరికీ ఎలాంటి నష్టం జరక్కుండా ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే. మూసీని అభివృద్ధి చేసే విషయంలో భేషజాలు పక్కన పెట్టి రాజకీయ నాయకులు కలిసి రావాలి.
✅నదీ పరీవాహక ప్రాంతంలోనే ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల ఆధారపడి ఉంది. దక్షిణ కొరియాలో అద్భుతమైన రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసుకుని 24 గంటల పాటు ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
✅కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా గ్రౌండ్ వాటర్ పెంచే గొప్ప కార్యక్రమం తమ్మడికుంట పునరుద్ధరణ. ఇందుకు సహకరించిన వారందరినీ అభినందించాల్సిన బాధ్యత ఉంది.
✅హైదరాబాద్ ను అలా చేయాల్సిన బాధ్యత ఉంది. రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక వేదికపైకి రావలసిన అవసరం ఉంది. ఎవరైనా బాధితులు ఉంటే వారిని నూటికి నూరు శాతం ఆదుకుంటాం.
✅మూసీలో మనుషుల శవాలు, పశువుల కళేబరాలు, ఇతర కలుషితాలతో మురికికూపంగా తయారైంది. మానవ తప్పిదం. ప్రభుత్వాల వైఫల్యం.. అన్నీ కలిసి మూసీ మురికిగా మారింది.
✅అద్భుతంగా తీర్చిదిద్దిన తమ్మిడికుంట చెరువుకు సంబంధించి నిర్వహణ అద్భుతంగా లేకపోతే మళ్లీ పూర్వస్థితి వస్తుంది. సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ తో పాటు ఇందిరా మహిళా శక్తి మహిళలు ఈ చెరువును నిర్వహించాలి. ఇక్కడ మహిళా శక్తి స్టాళ్లతో చిన్నచిన్న ఆర్థిక కార్యకలాపాలు జరిగేలా లేక్ ఎకానమీని అభివృద్ధి చేయాలి.
✅మన సంస్కృతిని కాపాడటానికి ఇదొక మంచి కేంద్రంగా వర్ధిల్లాలి. గ్రామాల నుంచి పట్టణాలకొచ్చి స్థిరపడిన వారు తమ సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకోవాలి. దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు జరుపుకోవడానికి ఈ చెరువు ఉపయోగపడాలి. ఇక్కడ ఒక జమ్మి చెట్టును కూడా నాటాలి” అని ముఖ్యమంత్రి గారు చెప్పారు.
✅పీఏసీ చైర్మన్ @GandhiArekapudi గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా సినీనటుడు అక్కినేని నాగార్జున గారు, ఎంపీలు @AKY_INCMP గారు @Vemnarenderredy గారు, @KVishReddy గారు, @RaghuveerMp గారు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలు @gadwalvijayainc గారు, శాసనమండలి విప్ @Drpmahendereddy గారు, పలువురు ప్రజాప్రతినిధులు, @Comm_HYDRAA రంగనాథ్ గారు ఇతర అధికారులు పాల్గొన్నారు.
#MusiRiverRejuvenation #LakeRestoration #SaveMusi
Today, I inaugurated the rejuvenated #ThammidikuntaLake in Madhapur, expanding it from 14 acres to 30 acres and dedicating it to the people.
Hyderabad’s identity must extend beyond its impressive skyline. Its lakes, green spaces and natural ecosystems are equally integral to the city’s character and future. We cannot allow these precious water bodies to disappear while families continue to suffer from urban flooding even after brief spells of rainfall.
Our vision is to restore the Musi, and transform #Hyderabad into a truly world-class global city — one that balances economic progress with environmental responsibility.