సొసైటీ ఆధునీకతకి ముఖ్య కారణం మోటివేషన్..ఎందుకంటే ప్రతి మనిషి కూడా మానవ సహజంగా ఉన్న పొజిషన్ కన్నా ఎదగాలని కోరుకుంటాడు .. పేదవాడు ధనికుడవ్వాలని కోరుకుంటాడు, సైంటిస్ట్ ఎవ్వరూ కనిపెట్టలేనిది కనిపెట్టాలనుకుంటాడు .మీ పార్టీ కార్యకర్త మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడు
సినిమాలో చాల వరకు డూపులు పెడతారు .వీళ్ళు చేసే ఖర్చుపైన డూప్లికేట్ ఎందుకు ఉండదు అనుకోకూడాదు ?సినిమా నిర్మాణం లో ప్రభుత్వ విజిలెన్సు ఉంటె తప్పు ఏంటి ? Anna @perni_nani@RGVzoomin 😄😄
ముడి పదార్థం 500 కూడా ఖర్చవ్వని పెయింటింగ్ ని కొనేవాడుంటే 5 కోట్లకి అమ్ముతారు
ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే బ్రాండ్ కి, ఐడియా కి ఎలా వెల కడతారు?
క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కంటిన్యువస్ గా అన్ని ఇంకా బెటర్ గా ఉండేలా ప్రయత్నించడం ..బెటరా కాదా అనేది కొనుగోలుదారుడు నిర్ణయిస్తాడు.
థ్యాంక్యూ నాని గారు..చాలా మంది లీడర్ల లా పరుష పదజాలం తో మాట్లాడకుండా డిగ్నిటీ తో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ..ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్ ని వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదండీ ..అది అమ్మేవాడి నమ్మకం..కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది
హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు @RGVzoomin గారూ.
నేను యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్‌ని,@perni_nani garu ఎకనామిక్స్ గురించి నాకు
ఏ బీ సీ తెలియదు..కానీ అనుమతిస్తే మీ ప్రభుత్వం లో టాప్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ తో నేను టీవీ డిబేట్ కి రెడీ..మా సినిమా ఇండస్ట్రీ కి ప్రభుత్వానికి ఏర్పడ్డ మిసండర్స్టాన్డింగు తొలగిపోవడానికి అవసరం ..థ్యాంక్యూ