విశాఖ నగరంలో పొల్యూషన్ పై విశాఖ ఎంపీ భారత్ గారు, కలెక్టర్ అభిక్షిత్ కిషోర్ గారి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విశాఖ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు, గణబాబు గారు, విష్ణు కుమార్ రాజు గారితో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబరుగా పాల్గొని విశాఖలో పొల్యూషన్ నియంత్రణకు నా సూచనలు పంచుకోవడం జరిగింది.
#APPCB
సొంత బిడ్డ ప్రమాదంలో ఉంటేనే ప్రజా కార్యక్రమాలు వాయిదా వేయనివాడు, నీ బిడ్డ చావుని రాజకీయం కోసం వాడుకుంటాడు అని ఎలా అంటున్నారు పార్వతీ గారు?
మీరు @Anitha_TDP గారు స్పందించాలి. ఈ కేసు విషయంలో అడ్డమైన వాళ్ళతో మా నాయకుడు మాటలు పడుతున్నాడు.
#JanaSenaParty#PawanKalyan
My leader @PawanKalyan is unfairly targeted in #SugaliPreethi case for no fault of his.
Here’s is detailed thread divided on Legal-Administrative and Political Aspects to set the record straight.
@JanaSenaParty@JSPShatagniTeam (1/n)
నువ్వు పెట్టే సోషల్ మీడియా పోస్టులకు తెలుగు భాష కరెక్ట్ చెయ్యడానికి ఆ రావణ్ జోసెఫ్ ఏమైనా నీ తెలుగు మాస్టరా? ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలని ప్రశ్నించావు, ఎంతమంది నాయకులను ప్రశ్నించావు? @prakashraaj#justasking#justunmasking
పేదల పక్షాన నిలిచి, వారి గళమైన ప్రజా నాయకుడు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు. నేడు శ్రీ వంగవీటి రంగా గారి జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా నివాళి అర్పిస్తున్నాను.
- జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
#79thVMRJayanthi
It’s 9:30 PM in Parvathipuram. Covering one of the largest Parliament constituencies in the country, stretching nearly 400 kms. Shri. @NagaBabuOffl Garu is still in the hall, meeting JanaSainiks and collecting applications. Kudos to his commitment and dedication.
@JanaSenaParty@JSPShatagniTeam@PawanKalyan
జూన్ 29th నుంచి రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల పనితీరును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
@PawanKalyan@JanaSenaParty
#JSPMembershipToLeadership
జూన్ 29 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల పనితీరును ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను సమీక్షిస్తున్నాను.
రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణుల నుంచి వస్తున్న విశేష స్పందన ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. @JanaSenaParty కోసం కష్టపడిన ప్రతి ఉద్యమి, ప్రతి సాధక్, ప్రతి జనసైనికుడికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని పార్లమెంట్ పరిశీలకులకు సూచించడం జరిగింది.
పార్లమెంట్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు పార్టీ బాధ్యతలతో పాటు, వివిధ అనుబంధ విభాగాల్లో సేవలందించాలనే ఆసక్తి ఉన్న జనసేన సాధక్స్, నాయకులు, జనసైనికులందరికీ ఈ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే అవకాశం కల్పిస్తున్నాం. జనసేన శ్రేణులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని నాయకత్వం తీసుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాను.
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
జనసేన కోసం నిలబడ్డ కార్యకర్తలకు అవకాశం కల్పించాలన్నదే అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సంకల్పం
దేశ రాజకీయాలకు జనసేన పార్టీ నిర్మాణం రోల్ మోడల్
అత్యంత పారదర్శకంగా సమాచార సేకరణ కమిటీలు పని చేస్తాయి
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్తలు
‘జనసేన పార్టీ ప్రజాస్వామ్యానికి విలువనిస్తుంది. పార్టీ నిర్మాణంలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బలంగా ఆచరించే విధానం శ్రీ పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమ’ని జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్త డాక్టర్ సందీప్ పంచకర్ల అన్నారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలైన సమాచార సేకరణ ప్రక్రియను జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమాచార సేకరణ కమిటీలను సమన్వయకర్తలు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా శ్రీ సందీప్ మాట్లాడుతూ “దేశానికి బాధ్యతాయుత నాయకత్వం అందించాలని, అది ప్రజాస్వామ్యబద్దంగా ఉండాలన్నది శ్రీ పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. పార్టీ కోసం నిలబడ్డ ప్రతి కార్యకర్తకు తగిన అవకాశం అందించాలన్నది మా అధ్యక్షుల వారి సంకల్పం. పార్టీ కోసం ఇంత తపించే వ్యక్తి దేశంలోనే మరొకరు లేరు. రబ్బరు చెప్పులు వేసుకున్న యువతతో రాజకీయాలు చేయిస్తాననే మాటకు కట్టుబడి ఆయన సాగిస్తున్న ప్రయాణంలో సామాన్యుడికే పెద్దపీట వేస్తారు. దేశానికి ఉత్తమ నాయకులను తయారు చేసే కర్మాగారంగా పార్టీని తీర్చిదిద్దుతున్నారు. ఇదో గొప్ప రాజకీయమార్పునకు నాంది పలకనుంది. దేశ రాజకీయాలకు జనసేన పార్టీ నిర్మాణం రోల్ మోడల్ కానుంది. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలైన పార్టీ సమాచార సేకరణ కమిటీలు తమ కార్యకలాపాలు మొదలుపెట్టారు. పార్టీలోని కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. నీతిగా, నిబద్ధతగా చేస్తున్న ఈ మహాక్రతువులో ప్రతి ఒక్కరూ పాలుపంచుకుంటున్నారు.’’ అన్నారు.
ఉన్నత ఆలోచనలకు ప్రతిరూపం శ్రీ పవన్ కళ్యాణ్ గారు :డా.పెదపూడి విజయ్ కుమార్, జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్త
ఈ సందర్భంగా జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్త విజయ్ కుమార్ మాట్లాడుతూ ‘‘కేడర్ టూ లీడర్ కార్యక్రమంలో భాగంగా ఓ మహా సంకల్పం తాలుకా ప్రయాణం ఈ రోజు మొదలైంది. ప్రజల కోసం నిరంతరం ఆలోచించే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం గొప్ప అనుభూతి. పార్టీకి పునాదులు బలంగా ఉండాలని తపించే నాయకుడు ఆలోచనలు ఎప్పుడూ ఉన్నంతంగానే ఉంటాయి. దేశం కోసం, రాష్ట్ర అభివృద్దిని కాంక్షించే శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీని ముందుకు నడిపించడంలో దేశంలో ఏ పార్టీ ఎంచుకోని విభిన్నమార్గాన్ని ఆదర్శంగా ఎన్నుకున్నారు. తానెప్పుడూ జనం మనిషిని అని నిరూపించుకున్నారు. సమాచార సేకరణ కమిటీల ద్వారా సేకరించిన సమాచారాన్ని స్వయంగా ఆయనే చూసి, అందరి ఆమోదంతో బాధ్యతలు అప్పగించడం పార్టీ నిబద్ధత, పారదర్శక విధానాలను తెలియజేస్తుంది. జనసేన పార్టీ వ్యక్తులను వ్యవస్థలుగా తీర్చిదిద్దే గొప్ప లక్ష్యంతో ముందుకెళ్లే పార్టీ. 28 మందితో కూడిన ఈ కమిటీ పారదర్శకం విధానంతో కార్యకర్తలు, వీర మహిళల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. వారికి కేంద్ర కార్యాలయం నుంచి మేం తగిన సహాయసహకారాలు అందిస్తాం.’’ అన్నారు.
*అందరికీ సమాన అవకాశాలు : డా.బుర్రా దివ్యరాజ్, జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్త*
ఈ సందర్భంగా జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్త డాక్టర్ బుర్రా దివ్యరాజ్ మాట్లాడుతూ. ‘‘ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలన చేసి, అత్యుత్తమ నాయకత్వాన్ని అందించాలనే బలమైన కాంక్ష, సంకల్పం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని, వారి నాయకత్వాన్ని
ప్రజలకు అందించాలని కోరుకుంటారు. రాజకీయంగా అండ లేని వారికి జనసేన పార్టీ వేదికగా ఉపయోడపడుతుంది. పార్టీలో ప్రజాస్వామ్య విలువను చూపిస్తూ, నేటి తరానికి రాజకీయాలను దగ్గర చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి గొప్పది. ఆయన స్ఫూర్తిని వచ్చే తరం జాగ్రత్తగా ముందుకు నడిపించే బాధ్యతను తీసుకోవాలి’’ అన్నారు.
పూర్తి పారదర్శకంగా కమిటీలు పనిచేస్తాయి : శ్రీ పెనుగొండ సుబ్బారాయుడు, జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్త
జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్త మాట్లాడుతూ..‘‘శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్గ దర్శకత్వంలో సమాచార సేకరణ కమిటీలు పారదర్శకంగా పనిచేస్తాయి. ఎవరి సమాచారం మిస్ కాకుండా, ప్రతి అంశం అధ్యక్షుల వారి దృష్టికి తెస్తాయి. కార్యకర్తల పూర్తి సమాచారాన్ని బేరీజు వేసి అధ్యక్షులు వారు తీసుకునే నిర్ణయంతో పార్టీ అత్యుత్తమంగా తయారు అవుతుంది. పార్టీ నాయకులుగా రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే నాయకత్వం
జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియ దేశరాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సామాన్య జనసైనికులు, వీర మహిళల నుండి వారి పనితీరు పరిశీలించి హ్యాండ్ పిక్ చేసి మరీ నియమించారు. ఈ ప్రక్రియ ద్వారా రాజకీయాలలో సామాన్యులకు మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే గొప్ప అవకాశాన్ని కల్పించనున్నారు.
#JSPMembershipToLeadership #JSPForNewAgePolitics
జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియను పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయం చేసేందుకు అయిదుగురు సభ్యులతో కమిటీని నియమించారు. పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు అయిదుగురు సభ్యులను ఖరారు చేశారు. ఈ కమిటీలో శ్రీ తమ్మిరెడ్డి శివశంకర రావు, డా. పెదపూడి విజయ్ కుమార్, డా. పంచకర్ల సందీప్, శ్రీమతి బుర్రా దివ్య రాజ్, శ్రీ పెనుగొండ సుబ్బారాయుడు సభ్యులుగా ఉంటారు. సోమవారం నుంచి 25 పార్లమెంట్ నియోజక వర్గాల్లో - జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రక్రియను పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ కమిటీని సమన్వయం చేస్తుంది.
- జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
#JSPMembershipToLeadership
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల నియామకం
• జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో నా స్వీయ పర్యవేక్షణలో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను" నియమిస్తున్నాము.
• ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక సీనియర్ పరిశీలకులు
• పార్టీ పట్ల నిబద్ధత, స్థానిక అంశాలపై అవగాహన కలిగిన ముగ్గురు సీనియర్ నాయకులు
• నిలకడగా ప్రతి సంవత్సరం సభ్యత్వ నమోదులో పాల్గొన్న ముగ్గురు సాధక్స్
• ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కనీసం ముగ్గురు సాధక్స్
• మొత్తం 28 మంది నాయకులు, సాధక్స్ తో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" ఏర్పాటు
• వీరికి సహకారం అందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం తరపున ఐదుగురు సహాయక సిబ్బంది
• ఈ కమిటీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కోసం అంకితభావంతో కష్టపడిన నాయకులు, సాధక్స్, జనసైనికుల సమాచారం సేకరణ.
• 2014 నుండి జనసేన జెండాను మోస్తున్న జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్దేలా పార్టీ నిర్మాణం
• పార్లమెంట్ నుండి గ్రామ స్థాయి వరకు, అలాగే వివిధ విభాగాలలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారికి, వారి ఆసక్తికి తగిన విధంగా బాధ్యతలు
• సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం నా ఆధ్వర్యంలో తీసుకోబడుతుంది.
• జనసైనికులలోని నాయకత్వ లక్షణాలు, నైపుణ్యం, అంకితభావాన్ని గుర్తించి వారికి నాయకత్వ అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
#JSPMembershipToLeadership