వాయిస్ క్లోనింగ్ స్కామ్‌తో మోసగాళ్లు డబ్బులు కొల్లగొడుతున్నారు. మీ సన్నిహితుల వాయిస్‌తో ఫేక్ కాల్స్ చేసి డబ్బులు అడుగుతారు. ఆపదలో ఉన్నామంటూ కంగారు పెడతారు. ఇలాంటి కాల్స్ వస్తే తొలుత ��ిర్ధారించుకోండి.
#TelanganaPolice #VoiceCloning
సోషల్ మీడియా స్నేహాలతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరినీ నమ్మి మీ వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవద్దు. స్నేహం ముసుగులో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే భయపడకుండా పోలీసులను ఆశ్రయించండి.
#TelanganaPolice#SocialMedia
పోలీసులంటే భరోసా, భయం వుం��ాలి
-వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్
పోలీసులు అంటే సాధారణ ప్రజలు, బాధితులకు భరోసా, నమ్మకం కలిగించాలి, అదే తప్పు చేసిన, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారికి పోలీసులంటే భయం కలగాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో నూతనంగా భాద్యతలు చేపట్టిన హన్మకొండ ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఇన్స్ స్పెక్టర్ సుబ్బారెడ్డి, ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఇన్స్ స్పెక్టర్ చేరాలు శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్కలను అందజేశారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ ప్రజలు మనపై వుంచిన నమ్మకానికి తగ్గట్లు పనిచేయాలని, పారదర్శకంగా విధులు నిర్వహించాలని సీపీ సూచించారు.
@TelanganaDGP
@TelanganaCOPs
3,4 జోన్ల అధికారులు, సిబ్బందికి గ్రీవెన్స్ నిర్వహించిన వరంగల్ సిపి
3,4 జోన్ల పరిధిలో విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందికి సంబంధించిన శాఖ పర��ైన సమస్యలపై ఇంచార్జ్ డిఐజి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, శుక్రవారం వరంగల్ రేంజ్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పదోన్నతులు, బదిలీలు, శాఖపరమైన క్రమశిక్షణ చర్యలకు సంబంధించి సిబ్బంది అధికారులు అందజేసిన దరఖాస్తులను వరంగల్ పోలీస్ కమిషన్ పరిశీలించారు.
@TelanganaDGP
@TelanganaCOPs
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కేవలం మంచిని పెంచేందుకు, విజ్ఞానాన్ని పంచేందుకు మాత్రమే వినియోగించండి. ఏఐని ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవు.
#telanganapolice
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పదు
- వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్.
నిర్వహించాల్సిన విధులను నిర్వహించకుండా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు ��ెలియజేసారు. నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని గురువారం కిట్స్ కళాశాల సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సమావేశంలో తొలి సారిగా గతంలో ఎన్నడూ లేని విధంగా సిసిటిఎన్ఎస్ అప్లికేషన్ 2.0 ద్వారా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ కోసం సంబంధిత పోలీస్ అధికారులు తీసుకుంటున్న చర్యలపై పోలీస్ కమీషనర్ ఆన్ లైన్ పద్దతిలో సంబంధిత స్టేషన్ అధికారులను అడిగి తెలుకోవడంతో పాటు, పెండింగ్ కేసుల, కేసుల పురోగతికై తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులు సూచనలు, సలహాలను అందజేసారు.
అనంతరం అధికారులను ఉద్యేశిస్తూ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లను స్టేషన్ అధికారులు వ్యక్తిగతంగా వెళ్ళి తనిఖీ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో విద్యా సంస్థల 100 మీటర్ల పరిధిలో ఎలాంటి పొగాకు ఉత్పత్తుల విక్��యాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని, రానున్న విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకొని విద్యార్��ుల భద్రతను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను పాఠశాలలకు తరలించే స్కూల్ బస్‌ల స్థితిగతులపై స్థానిక పోలీస్ అధికారులు వ్యక్తిగతం వెళ్ళి బస్సులను తనిఖీ చేయాలని ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన వరుస సంఘటనలను దృష్టిలో వుంచుకొని నగరంలో నేపాల్ దేశానికి చెందిన పౌరులు ఎక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడ నివస్తున్నారు, ముఖ్యంగా ఇండ్లల్లో పనిచేసే వారి వివరాలను సేకరించాలని
రాబోవు లోక్ అదాలత్ ద్వ���రా పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యే విధంగా అధికారులు కృషి చేయాలని, పెండింగ్ కేసులను పరిష్కరించడంతో పాటు, పెండింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను త్వరగా పరిష్కారించాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, దార కవిత, అదనపు డిసిపిలు రవి,బాలస్వామి, ప్రభాకర్ రావు, సురేష్‌కుమార్‌తో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, సబ్`ఇన్స్స్��ెక్టర్లు పాల్గొన్నారు. @TelanganaDGP
@TelanganaCOPs
బాధ్యతను మించిన మానవత్వం
-ఆపదలో అండగా నిలిచిన పర్వతగిరి సీఐ రాజగోపాల్
ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో రోడ్డుపై ప్రమాదం జరిగితే చూసీచూడనట్లు వెళ్లిపోయే ఈ రోజుల్లో, ఖాకీ చొక్కా వెనుక ఉన్న కరుణను ఓ పోలీస్ అధికారి కళ్లకు కట్టారు. హంటర్ రోడ్డు నుంచి తన విధులకు వెళ్తున్న పర్వతగిరి సీఐ రాజగోపాల్, జేఎస్ఎం కళాశాల వద్ద కారు స్కూటీని ఢీకొట్టిన ప్రమాదాన్ని గమనించారు. స్కూటీపై ప్రయాణిస్తున్న దంపతులు రక్తపు మడుగులో తీవ్ర గాయాలతో పడి ఉ��డటం చూసి ఆయన తక్షణం స్పందించారు. తన ప్రయాణాన్ని ఆపి, క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఒక ఆటో మాట్లాడి, గాయపడిన వ్యక్తిని అందులో ఎక్కించారు. కేవలం ఆస్పత్రికి పంపించి చేతులు దులుపుకోకుండా, స్వయంగా ఆ ఆటోలోనే తోడుగా కూర్చుని హంటర్ రోడ్డులోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో నేరుగా మాట్లాడి అత్యవసర వైద్య సేవలు అందేలా చూడటమే కాకుండా, భయంతో ఉన్న ఆ దంపతులకు కొండంత భరోసా ఇచ్చారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూ సాటి మనుషుల పట్ల పట్టింపు లేని ప్రస్తుత సమాజంలో, ఒక నిరుపేద కుటుంబం ప్రాణాలు కాపాడేందుకు సకాలంలో స్పందించిన సీఐ రాజగోపాల్ తీరు నేటి యువతతో పాటు పాత తరానికి సైతం ఆదర్శంగా నిలుస్తూ ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతోంది.
@TelanganaDGP
@TelanganaCOPs
Creating safe spaces for women is a shared responsibility.
Telangana Police SHE Teams are actively monitoring public places, responding to harassment, and ensuring swift action against offenders.
#SHETeams#TelanganaPolice#SafetyForHer
డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణపై పలు కీలక అంశాలపై చర్చించారు. హెల్మెట్లను పంపిణీ చేసి ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించాలని అన్నారు.
��రైవ్ అలైవ్ కార్యక్రమానికి విచ్చేసిన ఆపరేషన్స్ డీజీపి
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగం జనగామ పట్టణంలో ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన గ్రేహౌండ్స్, ఆపరేషన్స్ డీజీపీ అనిల్ కుమార్ గారిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసులు గౌరవవందనం చేశారు. @TelanganaDGP
@TelanganaCOPs
#ArriveAlive
ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాల నియంత్రణ సాధ్యం
-ఆపరేషన్స్ డీజిపీ అనిల్ కుమార్.
ప్రజల భాగస్వామ్యం, సహకారంతోనే రోడ్డు ప��రమాదాలను నియంత్రించగలమని డిజిపి అనిల్ కుమార్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా వరంగల్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని మాంగళ్య కల్యాణ వేదికలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిధి ఆపరేషన్స్ డీజిపీ అనిల్ కుమార్ తో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముందుగా ముఖ్య అతిధుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా కార్యక్రమానికి హాజరైన స్థానిక ప్రజలు, యువత ఉద్దేశిస్తూ డిజిపి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా గతం లో 1 లక్ష 73 వేల మంది రోడ్డ�� ప్రమాదాల్లో మరణిస్తున్నారని, దీని కారణంగా దేశ జీడీపీ 3శాతం నష్టం జరుగుతోందని మన తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది 7 వేలకు పై ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మరణించారని దీని కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఎన్నో భారీ ప్రమాదాలు జరిగినా ప్రజల్లో మార్పు రావడంలేదని, విదేశాల్లో ట్రాఫిక్ రూల్స్ అతి కఠినంగా ఉంటాయని అక్కడ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వీళ్ళల్లో జరిమాలను విధించబడతాయని, కానీ మనదేశంలో మాత్రం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే తక్కువ గా జరిమానాలు విధించడం ద్వారా వాహనదారులకు భయం లేదని, మన దేశంలో రోడ్డు ప్రమాదాలకు ఇది కూడా ఒక కారణమని, ట్రాఫిక్ రూల్స్ మీ భద్రత కోసమని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబందనాలు పాటిస్తే ఎన్నో రోడ్డు ప్రమాదాలను నివారించగలమని, అరైవ్ అలైవ్ ముఖ్య ఉద్దేశం వాహన దారుడు స్వీయ రక్ష పాటిస్తూ క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని, గత ఆరు నెలలుగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా వరంగల్ కమిషనరేట్ పరిధిలో 15 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గు ముఖం పట్టాయని, ప్రతి ఒక్కరు తమ వంతు భాద్యత భావిస్తూ ట్రాఫ��క్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని ప్రజల భాగస్వామ్యం రోడ్డు ప్రమాదలను నివారించగలమని డీజిపీ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మన రాష్ట్రం అలాగే రాష్ట్రంలో సంవత్సరంలో తొమ్మిది వందల హత్యలు జరుగుచుండగా, రోడ్డు ప్రమాదాల్లో మాత్రం ప్రతి సంవత్సరం సుమారు 8వేల మందికి పైగా మరణిస్తున్నారని ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయమని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ��ాహనం నడపటం ద్వారా ఈ సమస్య పరిష్కరించుకోగలమని తెలిపారు.
అంతకు ముందుగా కార్యక్రమం జరిగే ఆవరణలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు సంబంధించి ప్రమాదానికి గురైన వాహనాలను ప్రదర్శనకు ఉంచి ప్రమాదం జరిగిన తీరును అధికారులు డిజిపికి వివరించారు, ట్రాఫిక్ రూల్స్ అతి క్రమిస్తే జరిగే పరిణామాలపై జాగృతి కళాబృందం, ట్రాఫిక్ పోలీసులు అవగాహన సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం డీజీపీ చేతుల మీదుగా డైవింగ్ ప్రతిభ కనబరిచిన పోలీస్, ఆర్టీసీ డ్రైవర్లకు ప్రశంస పత్రాలను అందజేయగా, యువతకు హెల్మెట్లు, ఆటో డ్రైవర్లకు కంటి అద్దాలను అందజేశారు. చివరగా ట్రాఫిక్ నిబందనలు పాటిస్తామని స్థానిక యువతతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో డిసిపిలు రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, ధార కవిత, ��దనపుడిసిపి ప్రభాకర్ రావు, ఏసీపీలు భీమ్ శర్మ, నర్సయ్య, సత్యనారాయణ తో పాటు వెస్ట్ జోన్, ట్రాఫిక్ కు చెందిన ఇన్స్ స్పెక్టర్లు, ఎస్.ఐ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
#ArriveAlive @TelanganaDGP
@TelanganaCOPs
conducted a drug awareness program at MGM De-Addiction Centre under Praja Palana–Prajathi Parnalika. Fruits distributed to recovering users and saplings planted. DCP Dhara Kavitha, ACPs, Eagle Force & MGM staff participated.@TelanganaDGP@EAGLE_TELANGANA@cpwarangal@dcpczwrl