@not_disciple@TelanganaCMO@GHMCOnline@CommissionrGHMC@HYDTP@SajjanarVC_IPS The staff of Musheerabad Police Station reached the spot and took necessary safety precautions around the manhole. The manhole was properly secured and closed to prevent any untoward incident. At present, there is no issue or inconvenience at the location.😀
@not_disciple@TelanganaCMO@GHMCOnline@CommissionrGHMC@HYDTP@SajjanarVC_IPS The staff of Musheerabad Police Station reached the spot and took necessary safety precautions around the manhole. The manhole was properly secured and closed to prevent any untoward incident. At present, there is no issue or inconvenience at the location.😀
➡️ఆన్లైన్ ఆటల ఉచ్చులో బాల్యం!!
➡️తల్లిదండ్రుల నిఘా లోపమే ప్రధాన కారణం
➡️చిన్నారుల గేమింగ్ ప్రమాదాలపై హైదరాబాద్ సీపీ సజ్జనర్ కీలక అడ్వైజరీ
✳️'ఫ్రీ ఫైర్', 'ఫ్రీ ఫైర్ మ్యాక్స్' వంటి ఆన్లైన్ మల్టీప్లేయర్ ఆటల ఉచ్చులో పడి చిన్నారులు ఆర్థికంగా, మానసికంగా నష్టపోకుండా ఉండేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఒక కీలకమైన అడ్వైజరీ జారీ చేశారు. ఇటీవల సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వస్తున్న అనేక ఫిర్యాదులు బయటకు కేవలం ఆర్థిక మోసాలుగా కనిపిస్తున్నప్పటికీ.. వాటి వెనుక ముఖ్యంగా ఈ ఆన్ లైన్ గేములకు పిల్లలు బానిస కావడం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడమే ప్రధాన కారణాలని ఆయన స్పష్టం చేశారు. చిన్నారుల భవిష్యత్తును నాశనం చేస్తున్న ఇలాంటి గేమింగ్ యాప్‌ల అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని, వీటి నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకునేలా గూగుల్ వంటి అంతర్జాతీయ సాంకేతిక సంస్థలకు సైతం లేఖలు రాస్తామని పేర్కొన్నారు.
✳️హ్యాకింగ్ కాదు.. సొంత బిడ్డల పనే!
మొబైల్‌కు వరుసగా డెబిట్ మెసేజ్‌లు రావడంతో తమ బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని ఆందోళన చెందుతూ చాలామంది బాధితులు ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు దర్యాప్తు చేశాక బయటపడే నిజం తల్లిదండ్రులకు పెద్ద షాక్ ఇస్తోంది. అక్కడ ఎలాంటి హ్యాకింగ్ లేదా మోసపూరిత లింకులు లేవని, పిల్లలే 'ఫ్రీ ఫైర్', 'ఫ్రీ ఫైర్ మ్యాక్స్' వంటి ఆన్లైన్ మల్టీప్లేయర్ ఆటల్లో వర్చువల్ కాయిన్స్, డైమండ్స్ కొనుగోలు చేయడానికి ఫోన్లో సేవ్ చేసిన కార్డ్స్ లేదా యూపీఐ వివరాలను వాడేశారని తేలుతోంది. ముఖ్యంగా, తాతయ్యలు, నానమ్మల ఫోన్లలో యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయి ఉండటంతో పిల్లలు సులభంగా వేల రూపాయల లావాదేవీలు చేసేస్తున్నారు. ఇది సాంకేతికంగా నేరం కానప్పటికీ, కేవలం ఇంట్లో పర్యవేక్షణ లోపం వల్ల జరుగుతోంది. ఇటువంటి అజాగ్రత్తల వల్ల అసలైన సైబర్ నేరస్థులను పట్టుకోవాల్సిన పోలీసుల విలువైన సమయం వృథా అవుతోంది.
✳️గేమ్ పరిచయం.. పక్క రాష్ట్రానికి పరుగు!
ఇటీవల జరిగిన మైనర్ బాలికల అదృశ్యం ఉదంతం.. ఆన్లైన్ ఆటలు, సోషల్ మీడియాతో పొంచి ఉన్న ప్రమాదాలను మరోసారి కళ్లకు కట్టింది. 'ఫ్రీ ఫైర్' గేమ్ ద్వారా కొందరు అపరిచిత వ్యక్తులతో పరిచయం పెంచుకున్న బాలికలు, ఆ తర్వాత సోషల్ మీడియా యాప్స్ ద్వారా వారితో చాటింగ్ కొనసాగించారు. ఆన్లైన్ మాయలో పడిపోయి.. కేవలం ఇంటర్నెట్లో మాత్రమే పరిచయమైన ఆ వ్యక్తులను నేరుగా కలవడానికి తమ ఇళ్లను వదిలి, పక్క రాష్ట్రానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అయితే, పోలీసులు సకాలంలో స్పందించి ఆ బాలికలను సురక్షితంగా కాపాడి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. పిల్లలు ఫోన్లలో ఏం చేస్తున్నారో గమనించడం, వారికి డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడం ఎంత అత్యవసరమో ఈ సంఘటన తెలియజేస్తోంది.
✳️'స్టేటస్' కోసం దొంగచాటు ఖర్చులు!
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 10 నుంచి 17 ఏళ్ల లోపు విద్యార్థులు నేడు క్లాస్‌రూమ్‌ల కంటే 'ఫ్రీ ఫైర్, మ్యాక్స్' వంటి గేమింగ్ వర్చువల్ యుద్ధభూమిలోనే ఎక్కువగా గడుపుతున్నారు. స్నేహితుల మధ్య తమ స్టేటస్ కోల్పోకూడదనే తాపత్రయమే దీనికి కారణం. ఆటలో రేర్ ఐటమ్స్, రకరకాల ఆయుధాలు, 'ఎలైట్ పాస్' ఉన్నవారినే స్నేహితులు హీరోలుగా చూడటం, అవి లేని వారిని తక్కువ చేసి మాట్లాడటంతో.. ఆ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు దొంగచాటుగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఒకప్పుడు ఆన్లైన్ క్లాసుల పేరుతో చేతికి వచ్చిన ఫోన్లు, నేడు అర్ధరాత్రి వరకు సాగే గేమింగ్ సెషన్లుగా మారిపోతున్నాయి. తల్లిదండ్రులు బిజీగా ఉండటం, టెక్నాలజీపై వారికి తగినంత అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
✳️పసిమనస్సులను కబళిస్తున్న 'గేమింగ్ డిజార్డర్స్
అతిగా ఆన్లైన్ ఆటలు ఆడటం కేవలం అలవాటు మాత్రమే కాదు, ఒక భయంకరమైన మానసిక రుగ్మత అని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లోనే గుర్తించి దీనికి 'గేమింగ్ డిజార్డర్' అని నామకరణం చేసింది. ఆటలపై నియంత్రణ కోల్పోవడం, చదువు, నిద్ర, కుటుంబ సభ్యుల కంటే ఆటలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, నష్టాలు జరుగుతున్నా ఆట మానలేకపోవడం ఈ రుగ్మత ప్రధాన లక్షణాలు. దీనివల్ల పిల్లల్లో తీవ్ర కోపం, దూకుడు ప్రవర్తన, చదువులో వెనుకబాటుతనం, నిద్రలేమి, కంటి సమస్యలు, సామాజిక దూరం పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, ఆటలను కఠినంగా నిషేధించడం దీనికి సరైన పరిష్కారం కాకపోవచ్చు. అది వారిలో మరింత ఉత్సుకతను పెంచి దొంగచాటుగా ఆడేందుకు దారితీస్తుంది. కాబట్టి పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడటం, వారిని అర్థం చేసుకోవడం, ఆటల సమయాన్ని క్రమబద్ధీకరించడమే దీనికి అసలైన పరిష్కారం.
దేశ భద్రతా కారణాల దృష్ట్యా 2022లోనే కేంద్ర ప్రభుత్వం అసలైన 'ఫ్రీ ఫైర్' గేమ్‌ను భారతదేశంలో నిషేధించింది. అయినప్పటికీ, సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు చిన్నారులు వీపీఎన్ ల ద్వారా దొంగచాటుగా ఈ నిషేధిత గేమ్‌ను ఇంకా ఆడుతూనే ఉన్నారు. మరోవైపు, ఈ గేమ్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా వచ్చిన 'ఫ్రీ ఫైర్ మ్యాక్స్' ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో యథేచ్ఛగా లభిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. నిషేధిత గేమ్‌కు ప్రత్యామ్నాయంగా మారిన ఈ వెర్షన్‌కు చిన్నారులు అత్యంత వేగంగా ఆకర్షితులవుతూ, తీవ్ర వ్యసనానికి లోనవుతున్నారు.
✳️ఇప్పుడైనా కళ్లు తెరవండి.. పిల్లలను కాపాడుకోండి
చిన్నారులను ఆన్లైన్ ఆటల ముప్పు నుంచి కాపాడుకునేందుకు తల్లిదండ్రులు తక్షణమే కొన్ని కీలక రక్షణ చర్యలు చేపట్టాలి. మొదటగా, పిల్లలు వాడే ఫోన్ల నుంచి సేవ్ చేసిన బ్యాంక్ కార్డులు, యూపీఐ ఆటోఫిల్ వివరాలను తొలగించి, ప్రతి లావాదేవీకి పిన్ లేదా బయోమెట్రిక్ లాక్ తప్పనిసరి చేయాలి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లలో 'పేరంటల్ కంట్రోల్స్', 'పర్చేజ్ అప్రూవల్స్' ఆన్ చేసుకోవాలి. బ్యాంక్ అలర్ట్ మెసేజ్‌లను నిరంతరం గమనిస్తూ, వాటి ప్రాముఖ్యతను ఇంట్లోని వృద్ధులు, పెద్దవారికి కూడా వివరించాలి. అవసరమైతే పిల్లలకు పరిమిత బ్యాలెన్స్ ఉండే ప్రీపెయిడ్ కార్డులు మాత్రమే ఇవ్వాలి. ఇంట్లో ఎవరి మొబైల్ వాడినా సరే, రోజువారీ ఫోన్ వాడకంపై కచ్చితమైన సమయ పరిమితి విధించాలి. పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూ వారు ఆడే ఆటల గురించి అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ వారిలో తీవ్ర కోపం, నిద్రలేమి, మార్కులు తగ్గడం, ఫోన్‌ను దొంగచాటుగా దాచడం వంటి మార్పులు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై చైల్డ్ సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ సహాయం తీసుకోవాలి.
"ఈ అడ్వైజరీ ఆన్లైన్ ఆటలను లేదా గేమింగ్‌ను పూర్తిగా వ్యతిరేకించడానికి ఉద్దేశించింది కాదు. ఆన్లైన్ ఆటలను కేవలం వినోదం కోసమే, అదీ పరిమిత పరిధుల్లోనే ఆడాలి. మితిమీరిన గేమింగ్, నియంత్రణ లేని సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లల చదువు, ఆరోగ్యం, ప్రవర్తనతో పాటు వారి సమగ్ర వికాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా 'పర్యవేక్షణ (Monitor), మార్గదర్శకత్వం (Mentor), ప్రోత్సాహం (Motivate)' అనే త్రిసూత్రాన్ని పాటించాలి. అలాగే, విద్యార్థులు లేదా చిన్నారులు ఆటల్లోనైనా సరే.. 'క్లిక్ చేసే ముందు ఆలోచించండి' (Think Before You Click, Even While You Play) అనే నినాదాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఉపాధ్యాయులు, సంరక్షకులు కూడా చిన్నారుల ఆన్లైన్ కార్యకలాపాలను చురుగ్గా పర్యవేక్షించాలి. వారిలో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందిస్తూ, డిజిటల్ ప్రపంచానికి, నిజ జీవిత కార్యకలాపాలకు మధ్య సరైన సమతుల్యత ఉండేలా ప్రోత్సహించాలి. సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించడమే పిల్లల భద్రతకు, వారి శ్రేయస్సుకు అత్యంత కీలకం. పర్యవేక్షణ లేని ఇంటర్నెట్ వల చిన్నారుల భవిష్యత్తును ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీయకుండా, అలాగే ఆన్లైన్ వేధింపుల బారిన పడకుండా కాపాడుకోవడానికే ఈ మార్గదర్శకాలను విడుదల చేశాం. డిజిటల్ భద్రతపై తల్లిదండ్రులకు, పాఠశాలలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు తీసుకుంటోంది."అని సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ సిటీ పోలీస్
➡️ఆపరేషన్ కవచ్: 562 హోటళ్లు, లాడ్జీలలో సిటీ పోలీసుల ముమ్మర తనిఖీలు
➡️5 వేల మంది సిబ్బందితో అర్ధరాత్రి సాగిన సోదాలు
➡️క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షించిన నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్
➡️నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
✳️హైదరాబాద్ నగర అంతర్గత భద్రతను పటిష్టం చేయడంతో పాటు, అసాంఘిక శక్తుల కదలికలను ముందస్తుగా నిరోధించే లక్ష్యంతో శుక్రవారం రాత్రి 'ఆపరేషన్ కవచ్' తనిఖీలను సిటీ పోలీసులు నిర్వహించారు. శాంతి భద్రతల పరిరరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన ఈ సోదాలలో సుమారు 5,000 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని, మొత్తం 562 హోటళ్లు, లాడ్జీలలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. హోటల్ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, బస చేయడానికి వచ్చిన విజిటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్నారా? లేదా అనే అంశాలను నిశితంగా పరిశీలించారు. అర్థరాత్రి 11 గంటల నుంచి ఒంటిగంట వరకు ఈ సోదాలు కొనసాగాయి.
✳️ఈ ఆపరేషన్‌లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనలో పాల్గొన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని, అమీర్‌పేటలోని పలు లాడ్జీలను ఆయన స్వయంగా సందర్శించారు. గదుల కేటాయింపు ప్రక్రియ, విజిటర్ల వివరాల నమోదు విధానాన్ని పరిశీలించారు. లాడ్జీలలో బస చేసిన పలువురు విజిటర్లతో నేరుగా మాట్లాడి, వారు ఏ ప్రాంతం నుండి వచ్చారు, నగర సందర్శనకు గల కారణాలు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
✳️ఈ ముమ్మర తనిఖీలలో భాగంగా కమిషనరేట్ పరిధిలోని 7 జోన్లలో మొత్తం 562 హోటళ్లు, లాడ్జీల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. జోన్ల వారీగా తనిఖీలు జరిగిన లాడ్జీలు, హోటళ్ల వివరాలు చూస్తే... అత్యధికంగా ఖైరతాబాద్‌లో 119, శంషాబాద్‌లో 92, జూబ్లీహిల్స్, గోల్కొండలలో 86 చొప్పున, సికింద్రాబాద్‌లో 82, రాజేంద్రనగర్‌లో 53, చార్మినార్ జోన్లో 44 చోట్ల ఈ ఆపరేషన్ కొనసాగింది. ఈ సోదాలలో లా అండ్ ఆర్డర్ పోలీసులు సమన్వయంతో వ్యవహరించి, హోటళ్ల రికార్డులను, గదులను క్షుణ్ణంగా పరిశీలించారు.
✳️ఈ తనిఖీల నేపథ్యంలో హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులు విధిగా నిబంధనలు పాటించాలని నగర సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని తెలుపుతూ, లాడ్జీకి వచ్చే ప్రతి ఒక్కరి నుండి గుర్తింపు కార్డుల ఒరిజనల్ ప్రతిని పరిశీలించి, దాని స్పష్టమైన నకలును సేకరించాలని ఆదేశించారు. రిజిస్టర్లలో విజిటర్ల పూర్తి సమాచారం, ఫోన్ నంబర్లు, చెక్ ఇన్ , చెక్ అవుట్ సమయాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అసంపూర్ణ లేదా తప్పుడు సమాచారంతో గదులను కేటాయించరాదన్నారు.
✳️మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ గదులను ఇవ్వొద్దని, గుర్తింపు కార్డుల్లో ఉన్న వయసును దృవీకరించుకోవాలన్నారు. పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా త్వరలోనే నూతన డిజిటల్ విజిటర్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. భద్రతా నిఘాను బలోపేతం చేయడానికి హోటల్ పరిసరాలలో, ముఖ్యంగా ఎంట్రీ, ఎగ్జిట్, రిసెప్షన్ ఏరియాలు స్పష్టంగా కనిపించేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్క కెమెరా నిరంతరాయంగా పనిచేసేలా చూసుకోవాలని సూచించారు.
✳️ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే సూచనలు కనిపించినా వెంటనే డయల్ 100కి గానీ, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నిబంధనలను బేఖాతరు చేసే నిర్వాహకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.
✳️ఈ తనిఖీల్లో అదనపు సీపీ క్రైమ్స్ శ్రీ శ్రీనివాసులు, ఐపీఎస్, అదనపు సీపీ లా అండ్ ఆర్డర్ తఫ్షీర్ ఇక్బాల్, ఐపీఎస్, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్, ఐపీఎస్, జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ నార్త్ జోన్ శ్రీమతి శ్వేత, ఐపీఎస్, డీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ శ్రీ వెంకటేశ్వర్లు, ఐపీఎస్, డీసీపీ క్రైమ్స్ శ్రీ చైతన్య కుమార్, ఐపీఎస్ తో పాటు అన్ని జోన్ల డీసీపీలు శ్రీ కిరణ్ ఖరే, ఐపీఎస్, శ్రీమతి శిల్పవల్లి, ఐపీఎస్, శ్రీ శ్రీనివాస్, ఐపీఎస్, శ్రీ చంద్ర మోహన్, శ్రీ రమణా రెడ్డి, శ్రీ రాజేష్, డీసీపీ సైబర్ క్రైమ్స్ శ్రీ అరవింద్ బాబు, డీసీపీ విమెన్ సేఫ్టీ వింగ్ శ్రీమతి లావణ్య నాయక్ జాదవ్, అదనపు డీసీపీలు, ఏసీపీలు, తదితరులు పాల్గొన్నారు.
పీఆర్వో,
హైదరాబాద్ సిటీ పోలీస్
హైదరాబాద్ పేట్ల బురుజులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది.
ఈ వేడుకలలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాను. సుదీర్ఘమైన, చారిత్రాత్మకమైన పోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభ సందర్భంలో, ఉద్యమ అమరవీరులందరికీ హైదరాబాద్ సిటీ పోలీస్ తరపున ఘన నివాళులు అర్పించాను.
అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, వారు కలలుగన్న ఆశయాల సాధన కోసం మనమంతా నిరంతరం కృషి చేయాలి.
#TelanganaFormationDay
Your spit doesn't disappear - it lands somewhere, often on someone.
A moment of carelessness for you can become an unpleasant experience for someone else.
#BeResponsible#CivicSense
Fraudsters Use Digital Wedding Cards as a New Tool to Hack Phones; Avoid Opening APK Files or Suspicious WhatsApp Links from Unknown Numbers.
#DigitalWeddingCards
@rajender_nalla@CPHydCity The Case is a cheating and criminal beach of trust and forgery , Investigation under process some more evidence has to be collected and case will be finalised as early as possible.
@rajender_nalla@CPHydCity The Case is a Cheating and Criminal Breach Of Trust and Forgery. Investigation Under Process Some More Evidence Has to be Collected and The case will be Finised as early as Possible.
Today, on 01.01.2026, G Rambabu, SHO, along with SI Rajesh, patrol car staff & BC, participated in the programme at Nightingale Home for Girls located at Musheerabad Government School was visited and New Year celebrations were conducted with the orphan children by cutting a cake
Good afternoon Madam,
Doar to Doar Cyber awareness program conducted by the staff.
During the program, participants were educated about the online transactions, Loan Apps, Importance of OTPs not to become victims of Cyber fraud. A pledge was taken by the participants.
Today Conducted Awareness program by Ps Staff. During the program, participants were educated about the online transactions, Loan Apps, Importance of OTPs not to become victims of Cyber fraud. A pledge was taken by the participants to stay alert about Cyber Crimes.