సమగ్ర క్షేమానికి సనాతనధర్మమే...
ఋషిపీఠం జూన్ 2026 మాసపత్రికలోని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సంపాదకీయం
'సనాతనధర్మాన్ని నిర్మూలించాలి'- అని కొందరి ఉద్దేశ్యం, ఉద్యమం. శాశ్వత ప్రకాశస్వరూపుడైన సూర్యకాంతిని రూపుమాపాలి... అనడం ఎంతటి అవివేకమో, ఇదీ
అలాంటిదే! 'సనాతనం' అంటేనే 'శాశ్వతం'. 'ధర్మం' అంటేనే విశ్వనియమం. ఈ రెండూ ఒకటే. కానీ, తమ మతాల వ్యాప్తి కోసం ఈ దేశంలో బలంగా ఉన్న ధర్మాన్ని పెకలించాలని శత్రుశక్తుల తపన. వారు తమ లక్ష్యం కోసం కొన్ని శతాబ్దాలుగా తహ తహలాడుతూనే ఉన్నారు. ప్రలోభాలతో, బెదిరింపులతో మార్పిడి చేయడం, కుదరకపోతే సంహరించడం, విధ్వంసాలను రేపడం... వందల ఏళ్ళుగా జరుపుతూనే ఉన్నారు. వాటి ఫలితంగా చాలా కోల్పోయినా, ధర్మం సజీవంగానే నిలబడి ఉంది. దీనిని సహించలేక, 'మేధోమార్జనం' చేయాలని వక్రీకరణలు, దుర్వ్యాఖ్యలు చెలరేపి గ్రంథాలపై, ధార్మిక వ్యవస్థలపై, ధర్మప్రబోధకులపై, ఆలయవైభవాలపై అపోహలను, అవగాహనా రాహిత్యాన్ని కల్పించి మనపై మనకే ద్వేషం పుట్టించే కుయుక్తులను సృష్టించి వ్యాపింపజేశారు.
ఎంత హేతుబద్ధ వైజ్ఞానికులం అని చెప్పుకుంటున్నా, పూర్తి మతవాదులుగా బ్రతుకుతున్న విదేశీ విశ్వవిద్యాలయ మేధావులు వ్యూహాత్మకంగా 'కుట్రల'ను రచిస్తూ, 'కులాల వివక్ష'ను మనలో లోపంగా చెప్తూ, 'నిజమే కదా!' అని మన చేతనే అనిపించేలా మభ్యపెట్టారు; పెడుతున్నారు. మనలోవారే 'అవును - మనలో ఈ కులవ్యవస్థ ఒక లోపం'- అనడం, 'ఈ లోపాన్ని సవరించుకుని మన గొప్పతనాన్ని తెలియజేయాలి' అని భావించడం కూడా కనబడుతుంది.
'కులం' అనే పేరు లేకపోయినా, మరొక పేరుతో 'విభజన' అనేది అన్ని దేశాల సమాజాలలోనూ ఉన్నదే. గత-వర్తమాన చరిత్రలు తెలియని అవగాహనారహిత యువత ఈ వాస్తవాలను తెలుసుకోలేకపోతోంది. యుగాలనాడే తార్కిక, తాత్త్విక చింతనలతో అద్భుత శాస్త్రాలను ఆవిష్కరించి... యోగం, ఆయుర్వేదం, కుటుంబధర్మం, పర్యావరణ బాధ్యత, వేదాంతచింతన, న్యాయ-వైశేషిక దర్శనాలు, మంత్రరహస్యాలు, ఆలయనిర్మాణ పరిజ్ఞానాలు, జ్యోతిష-గణిత విజ్ఞానాలు సాధించి, అన్నిటినీ ఒక్క సూత్రంతో మేళవించి ఒకే ధర్మంగా ప్రతిష్ఠించిన అద్భుత పరంపర మనది... అని గ్రహించలేని పరిస్థితులను ఏర్పరచారు. దీనికి తొలుత దాడి చేసిన విదేశీ శక్తులు ఒక కారణమైతే, అనంతరం వారినే అనుసరించే కుహనా దేశభక్తులు మరొక కారణం.
అందరి జీవన విధానాలు, అభిరుచులు, ఆసక్తులు, సమర్థతలు, సమయాలు ఒకేలా ఉండవు... అనే సహజ సత్యాన్ని గ్రహించిన ఋషులు, 'వాటిలో ఏదో ఒకటి గొప్పది' అని వాదించి 'అటువైపే అందరూ ఉండాల'నే అవాస్తవ ధోరణిని ఏనాడూ అంగీకరించలేదు. అందుకే వివిధ జీవనరీతులు సమాజంలో ఉంటాయని, ఉండాలని'; దాని చేత ఒకరి వల్ల మరొకరికి ప్రయోజనాలు నెరవేరుతాయని స్పష్టంగా తెలుసుకున్నారు. అందుకే వివిధ వర్ణాలు, కులాలు ఏర్పడ్డాయి. వివిధ కుసుమాలతో కూడిన ఒకే మాల వలె, విభిన్నతలతో ఏకత్వం సాధించిన వ్యవస్థ సనాతనధర్మం. ఇవి ప్రత్యేక స్థానాలే కానీ, ఎక్కువ తక్కువలు కావు. కానీ విదేశీ పాలకులు ఈ సూత్రాన్ని అర్ధం చేసుకోకుండా, కేవలం స్వమత దురభిమానంతో, ఇతరుల ఔన్నత్యాలను దోషాలుగా చూసే కుదృష్టితో 'అసమానత'లను సృష్టించారు. కొందరు వ్యక్తుల దోషాలను వ్యవస్థకు అంటగట్టారు. వారి మతదేశాలలోనే పరస్పర వైషమ్యాలతో కొట్టుకు చస్తున్న వాస్తవాలను కప్పిపుచ్చుకుంటున్నారు.
ఈ సమయంలో... మొదటిగా విదేశాలు పర్యటించి తిరిగి భారతదేశానికి వచ్చాక స్వామి వివేకానంద చెప్పిన "ప్రపంచంలో అనేక మతాలను, అనేక సంస్కృతులను చూశాను... అనేక దేశాలను చూశాను. కానీ భారతదేశం కంటే గొప్ప దేశం లేదు. అలాగే మన మతంలో కూడా కొన్ని లోపాలు ఉండవచ్చు. కానీ ఇతర సంస్కృతులతో పోల్చి చూస్తే మన లోపాలు అతి తక్కువ. వాటిని సవరించుకునే అవకాశాలు చాలా ఎక్కువ. సవరించుకోగలిగిన అత్యంత తక్కువ లోపాలు ఉన్నది కేవలం హిందూధర్మంలో మాత్రమే" మాటలు ఈ సమయంలో గుర్తు చేసుకోవాలి.
ఉపాధు(శరీరా)ల పరంగా భేదాలున్నా, ఆత్మచైతన్యం అందరిలో ఒకటేనని, వ్యవహారంలో విభిన్నతలున్నా పరమార్థంగా ఏక తత్త్వమే ఉందని చాటి చెప్పే అద్భుత తత్త్వదృష్టి ఈ భూమిపై కేవలం 'సనాతనధర్మం'లో మాత్రమే ఉన్నదన్న సత్యం మరువరాదు.
ఈ రోజు ఈ ఉపాధిలో ఉన్నా, గతంలో వేరే శరీరాలతో ఉన్నామని, రాబోయే జన్మలలో ఎలాంటి తనువులు వస్తాయో తెలియదని చెప్పే 'జన్మసిద్ధాంతం' కేవలం మన ధర్మానికే స్వంతం. అందుకే ఈ జన్మలో లభించిన శరీరాన్ని, వంశపరంపరను సద్వినియోగం చేసుకోవాలని చెప్పిన ధర్మంలో వైషమ్యాలకు తావెక్కడ?
ఇప్పుడు ఈ హిందూధర్మ ద్వేషులు ఏ మతంవారిని మచ్చిక చేసుకోవాలని ఇలాంటి కూతలు కూస్తున్నారో అందరికీ తెలిసినదే! తమకు జరుగుతున్న నష్టాలను గుర్తించలేని జాతిగా, స్వార్థప్రయోజనాల కోసం ఆత్మహననాన్ని కూడా లెక్కించనివారిగా హిందువులను పరిగణిస్తున్నారు. అధికారం కోల్పోయినవారు, కొత్తగా అధికారానికి వచ్చినవారు కూడా శాసనసభలో సనాతనధర్మ నాశనానికి పిలుపునొకరిస్తే, మరొకరు ఆమోదిస్తున్నారు.
మన పురాతన ఆలయాల ఆదాయాలతో పబ్బం గడుపుకుంటూ, వాటిని దోచుకుంటూ, దుర్వినియోగపరుస్తున్న ప్రభుత్వాలు ఈ ఆలయాలకు ఆధారమైన ధర్మాన్నే రూపుమాపుతామనడం... నిద్రపోతున్న హిందువుల మొద్దుబారుడుతనానికి సంకేతం!
ఉచితాల-రాయితీల ఆశలకు పోయి, రాష్ట్ర సమూహ ప్రయోజనాలే దెబ్బతింటున్నాయన్న నిజాన్ని తెలుసుకోలేని వారు కేవలం హిందువులే!
“దేశ-రాష్ట్ర వనరులు నాశనమైనా, ముక్కలైనా మాకేం ఫరవాలేదు. మా మతాలు రాజ్యమేలితే చాలు” అనుకునేవారి మద్దతుతోనే దేశ సమగ్రతకు, ధర్మానికి విఘాతం కలిగించే పాలనలు కొన్ని రాష్ట్రాలేలుతున్నాయి.
ఈ నగ్నసత్యాలను ఈ హైందవజాతి గుర్తించేదెన్నడో!
అందరి హితాన్ని, దేశ అఖండతను కోరుకునేవారిలో, పాటుపడేవారిలో హిందువులే అధిక సంఖ్యాకులన్నది స్పష్టమైన సత్యం. అందుకే దేశంలో అందరూ క్షేమంగా, పూర్ణాభివృద్ధి దిశగా పురోగమించాలంటే హిందూభావజాలాలే పాలించాలి.
On the occasion of 84th birthday of parama poojyasri Ganapati Sacchidananda Swamiji of Avadhoota Datta Peetham , Mysore Brahmasri Samavedam Shanmukha Sarma garu has been conferred with “Pravachana Chakravarti” Title for his contributions in Promoting and upholding Vaidika Sanatana Dharma around the world.
Video 1 : felicitation
Video 2 : @SriSamavedam gari speech .
ఋషిపీఠం నూతన ప్రచురణ
‘సమన్వయ సరస్వతి’ ‘వాగ్దేవీవరపుత్ర’ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి ద్వారా
ఋషిపీఠం తొలి ప్రచురణగా 1994లో వెలువడిన ‘అగ్ని’ పుస్తకం ఇప్పుడు సరిక్రొత్త ముద్రణలో…
వెల: రూ.100/- (కొరియర్ చార్జీలు అదనం)
ప్రతులకు:
ప్లాట్ నం.37-93/138/2
మధురానగర్, నేరేడ్ మెట్,
హైదరాబాద్ - 500 056.
ఫోన్: 040-79658274
Whatsapp - 8688567767
e-mail: [email protected]
https://t.co/4k3IYhyhm4
Mr. N. Venkataramana
Mob: 9246488975
శ్రీశైల సంస్కృతి సంపదలు -
ఆలయం యొక్క చరిత్రను కాపాడాలి, సంస్కృతిని కాపాడాలి, ఈ సంస్కృతి వారసత్వ సంపదను కాపాడుకోవాలి.
భారతదేశంలో ప్రతి ఆలయం వెనుక కొన్ని వేల వేల సంవత్సరాల మహా చరిత్ర నేటికీ ఉన్నది. దాన్ని కాపాడుకునే దృష్టి పాలకులకు లభించుగాక! ప్రజలకు లభించుగాక! ఇది మనం ప్రార్థిద్దాం.
ప్రతి పవిత్రమైన క్షేత్రాన్ని ఒక టూరిస్ట్ సెంటర్ లా చేసుకొని ఆదాయమే ప్రధానంగా జీవించరాదు. ఇది ప్రధానం.
ప్రపంచంలో ఏ చోటుకీ లేని చరిత్ర భారతదేశంలో క్షేత్రాలకు ఉన్నది.
శ్రీశైల వాఙ్మయ సంపదను కాపాడుకోండి. చరిత్రలో ఎంతో ఉన్నది తెలుసుకోగలగాలి.
(శ్రీశైల మహిమా విశేషాలు ప్రవచనాంతర్గతం)
Celebrating 25 Years of Spiritual Legacy in Bengaluru 🌟
This May, Bengaluru marks a monumental milestone with the Pravachana Rajatotsavam, celebrating 25 years of continuous spiritual discourses by @SriSamavedam Garu.
The spiritual journey began in 2002 with "Veda Saptaham" and has evolved through 24 years of profound teachings on the Ramayana, Bhagavata, and ancient Indian wisdom. Even during the challenges of the pandemic, this "Jnana Yagnam" never flickered, continuing online to guide seekers through difficult times.
To honor this silver jubilee, Rushipeetham Satsangam is hosting a special 9-day event from May 15th to 23rd, 2026:
• The Wisdom: Seven days dedicated to the lives of great Sages ("Mana Maharshulu").
• The Art: A grand conclusion featuring Sivapadam, blending divine music and classical dance to bring the philosophy of Shiva to life.
From its humble beginnings in 2002 to becoming a cornerstone of Bengaluru's cultural fabric, this event is more than a celebration—it's a tribute to the timeless values of Sanatana Dharma.
📍 Venue: New Horizon College of Engineering Auditorium, Marathahalli.
@Tejasvi_Surya
#Rushipeetham #SamavedamShanmukhaSarma #BengaluruSpiritual #25YearsOfWisdom #Sivapadam
అవతలివారికున్న నిబద్ధత మనకెందుకు లేదు?!
(మే 2026 ఋషిపీఠం మాసపత్రికలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సంపాదకీయ వ్యాసం)
ఇతర మతాలవారితో పోల్చితే, హిందూమతంలోని నూతనతరాలలో హిందూధర్మజ్ఞానం, వాటిని పాటించడం బాగా లోపించింది. ఎంతసేపూ ర్యాంకుల కోసం పరుగులు, ధనార్జన ప్రాధాన్యం మాత్రమే పిల్లలకు ముఖ్యమని పెద్దల భావన. అందుకే తాము పాటించక, పిల్లలకు నేర్పక, అలవాటు చేయక ధర్మదూరులౌతున్నారు. ధర్మమంటే నిబద్ధభావం, అనుష్ఠాన అభ్యాసాలు లేకపోవడం చేత ఈ పరిస్థితి దాపురించింది.
ఈ శూన్యతను ఇతర మతాలు అందిపుచ్చుకుని వికృతవ్యూహాలతో మార్పిడులకు పూనుకుంటున్నారు. ఏమీ తెలియని హిందూ యువత మెదడుపై తమ సిద్ధాంతాలను రుద్ది, అవి ఎంతో గొప్పవి అనే భ్రాంతిని కలిగిస్తున్నారు. తెలియనితనం, తెలుసుకోవాలనే శ్రద్ధ లేని యువతీయువకులను సులభంగా మభ్యపెడుతున్నారు. ఒక వైపు శారీరకమైన ఆకర్షణ, భోగలాలస వారి వివేకాన్ని పనిచేయనివ్వడం లేదు.
కళాశాల దశలోనే ఇటువంటి ప్రలోభాలకు, భ్రమలకు లోనై విచ్చలవిడితనంతో, కూడని శారీరక సంబంధాలతో మతం మారుతున్నారు. నిజంగా ప్రేమయే ప్రధానమైతే వారిని తమ (హిందూ)మతంలోకి మారమని అడగవచ్చు కదా! వారికి ఉన్న మత నిబద్ధత తన మాతృమతంపై ఎందుకు లేదు? సశాస్త్రీయమైన పరంపరాగత సదాచారాలు, ప్రపంచం ఆశ్చర్యపడి గౌరవించే తత్త్వచింతన, అద్భుతమైన కళాసంపద, యోగవిద్య, మంత్రసాధన వంటి అద్భుతాలను కలిగిన హిందూధర్మం కంటే గొప్పది మరొకటి ఉంటుందని ఎలా అనుకోగలరు? అంటే ఈ అద్భుతాంశాలను పిల్లలకు తెలియనీయకపోవడమే పెద్దల అపరాధం.
బాల్యం నుండి... మన ధర్మంపై పూజ్యులు చెప్పిన మాటలు, సందేహాలకు సమాధానాలు, ఆలయాల ప్రత్యేకత - వాటి చరిత్ర, ఈ దేశంపై-ధర్మంపై జరిగిన భయంకరమైన దాడులు, వాటిని ఎదుర్కొంటూ అసువులు బాసిన త్యాగధనులు, యోగసిద్ధులైన మహనీయుల జీవితాలు ప్రబోధాలు, శాస్త్రాలలోని కొన్నైనా మంచి విషయాలు పిల్లలకు నేర్పకపోవడం, తాము నేర్చుకోకపోవడం - ఈ విపరీత పరిస్థితులకు ప్రధాన కారణం. తమ పరంపరపై కనీస గౌరవాన్ని కూడా కలిగించలేకపోవడం విచారకరం.
విద్యాసంస్థల నుండి, ఉద్యోగాలు చేసుకునే గొప్ప సంస్థల వరకు - అన్ని చోట్లా మతవాదులు చొచ్చుకుపోయి, మతమార్పిడి లక్ష్యంగా, హిందూనాశనమే ప్రాతిపదికగా దేశంలో అశాంతిని, అలజడిని, విచ్ఛిన్నతని సృష్టించడానికి వెనుదీయడం లేదు.
ఇటీవల నాసిక్ లో, మరికొన్నిచోట్ల వందల సంఖ్యలో జరిగిన వైకృత్యాలు, వెంటనే కొన్ని ఏళ్ళుగా జరుగుతున్న ఈ విధమైన మతదాడుల వార్తలు కుప్పలుతెప్పలుగా బయటపడ్డాయి.
ఇందులో వారికి మన మతంపై ఉన్న వైమనస్య, ద్వేషాలు స్పష్టంగా వ్యక్తమయ్యాయి.
మతానికి, శీలానికి ఉన్న అనుబంధం, నియమబద్ధ జీవితంలోని దివ్యత్వం, పవిత్రత ఈ సమయంలో తెలుసుకోవాలి. అవతలివారికి తమ మతంపై అవగాహన కంటే ముందు- పూర్తి గౌరవం, స్వాభిమానం, నిబద్ధత ఉన్నాయి.
ఆ భావాలు హిందూకుటుంబాలకు ఎందుకు లేవు?
'ప్రేమ' అనే పేరుతో కామవికారానికి లోనై, అవతలివారి వంచనకు చిక్కడం మానసిక బలహీనత కాదా? ఈ దుర్బలత్వమే తరువాత అవమానకర, వికృత పరిణామాలకు దారి తీస్తున్నది. అటుపై 'అన్యాయం జరిగింది' అంటూ పెడబొబ్బలు, గొడవలు పెట్టి ఏం ప్రయోజనం?
అటువైపు వారు వంచించారంటే నేరం వారిదే కాదు... దానికి గురియైన మనోవికారం, అవివేకం, తెగింపు ధోరణి ఇటువైపువారికి ఉండడం కూడా నేరమే.
ధనమే సర్వలక్ష్యంగా సాగే చదువులకు, ఆలోచనాధోరణికి దారుణ ప్రతిఫలమిది. ఉదాత్తాలైన మన ధర్మాంశాలను వక్రీకరిస్తుంటే ఉదాసీన, ఉపేక్ష భావాలను వహించడమే కాక, ధర్మభ్రాంతితో వాళ్ళ వ్యూహాలలో చిక్కి స్వధర్మం నుండి భ్రష్టులౌతున్నారు.
తరచు మన మందిరాలకు తీసుకువెళ్ళడం, మనవైన స్తోత్రమంత్రాలను నేర్పి నిత్యం పఠింపజేయడం, నామస్మరణ, వారాంతాలలో ప్రత్యేక పారాయణలు... వంటివి అలవాటు చేసి ఉంటే... ఆ దేవతాశక్తి ప్రభావం ఒక రక్షావలయంగా ఉండి పెడబుద్ధులు పుట్టకుండా బ్రతుకులను కాపాడేవేమో! మనదైన కట్టు, బొట్టును గౌరవించడం; ఆర్జన పెరగడంతో భోగాలకు, వ్యసనాలకు లోనుకాకుండా సంయమనంతో ధార్మిక-సేవాకార్యాలను ఆచరించడం నేర్పి ఉంటే ఈ దారుణాలు జరిగి ఉండేవి కావేమో!
ధర్మంపై స్వాభిమానం, దేశంపై బాధ్యత, వృత్తిని వృత్తిగా మాత్రమే స్వీకరించడం, డబ్బు సంపాదించే జీవితమే కాక పూర్వీకుల నుండి లభించిన వారసత్వసంపదను, సంప్రదాయ విలువలను పరిరక్షించుకోవడం బాల్యం నుండి నేర్పగలగాలి.