3️⃣7️⃣4️⃣ Intl. Matches
1️⃣7️⃣,2️⃣5️⃣3️⃣ Intl. Runs
3️⃣8️⃣ Intl. Hundreds
Only #TeamIndia player to smash two triple hundreds in Tests 👏
Winner of ICC Men's T20 World Cup 2️⃣0️⃣0️⃣7️⃣ & ICC Men's ODI World Cup 2️⃣0️⃣1️⃣1️⃣ 🏆
Here's wishing the legendary Virender Sehwag a very Happy Birthday 🎂🥳
@virendersehwag
రజినీకాంత్ ఆరా వేరు..
ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ వేరు..
ఆయన స్టైల్ వేరు..
ఆయన అట్రాక్షన్ వేరు..
ఆయన జస్ట్ అలా స్లో మోషన్లో నడిచి వస్తుంటే చాలు గూస్ బంప్స్ వస్తాయి.
మన హీరో కాకపోయినా.. తెలుగు వాళ్లకు కూడా ఇలాంటి ఫీలింగ్ రావడం గొప్ప విషయం.
తెలుగు వాళ్లు రజనీని మన సూపర్ స్టార్ల రేంజిలో ఆరాధిస్తారు. ఇది మన ప్రేక్షకులకు సినిమా అంటే ఉన్న పిచ్చి, భాషా భేదం లేకుండా సినిమాలను ఆదరించే విశాల దృక్పథానికి నిదర్శనం. తమిళోళ్ల లాగా మనోళ్లు సంకుచిత స్వభావులు కాదు కాబట్టే రజినీకి తెలుగులో ఇంత ఆదరణ.
ఇదంతా ఓకే కానీ.. రజినీకాంత్‌తో పోల్చి మన స్టార్లను కించపరచడం ఎందుకు? ముఖ్యంగా ప్రతిసారీ మెగాస్టార్ చిరంజీవిని ఆయనతో పోల్చి తగ్గించడమేంటి? #Jailer2 చూసి ఊగిపోతూ కొందరు చిరును, మిగతా సీనియర్ హీరోలను తగ్గిస్తూ వేసిన పోస్టులు చూశా.
రజినీకాంత్‌ను తక్కువ చేయడం కాదు కానీ.. ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్ విషయంలో మన చిరంజీవి ముందు రజినీ ఎంత?
చిరులా రజినీ కామెడీ చేయగలడా? (చంటబ్బాయి, అన్నయ్య)..
చిరులా రజినీ ఎమోషన్లను పండించగలడా? (ఆపద్బాంధవుడు, డాడీ)..
చిరులా రజినీ డ్యాన్సలు, ఫైట్లు చేయగలడా? (వీటికి ఉదాహరణలు ఇవ్వడం అంటే మెగాస్టార్‌ను అవమానించడమే)
‘ఆపద్బాంధవుడు’ సినిమాలో అద్దం ముందు నిలబడి.. చర్చి సీన్లో.. చిరు ఇచ్చిన పెర్ఫామెన్స్ ముందు.. రజినీకాంత్ నటన ఏ పాటిది?
ఒక్కసారి ‘రుద్రవీణ’ సినిమాలో ఆక్రోశంతో మాట్లాడుతూ అన్నం వడ్డించుకునే సన్నివేశాన్ని తెలుగులో చిరు ఎలా చేశాడో.. అదే సన్నివేశాన్ని మహా నటుడైన కమల్ హాసన్ తమిళంలో ఎలా చేశాడో పోల్చి చూసుకుని తర్వాత మాట్లాడండి.
రజినీ, కమల్ హాసన్‌ల గురువైన బాలచందర్ లాంటి గ్రేట్ డైరెక్టరే.. రజినీ, కమల్ కలిపితే చిరు అని కితాబిచ్చాడు. ఇంతకంటే ఏం కావాలి?
90వ దశకంలో జగదేకవీరుడు, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు సినిమాలతో చిరు.. రజినీని మించి మెగా హిట్లు కొట్టాడు. తన ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్‌తో అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, కమల్ హాసన్‌లను మించిన ఆరా చూపించాడు. (ఆ టైంలో రజినీ తన సినిమాలో చిరుతో క్యామియో చేయించుకున్నాడు. కింది ఫోటో అప్పటిదే) అప్పుడు చిరు సంపాదించిన యాక్సెప్టెన్స్ ఎలాంటిది అంటే.. ఆపోజిట్ ఫ్యాన్స్ సైతం ఆయన ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్సులకు ముగ్ధులైపోయి తన సినిమాలను ఎంజాయ్ చేశారు. (అప్పటికి ఈ ఆపోజిట్ ఫ్యాన్స్ లో నేనూ ఒకడిని కాబట్టి ధీమాగా చెబుతున్నా) బేసిగ్గా సినిమా లవర్ అయితే చాలు చిరు సినిమా చూడాల్సిందే అనిపించిన టైమ్ అది. కానీ తర్వాతే మా కులం, మా వర్గం అనే విభజన ఎక్కువైంది. ఈ సోషల్ మీడియా వచ్చాక అంతా బ్రష్టు పట్టింది. అందరివాడైన చిరును కొందరివాడిని చేసే ప్రయత్నం జరిగింది. జరుగుతోంది.
ఇక రజినీ విషయానికి వస్తే భాషా భేదం లేకుండా సినిమాలు చూసే తెలుగు వాళ్ల పెద్ద మనసు వల్ల ‘బాషా’ దగ్గర్నుంచి ఆయనకు ఇక్కడా ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ పెరిగింది. అందువల్ల చిరు కంటే పెద్ద స్టార్ అయ్యాడు. అంతే తప్ప పెర్ఫామెన్స్‌లో చిరు కంటే రజినీ ఎప్పుడూ తక్కువే. రజినీ కంటే ముందే చిరు సూపర్ స్టార్ అయ్యాడు. ఆయన్ని మించిన వైభవం చూశాడు.
చిత్రమైన విషయం ఏంటంటే.. ఒకవైపేమో చిరు ఇమేజ్ ఛట్రం దాటి సినిమాలు చేయట్లేదని, మోహన్ లాల్‌తో పోల్చి కామెంట్లు చేస్తారు. ఇంకోవైపేమో రొటీన్ ఎలివేషన్ సీన్లు చేసి నెట్టుకొస్తున్న రజినీతో పోల్చి ఆయన్ని తగ్గించాలని చూస్తారు. ఇదెక్కడి డబుల్ గేమ్? చిరు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆయన రేంజికి తగ్గ సినిమాలు చేయలేదన్నది వాస్తవం. రీఎంట్రీలో చిరు సినిమాల్లో మెజారిటీ నాకు నచ్చలేదు. కానీ ఈ మధ్య తన స్థాయిలో బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు.
తన చరిష్మాను సరిగ్గా ఉపయోగించుకుంటున్న నెల్సన్ లాంటి డైరెక్టర్ దొరకడం, తన సినిమాలు అనగానే పూనకం తెచ్చుకుని పని చేస్తూ, జనాలకు కూడా పునకాలు తెప్పించే మ్యూజిక్ ఇచ్చే అనిరుధ్ ఉండడం రజినీ అదృష్టం. జైలర్, జైలర్-2 సినిమాలను పక్కనపెట్టి.. గత దశాబ్ద కాలంలో రజినీ చేసిన కాలా, దర్బార్ (ఎలివేషన్ కుదరకపోతే అనిరుధ్ కూడా ఏం చెయ్యలేడు అనడానికి ఉదాహరణ), లాల్ సలామ్, వేట్టయాన్ లాంటి సినిమాల పరిస్థితేంటో కూడా ఒకసారి చూసి తర్వాత మాట్లాడండి.
నోట్: ఇదేమీ మెగా ఫ్యాన్స్ ను బుట్టలో వెయ్యడానికి రాసిన పోస్టు కాదు. ఒక సగటు సినీ అభిమానిగా నిజాయితీగా ఏమనిపిస్తే అది రాశాను.
#Megastar #Chiranjeevi #Superstar #Rajnikanth
#Jailer2 #AnirudhRavichander #NelsonDileepkumar
@yskanth@winsttonxavier@pepparsalt9@naaperusai@miryalasrikanth@27stories_@ursyathi@guptanagu8@SrinuThePrince@Thanos_Tweetss@sivacherry9
48 years since you began your journey in cinema, Nanna ❤️
Every day, we think of that day that changed everything for you and our family. I am grateful for everything you have done and to the audience for the constant love and support they have given you.
Your journey will always be an inspiration to us. And now, I’m looking forward to that day when we celebrate the milestone of 50 incredible years in cinema ✨
22 సెప్టెంబర్ 1978
ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది.
ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది.
అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ.
ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం.
నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆరోజు “చిరంజీవి” అనేది నేను పెట్టుకున్న పేరు.
నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వతమైన గుర్తింపు.
మీ ప్రేమకు, అభిమానానికి
ఎప్పటికీ కృతజ్ఞతలతో…
మీ చిరంజీవి ❤️
Wishing the Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh @PawanKalyan Garu a very Happy Birthday ✨
You have always been a great source of inspiration to me. Wishing you good health, happiness and many more wonderful years ahead.
Love you, Babai ❤️
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..
@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి
Heartiest congratulations to my dear brother Ravi on the blockbuster success of #Irumudi 💐
Thoroughly enjoyed the film from beginning to end. What a phenomenal performance @RaviTeja_offl, you carried Trinadh character entirely on your shoulders 👏🏻
Director @ShivaNirvana, you have done a wonderful job presenting the film with such depth and emotion.
Blessings to #BabyNakshathra for a very bright future, My warm congratulations to the entire cast and crew, and to producers Naveen Yerneni and Ravi Shankar of @MythriOfficial, on this well-deserved success.
ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే.
ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు.
మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి!
#LiveAndLetLive
@priya_Bshankar@saikumaractor@gvprakash
ఒకానొక సమయంలో చిరంజీవి కొత్త సినిమా వస్తే ఆ రోజు మార్కెట్ చాలా సందడి గా ఉండేది..🔥
చిరంజీవి సినిమా కి ఉన్నట్టు ఉన్నారు జనం,
చిరంజీవి లాగా డాన్స్ చేస్తున్నాడు.
చిరంజీవి లాగా ఫైట్ చేస్తున్నాడు.
నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా తరచుగా వినిపించే పదాలు!👍
#HBDMegastarChiranjeevi
Happy Birthday Nanna ❤️ @KChiruTweets
You have been my first hero, my biggest inspiration and someone I can always turn to. Through every high and low, your love, guidance and belief in me have been my greatest strength.
I feel truly blessed to have you in my life. Wishing you good health, happiness and many more wonderful years ahead.
Love you more than words can say, Nanna ❤️
HAPPY BIRTHDAY CHIRANJEEVI SIR ❤️
We remember the progression of our school years through the titles of your films. Your films didn’t just mark an era, they marked our lives.
You are not just our cinema..... You are very big part of our lives.
The passion. The drive. The madness. The way you broke the fourth wall and connected directly with the audience..... that connection is what made cinema an emotion for all of us.