In 2008, I had planned a robust youth wing structure for Yuva Rajyam, the youth wing of PRP. After 12 years of launching @JanaSenaParty, through many hardships and struggles, our cadre is now filled with experience and maturity and is ready to take on organizational responsibilities, handle politics, address public issues, and work towards Nation Building
On this occasion, my wholehearted thanks to the Telangana Yuva Rajyam youth wing, and special thanks to the youngsters who believed in me and have stood by me from 2005 till now.
I commit today that I will work towards building young and dynamic leaders of integrity, commitment, and patriotism. Naya Bharat will witness the rise of amazing leaders from Gen Z.
This Gen Z is tired of appeasement politics, dynasty politics, caste politics, divisive politics, and regional politics. This entire generation is looking for leaders who take responsibility and bring back the politics of accountability, not leaders who weaken Bharat on global platforms. They look forward to a strong and robust Bharat.
#JSPForNewAgePolitics
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారితో ఈ రోజు రైల్వే కోడూరు ఎమ్మెల్యే, శాసన సభలో విప్ గా ఉన్న శ్రీ అరవ శ్రీధర్ సమావేశమయ్యారు.
* శ్రీ అరవ శ్రీధర్ తన శాసన సభ విప్ పదవికి రాజీనామా పత్రాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందచేశారు.
* వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శ్రీ శ్రీధర్ తెలిపారు.
* తనపై వచ్చిన ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై వివరణ ఇచ్చారు.
50 శాతం గ్రీన్ కవర్ ఉండాలని చెప్పాము... గ్రేట్ గ్రీన్ వాల్ లాంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకు వెళ్లలేరా?
•టైమ్ ఫ్రేమ్ ప్రకారం... బాధ్యతగా పని చేయకపోతే ఎలా?
•ఎర్ర చందనం వెనక్కి తెచ్చే ప్రక్రియ ఎంత వరకూ వచ్చింది?
•శ్రీ వనజీవి రామయ్య, శ్రీ దుశ్శర్ల సత్యనారాయణల నుంచి స్ఫూర్తి తీసుకోండి
•వ్యక్తులుగా వారు ఎంతో సాధించారు... వ్యవస్థ ఉన్న అటవీ శాఖ ఎంత సాధించాలి
•అటవీ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @PawanKalyan గారు
•పనుల్లో నిర్లక్ష్యం వహించిన కొంత మంది అధికారుల తీరుపై ఆగ్రహం
‘రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ ఉండాలి... పర్యావరణ పరిరక్షణలో పచ్చదనం పెంపు ఎంతో కీలకం. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ చేపట్టాము. ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లలేరా? నిర్దేశిత టైమ్ ప్రకారం, బాధ్యతగా పని చేయకపోతే ఎలా? అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ అధికారులను ప్రశ్నించారు. విధులు, నిర్దేశించిన బాధ్యతలపై అలసత్వం వహిస్తే ఉపేక్షించలేమని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే కేవలం మన శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే అమూల్యమైన ఎర్ర చందనం టన్నుల కొద్దీ విదేశాలకు అక్రమంగా తరలిపోయింది.. చైనా, జపాన్, సింగపూర్ వంటి దేశాల కస్టమ్స్ అధికారుల వద్ద వేల కోట్ల విలువైన మన కలప సీజ్ చేయబడి ఉంది.. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ విదేశాల్లో పట్టుబడిన ఎర్రచందనాన్ని తిరిగి భారతదేశానికి రప్పించే ప్రక్రియ ఎంత వరకూ వచ్చిందని ప్రశ్నించారు. గ్రీన్ కవర్ 50 శాతం పెంచడానికి వారం రోజుల్లో ఏపీ గ్రీన్ సొసైటీ ఏర్పాటు చేయాలని సూచించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో అటవీశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రీన్ బెల్ట్, ఎర్రచందనం రికవరీ, గ్రేట్ గ్రీన్ వాల్ పై అంశాలవారీగా అధికారులతో సమీక్షించారు. నిర్దేశించిన కార్యక్రమాలను చేపట్టడంలోను, అటవీ భూముల పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించని కొందరు అధికారులపై ఉప ముఖ్యమంత్రివర్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పరిగణించకుండా, అటవీ ఆస్తులను పరిరక్షిచలేకపోయినా ఉపేక్షించబోమన్నారు. ప్రజలకు జవాబుదారీగా, పారదర్శకంగా పని చేయాలని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ వంటి కీలక అటవీ ప్రాంతాలలో పులులు తాగునీటి కోసం అడవి దాటి గ్రామాల వైపు రాకుండా, వాటి సంచార మార్గాల్లోనే వాటర్ సాసర్స్ ఏర్పాటు పనులపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “వనజీవి రామయ్య గారు, దుశర్ల సత్యనారాయణ గారు లాంటి పర్యావరణ ప్రేమికులు ప్రకృతి కోసం తమ జీవితాలనే అర్పించి అద్భుతాలు సృష్టించారు. ఎటువంటి స్వార్థం లేకుండా, కేవలం రాబోయే తరాల మనుగడ కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఆ ఇద్దరి నుంచి స్ఫూర్తి పొందాలి. ఒంటరిగా వారే అంతటి హరిత విప్లవాన్ని సాధించినప్పుడు, ఒక వ్యవస్థగా మనం ఎంత చేయాలి? నిజమైన సంకల్పంతో మనమంతా కలిసి ముందుకు సాగితే పచ్చని భవిష్యత్తు కచ్చితంగా సాధ్యమవుతుంది.
•సీజన్ కోసం ఎదురు చూడొద్దు
విత్తన బంతులు వెదజల్లడానికి సంప్రదాయ వర్షాకాలం సీజన్ కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదు. మన దగ్గర విత్తన బంతులు సిద్ధంగా ఉంటే ఏ సమయంలోనైనా వేసుకోవచ్చు. కొండ ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, అటవీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ చల్లేలా ముందస్తుగానే విస్తృత ఏర్పాట్లు చేయాలి. ఈ విత్తన బంతుల వెదజల్లే కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వానికే పరిమితం చేయకుండా, ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలి. జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విత్తన బంతుల తయారీ కార్యక్రమాలు చేపట్టి 2.5 కోట్ల విత్తన బంతులను పంపిణీ చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పొదుపు సంఘాల మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వాలంటీర్లతో పాటు రాష్ట్ర ప్రజలను, అన్ని వర్గాల ప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయలి. (1/2)
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిపై, PAC చైర్మన్, గౌరవ పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారిపై, NDA కూటమిపై తప్పుడు వార్తను సామాజిక మాధ్యమాల్లో వెల్లడించిన ప్రొఫెసర్ @K_Nageshwar గారు, ఆ వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవడాన్ని జనసేన పార్టీ తరపున స్వాగతిస్తున్నాము.
సీనియర్ ఎనలిస్ట్‌గా, మాజీ ఎమ్మెల్సీగా, ప్రొఫెసర్‌గా మీకు ఉన్న అనుభవం, మీరు చేసే విశ్లేషణలపై మాకు గౌరవం ఉంది. అయితే ఇటువంటి అవాస్తవ వార్తలు భవిష్యత్తులో మీ దృష్టికి వచ్చినప్పుడు, దయచేసి జనసేన పార్టీ కార్యాలయాన్ని సంప్రదిస్తే సరైన సమాచారాన్ని మేమే అందిస్తాము. ఊహాజనిత, ఆధారరహిత కథనాలను భవిష్యత్తులో ప్రస్తావించరని ఆశిస్తున్నాము.
అలాగే జనసైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ అంశాన్ని ఇక్కడితో ముగించాలని, సామాజిక మాధ్యమాల్లో దీనిపై ఎలాంటి పోస్టులు లేదా వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము.
మేధావి ముసుగులో అజ్ఞాన ప్రదర్శనలు తగదు @K_Nageshwar గారు. ఇకపై మీడియాలో విశ్లేషణలు ఇచ్చే సమయంలో మీరు ప్రొఫెసర్ అనే విషయం గుర్తు తెచ్చుకుని మాట్లాడతారు అని ఆశిస్తున్నాం.
జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, సోదరులు శ్రీ @mnadendla గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషంగా, ప్రజాసేవలో, @JanaSenaParty కార్యకలాపాలలో నిమగ్నమవ్వాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను.
#HBDNadendlaManohar
హిందువుల మనోభావాలను వైసీపీ దెబ్బతీస్తోంది
- వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది
- రాష్ట్రం బాగుపడాలనే ఆలోచన వారికి లేదు
- ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
- సభ్యత్వానికి నెల్లూరు పార్లమెంట్ ఇన్చార్జిగా బొలిశెట్టి నియామకం
- నగర అధ్యక్షుడు సుజయ్‌బాబు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం
నెల్లూరు :
హిందువుల మనోభావాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తోందని, వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఆయన నెల్లూరు చేరుకున్నారు. జనసేన అధిష్టానం ఆయనను జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదులో ఆయనను నెల్లూరు పార్లమెంట్‌కు ఇన్చార్జిగా నియమించారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్‌బాబు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా మాగుంటలేవుట్‌లోని ఓ హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. ఇటీవల శాసనమండలిలో జరిగిన విషయాన్ని ప్రజలందరూ గమనించారన్నారు. ఆలయాలకు వెళ్లి దేవుడిని కూడా రాజకీయాలు చేసే వైసీపీ నేతల వైఖరిని ఖండిస్తున్నామన్నారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వైసీపీ చేసే కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. కల్తీ జరిగిందని ఒప్పుకుని కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం దుర్మార్గమన్నారు. రాష్ట్రం బాగుపడాలనే ఆలోచన వైసీపీకి లేదన్నారు. వెంకటేశ్వర స్వామి బొమ్మలను చెప్పులు వేసుకుని తీసుకురావడం హేయమైన చర్య అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు చేస్తుందన్నారు. వైసీపీ వాళ్లే తప్పు చేసి .. మళ్లిd పవన్ కళ్యాణ్, చంద్రబాబు క్షమాపణ చెప్పాలనడం దారుణమైన విషయమన్నారు. అంబటి రాంబాబు దారుణమైన భాషను ఉపయోగించారని, అందులో జైలుకు వెళ్లారన్నారు. ఈ రోజు తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చానని, తనను అధిష్టానం సభ్యత్వానికి నెల్లూరు పార్లమెంట్‌కు ఇన్చార్జిగా నియమించిందన్నారు. గత ఏడాది 36వేల సభ్యత్వాల నమోదు కార్యక్రమం జరిగిందని, ఈ సారి రెట్టింపు ఉత్సాహంతో జనసైనికులు పనిచేయాలన్నారు. అధిష్టానం నియమించిన కమిటీలు, మండల అధ్యక్షులు,ఇన్చార్జుల ద్వారానే ఈ ఏడాది జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ జిల్లా అధ్యక్షుడి విషయం తనకు తెలియదని, అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సుజయ్‌బాబు మాట్లాడుతూ గత ఏడాది చేసిన దానికంటే మరింత ఉత్సాహంతో ఈ సారి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయాలన్నారు. అధికారంలో లేనప్పుడు కూడా నెల్లూరు సత్తా చూపించామని, ప్రస్తుతం అధికారంలో ఉన్నామని, రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. సభ్యత్వ నమోదులో జిల్లాను ముందంజలో ఉంచేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. రానున్న రోజుల్లో బొలిశెట్టి శ్రీనివా స్ సూచనలతో ముందుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్, కావలి నియోజకవర్గ ఇన్చార్జి అలహరి సుధాకర్ , ఉదయగిరి నియోజవర్గం సమన్వయకర్త కొట్టే వెంకటేశ్వర్లు , కోవూరు నియోజకవర్గ ఇన్చార్జి చప్పిడి శ్రీనివాసులురెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్లు కోలా విజయలక్ష్మి, గుండ్లూరు నాగరత్నం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందరరామిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ నెల్లూరు రూరల్, నగర డివిజన్ ఇన్చార్జులు, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాల మండలాధ్యక్షులు జిల్లా మరియు నగర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
@PawanKalyan @nadendlamanoharofficial @nagababuofficial @tammireddy_sivasankara_rao @ramtalluri@bolisettisrinu@janasenaparty @duggisetty_venkat_sujaybabu #pawankalyan #janasena #sujaybabuduggisetty
రాయలసీమకు జగన్ ద్రోహం చేశారు
- జగన్ అవినీతి ఒక్కొక్కటిగా బట్టబయలు
- జనసేన నగర అధ్యక్షుడు సుజయ్‌బాబు
- నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆత్మకూరులో భారీ ర్యాలీ
నెల్లూరు :
రాయలసీమ జిల్లాలకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్రోహం చేశారని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్‌బాబు ఆరోపించారు. మంగళవారం ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట తమ నిరసన తెలిపి అనంతరం పట్టణ ప్రధాన రహదారి నుండి ఆర్డీవో ఆఫీస్ వరకు నిరసన తెలియపరుస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సుజయ్‌బాబు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ధనాన్ని లూటీ చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడిపించారన్నారు. 2020లో రాయలసీమ సంగమేశ్వర ప్రాజెక్టు మొదలైంది జగన్ హయాంలోనే అన్నారు. 2014లో తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు నదీ జలాలను పంచుకుంటూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల పై నుంచి కృష్ణా నదీ జలాలను సొమశిలకు , రాయలసీమ జిల్లాలకు నీళ్లను తీసుకురావడం జరిగిందన్నారు. 2014 నుంచి 2019 వరకు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ ప్రాజెక్టునైతే తీసుకొచ్చారో .. ఆ ప్రాజెక్టు కనిపించకూ డదని, ఆయనకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న దురుద్దేశ్యంతో జగన్ ఇదంతా చేశాడని ఎద్దేవా చేశారు. జగన్ తీసుకొచ్చిన రాయలసీమ సంగమేశ్వర ప్రాజెక్టు డీపీఆర్‌లో కృష్ణా, గోదావరి బోర్డుల నుంచి ఎలాంటి అనుమతి తీసు కోకుండా 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడన్నారు. @pawankalyan @nadendlamanoharofficial @nagababuofficial @tammireddy_sivasankara_rao @ramtalluri@janasenaparty@Sujaybabujsp #pawankalyan #janasena
అవినీతి బయటకొస్తుందనే .. తప్పుడు రాజకీయాలు
- తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ముమ్మాటికీ నిజం
- దీనిని డైవర్ట్ చేసేందుకే తెరపైకి అంబటి రాంబాబు
- జగన్ వీకెండ్ పొలిటీ-షియన్
- జనసేన నగర అధ్యక్షుడు సుజయ్‌బాబు
నెల్లూరు :
కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాలతో కూడిన పరిపాలన నడుస్తుంటే ఓర్వలేక... గతంలో తాము చేసిన ఘోరాలు బ యటకు వస్తాయని జగన్ భయపడి తప్పుడు రాజకీయాలకు సిద్ధపడ్డాడని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్‌బాబు విమర్శించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అనేది ముమ్మాటికీ నిజమని, సిట్ నివేదిక స్పష్ట ంగా చెబుతున్నా జగన్ బుకాయిస్తున్నారన్నారు. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టులో జంతు కొవ్వు ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారని గుర్తుచేశారు. ఆ విషయం బయటకు వచ్చాక ప్రభుత్వం విచారణ చేపట్టిందని, విచారణలో కూడా కల్తీ నెయ్యి వాడారు అని తేలిందన్నారు. ప్రభుత్వం కచ్చితంగా దోషులను చట్టం ముందు నిలబెడుతుందన్నారు. ఈ విషయాన్ని డైవర్ట్ చేసేందుకే అంబటి రాంబాబును జగన్ ఒక పావుగా వాడుకున్నారన్నారు. సీబీఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలంటూ జగన్ గోల చేస్తున్నారని, ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చిందో చూపించాలని ప్రశ్నించారు. ఆ నివేదిక చూస్తే ప్రజలకు నిజం తెలుస్తుందన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియచేసేలా ఒక ప్లెnక్స్ వేయగానే గగ్గోలు పెడుతున్నారని, వీళ్లకు భయం ఏ స్థాయిలో పుట్టిందో ప్రజలకు అర్థమైందన్నారు. ప్లెnక్సీ వేస్తే గోల చేస్తున్న జగన్ వైసీపీ సిద్ధం సభల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోలిన బొమ్మలు పెట్టి వాటిని వైసీపీ గంజాయి బ్యాచ్‌తో కొట్టించి, కాళ్లతో తన్నించారని, అప్పుడు జగన్ సంస్కారం, విలువలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అప్పుడు రాక్షసానందం పొందింది జగన్ కాదా అని ప్రశ్నించారు. ఆ ప్లెnక్స్‌లో వాస్తవాలు ప్రజలకి చెప్పేలా ఉండటంతో జగన్‌కు సంస్కారం గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. అంబటి రాంబాబు తిట్టినవి తిట్లే కాదు... అవి బూతులే కాదు అంటూ జగన్ సర్టిఫికేట్ ఇస్తున్నాడని,జగన్ మానసికంగా ఎంత దిగజారిపోయాడో తెలుస్తోందన్నారు. జగన్‌కు లండన్ మందులు కూడా పని చేయడం లేదని, డోస్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ కి బూతులు అంటే మహా ఇష్టమని, అవి పవిత్ర వాక్యాలు లాగా వినిపిస్తాయన్నారు. అంబటి రాంబాబు, కొడాలి నాని, జోగి రమేశ్, వంశీ, పేర్ని నాని వాడే బూతులు ఆయనకు వినసొంపుగా ఉంటాయని, జగన్ దిగజారుడుతనం ఏ స్థాయిలో ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. జగన్ తన సొంత చెల్లెలు పసుపు చీర ధరిస్తే కూడా ఓర్చుకోలేక అవాకులుచెవాకులు మాట్లాడించి స్వంత మీడియాలో రాతలు రాయించాడన్నారు. అంబటి రాంబాబు కాపు కుల ప్రతిష్టను నిలబెట్టే పని ఒక-టైనా చేశాడా అని ప్రశ్నించారు.కాపులను తీవ్రంగా అవమానించారని, కాపులు తాగుబోతులు, తిరుగుబోతులు అంటూ తిట్టినవాడు ఈ రోజు కాపు -టైగర్ ఎలా అయ్యాడని సూటిగా ప్రశ్నించారు.సత్తెనపల్లిలో ఒక మైనర్ బాలుడు చనిపోతే వచ్చిన పరిహారం సగం లంచంగా అంబటి రాంబాబు తినేశారని గుర్తు చేశారు. జగన్ వీకెండ్ పొలిటీ-షియన్ అని, గురువారం సాయంత్రమో... శుక్రవారం ఉదయాన్నో ఇండిగో ్లఫట్ ఎక్కేసి బెంగళూరు వెళ్లిపోతాడని,ఆయనకు రాష్ట్ర ప్రజల గురించి, వారి అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించే బాధ్యత లేదని మండిపడ్డారు. నిజంగా జగన్ కి బాధ్యత ఉంటే అసెంబ్లీ సమావేశాల కు రావాలని, అక్కడ తిరుపతి లడ్డూ గురించి చర్చించాలన్నారు. బాధ్యత కలిగినవాడు అయితే అతనే తిరుపతి లడ్డూ గురించి చర్చిద్దాం అని కోరాలన్నారు. గెలిచాక ప్రమాణ స్వీకారానికి వచ్చారు తప్ప ఒక్కసారైనా అసెంబ్లీ ముఖం చూసారా? అసెంబ్లీ రాకుండా ఉన్న జగన్ క్రికెట్ టీ-ంకి ఎమ్మెల్యే జీతాలు ఎందుకు, ప్రోటోకాల్స్ ఎందుకు అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం కచ్చితంగా చట్టబద్ధమైన పాలన చేస్తోందని, ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా కుట్రపూరిత రాజకీయాలు చేసేవారిని కట్టడి చేసామన్నారు. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలని,యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులు కల్పించాలనే దిశగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రిజనల్ కో-ఆర్డినేటర్ గుండ్లూరు నాగరత్నం నగర ప్రధాన కార్యదర్శి శనివారపు అజయ్ బాబు డివిజన్ ఇంచార్జులు మరియు నాయకులు జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు. @PawanKalyan@mnadendla@NagaBabuOffl@TSivasankararao@JanaSenaParty@Sujaybabujsp #janasena #pawankalyan #sujaybabuduggisetty
#NoGheeInTTDLaddu
వైసీపీ హయాంలోనే .. నెయ్యి సరఫరాలో అవినీతి
- పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేయడం అర్థరహితం
- జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు సుజయ్‌బాబు
నెల్లూరు :
వైసీపీ హయాంలోనే తిరుమల లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి సరఫరా కాంట్రాక్టులో భారీ అవినీతి జరిగిందని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్‌బాబు ఆరోపించారు. బుధవారం నగరంలోని మాగుంట లేఅవుట్లో ఉన్న జనసేన నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు డెయిరీ వ్యాపారం లేని కంపెనీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టారని, ఆ సంస్థలకు కనీసం పాలు సేకరించే వ్యాపారం కూడా లేదని దుయ్యబట్టారు. ఆవు, నెయ్యి, పెరుగు, వెన్న లేకుండానే 60 లక్షల కిలోల నెయ్యి ఏ విధంగా సరఫరా చేశారని ప్రశ్నించారు. కెమికల్స్‌తో తయారు చేసిన ద్రవ్యాన్నే నెయ్యిగా సరఫరా చేశారని ఎద్దేవా చేశారు. జంతు కొవ్వుతో తయారైన రసాయనాలు అందులో ఉన్నాయన్నారు.. కల్తీ నెయ్యి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేయడం అర్థరహితమన్నారు. కూటమి ప్రభుత్వంలోనే వాస్తవాలు బయటపడ్డాయన్నారు. గత వైసీపీ చేసిన తప్పిదాలను మన్నించాలని 2024 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేశారని, దానిని కూడా తప్పుబట్టారన్నారు. కల్తీ నెయ్యి సరఫరాలో కిలోకి 25 రూపాయలు చిన్న స్థాయి నాయకులు దండుకున్నారని, పెద్ద స్థాయి నాయకులు కోట్ల రూపాయలను జేబుల్లో వేసుకున్నారని ఆరోపించారు. వైసీపీ అయిదేళ్ల పాలనలో 1.61 కోట్ల కిలోల నెయ్యి కోనుగోలు చేస్తే .. అందులో 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ కల్తీ నెయ్యితో 20కోట్ల శ్రీవారి లడ్డూలు తయారు చేసి అపచారం చేశారన్నారు. కల్తీ నెయ్యికి సరఫరా చేసే మోనోగ్లిజరైడ్, పామాయిల్‌ను ఎక్కడెక్కడ కొనుగోలు చేశారో ఆధారాలు కూడా బయటపడ్డాయన్నారు.ఈ కార్యక్రమంలో రిజినల్ కో-ఆర్డినేటర్ గుండ్లూరు నాగరత్నం, జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్, నగర ప్రధాన కార్యదర్శులు శనివరపు అజయ్ బాబు, జూటూరు మహేష్ శర్మ, నగర డివిజన్ ఇన్చార్జిలు మరియు నాయకులు చిత్తూరు రాము, బిల్ల ఉదయ్ కిరణ్, పసుపులేటి శ్రీనివాసులు నాయుడు, సాయి సత్యేంద్ర , వంగల శ్రీనివాసులు, శ్రీమంతుల కిషోర్, ఆనందరావు, నవీన్ రాజు , వెంకట రమణ ,మహేష్, తెల్లం బాలు, మహేష్, పోలయ్య, నరసింహ, హరీష్, జిల్లా వీరమహిళలు హేమ, హసీనా, ప్రసన్న, వర లక్ష్మీ, భాను, తదితరులు పాల్గొన్నారు.
@PawanKalyan@mnadendla@NagaBabuOffl@TSivasankararao@JanaSenaParty@Sujaybabujsp #JanaSenaParty #pawankalyan #sujaybabuduggisetty
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి పేషీలో లేని సురేష్ అనే వ్యక్తి పేషీలో పనిచేస్తూ అవినీతి కార్యకలాపాలకు పాల్పడినట్లుగా, ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం ఉన్నట్టుగా చూపిస్తూ తప్పుడు ఆరోపణలు చేసిన @YSRCParty పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నిర్ణయించింది.
గతంలో ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసిన వైసీపీ నాయకులు, ఇప్పుడు ఏకంగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత, పారదర్శకతపై అనుమానం కలిగించేలా ప్రచారం చేసిన ఈ తప్పుడు వార్తలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.
ఈ నిరాధార ఆరోపణలు చేసిన వారిపై, మరియు నిజానిజాలు నిర్ధారించకుండా ప్రచురించిన వారిపై, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పార్టీ న్యాయ విభాగం సిద్ధమైందని తెలియజేస్తున్నాము.
7 years ago, on Oct 12, 2018, my journey with @PawanKalyan garu in @JanaSenaParty began, driven by a vision for a stronger Andhra Pradesh. His able and kind leadership always motivates us even in the toughest of times. Here we are in the aftermath of Cyclone Titli, Srikakulam listening to the youth, to shape a future Andhra Pradesh that reflects their aspirations. Am deeply grateful to our Party President, Leaders, JanaSainik’s and Veera Mahila’s for this incredible journey!!🙏🏻
I still vividly remember when ‘Peddha Annaya’ acted as the hero in the film ‘Praanam Khareedhu’. We were in Nellore at that time, and I was still in school. We went to Kanakamahal Theater, and the elation I felt that day is beyond words.
In his 47 year film journey, it is truly inspiring to see how he has grown by leaps and bounds in every aspect, yet has remained humble at heart, never losing his healing and helping nature.
May Durga Maa bless him with a long life filled with success, health, and prosperity. And also , we wish to continue seeing him in many more versatile roles in the years to come. For him, there is no such thing as retirement, unless he chooses it. And knowing him, he never does..
A fighter by birth.. my Peddha Annaya who will be affectionately called as Shankar babu aka ‘ Mega Star Chiranjeevi’.
సెప్టెంబర్ 9, 2023, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో నిలిచిపోయిన రోజు... వైసీపీ చీకటి పాలనకు నిదర్శనంగా నిలిచిన రోజు, వైసీపీ ఫ్యూడలిస్టిక్ కోటలను @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు 6 నెలల్లో కూల్చేస్తానని శపథం చేసిన రోజు... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్రానికి ఒక పార్టీ అధినేతను రానివ్వకుండా నాటి @YSRCParty ప్రభుత్వం అడ్డుకుంటే, వేలాది మంది జనసైనికులతో కలిసి అర్థరాత్రి వేళ రాష్ట్ర సరిహద్దుల్లో రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడి, రాష్ట్రంలో అడుగు పెట్టి, NDA కూటమికి నాంది పలికి, రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిన రోజు.
పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చాయి
- అందుకే పార్టీలో చేరుతున్నా
- కండువా కప్పి ఆహ్వానించిన సుజయ్ బాబు
నెల్లూరు :
నెల్లూరు నగరంలోని 23 వ డివిజన్ కు చెందిన తేజా పవన్ కళ్యాణ్ మీద అభిమానం పెంచుకొన్నాడు. ఆయన ఆశయాలు నచ్చి తాము కూడా భాగస్వామ్యం అవుతామని జనసేన నగర నాయకులు శాండిలియా ఆధ్వర్యంలో ముందుకు వచ్చారు. ఈ నేపధ్యంలో జనసేన పార్టీలో తన మిత్రులతో కలిసి చేరాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో నగరంలోని మాగుంట లే అవుట్ లో ఉన్న జనసేన నగర పార్టీ కార్యాలయంలో తేజా, వారి మిత్ర బృందానికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ జనసేన అధినేత , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ఇష్టంతో తేజా, వారి మిత్రులు పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను నచ్చి ఎక్కువ మంది పార్టీలో చేరుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం పనిచేయాలని సూచించారు
23వ డివిజన్ లో జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. అనంతరం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ పెన్నా రిజనల్ కో-ఆర్డినేటర్ నాగరత్నం యాదవ్ ,జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, నగర ప్రధాన కార్యదర్శి శనివరపు అజయ్ బాబు, తదితరులు పాల్గొన్నారు. @PawanKalyan@mnadendla@NagaBabuOffl@JanaSenaParty@Sujaybabujsp #pawankalyan #janasena #sujaybabuduggisetty
Happy Birthday @PawanKalyan Garu.
I feel truly fortunate to have grown up witnessing your simplicity, strength and selfless nature. Your journey continues to inspire not just me, but millions.
Wishing you good health, endless happiness and many more years of greatness.
ఉపముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా కపాడిపాలెంలో మహిళలకు చీరల పంపిణీ
- ముఖ్య అతిథిగా పాల్గొన్న సుజయ్‌బాబు
- వీరమహిళల ఆధ్వర్యంలో కేక్ కటింగ్
నెల్లూరు :
ఉప ముఖ్యమంత్రి, జనసేన వ్యవస్థాపకులు కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఉదయం నుంచి జనసేన నగర పార్టీ ఆధ్వర్యంలో నిర్విరామంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా నగరంలోని 51వ డివిజన్ కపాడిపాళెంలో జనసేన పార్టీ నగర కార్యదర్శి అల్లూరు సనత్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్‌బాబు విచ్చేశారు. ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. పెన్నా డెల్టా రీజనల్ కోఆర్డినేటర్ గుండ్లూరు నాగరత్నం, జనసేన జిల్లా కార్యదర్శి షేక్ ఆలియాల చేతుల మీదుగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక జనసేన నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. ఈ సందర్భంగా సుజయ్‌బాబు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి , జగన్ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు పవన్ కల్యాణ్ చురు-కై-న పాత్ర పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి శనివరపు అజయ్‌బాబు, డివిజన్ ఇన్చార్జులు వంగళ్ల శ్రీనివాసులు, ఆముదాల సుమంత్, కనగలూరు సురేష్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. @pawankalyan @nadendlamanoharofficial @nagababuofficial @janasenaparty @duggisetty_sujaybabu #pawankalyan #janasena #nellorecityjanasenaparty #sujaybabuduggisetty